27, జనవరి 2014, సోమవారం

రాష్ట్రపతి ప్రసంగంలో కాంగ్రెస్‌ అజెండా


  

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ ప్రభుత్వ అజెండా ను ముందుకు తెచ్చినట్లుగా ఉందని బివి రాఘవులు వ్యాఖ్యానించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆలూరు, కోడుమూరు, కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై వేటు వేసేలా ప్రభుత్వం దానధర్మాలు చేసే సంస్థలు కావని రాష్ట్రపతి అనడం సరికాదన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు పనికి రావని, భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి భంగం కలిగేలా రాష్ట్ర విభజనపై చేసిన ప్రకటన కాంగ్రెస్‌ విధానమేనని చెప్పారు. కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా ఏర్పడే కరువు కాటకాల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వర్షాధారం మీదే ఆధారపడిన పశ్చిమ ప్రాంతంలో మెట్ట పంటలకు కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ రకంగా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి