.

6, మార్చి 2011, ఆదివారం

విదేశీ జోక్యం తగదు

లిబియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని అక్కడి చమురు నిక్షేపాలపై పెత్తనం చెలాయించాలనుకుంటే దానిని తాము వ్యతిరేకిస్తామని క్యూబా స్పష్టం చేసింది. ఈ మేరకు క్యూబా విదేశాంగ మంత్రి ఐరాస మానవ హక్కుల మండలి అధ్యక్షునికి లేఖ రాశారు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా అమాయకుల మరణాలు మానవతకే మాయని మచ్చగా నిలుస్తాయని, ప్రస్తుతం లిబియాలో జరుగుతున్న హింసాకాండపై క్యూబా ప్రపంచ దేశాలతో పాటు ఆందోళన చెందుతోందని ఆయన వివరించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ఎటువంటి విదేశీ జోక్యం లేకుండానే శాంతియుతమైన, సామరస్య పూర్వకమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ సమస్యలో విదేశీ సైనిక జోక్యాన్ని లిబియన్లు నిశ్చయంగా తిరస్కరిస్తారని, విదేశీ జోక్యం కారణంగా లిబియాలో జరుగుతున్న హింసాకాండకు తెరదించే పరిష్కార సాధనమరింత ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి