30, జనవరి 2014, గురువారం

నందికోసం పోటీపడుతున్నాం- అక్కడ అన్ని సౌకర్యాలుంటాయి 
- 'మిణుగురులు' దర్శకుడు అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
''కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. మరి కొన్ని సినిమాలు తెలియని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. ఇంకొన్ని సినిమాలు ధియేటర్‌ నుండి బయటికొచ్చిన తరువాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. ఆ కోవకు చెందినదే 'మిణుగురులు' చిత్రమని'' దర్శక నిర్మాత అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి అంటున్నారు. కంటి చూపు లేకపోతే అంతా శూన్యమన్నది అందరికీ తెలిసిందే. అటువంటి శూన్యమైన చూపులతో సమాజాన్ని ప్రశ్నిస్తున్న అంధ విద్యార్థుల కథను తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 40 మంది అంధ బాలబాలికలు నటించిన ఈ చిత్రంలో సుహాసిని, ఆశిష్‌విద్యార్ధి, రఘువీర్‌ యాదవ్‌, దీపక్‌, రుషిక ముఖ్య పాత్రలు పోషించారు. అంధ విద్యార్ధులు వసతి గృహాల్లో ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రం ఇటీవల సిరి మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు అయోధ్యకుమార్‌ బుధవారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో...read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి