.

10, నవంబర్ 2010, బుధవారం

సిద్దమైన 'ఆరెంజ్‌'

రామ్‌చరణ్‌ తాజా చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. జెనీలియాతో నటించిన చిత్రం 'ఆరెంజ్‌'. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వం వహించారు. నాగబాబు నిర్మించారు. ఈ చిత్రం ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో చిత్రించారు. అక్కడి బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రకథ ఇది. లవ్‌ చిత్రాల్లో కొత్తకోణంలో ఉండే ఈ కథకు చరణ్‌ సరిపోయాడని దర్శకుడు చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ వర్క్‌ తుదిదశలో ఉంది. 17న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం డి.ఐ. వర్క్‌ జరుగుతోంది. ఇటీవలే విడుదలైన గీతాలకు మంచి స్పందన లభించిందని నిర్మాత తెలియజేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి