.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఢిల్లీ-అటిన్షన్-హైదరాబాద్



        ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లుపై కదలికలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం చకచకా పావులు కదిపింది.బిల్లుపై చర్చ ప్రారంభించడమే గాక ఓటింగు కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. బిజెపి కూడా సహకరించే ధోరణిలో వుందంటున్నారు. ఆ పార్టీ నేతలతో స్వయంగా సోనియా గాంధీ ఈ విషయం ప్రస్తావించడం, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ మంతనాలు జరపడం, కొన్ని సవరణలపై కె.సి.ఆర్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారన్న కథనాలు ఆసక్తి కలిగించాయి. చర్చలో పాల్గొని సూచనలు చేయాలన్న రాహుల్‌ సలహా పనిచేసినట్టే కనిపించింది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయమై కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. దేశ రాజధానిలో ఏపీ ఎన్జీవోల ధర్నా, వైఎస్సార్‌సీపీ దీక్షలు, కాంగ్రెస్‌ టిడిపి సీమాంధ్ర నేతల నిరసనలు జరిగినా కేంద్రం మాత్రం అనుకున్న దిశగా అడుగులు వేస్తున్నది. see more.

ఎన్నికల చిత్తంబరం



         ఆర్థిక మంత్రి చిదంబరం ఆఖరి అనామతు పద్దులో అనుకున్నంత పని చేశాడు. అంతా బావున్నట్టు చెబుతూనే అనేక భారాలకు ద్వారాలు తెరిచాడు. ఉత్పత్తి రంగం వృద్ధి గొప్పలు ఉత్తుత్తివని తేలిపోగా వ్యవ'సాయం' మిథ్యగా మిగిల్చాడు. చెప్పిన అంచనాలకన్నా ప్రణాళికా కేటాయింపు అమాంతం 66 వేల కోట్లు కత్తెర వేశాడు. కేంద్ర ప్రణాళికకూ వివిధ రాష్ట్రాలకూ ఇచ్చే సహాయం మొత్తం 80 వేల కోట్లకు పైగా తెగ్గోశాడు. అవసరాలకు బిగబట్టి ద్రవ్యలోటు తగ్గించినట్టు మురిపించాడు. పరిశ్రమలకూ బడా బాబులకు రాయితీలు కొనసాగించడమే గాక సామాన్య ప్రజలకు ఉపయోగపడే సహాయమొత్తాలను మాత్రం వున్నచోటనే వుంచేసి ఉత్త మాటలు వడ్దించాడు. విద్య వైద్యం ఉపాధి ఉత్పత్తి వంటివాటికి వూపునిచ్చేవి గాక సరళీకరణ తంత్రాలనే పునరావృతం చేసి ఎన్నికల తర్వాత మరిన్ని వడ్డింపులకు రంగం సిద్ధం చేశాడు. see more

కిరణ్‌ను తప్పించండి !



 అధిష్టానానికి పిసిసి డిమాండ్‌ 
- నేడు ఢిల్లీకి సిఎం వ్యతిరేక గ్రూపు
- బొత్స ఇంట్లో కాంగ్రెస్‌ బచావో సమావేశం 
- కిరణ్‌, చంద్రబాబు, రాఘవులు, జగన్‌లకు లేఖ
- సమైక్యం కోసం తమతో కలిసిరావాలని వినతి
- సిఎం రాజీనామా, కొత్త పార్టీ అప్రాధాన్యం: బొత్స
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
   విభజన బిల్లును పార్లమెంటులో మంగళవారం ఆమోదిస్తారన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నిట్టనిలువున చీలిక ఏర్పడింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా విడిపోయారు. విభజనపై కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రూపు ఒకవైపు, కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు see more..

సింపుల్‌ కథను కొత్తగా చెప్పాడు: ప్రకాష్‌రాజ్‌



      పూరి జగన్నాథ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'హార్ట్‌ ఎటాక్‌' చిత్రం మూడోవారంలోకి ప్రవేశించింది. పూరి జగన్నాథ్‌కి సూపర్‌హిట్‌ చిత్రంగా, నితిన్‌కి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ఓ ప్రత్యేకపాత్రలో నటించారు. ఈ చిత్రం గురించి ఆయన ఈ విధంగా స్పందించారు.
''హార్ట్‌ ఎటాక్‌ సినిమా చూశాను. పూరి గురించి నాకు చాలా గర్వంగా వుంది.see more.

కివీస్‌ జోరు భారత్‌ బేజారు



 భారీ ఆధిక్యంలో కివీస్‌
- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ డబుల్‌ సెంచరీ

    వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ జట్టు పట్టుబిగించింది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవడంతో కివీస్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ( 281బ్యాటింగ్‌, 28 ఫోర్లు, 4సిక్స్‌) డబుల్‌ సెంచరీ సాధించగా, వాట్లింగ్‌ కూడా సెంచరీతో దూసుకెళ్ళడంతో కివీస్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 571 పరుగుల భారీ స్కోరును సాధించింది. see more.

మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్ట్‌



ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
     సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం చేపట్టిన 'చలో హైదరాబాద్‌' కార్యక్రమం అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన మహిళా కార్మికులతో ఇందిరాపార్కు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ధర్నా అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ రమ ఆధ్వర్యంలో కార్మికులు సచివాలయానికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. see more..

కొన్నవి మూడు బేళ్లే...



- వేలం తొలిరోజునే పొగాకు వ్యాపారుల మెలిక
- నిబంధనలు పాటించాలన్నందుకు  కొనుగోళ్లు బహిష్కరణ
ప్రజాశక్తి - ఒంగోలు ప్రతినిధి
   పొగాకు కొనుగోళ్లు తొలిరోజునే రైతులను కలవరపరిచాయి. ఏటా గిట్టుబాటు ధర లేని కారణంగా రైతులు వేలం బహిష్కరించేవాళ్లు. ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యాపారులే తమకు సమస్యలున్నాయంటూ ఎటువంటి కారణాలూ చెప్పకుండానే వేలం బహిష్కరించారు. వేలం ఎందుకాపారు? ఎందుకు కొనడంలేదు? అనే ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా రైతులకు చెప్పడంలేదు. see more.

సాధ్యమైనంత మేలు చేస్తాం



- సీమాంధ్ర నేతలకు రాహుల్‌ స్పష్టీకరణ
- యుటి సాధ్యం కాదని వెల్లడి
- అద్వానీతోనూ కాంగ్రెస్‌ నేతల సమావేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం హైద్రాబాద్‌ను పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటి) ఉంచడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. విభజన బిల్లులో సీమాంధ్రకు సాధ్యమైనంతగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. see more..

ఇంటర్‌నెట్‌ కాదు ఔటర్‌నెట్‌ రాబోతోంది!



  న్యూయార్క్‌: ఇంటర్‌నెట్‌ను మర్చిపోండి! తొందరలో ఔటర్‌నెట్‌ రాబోతుంది. భూగోళంపై నివసించే వారందరికీ వైఫి రూపంలో అందరికీ ఉచితంగా త్వరలో ఇంటర్‌నెట్‌ అందించటం జరుగుతుందని చెబుతున్నారు. ఔటర్‌నెట్‌ అని పిలువబడుతున్న ఈ ప్రోజెక్ట్‌ 2015 జూన్‌ కల్లా వందలాది చిన్న చిన్న శాటిలైట్స్‌ను భూమి అల్ప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రతి శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ను ఫోన్లకూ, కంప్యూటర్లకూ ప్రసారం చేయటంద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల ప్రజలకు ఉచిత ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇది సాంకేతికంగా దుస్సాధ్యమైనదేమీ కాదు. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వాడుకోవాలంటే.see more.

ప్రయివేటుకే పట్టం కట్టాం



- నిరాశలో పారిశ్రామికోత్పత్తి 
- 2011 నుంచే మాంద్యం 
- ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుంది 
- మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ 
- ఓట్‌ఆన్‌ బడ్జెట్‌లో చిదంబరం
  ప్రజాశక్తి-బిజినెస్‌ డెస్క్‌
  భారత దేశ ఆర్థిక వ్యవస్థ మేడి పండు చందంగా తయారయ్యింది. అహార ద్రవ్యోల్బణం ఓ వైపు ఎగిసి పడుతుండటంతో పాటు మరోవైపు వృద్ధి రేటు ఐదు శాతం లోపే సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం ఆందోళన కలిగిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. అయినా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గొప్పలు చెప్పుకున్నారు. సోమవారం పార్లమెంట్‌లో see more.

దక్షిణాఫ్రికా టి20 జట్టు కరారు



     జోహెన్నెస్‌బర్గ్‌: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టును సోమవారం ఎంపిక చేసింది. దేశీయ టి20 పోటీల్లో ప్రతిభ కనబరిచి ముంబయి ఇండియన్స్‌ తరపున ఐపిఎల్‌ కాంట్రాక్టు దక్కించుకున్న 23 ఏళ్ల లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్‌ హెండ్రిక్స్‌కు తుది జట్టులో చోటు దక్కింది.see more.

నిన్ను చూసి వెన్నెలె అనుకున్నా' పాటలు



       ''అమ్మాయి కోసం వెంటపడే అబ్బాయిల్ని చూశాం. అలాగే అబ్బాయి ప్రేమ కోసం తపించే అమ్మాయిల్ని కూడా చూశాం. ఇద్దరూ మ్యూచ్‌వల్‌ అండర్‌స్టాండింగ్‌తో ఒకటైన జంటల్ని కూడా గమనించాం. ఇవేమీ కాకుండా కొత్త తరహా ప్రేమ కథని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం'' అని నూతన దర్శకుడు రాజశేఖర్‌ ఎ.ఎమ్‌ అన్నారు. అనూప్‌తేజ్‌, ప్రణమ్య, యశ్వంత్‌ నటీనటులుగా రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నిన్ను చూసి వెన్నెలె అనుకున్నా'. నీహారిక సినిమాస్‌ పతాకంపై టి.విజయ వాసుదేవారెడ్డి నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. see more.

థానే జాయింట్‌ కమిషనర్‌గా లక్ష్మీనారాయణ



ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
    సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ఎట్టకేలకు మహారాష్ట్ర సర్కార్‌ పోస్టింగ్‌ ఇచ్చింది. ఆయన్ను థానే నగర పోలీసు సంయుక్త కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర క్యాడర్‌ 1990 బ్యాచ్‌కు చెందిన లక్ష్మీనారాయణ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ విభాగం సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా డిప్యుటేషన్‌పై వచ్చారు. సిబిఐ జేడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పలు కీలక కేసుల్లో విచారణ అధికారిగా ..see more

నేపాల్‌లో కూలిన విమానం



- 18 మంది మృతి
  ఖట్మాండు: నేపాల్‌లో విమానం కూలిపోయిన ఘటనలో ఆదివారం 18 మంది చనిపోయారు. ఇందులో14 మంది నేపాలీలు, ఒక మైనార్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన విదేశీయుడు ఉన్నారు. 19 సీట్ల సామర్థ్యం ఉన్న ట్విన్‌ అట్టర్‌కు చెందిన విమానం పోక్రా సిటీ నుంచి 12.40 గంటలకు బయలుదేరింది. తరువాతి 15 నిమిషాల అనంతరం పైలట్‌తో సంబంధాలు లేకుండా పోయాయి. ఈ మేరకు నేపాల్‌ ఎయిర్‌ లైన్స్‌ అధికారులు ఒకరు తెలిపారు. see more.

పేద విద్యార్థులపై పెద్ద మనసు



కృష్ణకుమార్‌ ఐఐటి చేశాడు. అయితే చాలామందిలా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఏదో చూసుకుని తన మానాన తను బతకాలనుకోలేదు. ప్రతిభ ఉన్నా డబ్బు లేని ఎంతోమంది పేద విద్యార్థులకు తనలానే ఐఐటి చేయడానికి తగిన ఊతమివ్వాలనుకున్నాడు. అవంతి ఫెలోస్‌కు రూపమిచ్చాడు.
భారతదేశంలోని ప్రముఖ కాలేజీలలో, కార్పొరేట్‌ కాలేజీలలో పేద విద్యార్థులకు అవకాశం ఉండదు. అందుకే ఇలాంటి పేద విద్యార్థులకు.see more.

'ఓ మైగాడ్‌'లో..గెస్ట్‌ రోల్‌




       అవును..ఫిలింనగర్‌లో ఇప్పుడు అందరినోటా 'ఓ మై గాడ్‌' చర్చే జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌, వెంకటేష్‌ ఈ చిత్రంలో నటించటం ఇందులో మొదటి విశేషం కాగా, రెండో విషయం మరోటుంది. అది పవన్‌కల్యాణ్‌ పాత్ర పరిధి చాలా చిన్నగా వుంటుందని, అయినా ఆ ప్రభావం సినిమా మొత్త కనిపిస్తుందని టాక్‌ ! 'కృష్ణుడు' వేషంలో పవన్‌ కల్యాణ్‌..see more.

చైనాలో అతి పెద్ద బుద్ద విగ్రహం



    బీజింగ్‌: ప్రపంచంలో అత్యంత వేగంగా పయనించే రైలు, అత్యంత పొడవైన వంతెన, అత్యంత పెద్ద భవనం, అత్యంత పొడవైన గోడ ఇవన్నీ ప్రపంచంలోని విహార యాత్రీకులను ఆకర్షించే చైనా వనరులు. చైనాలో ఎంత పెద్దదైతే అంత మంచిది అన్నట్లుగా విషయాలున్నాయి. ఇదే విషయం బుద్దుడికి కూడా వర్తిస్తుంది.see more.

ఆప్‌కే ఢిల్లీ పట్టం



- ఎబిపి న్యూస్‌-ఐపిఎస్‌ఒస్‌ స్నాప్‌ పోల్‌ సర్వే
     న్యూఢిల్లీ: ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా కేజ్రీవాల్‌ రాజీనామా చేశారనే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల అభియోగాలను ఢిల్లీ ప్రజలు విశ్వసించలేదు. ఆప్‌కు మరోమారు అవకాశం ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ పార్టీకి ఓటేయ్యాలని అత్యధికులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎబిపి న్యూస్‌-ఐపిఎస్‌ఒస్‌ స్నాప్‌ పోల్‌ సర్వే తెలిపింది. ఆ సర్వే ప్రకారం.. సుమారు 67 శాతం మంది స్థానికులు ఆప్‌కు మరో అవకాశం .see more

12, ఫిబ్రవరి 2014, బుధవారం

కఠినవ్యూహం



 -ఎలాగైనా ఆమోదం...!
 -అడ్డుకుంటే సస్పెన్షన్‌
 -సహకరిస్తేనే చర్చ
 -కాంగ్రెస్‌ వ్యూహం 
 -టి. నేతలకు సమాచారం
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం దిశలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. బిజెపి నేతలతో ఒకవైపు చర్చలు జరుపుతూనే వ ప్రత్యామ్నాయ మార్గాల వైపపు దృష్టి సారించింది. ఈ మేరకు టి.కాంగ్రెస్‌ నేతలకు సమాచారం అందింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఎంపిలపై ఇప్పటికే బహిష్కరణ ఆస్త్రం ప్రయోగించిన కాంగ్రెస్‌ అధిష్టానం, see more.

'ద హిందూస్‌' రద్దు



 -పుస్తకాలన్నింటిని వాపస్‌ తెస్తున్న పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ 
     న్యూఢిల్లీ: అమెరికా రచయిత వెండి డానిగర్‌ రచించినటువంటి 'ద హిందూస్‌: ఆన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరి' పుస్తకాలన్నింటిని వెనక్కి తెప్పించి నాశనం చేయనున్నట్టు పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ పేర్కొంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ కోర్టు ఉత్తర్వులను అనుసరించి పెంగ్విన్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. see more.

కాంగ్రెస్‌ కార్యాలయంలో అత్యాచారం, హత్య



 -కేరళలో మంత్రి పిఎతో సహా ఇద్దరు అరెస్టు
 ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం
    మళప్పురం జిల్లా నీలాంబర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం, హత్య చేసిన కేసులో కాంగ్రెస్‌ మంత్రి వ్యక్తిగత సహాయకుడితో పాటు మరొక నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేసే కె రాధ(49)పై పాశవికంగా అత్యాచారం చేశారనీ, ఆమె రహస్య భాగాల్లో గాయాలున్నాయనీ పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమెను హత్య చేసిన అనంతరం అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని బండరాయితో కట్టి మురికికుంటలో పడేశారు. see more.

లోక్‌సభ ఎన్నికల తర్వాతే కూటమి



 -సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏచూరి 
 -పార్లమెంటులో స్థితికి కాంగ్రెస్సే కారణమని విమర్శ
 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
      లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ కూటమి ఏర్పడే అవకాశం ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే తృతీయ ఫ్రంట్‌ ఏర్పడుతోందన్న ప్రచారం సరికాదని పార్లమెంటులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ' మతోన్మాదానికి, కాంగ్రెస్‌ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలని 11 పార్టీలు నిర్ణయించాయి. see more.

గ్రాఫిక్స్‌ ప్రధాన ఆకర్షణ : కోడిరామకృష్ణ



      కోడి రామకృష్ణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అవతారం'. అరుంధతీ ఆర్ట్‌ ఫిలిం బ్యానర్‌పై శ్రీమతి ఎం.కవిత సమర్పణలో యువ నిర్మాత యం.యుగంధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉత్తమ నటి భానుప్రియ, రాధిక కుమార్‌స్వామి, రిషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో దర్శకుడు కోడి రామకృష్ణ విడుదల చేశారు. see more.

సమ్మె సాకు... ప్రైవేటికరణ సోకు



 -చెత్త నిర్వహణకు రాంకీకి అప్పజెప్పేయత్నం
 -సందిట్లో సడేమియా జిహెచ్‌ఎంసి 
 -కొనసాగుతున్న సమ్మె - పేరుకుపోయిన చెత్త
 -ప్రైవేటికరిస్తాం:మేయర్‌
 ప్రజాశక్తి-హైదరాబాద్‌ప్రతినిధి
     తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగురోజులుగా జిహెచ్‌ఎంసి కార్మికులు చేస్తుంటే కార్మికుల డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమించడానికి తీసుకోవాల్సిన మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ చెత్త నిర్వహణను ప్రైవేటికరిస్తామని హెచ్చరిస్తున్నారు. 'కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. వేతనాలు పెంచడానికి ప్రభుత్వానికి లేఖరాస్తాం' అంటూ స్వీట్లు పంచిన మేయర్‌, కమిషనర్‌లు ఏకంగా కార్మికుల ఉద్యోగాలకు see more..

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

టి. బిల్లుకు అన్సారీ బ్రేక్‌?



 -రాజ్యసభలో ప్రవేశంపై ప్రశ్నలు  
 -ఆలోచనలో పడ్డ ప్రభుత్వం  
 -సీమాంధ్ర ఎంపీల రభస
 -'ఆర్ధికాంశాలపై' వివరణ కోరిన ఛైర్మన్‌  
 -వెంకయ్యతో మరోసారి జైరాం చర్చలు
 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
       రాష్ట్ర విభజన బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఆర్థికాంశాలతో కూడిన బిల్లును సంప్రదాయానికి భిన్నంగా తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ వివరణ కోరడంతో బిల్లుకు బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమచారం. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం ఆమోదముద్ర వేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమంటూ సోమవారమంతా ప్రచారం జరిగింది. see more.

మొక్కుబడి



 -1.83 లక్షల కోట్ల ఓటాన్‌ అకౌంట్‌
 -4వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం  
 -ప్రసంగాన్ని అడ్డుకున్న టి. సభ్యులు
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      రానున్న ఆర్థికసంవత్సరం (2014-15)కు 1,83,129 కోట్ల రూపాయలతో ఓట్‌ఆన్‌అక్కౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.50శాతం ఎక్కువ. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సోమవారం ఆయన బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభ ముందుంచారు. ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయన బడ్జెట్‌ను ..see more.

మేడారం జాతరకు సర్వం సిద్ధం



 -రూ. 100కోట్లతో అభివృధ్ధి పనులు పూర్తి : కలెక్టర్‌ కిషన్‌
 ప్రజాశక్తి-వరంగల్‌ ప్రతినిధి
       ఈ నెల 12 నుండి 15 వరకు జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ జి.కిషన్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏర్పాట్ల వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. వాటన్నింటినీ పూర్తి చేశామన్నారు. గుడారాలు వేసుకొని అక్కడే రెండు, మూడు రోజులు ఉండే సందర్శకుల కోసం లైటింగ్‌తో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరను 38 సెక్టార్లుగా విభజించి 38 సెక్టోరియల్‌ అధికారులను నియమించామని, వారి కింద మరో ఆరుగురు see more..

ముట్టడులతో దద్దరిల్లిన మున్సిపాలిటీలు



 -కనీస వేతనాల కోసం కార్మికుల డిమాండ్‌
 -ఒంగోలు, విశాఖలో అరెస్టులు
 -ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం
 ప్రజాశక్తి-యంత్రాంగం
     కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు), ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను ముట్టడించారు. పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు, అర్ధనగ ప్రదర్శనలు చేపట్టారు. ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టులకు ప్రయత్నించడంతో ..see more.

ఉలవచారు..బిర్యానీ..



      ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాష్‌రాజ్‌ ఓ తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని తెలుగులో 'ఉలవచారు..బిర్యానీ'గా పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి..see more.

సందిగ్ధం



 -సిఎం రాజీనామాపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
 -మంత్రులు, ఎమ్మెల్యేలతో కిరణ్‌ భేటీ
 -వద్దని వారించిన నేతలు
 ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
       ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. రాజీనామాపై కాంగ్రెస్‌ నేతల్లోనే ఉత్కంఠ నెలకొంది. రాజీనామా చేస్తానని సిఎం చెబుతున్నారని, తామైతే వద్దని చెబుతున్నామని, ఏమి చేస్తారనేది కిరణ్‌ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ నెల 13న లేదా 14న రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నా అది కూడా కచ్చితమైన తేదీ కాదని తెలిసింది. బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత సిఎం రాజీనామా చేస్తారని తాజాగా మరో ప్రచారం షికారు చేస్తోంది. see more.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

రాత్రి క‌రెంటుకు రైతులు బ‌లి



-  కరీంనగర్‌లో ఏడాదిలో 40 మంది మృతి 
-  కోతలు, షిఫ్టుల్లో మార్పుతో రైతాంగం బెంబేలు
    రవీంద్ర, కరీంనగర్‌ ప్రతినిధి
   గత నెల 25 అర్ధరాత్రి... ధర్మపురి మండలం గంగసముద్రం గ్రామంలో పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు గుండ గంగన్న(52) ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. గత మే నెలలో జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామంలో పరకాల సమ్మయ్య(55), దేశిని శివకుమార్‌(25) మామా అలుళ్లు ఒకే సంఘటనలో మృతి చెందారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. కరీంనగర్‌ జిల్లాలో గత ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు 50 మంది రైతులు రాత్రి విద్యుత్‌కు బలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. లెక్కప్రకారం.. పదిమాసాల్లో 50 మంది అనుకోవడానికి కూడా వీల్లేదు. ప్రధానంగా విద్యుత్‌ కోతలు ఉన్న సమయంలో ఆరుమాసాల్లోనే అంత మంది మృతి చెందారని చెప్పొచ్చు. read more.

నేటి నుంచి ఓటాన్‌ సభ



- 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం
- బహిష్కరించే యోచనలో టీ నేతలు
- కేబినెట్‌కు దూరంగా టీ మంత్రులు?
- పదకొండు గంటలకు బిఎసి
- 12 లేదా 13తో ముగింపు 
- ఈ సారీ ప్రజల సమస్యలు గాలికే
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
    సోమవారం నుండి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ఏకకాలంలో శాసనసభ, శాసనమండలి సమావేశం అవుతాయి. బడ్జెట్‌ను సభలో పెట్టడానికి గంట ముందు తొమ్మిది గంటలకు రాష్ట్రమంత్రివర్గం సమావేశమవుతుంది. మంత్రివర్గం ఆమోదించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు శాసనసభలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శాసనమండలిలో మంత్రి సి.రామచంద్రయ్య ప్రవేశపెడతారు. తొలిరోజున బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. read more.

ఒకే వేదికపై బాబు, గల్లా



 ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి
  టిడిపి రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ మంత్రి గల్లా అరుణకుమారి ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన మాజీ ఎంపీ ఎన్‌పి చెంగల్రాయ నాయుడు విగ్రహావిష్కరణ సభ దీనికి వేదికైంది. కొన్ని రోజులుగా గల్లా అరుణకుమారి టిడిపితో జతకడతారనే వార్తలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయింది. సభ జరుగుతున్నంతసేపూ సమయం దొరికినప్పుడల్లా ఆమె చంద్రబాబునాయుడితో గుసగుసలాడారు. read more.

హిరాకుడ్‌ రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం



- పడవ నీట మునిగి16 మంది మృతి
- మరో 12 మంది గల్లంతు
సంబల్‌పూర్‌ : ఒడిశాలోని హిరాకుడ్‌ డ్యామ్‌ రిజర్వాయర్‌లో ఆదివారం విహారానికి వెళ్లిన పర్యా టకులు ఘోర విషాదాన్ని చవిచూడాల్సి వచ్చింది. సంబల్‌పూర్‌ జిల్లాలోని ఈ రిజర్వాయర్‌లో వీరు ప్రయాణిస్తున్న పడవ తీతాపల్లి సమీపాన నీట మునిగి 16 మంది చనిపోయారు. మహిళలు, చిన్నారులు సహా 12 మంది గల్లంతయ్యారు. 70 మంది ప్రయాణీకులను చేరవేయగల.. read more

తృణమూల్‌ హింసాకాండపై లెఫ్ట్‌ సమరభేరి



- ఐక్యతతో కాంగ్రెస్‌, బిజెపిలను ఓడించాలని ప్రకాశ్‌కరత్‌ పిలుపు 
- ల్‌కతా లెఫ్ట్‌ఫ్రంట్‌ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు
- భారీగా తరలివచ్చిన ప్రజలను అభినందించిన ప్రకాశ్‌కరత్‌
ప్రజాశక్తి ప్రతినిధి-కొల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ ఆధ్వర్యంలో కొల్‌కతా నగరంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కొనసాగిస్తున్న హింసాకాండపై వామపక్ష కార్యకర్తలు సమరభేరి మోగించారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన వామపక్ష కార్యకర్తలతో నగరంలోని బ్రిగేడ్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ అరుణార్ణవమైంది. అసంఖ్యాక జనవాహినితో జనసంద్రంగా మారింది. ర్యాలీకి హాజరయ్యేందుకు నగరానికి చేరుకుంటున్న వామపక్ష కార్యకర్తలను అడ్డుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు తమదైన శైలిలో జులుం ప్రదర్శించారు. read more.

కామెడీ కంపల్సరీ !



    హాస్య నటుడిగా మాంచి ఫామ్‌లో ఉండగానే హీరోగా టర్న్‌ అయిపోయాడు సునీల్‌. ఆయన హీరో అవతారం ఎత్తాక సునీల్‌ నుంచి నికార్సయిన కామెడీ సినిమాలు రాలేదు. సిక్స్‌ ప్యాక్‌ చూపించడం కోసం కొన్ని ఫైటింగులూ, తనలోని డాన్సింగ్‌ టాలెంట్‌ బయటపెట్టడం కోసం పాటలూ పేర్చుకొంటూ కామెడీని అశ్రద్ధ చేశాడు.  see more.

37వ స్థానంలో నిలిచిన శివ




  సోచి: తొలి రెండు హీట్‌ల అనంతరం సోచిలోని భారత సంచలనం, రెండు సార్లు ఆషియన్‌ ఛాంప్‌ శివ కేశవన్‌ ల్యూజ్‌ క్రీడాంశంలో 37వ స్థానంలో నిలిచాడు. శుక్రవారం నాటి ప్రాక్టీస్‌ సెషన్‌లో దాదాపు 58 మైళ్ల వేగంతో తన స్లైడ్‌ మీంచి కిందపడ్డప్పటికీ చాకచక్యంతో, తన ప్రతిభతో తిరిగి దానిమీదకెక్కి యావత్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచిన విషయం తెలిసిందే. ఆ వీడియోని ఇంటర్నెట్లో వీక్షించిన వేలాది మంది ప్రజలు అతనిని రాత్రికి రాత్రి స్టార్‌ను చేసారు. అవినీతి అధికారులను ఎన్నికల నుండి see more..

అనారోగ్యంతో 108 వాహనాలు




- 'మహేంద్ర' వాహనాలతో గర్భిణుల ఇబ్బందులు
- వృధాగా ట్రాకింగ్‌ సిస్టం
- వినిపించని కురు కురు కురు....
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన 108 వాహనాలు కండిషన్‌లో లేక బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి. మార్గమధ్యలో ఆగిపోవడంతో గర్భిణులు, రోగులు, క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రేక్‌డౌన్‌కు కారణం మీరే అంటూ ఇఎంఆర్‌ఐ 108 వాహన సిబ్బందిని వేధిస్తోంది. కొండిపాంతాల్లో తిరిగే 'మహేంద్ర' వాహనాలు ఎక్కడానికి గర్భిణలను ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలని పిహెచ్‌సి వైద్యులు, ఐటిడిఎ అధికారులు ఫిర్యాదు చేసినా మొండిగా తిప్పుతున్నారు. వాహనం ఎక్కడుందీ కనుక్కోవడానికి రెండుకోట్లతో ఏర్పాటు చేసిన ట్రాకింగ్‌ సిస్టం పనిచేయడం లేదు. see more

రేపే పార్లమెంటుకు..




 - రాష్ట్రపతి చేతికి టిబిల్లు
- ప్రవేశ తేదీలపై స్వల్ప తేడాలు 
- బిజెపి మద్దతుపై భరోసా
- ఆమోదించడానికే ప్రయత్నం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
   ఆంధ్ర ప్రదేశ్‌ విభజన, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పునర్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రం తుది సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కేబినెట్‌ ఆమోదించిన బిల్లు ప్రతిని ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. కొంతమంది చెబుతున్నట్టు ఆయన ఈ విషయంలో ఎలాటి ప్రతిబంధకాలు సృష్టించే అవకాశం లేదు గనక సభలో ప్రవేశపెట్టడానికి పచ్చజెండా వూపుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో పదవ తేదీన ప్రవేశపెడతారని మొదట కథనాలు వచ్చాయి. కేబినెట్‌ ఆమోదం తర్వాత 12వ తేదీ అన్నారు.  see more..

నేపాల్‌ నూతన ప్రధాని సుశీల్‌ కోయిరాల



     ఖట్మండు: నేపాలీ కాంగ్రేస్‌ అధ్యక్షుడు సుశీల్‌ కోయిరాల నేపాల్‌ ప్రధాని కాబోతున్నాడు. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ -యు ఎమ్‌ ఎల్‌ మద్దతు ప్రకటించక పోవటమే ఇప్పటిదాకా ప్రధాన అడ్డంకిగా ఉండింది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ -యు ఎమ్‌ ఎల్‌ కి చెందిన అత్యున్నత నిర్ణాయక కమిటి అయిన 'స్టాండింగ్‌ కమిటి' ఆదివారం సమావేశమై నేపాలీ కాంగ్రేస్‌ నాయకత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించటంతో సుశీల్‌ కోయిరాల ప్రధాని కావటానికి రంగం సిద్దమైంది. see more..

8, ఫిబ్రవరి 2014, శనివారం

నీటి ఛార్జీల మోత



- కమర్షియల్‌, పరిశ్రమల కనెక్షన్‌లకు రెట్టింపు 
- జలమండలి ప్రతిపాదనలకు సర్కార్‌ గ్రీన్‌సిగల్‌
- నేటి నుండే అమలు
ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రతినిధి
గ్రేటర్‌లో నీటి ఛార్జీల మోత మోగించారు. కమర్షియల్‌, పరిశ్రమలకు సంబంధించిన తాగునీటి ఛార్జీలను పెంచడానికి జలమండలి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చేసింది. పెంచిన ఛార్జీల ప్రతిపాదనలను జలమండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పెంచిన ఛార్జీలు శనివారం నుండి అమలు కానున్నాయని .see more.

12,13 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 48 గంటల దేశవ్యాప్త సమ్మె



- పాల్గొననున్న 12 లక్షల మంది 
- సిసిజిఇడబ్ల్యూ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
డిమాండ్ల సాధన కోసం ఈనెల 12, 13 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సిసిజిఇడబ్ల్యూ), నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఎఫ్‌పిఇ) నేతలు సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిసిజిఇడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షులు టి నరసింహన్‌, రాష్ట్ర అధ్యక్షులు టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెలో 12 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని చెప్పారు. see more.

తనయుడి హెచ్చరిక




    తనయుడ్ని తండ్రి హెచ్చరిస్తాడు. కానీ, తండ్రికి తనయుడు హెచ్చరిక చేస్తాడా ? ఇప్పుడలాగే జరిగింది. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌కి అతని తనయుడు అమీన్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే, మొన్న రెహమాన్‌ తన స్టూడియోలో పాట రికార్డు చేస్తున్నాడు. అప్పుడు సమయం తెల్లవారుజాము 3 గంటల సమయం. see more.

ఈ ఏడాది 4.9% వృద్ధి



- వ్యవసాయరంగం తోడ్పాటు 
- సిఎస్‌ఒ అంచనాలు
  న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14)లో భారత వృద్ధి రేటు 4.9 శాతంగా ఉంటుందని కేంద్ర గణంకాల శాఖ (సిఎస్‌ఒ) అంచనా వేసింది. ఈ గణంకాలు ముందస్తు అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తయారీ రంగం వృద్ధి -0.2 శాతంగా ఉంటుందని సిఎస్‌ఒ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2013-14లో వ్యవసాయరంగం 4.6 శాతం వృద్ధిని సాధిస్తుందని సిఎస్‌ఒ పేర్కొంది. గతేడాది ఇది 1.4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం కూడా మంచి ప్రగతి నమోదు చేసుకునే అవకాశాలున్నాయి.see more.

వెలుగు చూసిన నందిగ్రామ్ నిజాలు



    మావోయిస్టుల నుంచి మితవాదుల పక్షాన ఉన్న మతోన్మాద శక్తుల వరకూ అందరూ ఈ విషయంలో ఏకమయ్యారు. ప్రతిపక్షానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వం వహించింది. దాంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. దాంతో ఆమె వామపక్ష వ్యతిరేక శక్తులకు ఒక చిహ్నంగా ఇటు జాతీయంగానే కాకుండా అటు అంతర్జాతీయంగా కూడా ఆవిర్భవించారు. అక్కడ నుంచి వామపక్షాలను ఎన్నికలపరంగా అజేయంగా ఎదుర్కొనడానికి రంగం సిద్ధమైంది. ఆ రకంగా ఆమె టైమ్‌ మేగజైన్‌ కవర్‌పేజీకి కూడా ఎక్కారు.
    చరిత్ర చాలా క్రూరమైనది. ఒక్కోసారి అది వాస్తవాన్ని కూడా బంధించేస్తుంది. ఏడేళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఒక మారుమూల గ్రామమైన నందిగ్రామ్‌ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోయింది. see more.

క్యాబినెట్‌ ఆమోదం.. టి వేగం



- టి. బిల్లు మరో కీలకఘట్టం 
- 30కి పైగా సవరణలు 
- ప్యాకేజీ వూరింపులు, యుటికి ససేమిరా 
- బిజెపికీ సమ్మతి 
- 12న రాజ్యసభకు 
- అసెంబ్లీకి పంపిన బిల్లే పార్లమెంటుకు
- అధికారికంగా సవరణల జాబితా 
- అసెంబ్లీ స్థానాల పెంపు 
- పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రకు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర విభజన దిశలో కేంద్రం మరో కీలకమైన ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ సమావేశంలో సీమాంధ్ర కేంధ్ర మంత్రులు నిరసనలకే పరిమితమైనారు.వారు ప్రతిపాదించిన సవరణలను కేబినెట్‌ పెద్దగా పట్టించుకోలేదు. కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలోనూ బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే, గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 10న కాకుండా 12వ తేదిన రాజ్యసభలో ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించారు. కోర్‌ కమిటీ సమావేశం ముగిసిన తరువాత ఎఐసిసి నేత అహ్యద్‌ పటేల్‌ ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. అయితే, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను. see more.

ఆరుగురే ఎన్నిక



ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల్లో అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్‌ బలపరిచిన ముగ్గురు, టిడిపి బలపరిచిన ఇద్దరు, టిఆర్‌ఎస్‌ బలపరిచిన ఒకరు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ నుంచి వెనక్కి తగ్గినా ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు.see more..

ప్రైవేటు సంస్థల్లో చేరే 'బొగ్గు' అధికారులపై దర్యాప్తు



- పార్లమెంటరీ స్థాయీసంఘం సూచన
    న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు ప్రైవేటు మైనింగ్‌ సంస్థల్లో చేరుతుండటంపై బొగ్గు మంత్రిత్వశాఖకుచెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైరయిన తరువాత ప్రైవేటు సంస్థల్లో చేరటం చట్టనిబంధనలకు విరుద్ధమైనందున ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. బొగ్గు క్షేత్రాలకేటాయింపులో ప్రమేయం వున్న బొగ్గు మంత్రిత్వశాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు పదవీ విరమణ చేసిన తరువాత ప్రైవేటు మైనింగ్‌ సంస్థల్లో చేరుతుండటం అనేక అనుమానాలకు తావిస్తుండటంతో తాము ఈ సూచన చేస్తున్నట్లు కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.see more.