.

3, ఫిబ్రవరి 2011, గురువారం

కల - నిజం

భౌతికవాదులను ఓడించడం ద్వారా శంకరుడు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఎనలేని హానిని కలిగించాడని ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త డా|| ప్రపుల్లచంద్ర రే విమర్శించారు. ఈ విమర్శ సరైనది. ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, రసాయనశాస్త్రం వంటి రంగాలలో ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. జగత్తు మిథ్య అని, ఇదంతా నాశనమయ్యేదే అని, వాస్తవిక జ్ఞానం అసలైన జ్ఞానం కాదని, విశ్వాసమే జ్ఞానానికి ప్రాతిపదిక అని చెప్పిన అద్వైతం విజ్ఞాన పురోగతికి పెద్ద తాత్విక ఆటంకంగా వ్యవహరించింది. శంకరుడు మనువాదాన్ని పూర్తిగా సమర్థించాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఓ పక్క చెప్తూనే ఇంకోపక్క వ్యవహారిక ప్రపంచంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం అవసరమని నొక్కి చెప్పాడు. మనకు ఇప్పుడు కూడా ఇటువంటి మహానుభావులు తారసిల్లుతూనే ఉంటారు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి