.

31, మార్చి 2011, గురువారం

ప్రజాతంత్ర హక్కులకు ప్రమాదం

ఈనాటి ప్రపంచ ద్రవ్య పెట్టుబడుల శకంలో సామ్రాజ్యవాదం, మానవ నాగరికత సాగించే ప్రజాతంత్ర పురోగమనంపై బహుముఖ దాడి చేస్తున్నది. ప్రస్తుత కాలంలో ఇది సంక్షేమ రాజ్యం పట్ల విశృంఖల దాడి మినహా మరొకటి కాదు. ఐరోపాలో మనం దీనిని చూడవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికన్‌ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం లండన్‌ వాసులు నిరసనలు తెలిపారు. ఇదేవిధంగా పలు దేశాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేమంటే, ఇప్పుడు సాగుతున్న పోరాటాలన్నీ ఆత్మరక్షణ స్వభావం కలిగినవే. అంటే, ఇంతకుముందు పోరాడి సాధించుకున్న ప్రయోజనాలను కాపాడుకోవటమే ధ్యేయంగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి