26, జనవరి 2014, ఆదివారం

నయా సరళీకరణ విధానాలపై నిరంతర పోరు-ఎఐఐఇఎ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్‌
    నాగపూర్‌: ప్రస్తుతం దేశ ఐక్యతకు, సమగ్రతకు గతంలో ఎన్నడూ లేని విధంగా సవాళు ్ల ఎదురవుతున్నాయని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఎఐఐఇఎ) అధ్యక్షుడు అమానుల్లాఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇటీవల ఇక్కడ జరిగిన ఎఐఐఇఎ 23వ జాతీయ మహాసభల ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ నానాటికీ పెరుగుతున్న ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు వేర్పాటువాద, అవకాశవాద శక్తుల పెరుగుదలకు అవకాశమిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను సవాలు చేస్తున్న నయా సరళీకరణ విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. కార్మిక వర్గ విముక్తికి జాతి ఐక్యతతో పాటు కార్మిక, బడుగు వర్గాల ప్రజల ఐక్యత అత్యంత ప్రధానమని ఆయన అన్నారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి