26, జనవరి 2014, ఆదివారం

నేను కాంగ్రెస్‌వాదినే...!- రాష్ట్రం వస్తే అడ్డుకోను 
- రెండు తరాలుగా పార్టీలోనే 
- నాది ఆవేదన మాత్రమే
- తప్పుల తడకగా బిల్లు 
- అధిష్టానం వల్లే తెలంగాణాకు అన్యాయం
- విడిపోతే అన్ని రంగాల్లో గొడవలే!
- కొట్టుకునే పరిస్థితి వస్తుంది
- నక్సలిజం, మతకల్లోలాలు పెరుగుతాయి
- చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌
   ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
తాను కాంగ్రెస్‌ వాదినే అని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ఆయన శనివారం నాడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాదం కన్నా కాంగ్రెస్‌ వాదమే తనలో ఎక్కువగా ఉందని చెప్పారు. 'నేను సమైక్య రాష్ట్రాన్ని ఎంతగా కోరుకుంటున్నానో అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్‌ వాదిని' అని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రం వస్తే అడ్డుకోనని చెప్పారు. తనది ఆవేదన మాత్రమే అని వివరించారు.read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి