.

27, జనవరి 2014, సోమవారం

ఈజిప్టు‌ విప్లవ వార్షికోత్సవంలో హింస



- 49 మంది మృతి
  కైరో: ఈజిప్ట్‌లో మూడు సంవత్సరాల క్రితం నాటి జనవరి25కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఆరోజు జరిగిన విప్లవ వెల్లువలో దీర్ఘకాలం నియంతగా కొనసాగిన హోస్ని ముబారక్‌ పాలన అంతం అయింది. ఆవిప్లవ వార్షికోత్సవం సందర్బంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఆ నిరసన ప్రదర్శనలలో కనీసం 49మంది మరణించారు. 247మంది గాయపడ్డారు. జనవరి25విప్లవం తరువాత జరిగిన ప్రజాస్వామిక ఎన్నికలో గెలిచి మొహమ్మద్‌ మోర్సి అధ్యక్షుడైనాడు. ఆతరువాత పోయిన సంవత్సరం సైనిక తిరుగుబాటుతో మోర్సిని అధ్యక్ష స్థానం నుండి తొలిగించారు. ఈసైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఒక సంకీర్ణం ఏర్పడి ఈనిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి