.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

భారతీయుల అష్టకష్టాలు

 లిబియాలోని కొందరు భారతీయ ఉద్యోగులు ప్రాథమిక అవసరాలు అందని దైన్య స్థితిని ఎదుర్కొంటున్నారు. లిబియాలోని అనేక ప్రాంతాల్లో తాగునీరు, ఆహార కొరత తీవ్ర సమస్యగా పరిణమించింది. దిగజారిన లిబియా జీవన స్థితిగతులకు ఇది అద్దం పడుతోంది. ఈ పరిస్థితి అనేక పట్టణాలకు వ్యాపించింది. దీంతో బాధలు పడలేక వారిలో కొందరు తెగించి లిబియాలోని జవియా పట్టణం నుంచి సరిహద్దును దాటి పొరుగునే ఉన్న ట్యునీషియా లోకి ప్రవేశించారు. అధ్యక్షుడు ముమ్మర్‌ గడాఫీ అనుకూల సాయుధ బలగాలకు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. 42 సంవత్సరాల గడాఫీ పాలనకు చరమ గీతం పాడాలనే ధృఢసంకల్పం ఆందోళనకారుల్లో కన్పిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి