.

29, డిసెంబర్ 2010, బుధవారం

కేసులన్నీ ఎత్తేస్తాం

ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనల సందర్భంగా విద్యార్థులు, ఇతరులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రబద్ధంగా అంగీకరించింది. ఈ మేరకు పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణా ప్రాంత మంత్రులతో మంగళవారం జరిపిన సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. ప్రభుత్వ పత్రికా ప్రకటనను ఎంపీలకు మంత్రులు అందజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి