27, జనవరి 2014, సోమవారం

ఆమ్‌-ఆద్మీ.. కథాంశంతో సినిమా   సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తమిళ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరమీదకు రాబోతోందన్న వార్తలు తమిళ సినిమా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. రాజకీయాలు, అవినీతి ప్రధానాంశంగా ఈ సినిమా కథ ఉంటుందని చెన్నరు టాక్‌ ! ఆమ్‌-ఆద్మీని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తారట. ఆమ్‌ ఆద్మీ పార్టీ పోరాటాన్ని కూడా ఇందులో ప్రధానాంశంగా తీసుకుంటున్నారని మరో భోగట్టా ! అయితే ఇదంతా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనటానికి సూచనగా కొంతమంది పేర్కొంటున్నారు. ఏదేమైనా రజనీ ఓ చిత్రం చేస్తున్నాడని వార్తలు రావటం ఆయన అభిమానుల్ని సంతోషపర్చింది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి