23, జనవరి 2014, గురువారం

అమరజీవికి అశ్రునివాళి
- నేడు స్టూడియోలోనే అంత్యక్రియలు
   మంగళవారం అర్థరాత్రి దాటాక కన్నుమూసిన అక్కినేని భౌతికకాయాన్ని ఉదయం 9.30 నిముషాలకు అన్నపూర్ణ స్టూడియోలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి రాజకీయ, సినీరంగప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆఖరిసారి తమ నటుడ్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు అక్కినేని కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేస్తూ నివాళులర్పించారు. గురువారం ఉదయం 7గంటలనుంచి 11.30గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని భౌతికకాయాన్ని ప్రజలు సందర్శించవచ్చు. అనంతరం ఫిలింఛాంబర్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు ఛాంబర్‌నుంచి తిరిగి స్టూడియోకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. 3.30గంటలకు స్టూడియోలోనే అంత్యక్రియలు జరుపుతారు.
  అక్కినేనికి గౌరవ సూచకంగా నేడు అన్ని స్టూడియోలు, షూటింగ్‌లు మూతబడతాయి. సౌత్‌ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌కామర్స్‌, తెలంగాణా ఫిలింఛాంబర్‌, 'మా' అసోసియేషన్‌, ఫెడరేషన్‌లు ఆయనకు నివాళులర్పిస్తునారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి