25, జనవరి 2014, శనివారం

సబ్‌ప్లాన్‌ నిధులు అడిగితే బూతులు- కెవిపిఎస్‌ నాయకులపై  సిఐ దౌర్జన్యం
- తీవ్రంగా ఖండించిన రాఘవులు
- క్షమాపణలు చెప్పిన పోలీస్‌ అధికారులు
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
   ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు జులుం చేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు ఎలా నిర్వహిస్తారంటూ అడ్డమైన బూతులు తిట్టారు. టెంట్‌ లాగేసి బీభత్సం సృష్టించారు. సబ్‌ప్లాన్‌ నిబంధనలు రూపొందించాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ కెవిపిఎస్‌ ఆధ్వార్యాన శుక్రవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవనం వద్ద నిర్వహించిన ఆందోళనలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు కెవిపిఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కెవిపిఎస్‌ ఉపాధ్యక్షులు బివి రాఘవులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి