.

19, ఫిబ్రవరి 2011, శనివారం

సలలిత రాగ సుధారస మూర్తి సుసర్ల దక్షిణామూర్తి

అయిదున్నర దశాబ్దాల క్రితం 'సంతానం' (1955) చిత్రం కోసం ఘంటసాల పాడిన 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో...' పాట ఇప్పటికీ మనసు దోచే మధుర గీతం. అదే చిత్రం ద్వారా లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు సినీగీతం 'నిదురపోరా తమ్ముడా...' మనసును తడి చేసే మంచి పాట! ఒరియా గాయకుడు రఘునాథ్‌ పాణిగ్రాహి 'ఇలవేలుపు' (1956) చిత్రం కోసం పాడిన 'చల్లని రాజా ఓ చందమామా...' నేటికీ ఓ మధురానుభూతి. 'నర్తనశాల' (1963) చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన 'సలలిత రాగ సుధారస సారం...' లాంటి పాటలు తెలుగువారు ఎవరైనా, ఎన్నటికైనా మరిచిపోగలిగేవేనా? మరి, మంగళంపల్లి, లతా మంగేష్కర్‌, రఘునాథ్‌ లాంటి అగ్రశ్రేణి కళాకారులను మొట్టమొదటిగా తెలుగు సినిమాల్లోకి తెచ్చి, ఇలాంటి మధుర గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎవరో ఎందరికి గుర్తున్నారు? 90 ఏళ్ళ వయస్సులో ఆయన ఇవాళ్టికీ మన మధ్యనే ఉన్నారని ఎందరికి తెలుసు? సంప్రదాయ సంగీతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, దక్షిణ భారత సినీ సంగీతంలో సినిమాలోని సన్నివేశానికీ, సాహిత్యానికీ కొత్త సొబగులు చేకూర్చిన ఆ సంగీత దర్శకుడు - సుసర్ల దక్షిణామూర్తి..............

1 కామెంట్‌: