.

25, డిసెంబర్ 2010, శనివారం

జాతీయ నాయకుల విజ్ఞప్తితో బాబు దీక్ష విరమణ

రైతు సమస్యలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన నిరవధిక దీక్షను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విరమించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సిపిఎం, సిపిఐ, ఐఎన్‌ఎల్‌డి, జెడి(ఎస్‌),జెడి(యు), ఎఐఎండికె, ఎండిఎంకె, ఎజిపి, ఆర్‌ఎల్‌డి, పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలకు చెందిన నేతలు నిమ్స్‌లో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు కొబ్బరి నీళ్లిచ్చి దీక్ష విరమింపజేశారు. శనివారం నిమ్స్‌ నుండి బాబు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి