.

14, నవంబర్ 2010, ఆదివారం

సూకీకి స్వేచ్ఛ

సూకీకి స్వేచ్ఛ సూకీకి స్వేచ్ఛమయన్మార్‌ ప్రజాస్వామిక నేత, ప్రతిపక్ష నేషనల్‌ లీగ్‌ డెమోక్రటిక్‌ (ఎన్‌ఎల్‌డి) నాయ కురాలు ఆంగ్‌సాన్‌ సూకీ(65)కి స్వేచ్ఛ లభించింది. 18 నెలలపాటు గృహ నిర్బంధంలో ఉన్న ఆమెను సైనిక జుంటా ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. సాయంత్రం 5.30 గంటలకు సూకీ కాంపౌండ్‌ వద్దకు పోలీస్‌ వాహనాలు వచ్చా యి. అనంతరం సూకీ విడుదల పత్రాలతో అధికారులు లోపలికి వెళ్లారు. తమ నాయకురాలి విడు దల కోసం ఆమె నిర్బంధంలో ఉన్న కాంపౌండ్‌ ముందు వేచిచూస్తున్న మద్దతుదారులను ఉద్దేశించి సూకీ న్యాయవాది యాన్‌విన్‌ 'ఇప్పుడు ఆమె స్వేచ్ఛాజీవి' అని సంతోషం పంచుకున్నారు. సూకీని విడుదల చేయనున్నట్లు వార్తలొచ్చిన నేప థ్యంలో వేలాది మంది ఆమె మద్దతుదారులు, ఎన్‌ఎల్‌డి పార్టీ సభ్యులు, మీడియా ప్రతినిధులు శుక్రవారం ఉదయం నుంచే సూకీని నిర్బంధించిన కాంపౌండ్‌ ముందు గుమిగూడారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి