.

5, జనవరి 2011, బుధవారం

చర్చలు జరుపుకుందాం

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను ఎలా తగ్గించాలనే అంశంపై చర్చించేందుకు ఉత్తర కొరియాలోని అమెరికా దూత తూర్పు ఆసియాకు బయలుదేరారు. కాగా ఉత్తర కొరియా సానుకూల ధోరణి చూపుతున్నందున ఉభయ దేశాల మధ్య సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మియుంగ్‌ బక్‌ సోమవారం చెప్పారు. చర్చల ద్వారా సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఉత్తర కొరియా ప్రముఖ పత్రిక పిలుపునిచ్చిన అనంతరం ఆయన పై విధంగా పేర్కొన్నారు. తాను ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు నూతన సంవత్సర సందేశంలో ఆయన తెలిపారు. నూతన దశాబ్దం విభజనల విషాదాన్ని అంతం చేస్తుందని, ఏకీకరణను సాధిస్తుందని, కొరియా ద్వీపకల్పాన్ని సుసంపన్నం చేస్తుందని ఉత్తర కొరియాలోని అతి పెద్ద ప్రభుత్వ పత్రిక రొడోంగ్‌ సిన్మున్‌లో సోమవారం ప్రచురితమైన అనేక వ్యాసాలు వెల్లడించాయి. ఉభయ పక్షాలూ చర్చలు జరిగేలా చూడాలని, కొరియా ద్వీపకల్పానికి చక్కటి భవిష్యత్తు తేవాలని ఆ వ్యాసాలు తెలిపాయి..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి