.

31, జనవరి 2014, శుక్రవారం

అభిప్రాయాల క్రోడీకరణ - ఆసాంతం తిర‌స్క‌ర‌ణ‌



ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఒక అంకానికి తెరపడింది. ఉభయసభల్లోనూ బిల్లుపై చర్చను ముగించారు. చర్చలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు రాతపూర్వంకగా సమర్పించిన వివరాలను, సవరణల ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపుతున్నట్లు ఉభయసభాపతులు ప్రకటించారు. తప్పుల తడకగా ఉన్న రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదంటూ ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి 77వ నిబంధన కింద ప్రతిపాదించిన తీర్మానాన్ని టి. సభ్యుల తీవ్ర నిరసనల మధ్య శాసనసభ ఆమోదించింది. మండలిలో సభ నాయకుడు రామచంద్రయ్య ప్రతిపాదించిన ఇదే తీర్మానానికి ఆమోద ముద్ర పడింది. మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనమండలిలో ఛైర్మన్‌ ఏ. చక్రపాణి ప్రకటించారు. ఆ వెంటనే ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాయిదా ప్రకటన వెలువడిన వెంటనే ఉభయసభల్లోనూ తెలంగాణా, సమైక్యాంధ్ర నినాదాలు మారుమ్రోగాయి.
 see more

మైలురాయి దాటాం




- తెలంగాణా బిల్లుపై దిగ్విజరుసింగ్‌
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యాంగం సూచించిన మేరకు అసెంబ్లీ అభిప్రాయాన్ని రాబట్టుకున్నామని, దీనిని కేంద్రం వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో ప్రవేశపెడుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజరుసింగ్‌ చెప్పారు. బిజెపి మద్దతు ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన ఈ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌.see more

తెలంగాణాతో తిరిగొస్తా..




- నిశ్చింతగా ఉండండి 
- చర్చ ముగింపుపై కెసిఆర్‌  నేడు ఢిల్లీకి...
- రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు 
- బిల్లు ఆమోదం పొందే తేదీలు నాకు తెలుసు
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
   తెలంగాణా ప్రజల స్వయంపాలన ఆకాంక్ష 15 రోజులలో నెరవేరబోతుందని టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల. see more

ఢిల్లీలో మౌనదీక్ష!




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ త్వరలోనే ఢిల్లీకి వెళ్దామని సీమాంధ్ర నేతలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పినట్లు సమాచారం. విభజన ప్రక్రియను నిరసిస్తూ వచ్చేనెల 5 నుంచి 21 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో టి బిల్లు వచ్చిన సమయంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలిసింది. see more.

ఇక 12 సిలిండర్లు



- ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేత
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్‌ సరఫరాపై ఇప్పటి వరకూ ఉన్న ఏడాదికి 9 సిలెండర్ల పరిమితిని 12కు పెంచుతూ రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు రానున్న ఎన్నికల్లో తమకు 'అదృష్టాన్ని' కట్టబెడుతుందని నమ్ముతున్న వంటగ్యాస్‌కు చెందిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలును కూడా తాత్కాలికంగా see more.

కుట్ర బహిర్గతం




- నందిగ్రామ్‌ కాల్పుల కేసులో బుద్ధదేవ్‌ సర్కారుకు సిబిఐ క్లీన్‌చిట్‌
 కోల్‌కతా: బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో 2007లో జరిగిన పోలీసు కాల్పుల వ్యవహారంలో నాటి బుద్ధదేవ్‌ సర్కారుకు సిబిఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కాల్పులు వ్యవహారం 'రాజ్యాంగ విరుద్ధమం'టూ కోల్‌కతా హైకోర్టు 2007లో చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తూ సిబిఐ గత నెల 18న దాఖలు చేసిన తాజా చార్జిషీట్‌ ఈ కేసును కొత్తమలుపు తిప్పింది. see more

సమస్యల సర్కారు




- జీఓ నెం.101ను సవరించాలి 
- 'చర్చ'కే పరిమితమైన ప్రభుత్వం
- ఇకపై సమస్యలపై మాట్లాడాలి
- సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు డిమాండ్‌ 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
     కార్పొరేషన్‌లలో స్వయం ఉపాధి పథకాలకు, సొసైటీలోని సభ్యులకు వ్యక్తిగత ఆర్థిక సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.101లో ఉన్న లోపాలను వెంటనే సవరించాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిమాండ్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌ 31న జారీ చేసిన ఈ జీఓలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు వయోపరిమితి విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. see more

38 మంది తమిళ మత్స్యకారుల అరెస్ట్‌



     రామేశ్వరం/కొలంబో: తమిళనాడుకు చెందిన దాదాపు 38 మంది మత్స్యకారులను లంక నౌకాదళం గురువారం అరెస్ట్‌ చేసింది. మత్స్యకారుల సమస్యపై భారత్‌-లంక మత్స్యకార ప్రతినిధి బృందాలు భేటీ అయిన మూడు రోజులకే ఈ తాజా అరెస్ట్‌ జరగటం విశేషం. అంతర్జాతీయ సముద్ర హద్దులు దాటారంటూ మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన వారి ఐదు బోట్లను లంక నౌకాదళం స్వాధీనం చేసుకుని see more

బాగ్దాద్‌లో పేలుళ్ళు‌, ఆరుగురి మృతి



- జనవరిలోనే 900 దాటిన మృతుల సంఖ్య
   బాగ్దాద్‌: బాగ్దాద్‌ నగరంలోని రద్దీ మార్కెట్‌ సమీపంలో వున్న ఒక రెస్టారెంట్‌లో గురువారం జరిగిన  బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. దీనితో జనవరిలో హింసాకాండకు బలైన వారి సంఖ్య 900 దాటిందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో పెరిగిపోయిన హింసాకాండ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, భద్రతా దళాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలతో దేశం మళ్లీ గత హింసాత్మక కాలం నాటికి .see more

హలో హలో @ 91 కోట్లు



న్యూఢిల్లీ : గత నవంబర్‌ ముగింపు నాటికి భారత్‌లో మొత్తం టెలిఫోన్‌ వినియోగదార్ల సంఖ్య 91.01 కోట్లకు చేరింది. అక్టోబర్‌ 2013 నాటికి ఈ సంఖ్య 90.45 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రారు) వెల్లడించింది. ఇంతక్రితం మాసం వినియోగదార్లతో పోల్చితే 0.62 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం వినియోగదార్లలో పట్టణ ప్రాంత ఖాతాదార్లు 60.06 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదార్ల వాటా 39.94 శాతానికి పెరిగింది. see more

పరువు కోసం...



-   ఆఖరి వన్డే నెగ్గాలని టీమిండియా తాపత్రయం 
-    క్లిష్ట పరిస్థితుల్లో ధోని సేన అ ఆధిక్యంపై కివీస్‌ కన్ను 
-    భారత్‌, కివీస్‌ ఐదో వన్డే నేడే 
-    ఉ. 6.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం..
     వెల్లింగ్టన్‌ :  వన్డేల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌గా కివీస్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ఆటతీరుతో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ధోనిసేన కనీసం ఆఖరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్‌ అనంతరం కీలక టెస్ట్‌ సిరీస్‌ ఆడనుండటం కారణంగా ఐదో వన్డే .see more.

హిందీ చిత్రానికి రీమేక్‌ మాత్రం కాదు : శేఖర్‌ కమ్ముల



'లీడర్‌' నుంచి 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' వరకు చిత్రాలు తీశాక కొత్త తరహా కథలు రాసుకుంటున్నా. ఆ క్రమంలో అనుకోకుండా హిందీ చిత్రం 'కహాని' చూడటం జరిగింది. అప్పటికే దిల్‌సుఖ్‌నగర్‌, లుంబినీ పార్క్‌ ఘటనలు జరిగాయి. దాంతో ఇందులో త్రెడ్‌ను తీసుకుని మొత్తం మార్చేసి సినిమా తీయాలనుకుని చేసిన చిత్రమే 'అనామిక'. హిందీ రీమేక్‌ మాత్రం కాదు'' అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ తొలిసారిగా దక్షిణాదిలో ప్రవేశించి తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. see more..

30, జనవరి 2014, గురువారం

రాక్ష‌రాస్య‌త‌లో భార‌త్ టాప్...!



- తేల్చి చెప్పిన ఐరాస
ఐక్యరాజ్యసమితి : ప్రపంచంలో వయోజన నిరక్షరాస్యులెక్కువగా వున్న దేశాలలో భారత్‌ అగ్రస్థానంలో వుందని ఐరాస విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో మొత్తం 28.7 కోట్ల మంది వయోజనులు నిరక్షరాస్యులుగా వున్నారని, ఇది ప్రపంచ నిరక్షరాస్యత జనాభాలో 37 శాతం అని ఐరాస నివేదిక చెబుతోంది. దేశంలోని పేద, ధనిక వర్గాల మధ్య అక్షరాస్యతలో భారీ వ్యత్యాసం వుందని ఈ నివేదిక వివరించింది. భారత్‌లో 1991లో 46 శాతం వున్న అక్షరాస్యత 2006 నాటికి 63 శాతానికి చేరినప్పటికీ పెరిగిన జనసంఖ్యతో పోల్చుకుంటే ఈ సాధన ఫలితాలెక్కడా కన్పించటం లేదని, read more

మైనార్టీల ప్రోత్సాహానికి, పరిరక్షణకు తగిన చర్యలు

వ్యవసాయ రుణమాఫీ పథకంలో లొసుగులు



    న్యూఢిల్లీ: యుపిఎ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన వ్యవసాయ రుణమాఫీ పథకం లొసుగులతో కూడి వున్నందు వల్ల అది ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోయిందని పార్లమెంట్‌కు చెందిన ప్రజా పద్దుల సంఘం (పిఎసి) తన మధ్యంతర నివేదికలో ఎత్తిచూపింది. పథకానికి నిర్దేశించిన మార్గదర్శకాల ఉల్లంఘన, పర్యవేక్షణా లోపాలు ఇందుకు ప్రధాన కారణాలని పిఎసి తన నివేదికలో వివరించింది.  read more

నందికోసం పోటీపడుతున్నాం



- అక్కడ అన్ని సౌకర్యాలుంటాయి 
- 'మిణుగురులు' దర్శకుడు అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
''కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. మరి కొన్ని సినిమాలు తెలియని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. ఇంకొన్ని సినిమాలు ధియేటర్‌ నుండి బయటికొచ్చిన తరువాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. ఆ కోవకు చెందినదే 'మిణుగురులు' చిత్రమని'' దర్శక నిర్మాత అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి అంటున్నారు. కంటి చూపు లేకపోతే అంతా శూన్యమన్నది అందరికీ తెలిసిందే. అటువంటి శూన్యమైన చూపులతో సమాజాన్ని ప్రశ్నిస్తున్న అంధ విద్యార్థుల కథను తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 40 మంది అంధ బాలబాలికలు నటించిన ఈ చిత్రంలో సుహాసిని, ఆశిష్‌విద్యార్ధి, రఘువీర్‌ యాదవ్‌, దీపక్‌, రుషిక ముఖ్య పాత్రలు పోషించారు. అంధ విద్యార్ధులు వసతి గృహాల్లో ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రం ఇటీవల సిరి మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు అయోధ్యకుమార్‌ బుధవారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో...read more

చిదంబ‌రం మ‌నీ లాండ‌రింగ్ ?



    న్యూఢిల్లీ: దాదాపు రు.5,500 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో ఒక ప్రముఖ టీవీ ఛానల్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంకు భాగస్వామ్యం వున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన కొన్ని పత్రాలు, రెండు డివిడిలు ఒక మీడియా సంస్థలకు లభించాయి. ఈ పత్రాలలో వున్న సమాచారం ప్రకారం టీవీ చానల్‌ యాజమాన్యానికి, ఆర్థిక మంత్రి పి చిదంబరంకు ఈ వ్యవహారంలో వున్న భాగస్వామ్యం గురించిన పూర్తి సమాచారం వున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో చిదంబరంను నేరుగా నిందిస్తూ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపి రామ్‌జెఠ్మలానీ గత నెల 6వ తేదీన ఆయనకు  read more

ఈ విజయం అందరిది




* విఆర్‌ఎల విజయోత్సవ సభలో వక్తలు
* కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
     గత రెండేళ్లుగా వేతనాల పెంపు కోసం విఆర్‌ఎలు అలుపెరుగని ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారని విఆర్‌ఎల విజయోత్సవ సభలో వక్తలు అభినందనలు తెలిపారు. ఈ విజయం అందరిదని కొనియాడారు. మరిన్ని సమస్యలపై రాజీలేని పోరాటాలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం స్థాపించన నాటి నుండి విఆర్‌ఎల సమస్యలపై సిపిఎమ్‌ పార్టీ, సిఐటియు రాజీలేని పోరాటాలు చేస్తున్నాయని  read more

4న జిఓఎం




ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియపై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు మంత్రుల ఉన్నతాధికార కమిటీ ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరికొంత గడువు ఇవ్వాలంటూ  read more

కిరణ సన్యాసం




- ఈ బిల్లు పెట్టే దమ్ముందా
- కేంద్రానికి సవాల్‌
- రాజకీయాల నుంచి తప్పుకుంటా
- సిఎం సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రపతిని మోసం చేసిన కేంద్ర హోంశాఖ
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
   ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రహౌంశాఖ రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపించిన విభజన ముసాయిదా బిల్లునే పార్లమెంటులో పెట్టడానికి అనుమతిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు.  read more

నోబెల్‌ శాంతి పురస్కారానికి స్నోడెన్‌ పేరు



      లండన్‌: అమెరికా అక్రమాల గుట్టు రట్టు చేసిన ఆ దేశ జాతీయ భద్రతా సంస్థ మాజీ అధికారి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ పేరున ఈ ఏడాది నోబుల్‌ శాంతి పురస్కారానికి ప్రతిపాదిస్తున్నట్లు నార్వేకు చెందిన ఒక పార్లమెంట్‌ సభ్యుడు ప్రకటించారు. నార్వే సోషలిస్ట్‌ లెఫ్ట్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి బార్డ్‌ వెగర్‌ సోల్జెల్‌ బుధవారం ఇక్కడ read more

7% పెరిగిన ఎఫ్‌డిఐ రాక

1


   యునైటెడ్‌ నేషన్స్‌ : గతేడాది 2013లో భారత్‌లోకి 28 బిలియన్‌ డాలర్ల విలువ చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చి చేరాయని యునైటెడ్‌ నేషన్స్‌ తన నివేదికలో పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఎఫ్‌డిఐతో పోల్చితే ఇది 17 శాతం అదనమని పేర్కొంది. ఏడాది మధ్యంలో అనుకోని విధంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాల ఎఫ్‌డిఐలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని పేర్కొంది. read more

ఫిట్‌నెస్‌ ఉంటే పతకాలు నావెంటే



     హైదరాబాద్‌ : ఫిట్‌నెస్‌ లేమి, గాయాలు వేధించటం కారణంగా 2013 సీజన్‌లో పతకాలు సాధించలేకపోయానని భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చెప్పారు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగా ఒక్కసారిగా నాఆటతీరు పేలవంగా ఉండటంతో కొంత నిరుత్సాహనికి గురయ్యానని, కాలి వేలి గాయం తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది. అలాగే నాపేలవ ఆటకు చాలా కారణాలున్నాయని అందులో ఇదోకటని ఈ హైదరాబాద్‌ షట్లర్‌ పేర్కోన్నారు.  read more

పవర్‌' సెన్సేషన్‌

'


     రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవీంద్రనాథ్‌(బాబి) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పవర్‌'(అన్‌లిమిటెడ్‌). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ అయిన టీజర్‌కు యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్‌ వచ్చాయి. రవితేజ గతంలో చేసిన 'బలుపు' చిత్రానికి ఒక సంవత్సరంలో 2,41,000 వ్యూస్‌ రాగా, 'పవర్‌'కు రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్‌ సాధించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. read more

29, జనవరి 2014, బుధవారం

మరో 3 వారాల గడువు ఇవ్వండి




-   రాష్ట్రపతికి లేఖ రాశానన్న సిఎం
-   సిఎల్పీ తరపున సీమాంధ్ర మంత్రులు మరో లేఖ
     ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
     రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడు వారాలు గడువు కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని మంగళవారం నాడాయన మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా సిఎల్పీ తరపున సీమాంధ్ర ప్రాంత మంత్రులు పలువురు రాష్ట్రపతికి మరో లేఖ రాశారు. బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. read more.

ఆరుస్థానాలకు 9మంది



-  ముగిసిన రాజ్యసభ నామినేషన్ల పర్వం
-  టిఆర్‌ఎస్‌కు సిపిఐ మద్దతు
     ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      రాజ్యసభకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని ఆరు స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌తోపాటు టిడిపి, టిఆర్‌ఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు కూడా మంగళవారం నాడే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో శాసనసభ కార్యదర్శి కార్యాలయం వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తరపున ముగ్గురు, టిడిపి తరపున ఇద్దరు, టిఆర్‌ఎస్‌ తరపున ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శి సదారాంకు తమ నామినేషన్‌ ఫారాలను వీరు అందచేశారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కె. కేశవరావుకు సిపిఐ మద్దతు ప్రకటించింది. కెకె నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ఏలు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా జెసి దివాకర్‌రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే, చివరి క్షణంలో ఆయన తప్పుకున్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెడ్డి ఆయన స్థానంలో నావినేషన్‌ వేశారు మరో స్వతంత్ర అభ్యర్థిగా చైతన్య రాజు నామినేషన్‌ దాఖలు చేశారు.శ్రమజీవి పార్టీకి చెందిన జె.భాస్కర్‌ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.read more.

విద్యను అమ్మడం అనాగరికం




-   కాంగ్రెస్‌, బిజెపి దొందూదొందే 
-   పిడిఎస్‌యు బహిరంగ సభలో హరగోపాల్‌
-   విద్యార్థుల భారీ ప్రదర్శన
     ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
     రామాయణ, మహాభారతాల్లో ఎక్కడైనా విద్యను అమ్ముకున్నట్లు చూశామా?, విద్యను అమ్ముకున్న దేశం అనాగరిక దేశమనిహైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విద్యా, వైద్యాన్ని అమ్ముకోవడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) 19వ రాష్ట్ర మహాసభ మంగళవారం ఉస్మానియా ఉస్మానియా .read more..

నా భార్య ఏ పనీ చేయదు!




ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన సంభాషణ ఇది. 
(ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్న మెయిల్‌ ఇది. ఇందులో సై - సైకాలజిస్ట్‌, భ - భర్త)

సై: మీరు ఏం చేస్తారు?
భ: నేను బ్యాంక్‌లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను.
సై: మీ భార్య ఏం చేస్తారు?
భ: ఆమె ఏ పనీ చేయదు. ఆమె గృహిణి మాత్రమే.
సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం ఎవరు తయారుచేస్తారు?.read more

పావు శాతం వడ్డింపు




* కీలక వడ్డీ రేటు పెంపు
* ఆర్‌బిఐ నిర్ణయం
* గృహ, వాహన రుణాలు ప్రియం
* 5% లోపే వృద్ధి రేటు
ముంబయి : దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా హెచ్చు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశ్యంతో రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. మంగళవారం ఆర్‌బిఐ నిర్వహించిన మూడో త్రైమాసిక మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 8 శాతానికి చేర్చింది. ఇంతక్రితం ఈ కీలక వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. మరోవైపు ఆర్‌బిఐ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు పెదవి విరిచాయి. read more..

మాట నిలబెట్టుకోవడంలో నాయుడు చాలా స్ట్రాంగ్‌



-  వెనక్కి తీసుకోవడంలో చాలా వీక్‌..
- పదేళ్ల తర్వాత హీరోగా చేస్తున్నా
- పా..పా..తుమ్మెదా..చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నా
      'బ్రహ్మచారిగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. పెళ్ళి చేసుకుంటే కనీసం టీవీ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆపలేము. నా పేరు నాయుడు... నా నోటికి దురుసెక్కువ... చేతికి దురదెక్కువ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో నాయుడు చాలా స్ట్రాంగ్‌. వెనక్కి తీసుకోవడంలో చాలా వీక్‌'..ఇవన్నీ మంచు మోహన్‌బాబు మాటలు. ఆయన తాజాగా నటించిన 'పాండవులు..పాండవులు తుమ్మెద' చిత్రంలో చెప్పిన డైలాగ్స్‌ అవి. ఇటువంటి డైలాగ్‌లో మరెన్నో ఈ చిత్రంలో ఉన్నాయని, సినిమా ప్రేక్షకులకు విందు భోజనమవుతుందని మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే హిందీ చిత్రం 'గోల్‌మాల్‌-3' సినిమాకి ..read more..

28, జనవరి 2014, మంగళవారం

అమాత్యుల టిరుగుబాటు



- సిఎం నోటీసుపై దుమారం
- స్పీకర్‌ ముందు నిరసన నినాదాలు  
- శాసనసభ చరిత్రలో తొలిసారి
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  శాసనసభలో అత్యంత అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన కేబినెట్‌లోనే మంత్రులే ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకువెళ్లారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటిస్‌ సోమవారం నాటి శాసనసభలో పెను దుమారాన్నే రేపింది. ఆ నోటిస్‌ను తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తూ టిఆర్‌ఎస్‌, టిటిడిపి, టి.కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి టి మంత్రులు కూడా జత కలిశారు. సభ్యులతో కలిసి వెల్‌లోకి దూసుకెళ్లారు.see more.

రాజ్యసభ అభ్యర్థులు వీరే!



- పాతకాపులకే కాంగ్రెస్‌ పట్టం
- రెబల్స్‌గా బరిలోకి సీమాంధ్ర నేతలు
- టిడిపిలో రాజుకున్న చిచ్చు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రం నుండి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అధిష్టానానికి విధేయులుగా ఉన్న కెవిపి రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్‌లనే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది.see more..

నేను లోతైన మనిషిని



- ఇంటర్వ్యూలో రాహుల్‌గాంధీ 
- మోడీ గురించి కంగారు లేదు
- గుజరాత్‌ దారుణానికి వారిదే బాధ్యత
- ఎంపిలే ప్రధానిని ఎన్నుకుంటారు
- అధిక ధరలు వాస్తవం
  ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో
  తనకు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ఎలాటి భయం లేదని కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. చిన్నతనంలోనే నానమ్మ, నాన్నల ప్రాణబలిని చూసిన తాను దేనికి భయపడాలని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తామని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ చాలా బలమైన శక్తి అనీ, విజయం సాధించే సత్తా వుందని ప్రకటించారు. see more.

మోడీ పటేల్‌ వారసుడు కాదు




-  రాజ్‌మోహన్‌ గాంధీ పునరుద్ఘాటన 
- మోడీది ఏకవ్యక్తి రాజకీయం
  ప్రజాశక్తి హైదరాబాద్‌ బ్యూరో
  బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దేశ తొలి ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌కు ఏ విధంగానూ వారసుడు కాలేడని ప్రముఖ చరిత్ర కారుడు, మహాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్‌ గాంధీ అన్నారు. తొలి ప్రధాని నెహ్రూతో పోల్చలేకపోయినా పటేల్‌ ఏ విధంగానూ మతతత్వవాది కాదని ఆయన జీవిత చరిత్ర రాసిన రాజ్‌మోహన్‌ అభిప్రాయపడ్డారు. see more.

ఎన్నాళ్లీ వెట్టిచాకిరి?




- సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
- ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని 
- ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
- ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ డిమాండ్‌
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  వెట్టిచాకిరి చేయించుకోకుండా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేకపోతే తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్సీ డాక్టర్‌ కె.నాగేశ్వర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టైంస్కేల్‌, కంటింజంట్‌, డైలీవేజ్‌, పార్ట్‌టైం, కన్సాలిడేటెడ్‌, హాస్టల్‌ డైలీవేజ్‌ తదితర ఉద్యోగులు ఆయా శాఖల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. see more.

మహిళల కబడ్డీ విజేత విశాఖ



-  ప్రజాశక్తి- చోడవరం,
-  విశాఖపట్నం
     విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలెంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. విజయనగరం ద్వితీయ స్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో, తూర్పుగోదావరి నాలుగో స్థానంలో నిలిచాయి. see more

అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం



- నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు
- అక్రమ అరెస్టులు
- కరీంనగర్‌లో పిడిగుద్దులు
- వరంగల్‌లో కలెక్టర్‌ బెదిరింపులు
  ప్రజాశక్తి-యంత్రాంగం
  బాలబడుల్ని అంగన్‌వాడీలకే అప్పగించాలనీ, ఇందిరమ్మ అమృత హస్తం పెండింగ్‌ బిల్లుల్ని, పెంచిన అద్దె బిల్లులు చెల్లించాలనీ, వేతన జీవో అమలు చేయాలనీ అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చలో కలెక్టరేట్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. అంగన్‌వాడీ పోస్టుల్ని భర్తీ చేయాలి, అధికారుల వేధింపుల్ని ఆపాలంటూ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల నినాదాలతో కలెక్టరేట్‌లు మారుమోగాయి. read more.

తప్పులున్నాయనడం తగదు



- రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ బ జైరామ్‌ రమేష్‌ 
  న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పరిశీలనకు పంపిన తెలంగాణా బిల్లు పూర్తిగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్‌ రమేష్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు తప్పులతో నిండి వుందనటం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేదా సీమాంధ్ర మంత్రులకు తగదని అన్నారు.read more.

విడిపోయిన 48గంటలలోనే


- భారత్‌ను సందర్శిస్తున్న ఫ్రెంచ్‌ అధ్యక్షుడి మాజీ భార్య
  పారిస్‌: ఫ్రెంచ్‌ అధ్యక్షుడి మాజీ భార్య వాలరీ ట్రైయర్‌వైలర్‌ ఒక ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం వచ్చింది. వాలరీ ట్రైయర్‌వైలర్‌ ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలో సోమవారం ఉదయం ముబై చేరుకున్నది. ఆమె ఆకలికి వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా ముంబై నగరంలోని నిరుపేదలు నివసించే మురికి వాడలో జబ్బున పడిన మహిళలనూ, పిల్లలనూ పరామర్శిస్తున్నది. read more.

కంపెనీలపై ఒత్తిడి లేదు



-   అ పెట్టుబడి ప్రాంత ఎన్నికపై సిఎం అ శ్రీసిటీలో ఇసుజు వాహన ప్లాంట్‌
    ప్రజాశక్తి-బిజినెస్‌ బ్యూరో
    రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆ వర్గాలు తమకు ఇష్టమచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి తప్పా తాము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఎలాంటి ప్రభావితం చేయలేదని అన్నారు. జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్‌ చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు సోమవారం హైదరాబాద్‌లో సిఎం లాంచనంగా శంకుస్థాపన చేశారు.read more.

చిన్నమార్పులు.. పెద్దవిజయాలు



      హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్‌లో సత్తా చాటిన అశ్విన్‌, జడేజా... అక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో వీరిద్దరూ ఇంతగా చెలరేగడానికి వీరి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చిన్నపాటి మార్పులు ఎంతో ఉపకరించాయి.కీలకమైన మూడో వన్డేలో అశ్విన్‌ నెం.7లో బ్యాటింగ్‌కి వచ్చాడు. మరో వైపు జడేజా నెం.8వ స్ధానంలో ఫినిషర్‌గా దుమ్ముదులిపాడు. నిజానికి అశ్విన్‌ తన కెరీర్‌ని బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించాడు. తమిళనాడు జట్టుకి ఓపెనింగ్‌ కూడా చేశాడు. read more.

కమర్షియల్‌గా ఆలోచించను.. కథ గురించే..ఆలోచిస్తా..



- కాజల్‌ అగర్వాల్‌
'తొమ్మిదేళ్ళ సినీ జీవితం.. చాలా బిజీగా గడిచింది. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ఏడాదికి అయిదారు సినిమాలు కాకుండా, చేసేది రెండు సినిమాలైనా అర్ధవంతమైన సినిమాలు చేయాలనుకుంటున్నా'నని అందాల నటి కాజల్‌ చెప్పారు. ఇటీవలె ఆమె అతిథి పాత్రలో కనిపించిన చిత్రం 'ఎవడు'. అందులో దీప్తి పాత్రకు వస్తున్న స్పందన గురించి సోమవారం పాత్రికేయులతో కాజల్‌ మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లో.. read more

27, జనవరి 2014, సోమవారం

అండమాన్‌ సమీపంలో పడవబోల్తా



- 28 మంది మృతి
పోర్ట్‌బ్లెయిర్‌: బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో ఆదివారం ప్రయాణీకుల పడవ బోల్తాపడ్డ ప్రమాదంలో కనీసం 28 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. 45 మంది ప్రయాణీకులతో బయల్దేరిన ఈ పడవ ఉత్తర బంగాళాఖాతంలోని రాస్‌ దీవి సమీపంలో నీట మునిగింది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది తమిళనాడులోని కాంచీపురం, ముంబయి నగరానికిచెందిన వారే. సమాచారం.read more

గ్రేహౌండ్స్‌ ఎస్‌ఐ కె ప్రసాద్‌కు మరణానంతరం అశోక్‌చక్ర పురస్కారం



     న్యూఢిల్లీ : 65వ రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్‌ ఎస్‌ఐ కె ప్రసాద్‌బాబుకు మరణానంతరం అశోకచక్ర పురస్కారాన్ని అందజేశారు. గత ఏడాది ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో ఎస్‌ఐ ప్రసాద్‌ మరణించారు. ఆదివారం గణతంత్రదినోత్సవ పరేడ్‌ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి ఈ పురస్కారాన్ని ప్రసాద్‌ తండ్రి కె. వెంకటరామయ్య అందుకున్నారు. గతేడాది ఏప్రిల్‌ 16న ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు పేలుడుకు పాల్పడి, ప్రసాద్‌ నేతృత్వంలోని గ్రేహౌండ్స్‌ బృందంపై కాల్పులు జరిపారు. read more.

ఆస్తులతో ఆటలు



- దస్తావేజుల పని 'మీసేవ'కు ఇస్తే అవస్థలే
ప్రజాశక్తి ప్రతినిధి - తిరుపతి జోన్‌
  కడుపులో క్యాన్సర్‌ గడ్డవుంది. దాన్ని తొలగించాలి. నిపుణుడైన డాక్టర్‌ అయితేనే ఆ పని చేయగలడు. చేతిలో కత్తి ఉందిగదా అని కూరగాయలు తరిగే వ్యక్తివద్దకు ఆ రోగిని పంపితే...ఏమవుతుంది?
అచ్చం ఇలాగేవుంది...దస్తావేజుల తయారీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి. ఇంటర్నెట్‌ ఉందిగదా అని దస్తావేజుల తయారీ వ్యవహారాన్ని మీ-సేవకు అప్పగించాలనుకుంటోంది. వృత్తి..read more.

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టిచ్చిన ప్రజాశక్తి విలేకరికి అవార్డు



   ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
   గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ రాంగోపాల్‌, ఎస్‌పి రామకృష్ణ చేతుల మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం 'ప్రజాశక్తి' విలేకరి అరవింద్‌బాబు అవార్డు అందుకున్నారు. గతనెల 16న ఎర్రచందనం తరలిస్తున్న స్మగర్లను అరవింద్‌బాబు ప్రాణాలకు తెగించి పోలీసులకు పట్టిచ్చాడు.read more

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలందరికీ చేరాలని తెలిపారు. పథకాల అమలుపై సామాజిక తనిఖీ తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. దేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అమల్లో ఉందన్నారు. దేశం కోసం పోరాడిన అమరవీరులను, త్యాగధనులను స్మరించుకోవాలని సూచించారు. read more