.

30, డిసెంబర్ 2013, సోమవారం

విదేశాల్లో 14 శాఖలు

-  నూతన సర్కిల్‌గా తిరుపతి
-  2014లో 8 వేల ఉద్యోగాల భర్తీ
-  కెనరా బ్యాంకు సిఎండి వెల్లడి
   పూణె : రానున్న రెండేళ్లలో విదేశాల్లో కొత్తగా 14 శాఖలను విస్తరించాలని కెనరా బ్యాంకు నిర్దేశించుకుంది. అదే విధంగా మరో రెండు, మూడేళ్ళలో విదేశాల నుంచి వచ్చే రెవెన్యూ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకు వ్యాపారంలో ప్రస్తుతం ఈ వాటా ఆరు శాతంగా ఉంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు విదేశాల్లోని మూడు ప్రాంతాల్లో ఐదు శాఖలున్నాయి. మరో మూడు నెలల్లో జోహెన్నస్‌బర్గ్‌లో కొత్త శాఖను తెరువనుంది. అదే విధంగా సెప్టెంబర్‌ 2014 నాటికి న్యూయార్క్‌, దుబయి, ఫ్రాంక్‌ఫర్ట్‌లో నూతన శాఖలను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకుంది. మరో పది శాఖలను సాహో పాలూ, దారు ఈ సాలీమ్‌, టోక్కో, అబూజా, జెడ్డా, ఖాతర్‌, సిడ్నీ, ఒంటారియో, వెల్లింగ్టన్‌, సింగపూర్‌ ప్రాంతాల్లో విస్తరించడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఆ బ్యాంకు ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌కె దుబే తెలిపారు. ఈ శాఖలన్నీ నిర్వహణలోకి వస్తే విదేశీ వ్యాపారం 15నుంచి 20 శాతం వాటాకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. శనివారం పూణె సర్కీల్‌లో ఈ-లాంజ్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.read more

బాధితుల మృత్యుఘోష.. సరదాల్లో సర్కారు

  -ఇదీ అఖిలేష్‌ ప్రభుత్వ తీరు
సైఫై (యుపి) : ముజఫర్‌నగర్‌, షామిలి జిల్లాల్లో సెప్టెంబర్‌లో జరిగిన మత ఘర్షణల బాధితులు గడ్డకట్టించే చలిలో మృత్యుఘోష పెడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన స్వగ్రామం సైఫైలో రెండు వారాల ఉత్సవాలలో మునిగిపోయారు. పైగా వీటిని దశాబ్దకాలం నుండి తమ పార్టీ సంప్రదాయకంగా జరుపుకుంటోందంటూ ఆయన నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారు. సైఫైలో తనను కలిసిన మీడియా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల కవరేజి కోసం రాలేదన్న సంగతి తనకు తెలుసని, ఒకవైపు సహాయ శిబిరాల్లో బాధితులను చూపుతూనే మరో వైపు ఈ ఉత్సవాలను కూడా చూపుతుంటారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌ నగర్‌ అల్లర్లు జరిగి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించని అఖిలేష్‌ ఆయన తండ్రి ములాయంలు ఇప్పుడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం నాడు ఇక్కడికి చేరుకున్నారు.read more

'అనంత విషాదం'పై ఆధారాల సేకరణ

  ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద జరిగిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై విచారణ మొదలైంది. రైల్వే, ఫోరెన్సిక్‌, పోలీసులు విడివిడిగా విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పని చేపట్టారు. రైల్వేబోర్డు ఛైర్మన్‌ అరుణేంద్రకుమార్‌ ఆదివారం ఉదయాన్నే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన బోగిని ఆయన పరిశీలించారు. అనంతరం సంఘటనా స్థలానికెళ్లి తనిఖీ చేశారు. మరోవైపు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శనివారం సాయంత్రమే పుట్టపర్తికి చేరుకుంది. డిఎన్‌ఎ విభాగపు నిపుణులు, పేలుడు, రసాయనిక విభాగపు నిపుణులు, క్లూస్‌ విభాగపు నిపుణులు ఈ బృందంలో ఉన్నారు.read more

ఇంకా పెళ్లి కాలేదు

   తనకు పెళ్లి అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతోంది నిన్నటి తరం నాయిక సంఘవి. 1994లో 'తాజ్‌మహల్‌' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ తార ఆమధ్య పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వార్తలను తాజాగా సంఘవి ఖండించింది. 'నేనింకా పెళ్లి చేసుకోలేదు. అలాగే నాపై ప్రచారం జరుగుతున్నట్టుగా నేను నటనకు స్వస్తి చెప్పలేదు. అయితే, ఇంట్లో వాళ్లు మాత్రం సంబంధాలు చూస్తున్నారు' అని తెలుపుతోంది సంఘవి.read more

కలిసి కదిలారు.. కొట్టు మూయించారు!

 పద్మ ఆరేళ్ల బాబు తన బుల్లి చెల్లిని ఇంటి వరండాలో ఆడిస్తున్నాడు. ఇంతలో దిగువ బ్రాందీ కొట్టునుంచి రెండు ఖాళీ సీసాలు మేడపైకి ఎగిరి వచ్చి కింద పడి భళ్లున బద్దలయ్యాయి. ఓ సీసా బాబు తలమీద పడేదే... తృటిలో తప్పింది. ఆ శబ్దానికి హడలిపోయిన చిన్న పాప ఆ గాజుముక్కల మీదకు పాకేసింది. పాప చిట్టి చేతులు, మోకాళ్లు రక్తం స్రవించాయి...

బంగారమ్మది చిన్న ఇల్లు. అది ఎండాకాలం కావడంతో గాలాడక ఒక తలుపు రెక్క తెరిచి, భర్తకోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకుంది.read more

సర్పంచిని బికారిని చేసిన వివక్ష

 -ఇల్లు, భూమి అమ్మి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం
 - నేడు ఇల్లిల్లూ తిరిగి అడుక్కుంటున్న వైనం
గ్రామానికి సర్పంచి కాగానే దళిత వెంకటయ్య బాధ్యతగా అభివృద్ధి చేయాలని కలలు గన్నాడు. శక్తి వంచన లేకుండా పని చేశారు. రెండోసారి రిజర్వేషన్‌ కాకపోయినా పోటీపడి గెలిచాడు. ఇల్లు, భూమి అమ్మి ఖర్చు చేశాడు. ఆ తరువాత నిధులు వస్తే మరింత అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఇళ్లు భూమి అమ్మి ఖర్చు చేశాక రావల్సిన నిధులు రాకుండా పెత్తందారులు కుట్ర పన్నారు. అభివృద్ధికి అడ్డుకట్ట వేయక పోతే ఓ దళితుడు గ్రామానికి మేలు చేశాడనే పేరు రాకూడదనుకున్నారు. జనరల్‌ సీటుకు పోటీపడి రెండోసారి గెలవడం పట్ల వివక్షతోపాటు అక్కసు తోడయింది. దళితుడికి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. నిధులు మంజూరు కాకుండా అడ్డుపడ్డారు.read more

మింగేసే అనకొండలు

 - సమన్వయం జరిగే వరకూ అడ్డుకుంటా
 - అధికారంలోకొస్తే అక్రమాస్తుల్ని వెలికితీస్తాం
 - తిరుపతి 'ప్రజా గర్జన'లో చంద్రబాబు
 ప్రజాశక్తి - తిరుపతి ప్రతినిధి
 అవినీతి రహిత భారత నిర్మాణానికి చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకూ పోరాడుతానని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశ రాజకీయాల్లో టిడిపి కీలకంగా వ్యవహరించబోతోందని చెప్పారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో టిడిపి ప్రజాగర్జన పేరుతో ఎన్నికల శంఖారావాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లాంటి ఆనకొండలను ఆదరిస్తే దేశాన్ని మింగేస్తాయని పేర్కొన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలంటే ప్రతి read more

భూకంపాలు తట్టుకునే ఇళ్లు..!

  -8 వేల గృహాలను నిర్మిస్తున్న సిక్కిం
న్యూఢిల్లీ: భూకంపాల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు వీలుగా భూకంపాలను తట్టుకునే విధంగా ఎనిమిది వేల గృహాలను నిర్మించేందుకు రు.391 కోట్ల అంచనా వ్యయంతో సిక్కిం ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టింది. భూకంప బాధిత గృహాల పునర్నిర్మాణం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 7,972 ఇళ్లను నిర్మించనున్నారు. 2011 సెప్టెంబర్‌లో సంభవించిన భూకంపంలో 70 మంది ప్రాణాలు కోల్పోగా భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతంలో ఈ భూకంపాలను తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి read more

అది శూన్యహస్తం

 - కాంగ్రెస్‌ ముంచేసింది... తడిగుడ్డతో గొంతు కోసింది
-పార్టీలో భవిష్యత్‌ లేదు
- బిల్లుపై చర్చిద్దాం.. అడ్డుకుందాం
- రాష్ట్రపతి సుప్రీంకు నివేదిస్తారు
- మీట్‌ ది ప్రెస్‌లో  'అవిశ్వాస' ఎంపీలు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 శాసనసభలో చర్చించడం ద్వారానే రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవడం సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపా దించిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం (ఎపిజెఎఫ్‌) ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, హర్ష కుమార్‌ పాల్గొన్నారు. శాసనసభకు రాష్ట్ర విభజన బిల్లు వచ్చిన నేపధ్యంలో అనుసరించే వ్యూహంతో పాటు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం తమతో అసలు చర్చించలేదని చెప్పారు. విభజనపై మీడియాలో వస్తున్న వార్తలను ఊహాగానాలుగానే భావించామని,read more

29, డిసెంబర్ 2013, ఆదివారం

పాతబస్తీలో 'కాశ్మీర్‌' దుస్థితి

-పేలుళ్లు ఎక్కడైనా ఇక్కడి యువకులపైనే ఉగ్రముద్ర
- 'పీపుల్స్‌ యూనిటీ అగినెస్ట్‌ కమ్యూనలిజం' సభలో తరిగామి
  -మతోన్మాదంపై ఐక్య ఉద్యమం
 ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
 కేంద్రంలో అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆ పార్టీ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్‌ తరిగామి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో పెద్దలు చేసిన తప్పులకు కాశ్మీరీలు శిక్షలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీరీల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారిని సైన్యం కాల్చిచంపుతోందని, ఆందోళనలు చేస్తే ఉగ్రవాద ముద్రవేసి ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. అదే పరిస్థితిని ఇక్కడి పాతబస్తీ ప్రజలు ఎదుర్కొంటున్నారనీ దేశంలో ఏ మూల బాంబు పేలుళ్ల జరిగినా ఇక్కడి అమాయక ముస్లిం యువకులపై ఉగ్రముద్ర వేస్తున్నారని తెలిపారు. ఆవాజ్‌ ఆధ్వర్యంలో శనివారం పాతబస్తీలోని చాంద్రాయణ్‌గుట్ట చౌరస్తాలో 'మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత' (పీపుల్స్‌ యూనిటీ అగినెస్ట్‌ కమ్యునలిజం' సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మజ్లీస్‌ పార్టీ ఒకవైపు పాతబస్తీని ఏలుతుంటే..అధికారం కోసం బిజెపి, సంఫ్‌ుపరివార్‌ వంటి మతత్వశక్తులు రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇరు మతాల ప్రజల మధ్య చిచ్చు రగిల్చి ఓటు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. 'పేద ప్రజలను బతకనీయండి, వారి హక్కులను లాక్కోకండి, లౌకిక భావాలు గల నేతల్ని ఎన్నుకొండి' అని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్‌, హైదరాబాద్‌లేread more

ఢిల్లీ గద్దెపై 'ఆమాద్మీ'

  -పదవీ బాధ్యతలు స్వీకరించిన కేజ్రీవాల్‌
ఘజియాబాద్‌: ఢిల్లీ రాష్ట్ర ఏడవ ముఖ్యమంత్రిగా ఆమాద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. రామ్‌లీలా మైదాన్‌లో శనివారం అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో కేజ్రీవాల్‌తోపాటు మనిష్‌ శిశోడియా, సోమనాధ్‌ భారతి, రాఖి బిర్లా, సత్యేంద్ర జైన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, గిరిష్‌ సోనీ వున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కేజ్రీవాల్‌ రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముని నివాళు లర్పించారు.
                    శాఖలు
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన వద్ద హోం, ఆర్థిక, విజిలెన్స్‌, విద్యుత్‌ ప్రణాళికా, సేవల విభాగాలకు సంబంధించిన శాఖలను ఉంచుకున్నారు. మనిష్‌ శిశోడియాకు విద్య, పిడబ్ల్యుడి, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థలు, సోమనాధ్‌భార్తికి భూమి, భవనాలు విభాగాలతో పాటు పాలనాసంస్కరణలు, న్యాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. కేజ్రీవాల్‌ మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి రాఖి బిర్లాకు సాంఘిక read more

3న రాష్ట్రబంద్‌

 -2న విశాఖలో సమైక్య శంఖారావం
 - 3 నుంచి 10 వరకు రిలే దీక్షలు
 -23 తర్వాత రాష్ట్రపతికి అఫిడవిట్ల సమర్పణ
  - సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జనవరి 3న రాష్ట్ర బంద్‌ నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పివి) పిలుపునిచ్చింది. వచ్చేనెల 2న విశాఖపట్నంలో న్యాయవాదులు సమైక్య శంఖారావం పేరుతో బహిరంగ సభను జరుపుతున్నారని ప్రకటించింది.
                          శనివారం హైదరాబాద్‌లోని ఎపిఎన్జీవో
హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. విభజన అంశంపై జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిపే భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి మంత్రి ఎస్‌ శైలజానాథ్‌, టిడిపి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత జగదీష్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్‌ పి అశోక్‌బాబు వెల్లడించారు. అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యూహాన్ని పాటించాలో, బయట ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు ఎలాంటి ఉద్యమాన్ని చేపట్టాలోread more

డి ఫర్‌ దివాళా

-సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఖాళీ
- తెలంగాణాలోనూ తప్పని జంపింగ్‌లు
- వైసిపి, టిడిపిలవైపు చూపు
- బొత్సపైనా అనుమానాలు?
- ఫిబ్రవరి నాటికి చేరికలు పూర్తి
 ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
 రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనే కాదు తెలంగాణా ప్రాంతంలోనూ కాంగ్రెస్‌పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదు. దీనిపై ఆ పార్టీ నేతలే అనేకచోట్ల బహిరంగంగా చెబుతున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఖాళీ అయినా, రాష్ట్రాన్ని విభజించి టిఆర్‌ఎస్‌ విలీనం గాకుండా తెలంగాణాలో వచ్చే లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ఉంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీలవైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్‌ను వదిలిపోగా, మరికొందరు బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇందులో వైసిపిలోకి, టిడిపిలోకి వెళుతున్నట్లు జిల్లాల వారీగా లెక్కలతో read more

ఇతర చోట్ల అవినీతినీ చూడండి

  -మీడియాతో సోనియా మొర
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రభుత్వాల హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవ నేపథ్యంలో శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసేతర రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న 'ఆదర్శ్‌' కుంభకోణం విషయంపై ఇప్పటికే పార్టీలో చర్చించామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అవినీతి, ద్రవ్యోల్బణం తమకు కీలక అంశాలుగా మారాయని ఆమె వివరించారు. కాంగ్రెసేతర పార్టీల పాలనలోవున్న కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై కూడా మీడియా దృష్టి సారించాలని ఆమె సూచించారు. మీడియా తమ తప్పులతో పాటు ఇతరుల తప్పులనుకూడా ఎత్తి చూపాలని ఆమె సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తమ ముందు పెను సవాళు ్లన్నాయని, అయితే వాటిపై ఉమ్మడి పోరుతో విజయం read more

అనంత విషాదం

  -  హాహాకారాలతో అగ్నికి ఆహుతి
   -రైలుబోగీలో పెనుమంటలు
 - 26 ప్రాణాలు బుగ్గిపాలు
  -నాయకుల దిగ్భ్రాంతి
మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనమైన దుర్ఘటన మరువకముందే అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్‌ సమీపంలో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘోర ప్రమాదానికి గురైంది. శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ బి1 త్రీటైర్‌ ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో 26 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో అత్యధికులు కర్నాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
   ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి
 త్రిటైర్‌ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగి మధ్యలో నుంచిread more

28, డిసెంబర్ 2013, శనివారం

రాహుల్ సూక్తి సుధ

- కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సిఎంలతో భేటీ 
-'ఆదర్శ్‌ నివేదిక' తిరస్కరణ తప్పు
- మార్చినాటికి అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తలు 
-ధరల అదుపునకు 'సంస్కరణలు'
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదర్శ్‌ కుంభకోణం విచారణ నివేదికను తిరస్క రించడం సరికాదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సిఎం పృధ్వీరాజ్‌ చవాన్‌ పక్కన ఉండగానే రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవినీతిపై ప్రతిపక్షాలు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేస్తోన్న సమయంలోనే రాహుల్‌ సొంతread more

నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం

అనంతపురం : నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైల్లో శనివారం తెల్లవారు జామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. డీ1 ఏసీ బోగీలో చెలరేగిన మంటలు మరో బోగీకి అంటుకోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఘటన సమయంలో ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉండడంతో చాలా మంది అపాయాన్ని తప్పించుకోలేకపోయారు. కొందరు సురక్షితంగా బయటపడగా.. మరికొందరు తీవ్రగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదానికి గురైన రెండు బోగీల్లో సుమారు 62 మంది ప్రయాణీకులు read  more

ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ : ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఈశ్వరుడిపై ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. దీంతో రాంలీలా మైదానం కిక్కిరిసిపోయింది. కేజ్రీవాల్ అనంతరం ఆరుగురు మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.read more

27, డిసెంబర్ 2013, శుక్రవారం

లౌకిక శక్తులు ఏకం కావాలి

  -సిిపిఐ వ్యవస్థాపక దినోత్సవంలో బర్దన్‌
   ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
మతోన్మాదం, మతమౌఢ్యం రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌ సూచించారు. ప్రస్తుతం మన దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల ఐక్యతే ఈ సంక్షోభాలను పరిష్కరించగలదని చెప్పారు. అందువల్ల వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకమై దేశానికి దశ, దిశ, నిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ 88వ వ్యవస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో బర్దన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు వామపక్షాలకు పెద్ద సవాల్‌ వంటివని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు (రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ), రెండు పార్టీలు (కాంగ్రెస్‌, బిజెపి) అధికారంకోసం అర్రులు చాస్తున్నాయని ఎద్దేవా చేశారు. అయితే ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాల్లో ఈ రెండు పార్టీలకు ఎలాంటి తేడాల్లేవన్నారు. సరళీకరణ విధానాలను అమలు చేయటంలో కాంగ్రెస్‌, బిజెపి దొందూ దొందేనని చెప్పారు. ఈ రెండు పార్టీల్లో ఒకటి అధికారంలో ఉంటే, మరోటి ప్రతిపక్షంలో ఉండాలి తప్ప వేరే పార్టీలకు అవకాశం ఉండకూడదనే విధంగా (ద్విపార్టీ విధానం) ఆయా పార్టీల నాయకులుread more

'స్నూప్‌గేట్‌'పై విచారణ కమిషన్‌

 - కేంద్రం నిర్ణయం 
 -ఇరకాటంలో మోడీ
న్యూఢిల్లీ : గుజరాత్‌ సిఎం నరేంద్ర మోడీ తరఫున ఆ రాష్ట్రంలోని ఒక మహిళపై రహస్య నిఘా (స్నూపింగ్‌) నిర్వహించిన ఉదంతంపై విచా రణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. గురువారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసు కుంది. సుప్రీం మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాట య్యే ఈ కమిషన్‌ తన విచారణ నివేదికను మూడు నెలల్లో కేంద్రానికి సమర్పించాల్సి వుంటుంది. అదే విధంగా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అనధీకృత నిఘా కొనసాగించిన ఘట నలపై కూడా విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిం చింది. ప్రస్తుత లేదా రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయ మూర్తి నేతృత్వంలో ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రతి పాదించింది. గుజరాత్‌ 'స్నూప్‌గేట్‌' వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించిన విచారణ కమిషన్‌ కేంద్రం నిర్ణయంతో రద్దయ్యే అవకాశ ముంది. కేవలం గుజరాత్‌ రాష్ట్రంలో మాత్రమే కాక రాష్ట్రం వెలుపల కూడా నిఘా నిర్వహించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోడీ తరపున కొనసా గిన ఈ స్నూపింగ్‌ కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, కర్నా టకకు కూడా విస్తరించిం దని వెబ్‌ పోర్టల్‌ గులైల్‌. కామ్‌ బుధవారం వెల్లడిం చిన విషయం తెలిసిందే. read more

కోట్లకే టికెట్లు

 -అసెంబ్లీకైతే 20
- లోక్‌సభకైతే 30
- వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్‌కు డిమాండ్‌
- కాంగ్రెస్‌లోనూ తగ్గని జోరు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
 ఎన్నికల్లో పోటీ చేయడానికి చమట చుక్కలు చిందించాల్సిన అవసరం లేదు. ప్రజలతో సంబం ధాలు ఉండనక్కర్లేదు.. ప్రజా నాయకుడుగా గుర్తింపు ఉండాల్సిన అవసర అంతకన్నా లేదు. సమ స్యలపై అవగాహన లేకున్నా ఓకే.. నియోజక వర్గంపై కాస్తంత అవగాహన. పార్టీకి అడిగినంత ఫండ్‌, అందరినీ సమన్వయం చేసుకుని చివరిదాకా ప్రచారం చేసుకునేంత ఆర్థిక స్థోమత ఉంటే చాలు. అసెంబ్లీకైతే 15 లేదా 20 కోట్లు.. లోక్‌సభకైతే 25, 30 కోట్లు ఉంటే చాలు. టికెట్టిస్తామని పాలక రాజకీయ పార్టీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో ప్యాకేజీలు కూడా సిద్ధం చేశాయని వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల టికెట్లు ఆశిస్తున్న నేతలు చెబుతున్నారు. బాగా డిమాండ్‌ ఉన్న పార్టీలకు ఎంతయినా చెల్లించడా read more

వేడెక్కిన విడిది

  -రాష్ట్రపతికి పోటాపోటీగా వినతులు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 సీమాంధ్ర, తెలంగాణా ప్రాంత నేతల పోటాపోటీ వినతులతో రాష్ట్రపతి శీతాకాల విడిది వేడెక్కుతోంది. శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు రావడం. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేయడం సాంప్ర దాయంగా వస్తున్నప్పటికీ ఆయన పర్యటన సాధారణంగా మీడియాకు దూరంగా ఉండేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా తెలంగాణా సీమాంధ్ర ప్రాంత నేతలు రాష్ట్రపతిని కలవడానికి పోటీ పడుతున్నారు. గురువారం ఒక్కరోజే నాలుగు పార్టీల నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. తమ వాదనలను వినిపించారు. వీరుకాకుండా మర్యాద పూర్వకంగా ఎంపి అజహరుద్దీన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాష్ట్రపతిని కలిశారు. గురువారం ఉదయం వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంఎల్‌ఏలు ఇతర నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. విభజనకు వ్యతిరేకంగా ఎంఎల్‌ఏల సంతకాలతో ఉన్న అఫిడ విట్లను అంద చేశారు. విభజన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ తరువాత కేంద్ర మంత్రి పురందేశ్వరి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న లోపాలను ఆమె రాత పూర్వకంగా రాష్ట్రపతికి అందచేశారు. విభజన తరువాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో న్యాయంread more

మే 17న ఎంసెట్‌

- ప్రవేశపరీక్షల తేదీల ప్రకటన
-ఎన్నికల తేదీలకు అడ్డొస్తే మార్పులు
-ఉన్నత విద్యామండలి వెల్లడి
 

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎంసెట్‌) -2014 పరీక్షను వచ్చే సంవత్సరం మే 17న జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి పదిన నోటిఫికేషన్‌, జూన్‌ రెండున ఫలితాలు విడుదల కానున్నాయి. గురు వారం ఉన్నతవిద్యామండలిలో జరిగిన సమావేశంలో ప్రవేశపరీక్షల తేదీలను ఉన్నతవిద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు కేటాయించిన యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్లు, కన్వీనర్లతో మండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, సెక్రటరీ సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజరుజైన్‌, ఉన్నతవిద్యముఖ్య కార్యదర్శి అజరుమిశ్రా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పరీక్షల తేదీలను ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గతంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన యూనివర్సిటీలకే 2014-15 పరీక్షల బాధ్యతలను అప్పగించామన్నారు. సారత్రిక ఎన్నికలకు సంబంధించి మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ రానుందని, ఒకవేళ పరీక్షల తేదీలు అడ్డుగా ఉంటే తర్వాత వాటిని రీ షెడ్యూల్‌ చేస్తామన్నారు. read more 

26, డిసెంబర్ 2013, గురువారం

ఊపు తక్కువ 'ఉయ్యాలా జంపాలా'(రివ్యూ)

     ఒక కథతో ఓ సినిమా వచ్చి సూపర్‌హిట్టయ్యాక, దాదాపు అలాంటి కథతోనే కొద్దిగా నేపథ్యం మార్చి మరో సినిమా వస్తే? ఇలాంటి సంఘటనలు తెలుగు సినిమాకు కొత్త కాదు. వినూత్నమైన ప్రచారంతో, కొత్త హీరో హీరోయిన్లతో అందరినీ ఆకర్షిస్తూ, తాజాగా వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' పరిస్థితి కూడా అచ్చంగా అదే!     ఇది ఓ ప్రేమ కథ. గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. వివరంగా చెప్పాలంటే... గోదావరి జిల్లాల్లోని పచ్చని పంట పొలాలు, చెరువుల నేపథ్యంలోని కూనవరం గ్రామం. ఆ గ్రామంలో సూరి (తొలి పరిచయం రాజ్‌ తరుణ్‌) తండ్రి లేని బిడ్డ. పెద్ద చదువులు చదువుకోని సూరి కోడి పెంటతో చేపల చెరువుకు మేత అందించే వ్యాపారం చేస్తుంటాడు. తల్లిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మరో ఇల్లు అతని అమ్మమ్మ, తాతయ్య, మేనమామలది. ఆ మేనమామకు ఓ కూతురు. ఆ మరదలు పేరు ఉమాదేవి (తెలుగులో 'చిన్నారి పెళ్ళికూతురు'గా అనువాదమైన హిందీ సీరియల్‌ 'బాలికా వధు' ఫేమ్‌ అయిన అవికా గోరే). బావామరదళ్ళు ఎప్పుడూ ఏవో గిల్లి కజ్జాలు, కొట్లాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు.see more

అమృతహస్తం - అస్తంవ్యస్తం

ప్రస్తుత ధరలను విశ్లేషిస్తే మెనూ ప్రకారం వండి పెట్టటానికి రూ.31 ఖర్చు నిర్వాహకులకు అవుతుంటే పాలకులు కేవలం రూ.15 ఇస్తున్నారు. అంటే రోజుకు ఒక్కొక్కరికి రూ.16 అదనపు భారం నిర్వాహకులపై మోపుతోంది. దీంతో నిర్వాహకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించటం వల్ల అమృత హస్తం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పౌష్ఠికాహిరం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత హస్తం పథకం ప్రసవవేదన పడుతోంది. పాలకులకు ప్రచారంపై ఉన్న మమకారం అమలుపై లేకపోవటంతో అస్తవ్యస్తంగా మారింది. పౌష్టికాహారం దొరుకుతుందని ఆశతో అంగన్‌వాడి కేంద్రానికి వచ్చిన బాలింతలు, గర్భిణీలకు నిరాశే మిగులుతోంది. ఇందిరమ్మ అమృత హస్తం పథకంలోని అమృతం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారి మొండిహస్తమే దర్శనమిస్తోంది. కాంగ్రెసు పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి గాని ఆచరణలో నైరాశ్యం అలుముకుంది. వన్‌ ఫుల్‌ మీల్స్‌ నినాదంతో ప్రభుత్వం ఊదరగొడుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం,ధరల శాపంతో పథకం అమల్లో అష్టకష్టాలు పడుతోంది. పని భారంతో అంగన్‌వాడీలు తల్లడిల్లుతున్నా, అప్పుల భారంతో గ్రామ సమాఖ్యలు హాహాకారాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టటం లేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడితేనే సరిపోదు, వాటి ఫలితాలు లబ్ధిదారులకు చేరినప్పుడే సార్థకత ఉంటుంది. కానీ పాలకులకు ఆ దృష్టి లేదు. రాష్ట్ర ప్రభుత్వం see more

వేల కోట్లు 'వేదాంత' స్వాహా

  - దశాబ్ది తర్వాత దర్యాప్తుపై హర్షం
 - హిందుస్థాన్‌ జింక్‌ ఆస్తుల చౌకబేరం
 -డిజిన్వెస్ట్‌మెంట్‌ బాగోతంపై సిబిఐ విచారణ
  ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
 హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ను వేదాంత గ్రూపునకు కారుచౌకగా కట్టబెట్టడంపై సిబిఐ దృష్టి సారించింది. అత్యంత విలువైన ఆస్తులను తక్కువగా మదించి, ధారాదత్తం చేయడంపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రతిష్టాత్మకమైన హిందుస్థాన్‌ జింకులో వాటాల ఉపసంహరణలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని సిపిఎం మొదటినుంచీ డిమాండు చేస్తోంది. ఈ తతంగం జరిగిన 11 ఏళ్ల తరువాత సిబిఐ విచారణ మొదలెట్టింది.
హిందుస్థాన్‌ జింక్‌లోని 26 శాతం వాటాలను వేదాంత గ్రూపులో భాగమైన స్టెరిలైట్‌ సంస్థకు విక్రయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తోపాటు పలువురుsee more

25, డిసెంబర్ 2013, బుధవారం

ఈజీగా ప్రజాశక్తి ఈ-పేపర్‌(జీవన సౌరభం)

''తనమీద ఆధారపడని వారినే
వరించే అలవాటు అదృష్టానిది.''
       * ప్రజాశక్తి వెబ్‌సైట్‌ మెయిన్‌ పేజీలో వుండే ఈ-పేపర్‌ లింక్‌ నుండి కానీ, www.epaper.prajasakti.com నుండిగానీ ఓపెన్‌ చేసుకోవచ్చు.
* ఈ-పేపర్‌ హౌమ్‌ పేజీ మెయిన్‌, టాబ్లాయిడ్స్‌ అనే రెండు విభాగాలుగా థంబ్స్‌ రూపంలో కనిపిస్తాయి.
* హౌమ్‌ పేజీలో కనిపించే మెయిన్‌ ఎడిషన్‌ మొదటి పేజీ థంబ్‌పై క్లిక్‌ చేస్తే పేజీ ఓపెన్‌ అవుతుంది. దీంతో పాటు లోపలి పేజీలు కూడా ఎడమవైపున థంబ్స్‌ రూపంలో కనిపిస్తాయి.
* లింక్స్‌ : మెయిన్‌ మరియు జిల్లా ఈ-పేజీల్లో మొదటి పేజీ తరువాయి వార్తలకు లింక్స్‌ వున్నాయి. ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే మొదటి పేజీ వార్త కొనసాగింపును అక్కడ చూడొచ్చు.
* ఒక పేజీ నుండి మరో పేజీకి :
1. మెయిన్‌ అయినా జిల్లా పేజీలైనా ఒక పేజీ ఓపెన్‌ చేసినప్పుడు దానికి సంబంధించిన మిగతా పేజీలు థంబ్స్‌ రూపంలో ఎడమవైపున కనిపిస్తాయి.
2. పేజీలో పైభాగంలో వుండే ఆప్షన్స్‌ బార్‌లో (జిల్లా, మెయిన్‌) కనిపించే పేజీ నెంబర్లకు ఇరువైపులా వుండే ప్రీవియస్‌, నెక్ట్స్‌ బటన్స్‌ ద్వారా మిగతా పేజీలను చూడొచ్చు. అలాగే ఆ నంబర్‌పై క్లిక్‌ చేస్తే అన్ని పేజీలు డ్రాప్‌డౌన్‌ మెనూలో క్లిప్పింగ్స్‌గా కనిపిస్తాయి. వాటి నుండి ఆయా పేజీల్లోకి సులువుగా వెళ్లొచ్చు.see more

మరో చెన్నారెడ్డిని కాలేను


- ఆంక్షలు అంగీకరించేది లేదు 
- బిల్లును సవరించాలని జనవరిలో భారీ ధర్నా 
- అభ్యంతరాలపై ప్రధానికి వినతిపత్రం 
- తెలంగాణ గ్రూప్‌1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణలో కెసిఆర్‌ 
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  తెలంగాణ ముసాయిదా బిల్లులోని అంక్షలు అంగీకరించి మరో మర్రి చెన్నారెడ్డిని కాదల్చుకోలేదని టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. సంపూర్ణ తెలంగాణ సాధించేదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు కొనసాగితే మరో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ ఆసోసియేషన్‌ డైరీ-2014, క్యాలెండర్‌, టేబుల్‌ క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ బిల్లులోని అభ్యంతరాలపై త్వరలో తెలంగాణా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో వ్యక్తమైన సూచనలూ, సలహాలను రూపకల్పన చేసి ప్రధాన మంత్రికి వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. బిల్లును సవరించాలని జనవరి మొదటి వారంలో ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించాలని టిజేఏసి నేతలకు సూచించారు. read more

అక్రమ కేసులతో రైతులకు సంకెళ్లు


- నిరసనగా రాస్తారోకో
  ప్రజాశక్తి-పర్చూరు
  శీతల గిడ్డంగిలో జరిగిన కుంభకోణంలో రైతులను నిందితులను చేసి జైలు పాలు చేయడమే కాకుండా, సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకరావడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా పర్చూరులో మంగళవారం రాస్తారోకో చేశారు. శీతల గిడ్డంగి యాజమాన్యం, బ్యాంకు అధికారులు కుమ్మక్కై రైతులను అన్యాయంగా జైలుపాలు చేశారంటూ ఆగ్రహించారు. కోట్లు కొల్లగొట్టిన యాజమాన్యాన్ని వదిలి రైతులను అరెస్టు చేసిన పోలీసు అధికారుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసును సిబిఐతో విచారణ జరిపించాలని బాధిత రైతుల కుటుంబాలు డిమాండు చేశాయి. అమాయకంగా సంత కాలు చేయడమే రైతుల తప్పని వాపోయారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని రామతులశమ్మ శీతల గిడ్డంగిలో రుణ కుంభకోణం కేసులో పోలీసులు 39మందిపై కేసు నమోదు చేశారు. చీరాల డిఎస్‌పి డి నరహర 27మందిని రెండు వారాల కిందట అరెస్టు చేయగా పర్చూరు కోర్టు రిమాండు విధించిన విషయం తెలిసిందే. రిమాండు గడువు ముగియడంతో మంగళవారం రైతులను కోర్టుకు తీసుకొచ్చారు. రైతులను సంకెళ్లతో తీసుకురావడం చూసిన తోటి రైతులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసు దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్చూరులోని ప్రధాన రహదారిపై కోర్టు ఎదుట రాస్తా రోకో చేశారు. read more

రాష్ట్రపతిని అవమానిస్తున్న నాయకులు


- విభజనపై తేలాకే పొత్తులపై ఆలోచన
- విద్యుత్‌ ఛార్జీల పెంపుపై పోరాటం 
- విలేకరుల సమావేశంలో బివి రాఘవులు
  ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి
  రాజకీయ పక్షాల నాయకులు రాష్ట్రపతిని అవమానిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. గుంటూరు ప్రగతినగర్‌లో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం లో విడిదికీ, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతోత్సవాల్లో పాల్గొ నేందుకు వచ్చిన రాష్ట్రపతికి ప్రజాప్రతినిధులు విభజన విషయం మొరపెట్టుకోవడం విడ్డూ రంగా ఉందన్నారు. విభజన బిల్లును రాష్ట్రపతి శాసనసభకు పంపితే దాని గురించి మళ్లీ ఆయనకే చెప్పడం అవమా నించడమే అవుతుం దని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయమై సిపిఎం ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదన్నారు. రాష్ట్రవిభజన అంశం కొలిక్కి వచ్చాకే దీనిపై ఆలో చిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బిజెపిలను ఓడించడమే తమ ధ్యేయమన్నారు. ఈ పార్టీల గుత్తాధిపత్యాలను బద్దలుకొట్టే లక్ష్యంతోనే ఎత్తుగడలు, సర్దుబాట్లు ఉంటాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే తమకు ఓట్లూ, సీట్లూ అవసరమేననీ, అయితే వీటికోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. టిడిపి read more 

మోడీ 'గాలి' తీస్తున్న గణాంకాలు


అంతిమంగా ఎన్నికలనేవి కచ్చితమైన గణాంకాల మీదే ఆధారపడతాయి తప్ప, కృత్రిమంగా వ్యక్తులనే బుడగలకు గాలి కొట్టి ఉబ్బేయడం మీద కాదు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రేపటి లోక్‌సభ ఫలితాలకు దిక్సూచిగా ఎంతవరకు తీసుకోగలమనేది అసలు ప్రశ్న. గత అయిదు ఎన్నికల చరిత్రలోకి వెళితే అటువంటి అభిప్రాయానికి రాగల సరళి అందులో కనిపించదు. ఉదాహరణకు 1998లో కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ బలం 114 స్థానాలకు జారిపోయింది. గత అయిదేళ్లలో ఏదో ఒక పార్టీ కాదు సరికదా, పోలింగ్‌కు ముందు ఏర్పడిన ఏ కూటమీ కూడా 272 అనే మాంత్రిక సంఖ్యను చేరుకోలేకపోయింది. 1996 తర్వాత ఏర్పడిన ప్రతి ప్రభుత్వమూ 'పోస్ట్‌-పెయిడ్‌' కనెక్షన్‌ అని ఒక వ్యాఖ్యాత read more

చారిత్రక చర్చీలు


   జీసస్‌ జన్మదినాన్ని పురస్కరించు కొని, ప్రపంచవ్యాప్తంగా జీసస్‌ను స్మరించుకుంటూ చేసుకునే పండగ క్రిస్మస్‌. ముఖ్యంగా, క్రైస్తవులు జీసస్‌ పుట్టిన డిసెంబర్‌ 25ను పవిత్రమైన రోజుగా భావిస్తారు. దాంతో, ప్రజలు ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో ఈ పండగను జరుపుకొంటారు. మరి క్రిస్మస్‌ ప్రత్యేకతల గురించి.... రాష్ట్రంలోని ప్రాచీన చర్చీల గురించి తెలుసుకోవాలని ఉంది కదూ! ఆ వివరాలతో కూడినదే ఈ ప్రత్యేక కథనం.
   క్రిస్మస్‌ చరిత్ర 4000 సంవత్సరాల నాటిది. చారిత్రక కథనాల ప్రకారం జీసస్‌ పుట్టిన దగ్గర నుంచి చర్చీలలో క్రిస్మస్‌ను జరిపేవారు కాదు. జెరూసలేమ్‌లోని రోమన్‌ క్యాథలిక్‌ చర్చీలు కూడా క్రీ.శ 400 ఏళ్ళ నుంచి మాత్రమే క్రిస్మస్‌ను జరుపుతున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
కొన్ని శతాబ్దాల క్రితం క్రిస్మస్‌ వేడుకలు పురాతన సంప్రదాయాలకు అనుగుణంగా రోమన్‌లు మాత్రమే జరుపుకొనే వారు. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి క్రిస్టియన్‌ ఈ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొంటున్నారు. ఇల్లు, కార్యాలయాలు read more

పవనిజం అంటే?


      'ప్రతివారికి సాయం చేయాలనే గుణం ఉండాలనే' పాయింట్‌తో 'పవనిజం' చిత్రాన్ని రూపొందించామని చిత్ర దర్శకుడు ఇ.కె. చైతన్య అన్నారు. ధర్మశాస్త్రే ఫిలిమ్స్‌ బేనర్‌పై శ్యామ్‌శీన్‌ నిర్మాతగా, మధు, సుధీర్‌, సింధు, జయంతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి 60శాతం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో చిత్రించనున్నామని దర్శకుడు వెల్లడించారు. మంగళవారంనాడు ఆయన విలేకరులతో చిత్రం గురించి వివరిస్తూ....పవన్‌కళ్యాణ్‌ అభిమానులు సమాజంలో మంచి చేయాలనేది బాధ్యతగా ఫీలయి చేస్తే ఎలా ఉంటుందనేది ఇందులో చూపించాం. పవన్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2న టీజర్‌ విడుదలచేశాం. మంచి స్పందన లభించింది. నాగబాబు కీలక పాత్ర పోషించారు. చిత్రం ప్రారంభంనుంచి ఆయన మంచి సహకారాన్ని అందిస్తున్నారని' తెలిపారు.
మధు మాట్లాడుతూ.... తాను ఇందులో పవన్‌ అనే పాత్రను పోషిస్తున్నాననీ, ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిగా నటిస్తున్నానని అన్నారు. ఈ చిత్రంలో పనిచేస్తున్నవారంతా పవన్‌ ఫ్యాన్సేనని read more

23, డిసెంబర్ 2013, సోమవారం

బుల్లితెరపై సూపర్‌ జోడీ


- యాంకరింగ్‌ టు యాక్షన్‌
   వాగడం...ఏదో ఒక అంశంపై తర్కంతో సంబంధం లేకుండా అనర్గళంగా, వేగంగా మాట్లాడే కళే వాగడం ! ఇలాంటి ఆర్ట్‌..బుల్లితెర నటులకు తప్పనిసరి. ధనా..ధన్‌ ! ఫటా..ఫట్‌ ! డైలాగ్స్‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటేగానీ బుల్లితెర వీక్షకుడు టీవీకి అతుక్కుపోడు. ఈ ప్రతిభను పట్టేసి, టెలివిజన్‌పై చక్రం తిప్పుతున్న నటులు సౌమ్య, వేణు. 'గంగతో రాంబాబు' ఒక్క సీరియల్‌తో తెగ పాపులారిటీ సంపాదించేశారు. ఇంతకీ వీరిద్దరూ టెలివిజన్‌ వైపు ఎలా వచ్చారు ? అన్న విషయానికొస్తే..
ఐదేళ్ల క్రితం తెలుగు టీవీ ఛానళ్ల బూమ్‌ మొదలైంది. 24 గంటల మ్యూజిక్‌ ఛానళ్లు ప్రారంభమయ్యాయి. చాలా విభాగాల్లో కొత్త వాళ్లకు అవకాశాలు ఏర్పాడ్డాయి. వీడియో జాకీగా సౌమ్య వారణాసి, వేణు క్షత్రియలు ఇద్దరూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరోరా కాలేజ్‌లో కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ సౌమ్య. నిజానికి తను పుట్టింది, పెరిగింది అంతా నాగపూర్‌లో, దీంతో తెలుగు భాషలో అంతగా పట్టు లేదు. వీడియో జాకీగా ఇది బాగా పనికొచ్చింది.  read more

స్త్రీవాద సాహిత్య విమర్శకు గీటురాయి


'సాహిత్యాకాశంలో సగం' గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడంతో తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకు అరుదైన గౌరవం దక్కింది. ఇది తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవం. నేడు సమాజంలోని స్త్రీలు పూర్వంలాగా చైతన్య రహితులు కాదు. పరిమితమైన ప్రపంచానికే కట్టుబడి ఉన్న వాళ్లుకాదు. తమ మానసిక, భౌతిక ప్రపంచాలను కుదించివేసిన పురుషాధిక్య సమాజం వ్యూహాన్ని, కుట్రలను, తెలుసుకొని- తమ అస్థిత్వ పోరాటానికి సిద్ధమవుతున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. సాహిత్య రంగంలో అపూర్వ చైతన్యంతో దూసుకెళ్తున్నారు. కథ, నవల, నాటకం, వ్యాసం, విమర్శ, పరిశోధనా మొదలైన ప్రక్రియల్లో స్వాతంత్య్రానికి పూర్వం కొంత, అనంతరం పూర్తిగా ప్రవేశించి స్త్రీల మనోభావాలను సాహిత్య ప్రపంచానికి విన్పించారు.
స్వాతంత్య్రానికి పూర్వం సంస్కరణ, అభ్యుదయ, జాతీయోద్యమ సాహిత్యాన్ని సృష్టించిన స్త్రీలు- మహిళా దశాబ్ది (1975 - 85)లో మహిళల చీకటి జీవితాల్లోని కోణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తమ చుట్టూ అల్లుకున్న జండర్‌ వివక్ష ఇనుప కంచెలను తొలగించుకునేందుకు ఉద్యమ ప్రయత్నం చేశారు. ఇటువంటి స్త్రీల సాహిత్య, ఉద్యమ కృషిని మార్క్సిస్టు ఆర్థిక రాజకీయ దృక్పథం నుంచి ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే దాదాపు మూడు దశాబ్దాల నుంచి అంచనా వేస్తూ వస్తున్నారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో పరిశోధన చేస్తున్నకాలం నుంచీ, తరువాత అక్కడే ఆచార్యులు అయ్యాక కూడా వాఙ్మయ సూచికలపై ప్రత్యేక దృష్టినే సారించారు ఆమె.  తన సాహిత్య విమర్శ ప్రారంభంread more

లీజు పేరిట కబ్జా


 - రూ.15 కోట్ల వక్ఫ్‌ భూమి కబ్జా
- హైదరాబాద్‌ నుంచి ఎంఐఎం ప్రణాళికలు
  ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
 కబ్జా అంటే స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడం.. నకిలీ పత్రాలు సృష్టించడం.. కాజేయడం.. ఆ తరువాత అమ్ముకుని కోట్లు గడించడం.. ఇది ఇప్పటి దాకా కబ్జాదారులు అవలంబిస్తున్న పద్ధతి. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మతాన్ని అడ్డం పెట్టుకుని సొసైటీకి లీజు తీసుకుని ఆ భుమిని తెగనమ్మి జేబులు నింపుకుంటున్నారు. కర్నూలు నగరంలో కోట్లు విలువ చేసే వక్ఫ్‌ భూమిని కబ్జా చేసి అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది..
కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పొలిమేరలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును అనుకుని సర్వే నంబర్‌ 151లో 27 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమి ఉంది. ఇందులో 10 ఎకరాల భూమికి కర్నూలు నగర ఎంఐఎం నేతలు ది ఫ్రూట్‌ మర్చంట్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ పేరుతో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం జరుపుకునేందుకు లీజు పేరుతో వక్ఫ్‌బోర్డు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అసోసియేషన్‌ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారుకానీ ఈ స్థలంలో ఎలాంటి మార్కెట్‌ పెట్టలేదు. పదెకరాల స్థలాన్ని ఒకటిన్నర, రెండు సెంట్ల ప్రకారం ప్లాట్లు వేశారు. దాదాపు 550 ప్లాట్లుగా తయారు చేశారు. సెంటున్నర ప్లాట్‌ అయితే రూ. 25,500, రెండు సెంట్ల స్థలం అయితే రూ. 30 వేలుగా read more

సిరుల మాగాణి సింగరేణి


  -కార్మికుల సంక్షేమం అంతంతమాత్రం 
  -నేడు ఆవిర్భావ దినోత్సవం
   ప్రజాశక్తి-కొత్తగూడెం
  సిరుల మాగాణి సింగరేేణి కాలరీస్‌ సంస్థ 123 ఏళ్ల ఘన చరిత్రను పూర్తి చేసుకుని సోమవారం 124వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. కార్మికుల సంక్షేమం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేక కథనం...
1871లో అప్పటి బ్రిటీష్‌ జియలాజికల్‌ సర్వే అధికారి విలియం కింగ్స్‌ ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)లో బొగ్గు నిక్షేపాలు గుర్తించడంతో 'నల్లబంగారం' ప్రస్థానం మొదలైంది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించి తెలంగాణా ప్రాంత పారిశ్రామిక రంగంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించింది. సింగరేణిని ఆసరాగా చేసుకుని ఎన్నో అనుబంధ పరిశ్రమలు పునాది వేసుకున్నాయి. కెటిపిఎస్‌, నవభారత్‌, స్పాంజ్‌ ఐరన్‌ read more

రాష్ట్ర విభజన వద్దు


- వివరాల్లేని తెలంగాణా బిల్లు 
- విభిజిస్తే సమస్యలు మరింత జటిలం
-నాలుగు జిల్లాల్లోనే తెలంగాణా డిమాండ్‌
-బిల్లుపై చర్చకు గడువు పెంచండి
-రాష్ట్రపతితో సిఎం భేటీ
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
 రాష్ట్రాన్ని విభజించొద్దని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, విడిపోతే తాగు, సాగు నీటి సమస్యలు తలెత్తి నీటి యుద్ధాలు వస్తాయని పేర్కొనట్లు తెలిసింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల ప్రజలు మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, మిగతా జిల్లాల్లో తెలంగాణ ప్రభావం అంతగా లేదని సిఎం రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆదివారం ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపైread more

వలస పక్షుల కాకా... కీకీ...


- అవకాశాలను బట్టి ఆరోపణలు, అస్త్రశస్త్రాలు
-వైసిపీకి మొదటి ప్రాధాన్యత
-కాదంటే తెలుగుదేశం
- బడాబాబులకే చంద్రబాబు పట్టం
- టిఆర్‌ఎస్‌కూ శిరోభారాలు
-బిజెపివైపు కొందరు కోస్తా ప్రముఖులు, తారలు 
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  మరికొందరు మోడీపై ఆశతో బిజెపిలోకి దూకేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాలు గుడుగుడు గుంచం ఆటలాగా మారిపోయాయి. ఈ ఎన్నికలు ఏకైక అవకాశంగా భావిస్తున్న వైసీపీ అధినేత జగన్‌, జీవన్మరణ పోరాటంలా పరిగణిస్తు read more

19, డిసెంబర్ 2013, గురువారం

మన్నాపూర్‌ సర్పంచి మాణిక్యమ్మ సజీవ దహనం


  -గతంలో రెండు సార్లు ప్రత్యర్థుల హత్యాయత్నం
ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/ నారాయణపేట
మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం మన్నాపూర్‌ గ్రామ సర్పంచి మల్లెల మాణిక్యమ్మ(55)ను గుర్తు తెలీని వ్యక్తులు కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్నాపూర్‌ సర్పంచి మల్లెల మాణిక్యమ్మ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుతో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆమె గెలుపును జీర్ణించుకోలేని ప్రత్యర్థులు హత్యకు కుట్రపన్నారు. అందులో భాగంగానే గతంలో ఓసారి కల్లులో గుళికల మందుపోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మరోమారు పీర్లపండుగ సందర్భంగా దాడి చేశారు. వీటన్నింటి నుండీ ఆమె తప్పించుకుంటూ see more

'ప్యార్‌ మే పడిపోయానె'


      సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై 'ఏమైంది ఈవేళ', 'అధినేత' చిత్రాలను నిర్మించిన కె.కె.రాధామోహన్‌ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'ప్యార్‌ మే పడిపోయానె'. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈనెల 16 నుంచి రెండో షెడ్యూల్‌ మొదలయింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'లవ్‌యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న కుటుంబకథాచిత్రమిది. 'మొదటి షెడ్యూల్‌లో చేసిన సీన్స్‌ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. లవ్‌లీ తర్వాత ఆది, శాన్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రం మరో సూపర్‌హిట్‌ చిత్రం see more

గరీబ్‌ సి.ఎమ్‌.


        కేవలం రెండున్నర లక్షల రూపాయల ఆస్తిపరుడాయన. ఆయన వద్ద ఉన్న నగదు 1080 రూపాయలు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ 9,720 రూపాయలు. ఈ సమాచారాన్ని ఆయన గత అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థిగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వయసు 64 సంవత్సరాలు. తల్లి అంజలి నుంచి సంక్రమించిన 432 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రేకుల ఇల్లే ఆయన స్థిరాస్తి. దాని మార్కెట్‌ విలువ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు. భార్య పాంచాలీ భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరయ్యారు. ఆమెకు  see more

నిరంకుశ మమత


   -తృణమూల్‌ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
   -ప్రజాతంత్ర శక్తులు స్పందించాలి : ప్రకాశ్‌ కరత్‌
   - ఢిల్లీలో బెంగాల్‌ వామపక్ష కూటమి ధర్నా
    ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
  బెంగాల్‌ తృణమూల్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థనే హత్య చేస్తోందని రాష్ట్ర వామపక్ష కూటమి విమర్శించింది. రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులతో పాటు ప్రజస్వామిక వ్యవస్థలనూ మమతా బెనర్జీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర వామపక్ష కూటమి ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడి జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. లెఫ్ట్‌ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌బసుతో పాటు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పికి చెందిన రాష్ట్ర నేతలు, నాలుగుsee more

ఇక అవినీతిపై లోకాస్త్రం


  -లోక్‌పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. మంగళవారం కొన్ని సవరణలతో రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదిం చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌ వాది పార్టీ, శివసేన కార్యకర్తలు వాకౌట్‌ చేయగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో సహా అన్ని పార్టీల సభ్యులు బిల్లును గట్టిగా సమర్ధించారు. లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. అంతకు ముందు బిల్లుపై జరిగిన see more

18, డిసెంబర్ 2013, బుధవారం

రసవత్తరంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు


ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (ఖమ్మం)
ఖమ్మంలోని సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతున్న అండర్‌-19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు రెండోరోజు రసవత్తరంగా సాగాయి. బాలుర విభాగంలో 20 జిల్లా జట్లు, బాలికల నుండి 15 జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం నాటి లీగ్‌ పోటీల్లో బాలికల విభాగం నుండి రంగారెడ్డి, విజయనగరం, హైదరాబాద్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌, కృష్ణా, ప్రకాశం, బాలుర విభాగం నుండి కరీంనగర్‌, ఖమ్మం, విజయనగరం see more

ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం


-     ఢిల్లీ గద్దెనెక్కే సన్నాహాల్లో కేజ్రీవాల్‌ 
     న్యూఢిల్లీ : కాంగ్రెస్‌, బిజెపిల మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ప్రజలే నిర్ణయించాల్సిందిగా ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం కోరారు. ప్రభుత్వ ఏర్పాటు వంటి కీలక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న ఆ పార్టీ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణే మంచిదని భావిస్తోంది. ఇందుకోసం 25 లక్షల కాపీలను ప్రజలకు పంచి వారి సమాధానాలను ఆదివారం వరకు స్వీకరిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. 'దేశాన్నే లూటీ చేసిన కాంగ్రెస్‌ మద్దతు ఎలా తీసుకోగలం?, ఇతర రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బిజెపి ఢిల్లీలో ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తోంది?' వంటి ప్రశ్నలను ప్రజలముందుంచి అభిప్రాయాలు కోరనున్నామని తెలిపారు. కాంగ్రెస్‌, బిజెపిల మద్దతు తీసుకోవాలంటే 18 అంశాల్లో వారి వైఖరి తెలపా లంటూ ఆప్‌ లేఖలు రాసిన విషయం తెలిసిందే.  see more

సర్దుబాటలో సమైక్య సింహం?


-     విభజన వైపు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
       ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
      రాష్ట్ర విభజనకే సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. నిన్నటిదాకా సమైక్యత తప్ప మరో అభిప్రాయానికి తావులేదని చెప్పిన వారంతా ఇప్పుడు విభజన వల్ల ఏర్పడే సమస్యలను అసెంబ్లీలో చెప్పడానికి సిద్ధమవు తున్నారు. సమైక్యత మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఇదే అంశంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నారు. మొన్నటిదాకా సమైక్యత తప్ప మరో మాటెత్తని సిఎం ఇప్పుడు ఆ మాటే ఎత్తడానికి సంశయిస్తున్నారు. విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టిన రోజు సిఎం గైర్హాజర్‌ కావడంతో సమైక్యవాదిగా వచ్చిన గుర్తింపు ఒక్కనిముషంలో మాయమైంది. అధిష్టానం కనుసన్నల్లోనే సిఎం నడుస్తున్నారని ప్రచారం జరుగు తోంది. ఆయనను సీమాంధ్రలో హిరోగా కొలిచిన వారే దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. మంగళవారం జరిగిన బిఎసిలోనూ చర్చకు సహకరించాలని సిఎం చెప్పడం.. సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సమావేశంలోనూ అభిప్రా యాలు చెప్పాలని అందరికీ సూచిం చడంతో విభజనకు చిన్నచిన్నగా దారులు వెతుకుతున్నారని తెలుస్తోంది. విభజన జరిగిపోతున్నప్పుడు ఇంకా సమైక్యత అంటూ అనడం అర్థం లేనిదని, దానివల్ల ఆ ప్రాంత ప్రజలకు చేతులారా అన్యాయం చేయడమేనని గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి see more

రెండో దశకు అనుమతి


-   వంశధారపై ట్రిబ్యునల్‌ మధ్యంతర తీర్పులో వెల్లడి
-    నేరడి బ్యారేజీపై విచారణ కొనసాగింపు
-    పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
     ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో/శ్రీకాకుళం ప్రతినిధి
    వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 నిర్మాణానికి వంశధార నదీ జల వివాదాల ట్రిబ్యునల్‌ అనుమతినిచ్చింది. వంశధార నదిపై ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించదలచిన సైడ్‌ ఛానల్‌ నిర్మాణం సబబేనని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. నదీ జలాల్లో 8 టిఎంసిల నీటిని వాడుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు ఎంకె శర్మ నేతృత్వంలోని త్రిసభ్య ట్రిబ్యునల్‌ మంగళవారం తీర్పును వెల్లడించింది. తదుపరి ఉత్వర్వులు వెలువడే వరకూ ఈ తీర్పు అమల్లో ఉంటుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ గ్రామం వద్ద వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 స్టేజ్‌-2 లో భాగంగా సైడ్‌ ఛానల్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంపై ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ప్రాజెక్టు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నట్లు ట్రిబ్యునల్‌ తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రాజెక్టు అక్రమం, చట్టవిరుద్ధమని ఒరిస్సా ప్రభుత్వం రుజువు చేయలేకపోయిందని see more

నేటి నుంచి చర్చ


-   20 వరకు అసెంబ్లీ
-    బిఏసిలో నిర్ణయం
-    చంద్రబాబు గైర్హాజరు 
-    వైసిపి, సీమాంధ్ర టిడిపి సభ్యుల వాకౌట్‌ 
     ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
    రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ ముసాయిదా బిల్లుపై నేటి (బుధవారం)నుంచి శాసనసభలో చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల కమిటి (బిఏసి) సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం వరకు సమావేశాలు నడుస్తాయి. అంటే ఈ నెల 20 వరకు బిల్లుపై చర్చ నడుస్తుంది. ప్రశ్నోత్తరాలు యధా విదిగానే ఉంటాయి. క్రిస్మస్‌పండుగ సెలవులు, ఇతర సెలవుల అనంతరం తదుపరి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను బుధవారం శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించనున్నారు. ఈ నెల 30 నుంచా లేదా జనవరి మొదటి వారంలో తిరిగి సమావేశాలు ప్రారంభ మయ్యే అవకాశాలున్నట్లు అసెంబ్లీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ చీప్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. గందరగోళాలు, ఉత్కంఠ మధ్య సోమవారం అసెంబ్లీలో బిల్లును టేబుల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే బిఎసి జరగకుండానే సోమవారం సాయంత్రం చర్చ ప్రారంభమైందని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు see more

పెద్దల ఆమోదం


-    లోక్‌పాల్‌కు రాజ్యసభ ఓకే
-     అవినీతి నిర్మూలనలో ముందడుగు 
-      45 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితం
-      నేడు లోక్‌సభలో చర్చ
     న్యూఢిల్లీ : చారిత్రక లోక్‌పాల్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో అవినీతిని రూపుమాపేందుకు గత 45 ఏళు ్ళగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌ బిల్లుపై రాజకీయ పార్టీలు సూచించిన సవరణలపై రాజ్యసభ ఛైర్మన్‌ హమిద్‌ అన్సారీ అంతకుముందు తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతుంది. కాగా లోక్‌పాల్‌ బిల్లు కోసం నిరశన దీక్షలో వున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే బిల్లు ఆమోదం పట్ల హర్షం ప్రకటిం చారు. బిల్లును ఆమోదించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడగానే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించా see more