.

3, డిసెంబర్ 2013, మంగళవారం

దద్దరిల్లిన కలెక్టరేట్లు

- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు, నిబంధనల కోసం రాష్ట్రవ్యాప్తంగా కెవిపిఎస్‌, గిరిజనసంఘం ధర్నాలు
- నిధులు విడుదల చేయకుంటే అసెంబ్లీ స్తంభింపజేస్తాం
ప్రజాశక్తి - యంత్రాంగం
    ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను విడుదల చేయాలనీ, సబ్‌ప్లాన్‌ చట్టం అమలుకు నిబంధనలు రూపొందించాలనీ డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, గిరిజనసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. నిధులను పక్కదోవ పట్టించడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనుల సంక్షేమానికే నిధులు ఖర్చు చేయాలని పెద్దపెట్టున నినదించారు. 
సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేసి, చట్టం అమలుకు నిబంధనలు రూపొందించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని సిపిఎం శాసనసభా పక్షనేత జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్గొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో ఆయన ప్రసంగించారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలో కలెక్టర్లకే స్పష్టత లేకపోవడంతో సబ్‌ప్లాన్‌ చట్టం నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి