25, జనవరి 2014, శనివారం

భరించలేం... బంగారం!


     ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి తారాపథానికి దూసుకువచ్చిన దర్శక - నిర్మాత మారుతి. ఆయన సమర్పణలో, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మించిన సినిమా 'లవ్‌ యు బంగారం'. గతంలో వచ్చిన 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్‌', నిరుటి 'రొమాన్స్‌' లాగానే మారుతి ఈ సారి కూడా తనకు అలవాటైన అసభ్య, అశ్లీల పద్ధతిలోనే తీసిన సినిమా ఇది. యూత్‌ను ఆకట్టుకోవాలనే దుగ్ధతో బూతు చిత్రాలు తీస్తున్న ఇటీవలి కుక్కమూతి పిందెల ధోరణికి ఈ సినిమా మరో తాజా ఉదాహరణ. 
     సర్వసాధారణంగా కాలేజీ ప్రేమ కథలను తీసుకొనే మారుతి ఈసారి భార్యాభర్తల మధ్య ప్రేమనూ, వారి మధ్య శృంగారాన్నీ ఎంచుకున్నాడు. విశాఖపట్నంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు హీరో ఆకాశ్‌ (శేఖర్‌ కమ్ముల తీసిన 'హ్యాపీ డేస్‌' ఫేమ్‌). నిదానంగా సాగే ఈ కుర్రాడు, వేగంగా సాగే మీనాక్షి ('ఆర్య'లో బాల నటిగా మెరిసి ఇప్పుడు హీరోయిన్‌ అయిన శ్రావ్య) ప్రేమలో పడతారు. తల్లితండ్రుల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంటారు. ఆపైన హైదరాబాద్‌కు మకాం మారుస్తారు. కొన్నాళ్ళు ఆనందంగా జీవితం గడిచాక, ఇంట్లో విసుగు పుడుతోంది కాబట్టి, ఉద్యోగం చేస్తానంటుంది హీరోయిన్‌. అందుకు సరేనంటాడు హీరో.read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి