.

26, మార్చి 2011, శనివారం

లిబియాలో సామ్రాజ్యవాదుల జోక్యం

చమురు నిల్వలు పుష్కలంగా వున్న ప్రాంతంపై తన పెత్తనాన్ని నిలబెట్టుకోవటమే పరమావధిగా సామ్రాజ్యవాదులు ఇంతటి దుస్సాహసానికి తెగబడుతున్నారు. అదే విధంగా తన ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తుల పునరేకీకరణను అడ్డుకోవటం కూడా ఈ దాడి వెనక వున్న వ్యూహం. 2009 నాటి అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో 10,320 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా వున్న చమురు నిల్వల్లో 55.6 శాతం ఇక్కడే ఉన్నాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలంటూ బహ్రెయిన్‌ ప్రజానీకం ఖలీఫాకు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలచినప్పటికీ అమెరికా ప్రోద్బలంతో సౌదీ అరేబియా సైనిక దళాలు ఖలీఫాకు మద్దతుగా బహ్రెయిన్‌లో జోక్యం చేసుకున్నాయి. సామ్రాజ్యవాదుల ద్వంద్వ ప్రమాణాలను ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి