.

30, నవంబర్ 2013, శనివారం

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ - సమీక్ష



మన దర్శక, నిర్మాతలు, రచయితలు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే, రకరకాల కథలను వెండితెరకు ఎక్కించవచ్చు. రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలు, రివెంజ్‌ డ్రామాల రొంపి నుంచి తెలుగు సినిమాను బయటపడేయవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నాలు ఇటీవల బాగా తగ్గిపోయాయి. ఈ కరవు కాలంలో కొంతలో కొంత కొత్తగా అనిపించే వెండితెర ప్రయత్నం - 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'. సవాలక్ష లోపాలు సినిమాలో ఉన్నా, రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తుంటుంది.
ఠశాలలోనే కాదు, కుటుంబంలోనూ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అతి స్ట్రిక్ట్‌గా ఉండే ఓ రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ రామ్మూర్తి (నాగినీడు). నూరు తప్పుల దాకా క్షమించినా, తప్పుల్లో సెంచరీ కొట్టారంటే, ఎవరినైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపేసి, వారితో బంధుత్వాన్ని తెగ తెంపులు చేసుకొనే నిరంకుశుడు. readmore

13ఏళ్లకే ఎమ్మెస్సీ!




     తల్లి పూర్తిగా నిరక్షరాస్యురాలు, తండ్రి రోజువారీ కూలి పనులు చేసుకుంటారు. కానీ కూతురు మాత్రం ఏడేళ్ల వయస్సులోనే పదో తరగతి,13 ఏళ్ళ వయస్సులోనే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొందింది. ప్రతిభ అనేది కులం మీదో, సామాజిక స్థితిగతుల మీదో ఆధారపడి ఉండదు. ఈ సత్యానికి నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సుష్మావర్మ. 
ఇప్పుడే కాదు, కొన్నేళ్ళ కిందటే పదవతరగతి ఉత్తీర్ణులైన వారిలో, దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా ఈ అమ్మాయి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఇంకోటి కూడా ఉంది. సుష్మ 2007లో ఏడేళ్ళ వయస్సుకే పదవ తరగతి పాసై, రికార్డును అధిగమించింది. ఆ రికార్డు ఎవరిదో కాదు తన సొంత అన్నయ్యదే. సుష్మా అన్న పేరు శైలేంద్ర. తొమ్మిదేళ్ళ వయస్సులో ఉత్తరప్రదేశ్‌ హైస్కూల్‌ నుండి పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. ఈ ఇద్దరు బాల మేధా వులను కన్న తల్లితండ్రులు ఇద్దరికీ చదువు లేదు. ఆస్తి అంతస్థులు అంతకన్నా readmore

15 కేజీల బంగారం, నగదు దోపిడీ



  - మహేశ్‌బ్యాంక్‌ ఖాతాదారుల ఆందోళన 
  - సిబ్బంది పాత్రపై పోలీసుల అనుమానం
   ప్రజాశక్తి - హైదరాబాద్‌
  హైదరాబాద్‌ ఎఎస్‌రావునగర్‌లోని మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. అందులోని 15 కేజీల బంగారం, నగదు దోచుకెళ్లారు. గురువారం బ్యాంక్‌ను మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సిసి కెమెరాల వైర్లు తెంచి దోచుకోవడం సంచలనం రేపింది. అయితే ఈ దోపిడీ వెనుక బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు షెట్టర్‌ను ధ్వంసం చేయకుండా మారు తాళాలతో లోనికి ప్రవేశించిన దుండగులు.. బ్యాంకు లాకర్‌ను కూడా తాళాలతోనే తెరిచారు. అందు లోని 15 కేజీల బంగారం, నగదు దోచుకెళ్లారు. readmore

పునరంకితమవుదాం


    - తెలంగాణా దీక్షాదివస్‌లో వక్తల ఉద్ఘాటన
     ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో 
  తెలంగాణా రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు చేపట్టిన నిరవధిక దీక్షకు నవంబర్‌ 29, 2013తో నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఇందిరాపార్కువద్ద తెలంగాణా దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దివస్‌ సాయంత్రం 5 గంటలదాక కొనసాగింది. కెసిఆర్‌ దీక్ష తర్వాత, అనంతరం ఏర్పడిన పరిస్థితులను, ఉద్యమ ప్రస్తానాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. కెసిఆర్‌ దీక్షా స్ఫూర్తితో రానున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. రాబోయే తెలంగాణా రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని ప్రజలకు దీక్షా దివస్‌లో వక్తలు విజ్ఞప్తి చేశారు. పునర్‌ నిర్మాణంreadmore

24, నవంబర్ 2013, ఆదివారం

మోడీకి మరో పోటు

   -అక్రమ నిఘాపై సుప్రీంలో సస్పెండెడ్‌ ఐఎఎస్‌ అధికారి అఫిడవిట్‌
  న్యూఢిల్లీ : ఓ మహిళా ఆర్కిటెక్ట్‌పై గుజరాత్‌ ప్రభుత్వ అక్రమ నిఘా వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆ రాష్ట్రానికి చెందిన సస్పెండెడ్‌ ఐఎఎస్‌ అధికారిప్రదీప్‌శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు. అక్రమ నిఘాకు బాధ్యులైన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆయన రాజకీయ అనుచరుడు, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అమిత్‌ షాపై చర్యలు తీసుకోవాలని ప్రదీప్‌ కోరారు. 27 ఏళ్ల సదరు మహిళతో మోడీకి సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తనకు తెలియడంతో తనపై గుజరాత్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రదీప్‌ వాపోయారు. భారత టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించి మరీ ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించారని విమర్శించారు. 2004లో ఆమెను మోడీకి పరిచయం చేసినవారిలో తానూ ఉన్నానని ప్రదీప్‌ పేర్కొనడం గమనార్హం. మహిళా ఆర్కిటెక్ట్‌పై 'సాహెబ్‌' కోసం నిఘా ఉంచాల్సిందిగా పోలీసు ఉన్నతాధి కారులను అమిత్‌షా ఆదేశించినట్లు పరిశోధక వార్తా సంస్థలైన క్రోబ్రాపోస్ట్‌, గులైల్‌ ఇటీవల readmore

సంక్షేమ భవన్‌ను ముట్టడించిన బధిరులు

     -జాడలేని అధికారులు 
    -కమిషనర్‌ ఛాంబర్‌ ఎదుట బైఠాయింపు
    -పర్మిషన్‌ లేదని ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు
      ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
   దీర్ఘకాలంగా అపరిష్క్రుతంగా ఉన్న తమ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనుబంధ సంస్థ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఫర్‌ డెఫ్‌ (డిఎస్‌డి) ఆధ్వర్యంలో బధిరులు వికలాంగుల సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. అంతకుముందు వారు నల్గొండ క్రాస్‌రోడ్‌ నుంచి ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన బధిర మహిళలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వారి సైగల్ని అర్ధం చేసుకోని పోలీసులు సంక్షేమ భవన్‌లోకి బలవంతంగా తోసుకెళ్లారు. దీంతో ఆందోళనకారులు వికలాంగుల సంక్షేమ భవన్‌లోని కమిషనర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు. అక్కడి డైరెక్టర్‌ కమ్‌ కమిషనర్‌ కె శారదాదేవి రెండు నెలలుగా readmore

ఊడ్చేసిన హెలెన్‌

-   రైతుకు కోలుకోలేని దెబ్బ... 
   -  నేలమట్టమైన వేలాది ఇళ్లు
   - చీకట్లోనే గ్రామాలు బ దెబ్బతిన్న రహదారులు
      ప్రజాశక్తి - యంత్రాంగం
  గత నెలలో వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినగా మిగిలిన పంటను హెలెన్‌ తుపాను ఊడ్చేసింది. ఉభ య గోదావరి జిల్లాల్లో రైతులు కుదేలవగా, కృష్ణా, గుంటూరు తది తర జిల్లాల రైతులు కొంతమేర నష్టపోయారు. ఉభయ గోదావరి జిల్లాల్లో హెలెన్‌ దెబ్బకు సుమారు రూ.1100 కోట్ల నష్టం వాటిల్లి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి నష్టం అంతకు మరిన్ని రెట్లు అధికం. ఖరీఫ్‌ సీజన్‌లో చేతికందే సమయంలో ప్రతి సారీ రైతులు పంట కోల్పోతున్నారు. ఐదేళ్ల నుండీ వరుసగా అప్పుల ఊబిలోనే ఉన్నారు. విద్యుత్‌శాఖ, రహదారులు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలో వర్షానికి మార్కెట్లోని ధాన్యం readmore

చాపకింద నీరులా..?

-గవర్నర్‌తో కన్నా భేటీ
    -పదవికి లైన్‌ క్లియర్‌ సంకేతమా!
   - కిరణ్‌ను బెదిరించేందుకు అధిష్టానం అస్త్రమా!
   ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
   వ్యవసాయశాఖ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ఎటుపోయినా, ఏమిచేసినా, ఎవరితో కలిసినా చర్చనీయాంశమే అవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించి కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించబోతున్నట్లు కాంగ్రెస్‌వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో శనివారం గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో కన్నా భేటీ అయ్యారు. పదిహేను నిమిషాల పాటు జరిగిన సమావేశంలో గవర్నర్‌తో కన్నా ఏమి మాట్లాడారనేది తెలియక పోయినా readmore

తృణమూల్‌ సస్పెండెడ్‌ ఎంపీ అరెస్ట్‌

 కొల్‌కతా: శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో సస్పెండెడ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కునాల్‌ ఘోష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో అసలు దోషులను కాపాడేందుకు కునాల్‌ను బలి పశువును చేసి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆరోపణలున్న నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అరెస్ట్‌ చేసిన అనతరం read more

20, నవంబర్ 2013, బుధవారం

మున్సిపల్‌ హెల్త్‌ కార్డుల జారీలో వివక్ష


    -ఎమ్మెల్సీ గేయానంద్‌
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  హెల్త్‌కార్డుల జారీలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం. గేయానంద్‌ విమర్శించారు. బుధవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్‌తో సహా మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, కార్మికులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. యూనియన్‌ అధ్యక్షులు కె.సామ్రాజ్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గేయానంద్‌ మాట్లాడుతూ హెల్త్‌కార్డుల జారీలో ప్రభుత్వ విధానం ఏమిటని శాసన మండలిలో ప్రశ్నిస్తే, దశలవారిగా అందరికి ఇస్తామని చెప్పిందన్నారు. సాధారణ ఉద్యోగుల కన్నా మున్సిపల్‌ కార్మికులు ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారని, కానీ హెల్త్‌కార్డుల జారీలో వీరిపట్ల ప్రభుత్వం వివక్ష పాటిస్తోందన్నారు. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని దెబ్బతీసి, ప్రభుత్వ ఆసుపత్రులను మూసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హెల్త్‌కార్డులు ఇచ్చే వరకు ప్రభుత్వంపై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఒత్తిడి చేస్తారని చెప్పారు. హెల్త్‌కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తన విడ్డూరంగా readmore

మహిళ బ్యాంకు ఆరంభం

-  ప్రారంభించిన ప్రధాని
-  మార్చి కల్లా 25 శాఖలు
    ముంబయి : దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ప్రత్యేక మహిళ బ్యాంకు అందుబాటులోకి వచ్చింది. ముంబయిలోని ఎయిర్‌ఇండియా భవనంలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మహిళ బ్యాంకును ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, యుపిఎ-2 ఛైర్మన్‌ సోనియాగాంధీ లాంచనంగా ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఏర్పాటు చేశారు. తొలి దశలో పలు ప్రధాన నగరాల్లో ఏడు శాఖలను తెరిచారు.
ఆ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ మహిళల్లో మరింత స్వయం సమృద్ధి, వారికి భద్రత పెరగాలన్నారు. సోనియా మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్బంగా ఈ శాఖను తెరవడం అమెను స్మరించుకున్నట్లవుతుందని అన్నారు. ఆర్థిక మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ మహిళ బ్యాంకును అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రూ.1,000 కోట్ల మూలధనంతో మహిళ బ్యాంకును ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్‌లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ బ్యాంకు బోర్డులో మొత్తం ఎనిమిది మంది మహిళreadmore

శ్రీశైలం టు సాగర్‌

-సరిహద్దులపై సంవాదం ?
     -అరణ్యభవన్‌లో నేడు చర్చ
     -కర్నూలు తరహాలోనే గుంటూరు నివేదిక
      ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   రాష్ట్ర విభజన దిశలో కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణా, సీమాంధ్ర ప్రాంత సరిహద్దులపై కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో భద్రాచలం, పాల్వంచ, మునగాల ప్రాంతాలను సీమాంధ్ర ప్రాంతంలో కలపాలంటూ చేసిన ప్రతిపాదన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలతో పాటు, పరిసర ప్రాంతాలు కర్నూలు జిల్లా పరిధలోకే వస్తాయంటూ వెలువడిన వార్తలు కలకలం రేపుతోంది. అటవీశాఖ రికార్డుల ఆధారంగా కర్నూలు జిల్లా అధికారులు ఈ నివేదికను పంపారు. 1972 ఫిబ్రవరి 25న జిఓ నెంబరు 247 ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన 1468.52 ఎకరాల అటవీ భూమిని శ్రైశైలం ప్రాజెక్టుకు కేటాయించారని, దీని ప్రకారం ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలూ కర్నూలు పరిధిలోకే వస్తాయని ఆ జిల్లా అధికారులు ఇచ్చిన నివే దిక తాజాగా చర్చనీయాంశంగా మారింది.readmore

సిఎం గాంధీభవన్‌ బహిష్కరణ

   -నేనే పిలవలేదు : బొత్స
         -సమన్వయ కమిటీలోనే డిగ్గీ టి బిల్లు
               ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
    ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌ను బహిష్కరించారా? ఇదే కాంగ్రెస్‌పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి ప్రకటన నాటినుండి ఇప్పటివరకు కిరణ్‌ గాంధీభవన్‌లో అడుగుపెట్టలేదు. ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కిరణ్‌.. ఆ తర్వాత గాంధీభవన్‌ వైపు కన్నెత్తి చూడలేదు. పిసిసి తరపున అనేక కార్యక్రమాలు జరిగినా ఏ ఒక్కదానికీ ఆయన హాజరుకాలేదు. ముఖ్యనేతలకు సంబంధించి వర్థంతులు, జన్మదినోత్సవాలు జరిగినా పిసిసి అధ్యక్షులతో పాటు సిఎం, డిప్యూటీ సిఎం హాజరవుతారని పిసిసి మీడియాకు మెసేజ్‌లు పంపుతూ వుంటుంది. అయితే సిఎం హైదరాబాద్‌లో ఉన్నా క్యాంపు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. మంగళవారం కూడా అదే జరిగింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి సిఎం పాల్గొంటారని పిసిసి మెసేజ్‌ పంపింది. అయితే ఆయన వస్తారని ఎదురుచూసిన నేతలకు నిరాశreadmore

17, నవంబర్ 2013, ఆదివారం

కేంద్ర బిందువులైన రాజ్యాంగ నిబంధనలు

ఆంధ్ర ప్రదేశ్‌ విభజనపై చర్చ కేంద్రీకృతమైన ఈ సందర్భంలో రాజ్యాంగ నిబంధనల గురించి విస్త్రతమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. అందులోనూ ఆర్టికిల్‌ 2,3,4, ఇంకా 371(డి,ఇ) వంటివి పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. ఎవరికి వారు తమదైన వ్యాఖ్యానం జోడిస్తున్నారు. అందుకే అసలు రాజ్యాంగం వాటి గురించి ఏమి చెబుతున్నదో యధాతథంగా తెలుసుకోవలసిన అగత్యం ఏర్పడుతున్నది. 
రాజ్యాంగపు అధికరణం (ఆర్టికల్‌) 2 : నవీన రాష్ట్రాలకు ప్రవేశమిచ్చుట 
లేదా స్థాపన చేయుట
యూనియన్‌లోనికి క్రొత్త రాష్ట్రాల ప్రవేశాన్ని పార్లమెంటు తన షరతులతో చట్టబద్ధంగా ఆమోదించవచ్చు. 
అధికరణం 3 : చట్టం ద్వారా పార్లమెంటు 
(ఎ) ఏదైనా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విభజించి, లేదా రెండు లేదా కొన్ని రాష్ట్రాలను కలిపి, లేదా ఒక రాష్ట్రానికి ఏదైనా ప్రాంతాన్ని కలిపి నూతన రాష్ట్రాన్ని ఏర్పరచవచ్చు...readmore

సిద్ధిక్‌ బర్మాక్‌ దర్శకత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌ దైన్యస్థితిని వెల్లడించిన 'ఒసామా'

ఐర్లాండ్‌, జపాన్‌ సంయుక్తంగా నిర్మించిన 84 నిమిషాల చిత్రం 'ఒసామా'. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల పడగనీడకింద తలదాచుకుంటున్న ఆ దేశ ప్రజల ధైన్య స్థితిని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. తండ్రిని, మేనమామను పోగొట్టుకున్న ఒసామా అనే 12 ఏళ్ళ పాప తల్లి, అమ్మమ్మలతో కలిసి జీవిస్తుంటుంది. ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఒసామా తల్లి పనిచేసే ఆసుపత్రిని బలవంతంగా మూసివేయిస్తారు. దాంతో ఉపాధికోల్పోయిన ఆమె ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో కూతురు ఒసామానే అబ్బాయిగా మార్చి ఓ టీ దుకాణంలో పనిలో చేరుస్తుంది. ..readmore

ఐక్యతే విజయానికి సోపానం..

  ఓ వైపు నినాదాల హోరు.. మరోవైపు కరతాళధ్వనుల జోరు.. ఈ జోష్‌ అంతా ఎక్కడనుకుంటున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌.సి.యు) విద్యార్థిసంఘ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్రకమిటీ ఏర్పాటుచేసిన అభినందనసభలో. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో గత రెండేళ్ళ నుంచి భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఐ) స్వతంత్రంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తోంది. ఈసారీ అధ్యక్ష పదవితో ప్రధానకార్యదర్శి, సహాయకార్యదర్శి స్థానాలనూ గెలుపొందింది. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓ యువతి అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం. ఆమె పేరు -శిరీష. ఈ సందర్భంగా కలిసిన 'జీవన'తో శిరీష తన అనుభవాల్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ...read more

'చంద్రమోడి' పోస్టర్ల కలకలం

ప్రజాశక్తి - చేబ్రోలు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు కూడలిలో నారా చంద్రబాబునాయుడు, నరేంద్రమోడి కలసి ఉన్న పెద్ద ఫ్లెక్సీ 'చంద్రమోడి యూత్‌' పేరుతో వెలిశాయి. బిజెపితో తమకు ఎటువంటి పొత్తులూ లేవంటూ టిడిపి నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తుపాను బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథంలో ఫ్లెక్సీలు వెలిశాయని స్థానికులు చెబుతున్నారు. అయితే టిడిపి, బిజెపి ఎన్నికలపొత్తు నేపథ్యంలో ప్రజల్లో స్పందన తెలుసుకోవడం కోసం తెలుగు తమ్ముళ్లు వేయించినట్లు మరో ప్రచారం జరుగుతోంది. read more

15, నవంబర్ 2013, శుక్రవారం

మరో బస్సు దగ్ధం

      -కర్నాటకలో ఏడుగురి సజీవ దహనం
బెంగళూరు : మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాద ఘటన మరువకముందే, ఇదే తరహా ఘటన కర్నాటకలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా, 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇక్కడి నుండి 52 మంది ప్రయాణీకులతో ముంబయికి బయల్దేరిన వోల్వో బస్సు కర్నాటకలోని హవేరి జిల్లా కునిమెల్లిలో బ్రిడ్జిని ఢకొీనడంతో డీజిల్‌ ట్యాంక్‌ లీకై మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు ఎగిసిన వెంటనే దాదాపు 45 మంది ప్రయాణీకులు అద్దాలు పగులకొట్టుకుని బయటపడ్డారని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదమనంతరం పరారయిన బస్సు యజమాని షకీల్‌ అహ్మద్‌ను, డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.read more.....

డిసెంబర్ 15 లోపు...

   -ఇందిర జయంతికి టి. బిల్లు ఫైనల్‌                        ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    రాష్ట్ర విభజన దిశలో కేంద్ర మంత్రుల బృందం కసరత్తును వేగవంతం చేసింది. శీతాకాల సమావేశాల్లోనే టి. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన తాజా ప్రకటన నేపథ్యంలో ఆ దిశలో ప్రక్రియను పూర్తిచేయడానికి జిఓఎం చర్యలు చేపట్టింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు దిశలో కీలక ప్రక్రియను పూర్తి చేయడానికి తాజాగా డిసెంబర్‌ 15ను కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. ఆ తేదిన వీలైతే అంతకన్నా ముందే టి. బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.read more.....

వాయిదాతో దుమారం

  - సిఎం మార్పు ఖాయమంటూ ప్రచారం
    -స్పందించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
      -18న జిఓఎంతో కిరణ్‌ భేటీ
      ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం)తో ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ వాయిదా పడటం దుమారాన్ని రేపింది. జిఓఎం ముందుకు వెళ్లడానికి ఆయన నిరాకరించారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఖరిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆగ్రహంగా ఉందని, ఆయన్ను మార్చడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితమే ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీని కలిసివచ్చిన రాష్ట్రమంత్రి కన్నాలక్ష్మీనారాయణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.read more...

అశోక్‌ ఖేమ్కాకు 45వ బదిలీ

చండీఘర్‌: సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి హర్యానా ప్రభుత్వం సహకరించిన విషయాన్ని బయటపెట్టిన ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాను 45వ సారి బదిలీ చేశారు. గత ఏప్రిల్‌లో పాత దస్తావేజుల శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితుడైన అశోక్‌ను ఆర్నెల్లు తిరక్క ముందే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. 2008లో భూమి రిజిస్ట్రేషన్‌ శాఖకు డైరెక్టర్‌గా ఉన్న ఖేమ్కా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డిఎల్‌ఎఫ్‌, రాబర్ట్‌ వాద్రాల మద్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేశారు. అయితే ఖేమ్కాను బదిలీ చేయలేదని, ఇతర రాష్ట్రాల ఎన్నికల నిమిత్తం ఇతర అధికారులతో ఎన్నికల సంఘం ఆయనను పంపుతోందని ప్రభుత్వం చెబుతోంది.read more....

గొంతు కోసిన ప్రేమ







-ప్రేమోన్మాది ఘాతుకం

- ప్ర్రియురాలిని చంపి తానూ ఆత్మహత్యాయత్నం
          ప్రజాశక్తి -దేవరకొండ
   తను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్ధం కావడాన్ని జీర్ణించుకోలేక ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేశాడో ఉన్మాది. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం నల్గొండ జిల్లా దేవరకొండలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండభీమనపల్లిలోని ఖాదర్‌ మెమోరియల్‌ కళాశాలలో గాంధీనగర్‌కు చెందిన గోలి కవిత(22), ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన సోమదేవపల్లి బాలకృష్ణ ఎంబిఏ చదువుకున్నారు.read more..

'ఉమ్మడి' తేలితేనే...!


   -ఆదాయ పంపిణీపై స్పష్టత      - జిఓఎం ఎదుట ఆర్థిక అధికారుల మొర
         ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
   ఉమ్మడి రాజధాని హౌదా, పరిధి ఖరారు కాకుండా ఆదాయ పంపిణీ సాధ్యం కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో మంత్రుల బృందం (జిఓఎం) ఎదుట కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పుడొచ్చే పన్ను, పన్నేతర ఆదాయాన్ని జనాభా దామాషా ప్రకారం లెక్కించడం పెద్ద ఇబ్బంది కాదని అన్నట్లు సమాచారం. మామూలుగా అయితే కోస్తా, రాయలసీమకు 60 శాతం, తెలంగాణాకు 40 శాతం వంతున పంపిణీ చేయొచ్చని, కేంద్రం ఎన్నేళ్లు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు రెవెన్యూ షేరింగ్‌ ఇరు రాష్ట్రాలకు అందుతుందని వివరించినట్లు తెలిసింది. కానీ గతంలో విభజించిన రాష్ట్రాలకు, ఎపికి చాలా తేడా ఉంది.read more...

13, నవంబర్ 2013, బుధవారం

బ్రిటన్‌ మానవ హక్కుల ఉల్లంఘన

 
-అసాంజేపై ఈక్వెడార్‌ అధ్యక్షుడు రాఫేయిల్‌ కొర్రియా
పారిస్‌: లండన్‌దాటి బయటకు వెళ్లేందుకు వికీలీక్స్‌ స్థాపకుడైన జూలియన్‌ అస్సాంజేని అనుమతించకుండా బ్రిటన్‌ మానవ హక్కులను కాలరాస్తున్నదని ఈక్వెడార్‌ అధ్యక్షుడు రాఫేయిల్‌ కొర్రియా అన్నారు. పారిస్‌ సందర్శనలో ఉన్నప్పుడు కొర్రియా మాట్లాడుతూ అస్సాంజే భవిష్యత్తు బ్రిటన్‌ చేతుల్లో ఉందన్నారు. జూలియన్‌ అస్సాంజే గత సంవత్సరంన్నర కాలంగా లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. 2012లో ఈక్వెడార్‌ ఇస్తానన్న ఆశ్రయం ఇంకా అలానే ఉన్నదని ఈక్వెడార్‌ అధ్యక్షుడు ప్రకటించాడు. అస్సాంజేకి తాను ఆశ్రయంపొందగోరే దేశాన్ని ఎంచుకునే హక్కు ఉన్నదని ఆయన చెప్పారు.read more

'ఉమ్మడి' ప్రాంతం విడిగా

 

- బిల్లులో రాజధాని ప్రత్యేకం
     -హోదాపై తర్జన భర్జన
   ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
  విభజన బిల్లులో ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూపట్లేదని తెలిసింది. పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకూ హైదరాబాద్‌ సంయుక్త రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రుల బృందం ఇప్పటి వరకూ దాని సరిహద్దులు, హౌదాలను నిర్వచించలేదు. దీనిపై స్పష్టత ఇవ్వకుండానే కేంద్రం ముసాయిదా బిల్లు సిద్ధం చేస్తోందని సమాచారం. వాస్తవానికి జిఓఎం నివేదిక ఇచ్చాక దాని ఆధారంగా హౌం మంత్రిత్వశాఖ బిల్లు రూపొందించి మంత్రి మండలి ఆమోదానికి పంపాలి. పార్లమెంట్‌ సమావేశాలు దగ్గర పడుతుండటంతో జిఓఎం నుంచి నివేదిక అందకపోయినా అధికారులు బిల్లు తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల పరిధిలో చూపకుండా, ప్రత్యేకంగా చూపిస్తున్నారని తెలిసింది. సిడబ్ల్యుసి నిర్ణయించినట్లు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వట్లేదని,read more....

శాంతిభద్రతలపై డిజిపి సమీక్ష

 
-పోలీసు శాఖ తరపున జిఒఎంకు నివేదిక ఇవ్వలేదు
    ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవడంతో జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో శాంతి భద్రతల పరిస్థితులపై రాష్ట్ర డిజిపి బయ్యారపు ప్రసాదరావు మంగళవారం సమీక్షించారు. సోమవారం సాయంత్రం వరకు ఢిల్లీలో పలు సమావేశాల్లో పాల్గొ న్న డిజిపి వెంటనే హైదరాబాద్‌కు చేరుకుకుని ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబిలీ హాల్‌లో జంట కమిషనరేట్లలోని సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఎసిపి ఆపై అధికారులు పాల్గొన్న ఈ సమావేశం గంటన్నర పాటు జరిగింది. ఈ సందర్భంగా డిజిపి జంట కమిషనరేట్లలోని పోలీసు అధికారులను సమస్యల గురించి తెలపాలని కోరగా వారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.read more...

బాబు లోకల్‌ షో


   -లాభం లేదన్న నేతలు
  -విడివిడిగా సమావేశాలు
  -లోకేష్‌కు బాధ్యతలు?
   -తమ్ముళ్ల తన్నులాట
    -రాష్ట్రపతికి లేఖ
    ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ప్రతికూలంగా మారాయి. దాన్నించి బయటపడేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. విభజన, సమైక్య ఉద్యమాల నేపధ్యంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తే సమావేశం సవ్వంగా సాగదని భావించిన చంద్రబాబు...పార్టీ చరిత్రలో ఎన్నడులేని విధంగా సీమాంధ్ర నాయకులు, తెలంగాణా నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలహీనతను చాటారు.read more....

హద్దులు దాటుతున్నారు!

      -సిబిఐ, కాగ్‌లపై చిదంబరం
     న్యూఢిల్లీ : విధాన రూపకల్పన, పర్యవేక్షణలను వేరు చేసే సన్నని విభజన రేఖను గౌరవించాల్సిందిగా సిబిఐని ఆర్ధికమంత్రి చిదంబరం మంగళవారం కోరారు. తమ పరిమితులను, పరిధులను అతిక్రమిస్తున్నారంటూ దర్యాప్తు సంస్థలపై, కాగ్‌పై ఆర్ధిక మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. సక్రమంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను నేరాలుగానో లేదా అధికార దుర్వినియోగాలుగానో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వాటిపై మండిపడ్డారు. విధానపరమైన అంశాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సిబిఐని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోరిన మరుసటి రోజే చిదంబరం ప్రతిస్పందన వెలువడింది.read more....

చరిత్ర తెలుసుకో వక్రీకరించొద్దు...

    -
    -మోడీకి మందలింపు
  న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇకపై సభల్లో ప్రసంగించే సమయంలో కాస్తంత జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించాలని బిజెపి భావిస్తోంది. చారిత్రక సందర్భాలను ఉటంకించేటపుడు ఎలాంటి తప్పులు, పొరపాట్లు రాకుండా చూసుకోవాలని పేర్కొంటోంది. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శనాస్త్రాలు గుప్పించకుండా చూడాలంటే మోడీ తప్పనిసరిగా జాగ్రత్తపడాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. చారిత్రక వాస్తవాల పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. తాజాగా జరిగిన ఒక సభలో మోడీ ప్రసంగిస్తూ గుజరాత్‌ స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ పేరు విషయంలో గందరగోళానికి గురయ్యారు.read more...

అన్నీ ప్రశ్నలే...

Add caption


  - ప్రతిపాదనలు నాస్తి
  - భేటీలో తొలిరోజు
   -'శీతాకాలం'లోనే పూర్తి చేయండి
    -రాష్ట్ర విభజనపై జీఒఎం ముందు 5 రాజకీయ పార్టీలు
   - హామీ ఇవ్వలేమన్న కేంద్ర మంత్రులు
  - ప్రాంతాల వారీగా రెండు వాదనలు వినిపించిన కాంగ్రెస్‌
   - హైద్రాబాద్‌పై రాజీలేదన్న టిఆర్‌ఎస్‌, ఎంఐఎం
     - విధివిధానాలపై స్పందించేందుకు బిజెపి నిరాకరణ
     -మరికొన్ని సమావేశాలు జరుగుతాయి : షిండే
     రాష్ట్ర విభజన ప్రక్రియను డిసెంబరులో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేయాలని ఐదు రాజకీయ పార్టీలు కేంద్ర మంత్రుల బృందానికి (జీఒఎం) విజ్ఞప్తి చేశాయి. జీఒఎం రూపొందించిన 11 విధివిధానాలపై వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు, విభజనను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడిగా డిమాండ్‌ చేశాయి. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టాలన్న పార్టీల డిమాండ్‌పై మాత్రం జీఒఎం నిర్దిష్ట సమాధానమివ్వలేదు. కచ్చితంగా శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని తాము హామీ ఇవ్వలేమని మంత్రులు వివిధ పార్టీల నేతలకు స్పష్టం చేశారు.read more...

'రచ్చబండ'లో నిలదీతలు

  -సిపిఎం నాయకుల అరెస్టు
    -ఎవడ్రా వాడు... విజయవాడలో ఎమ్మెల్యే రౌడీపోకడ
    ప్రజాశక్తి-యంత్రాంగం
  ప్రజాసమస్యల పరిష్కారం, లబ్దిదారులకు లబ్ది చేకూర్చేందుకు నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో సమస్యలపై నిలదీయడం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదు.. సమస్యలు చెప్పొద్దు.. అడగొద్దు.. మేం వచ్చాం.. కార్యక్రమం నిర్వహించాం.. వెళ్తున్నాం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదూ.. అంటే పోలీసులతో అరెస్టులు చేస్తున్నారు.. ముఖ్యంగా ప్రజా సమస్యలపై నిలదీస్తున్న సిపిఎం నాయ కులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు..red mor

12, నవంబర్ 2013, మంగళవారం

'అటవీ' హక్కు పత్రాలివ్వాలి

- ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలి
  - ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
     ప్రజాశక్తి- పార్వతీపురం/వరంగల్‌
     పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలని, ఫారె స్టు అధికారుల దాడులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో సోమవారం విజయనగరం, వరంగల్‌ జిల్లా ల్లో పోడు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభు త్వ కార్యాలయాలను ముట్టడించారు. అటవీశాఖ అధి కారుల దాడులు ఆపాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 26న కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజన
సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి, వాటిని పరిష్కరించేవరకూ పోరాడతా మని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మిడియం బాబూరావు హెచ్చరించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం READ MORE

సేవా బాణీలోనే... ఆకాశవాణి!

 
















 - ఇవాళ 'ప్రజాసేవా ప్రసార దినం'
   ఏకకాలంలో ఇటు విజ్ఞానాన్నీ, అటు వినోదాన్నీ, మరోపక్క విషయ సమాచారాన్నీ ఎంతో సరళంగా, వేగంగా అందించే సాధనంగా రేడియోను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రజా ప్రసార సాధనంగా 'ఆకాశవాణి' ఎన్నో దశాబ్దాలుగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు రేడియోలు, ఇంటర్నెట్‌ రేడియో సేవలు, ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం. ఛానళ్ళు ఎన్ని వచ్చినా, ప్రజా సేవకు పూర్తిగా కట్టుబడిన సాధనంగా 'ఆకాశవాణి' తన చారిత్రక కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందుకు నడుస్తోంది. ఆ కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, ప్రజాసేవకు పునరంకితమవుతూ మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్‌ 12న 'ప్రజాసేవా ప్రసార దినం' (పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డే) జరుపుకొంటోంది. READ MORE

ఢిల్లీ నమూనాలో పదేళ్లు

- భద్రాచలం, నూగూరు, మునగాల మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలి
  - కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు అందించాలి
  - 371(డి)పై స్పష్టత లేకుండా విభజిస్తే ఎన్నో సమస్యలు
   - తెలంగాణాలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కష్టసాధ్యం - జీఒఎంకు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక
       ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
       రాష్ట్ర విభజన అనంతరం హైద్రాబాద్‌ నగరాన్ని పదేళ్లపాటు ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల బృందానికి (జీఒఎం) సిఫార్సు చేసింది. ఈ కాలంలో శాంతి భద్రతలు, న్యాయ పరిపాలన, మున్సిపల్‌ పరిపాలన, భూమి- పట్టణాభివృద్ధి తదితర కీలకాంశాలన్నీ కేంద్రం ఆధానంలోనే ఉంచాలని కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఒఎంకు 25 పేజీల నివేదికను సమర్పించింది. హైద్రాబాద్‌ భవితవ్యంతో పాటు జీఒఎం నిర్దేశించిన 11 విధివిధానాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేసింది. ఖమ్మం జిల్లా భద్రాచలం, నూగూరు (వెంకటాపురం) మండలాలను, నల్గొండ జిల్లా మునగాల మండలాన్నీ కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని సిఫార్సు చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి పదేళ్ల READ MORE

బంగారు ఏనుగొచ్చేసిందోచ్‌!

-  బాలల చలనచిత్రోత్సవాలకు సర్వం సిద్ధంబ ప్రసన్నకుమార్‌ మహంతి
  - 48 దేశాల నుండి 200 సినిమాలు బ రోజు 30 షోలు
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  బాలల చలనచిత్రోత్సవ సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంగారు ఏనుగు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రపంప నలుమూలల నుంచి బాలల చిత్రాలు భాగ్యనగర ప్రదర్శనకు తరలిరానున్నాయి. ఈ ఉత్సవాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రసన్న కుమార్‌ మహంతి సోమవారం వెల్లడించారు. 18 వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు సర్వం సిద్ధం చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 894 ఎంట్రీలు వచ్చాయన్నారు. అందులో 48 దేశాలకు చెందిన 200 సినిమాలను ఎంపిక చేశామన్నారు. సోమవారం సచివాలయంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఏర్పాట్లపై అత్యున్నత    read more......

11, నవంబర్ 2013, సోమవారం

10,000 మంది మృతి

   - హైయాన్‌ దెబ్బకు కుదేలయిన ఫిలిప్పీన్స్‌ 
   - తుడిచిపెట్టుకుపోయిన 36 ప్రావిన్సులు 
   - వియత్నాంకూ ప్రమాదం ?
    మణిలా : శుక్ర, శనివారాల్లో ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన హైయాన్‌ టైఫూన్‌ దెబ్బకు కనీసం 10 వేల మందికి పైగా ప్రజలు మరణించి వుంటారని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ టైఫూన్‌ సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ను దాదాపుగా నేల మట్టం చేసింది. తీర ప్రాంతపు గ్రామాలు కొట్టుకు పోయాయని, ఈ ప్రాంతంలో దాదాపు 70 నుండి 80 శాతం మేర ధ్వంసమైందని లేతె ప్రావిన్స్‌ పోలీస్‌ చీఫ్‌ ఎల్మర్‌ సోరియా వివరించారు. టైఫూన్‌ దెబ్బతిన్న తీర ప్రాంతాలకు చేరుకోవటానికి సహాయక బృందాలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ బృందాలు ఆ ప్రాంతాలకు చేరుకుంటేనే వాస్తవమైన మృతుల సంఖ్య వెలుగు చూడదని ఆయన వివరించారు. టైఫూన్‌ దెబ్బకు బతికి బయట పడిన వారిలో కొందరు ఇప్పుడు ప్రభుత్వం అందచేసే ఆహార సహాయం కోసం ఎదురు చూస్తుండగా మరికొందరు తమ ఆత్మీయుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రజలు ఆహారాన్వేషణ చేస్తూ జంబీల మాదిరిగా నడుస్తున్నారని లేతె ప్రావిన్స్‌కు చెందిన ఒక వైద్య విద్యార్ధి వ్యాఖ్యానించాడు. read more

సోనియా, థాకరే తరహా


   -  కెసిఆర్‌ రిమోట్‌ వ్యూహం
   -  ఎన్నికల తర్వాత ఎటైనా
   - వైసీపీ ఓట్ల మద్దతుపైనా ఆశలు 
   ప్రజాశక్తి బ్యూరో హైదరాబాదు
    వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల ఏర్పాటు తథ్యమని భావిస్తున్న టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు తెలంగాణా ముఖ్యమంత్రిత్వం ఖచ్చితంగా తమ అదుపు లోనే వుండాలని భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పన్నెండేళ్లుగా ప్రత్యేక రాష్ట్రంకై ఉద్యమాలు వ్యూహాలు నడిపించి కొత్త రాష్ట్రాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్‌ చేతుల్లో ఎలా పెడతామని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. సోనియా గాంధీకి గుడి కట్టిస్తామంటూ జైత్రయాత్రలు చేస్తున్న కాంగ్రెస్‌ను సూటిగా విమర్శించడం కుదరకపోయినా ప్రధాన చొరవ తమ చేతుల్లో వుండాలనేదే టిఆర్‌ఎస్‌ ఉద్దేశంగా కనిపిస్తుంది. read more

మొక్కుబండ... రచ్చబండ!

 - ప్రారంభ కార్యక్రమాలకు సిఎం దూరం
   - ఆహ్వానించడానికి ఆసక్తిచూపని నేతలు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
       విభజన, సమైక్య ఆందోళనల మధ్య వివాదాస్పదంగా మారిన రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సోమవారం నుండి ఈ నెల 26వ తేది వరకు జరిగే తాజా రచ్చబండ గత కార్యక్రమాలకు భిన్నంగా సాగనుంది. గతంలో జరిగిన రెండు రచ్చబండల్లోనూ ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధానపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజా కార్యక్రమంలో మాత్రం స్థానిక నేతలకే ప్రాధాన్యత దక్కనుంది. ఎక్కడికక్కడ స్థానిక ఎంఎల్‌ఏలు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. గత రెండు కార్యక్రమాల్లోనూ తొలిరోజు నుండి చివరిరోజు వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ సారి ఎప్పుడు, ఎక్కడ పాల్గొంటారన్న విషయమై ఆదివారం సాయంత్రం వరకు అయోమయమే నెలకొంది. ఆయన పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. రచ్చబండ తొలిరోజు ప్రారంభ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండనున్నారు.read more

అధికారుల అండతో మేత

   - 1100 ఎకరాల అటవీ భూమిపై ఐటిసి కన్ను
   -  హైకోర్టు స్టేతో ఆగిన కేటాయింపు 
          అరవై అడుగుల ఇంటి స్థలం కావాలని ఏళ్ల తరబడి గిరిజనులు చేస్తున్న పోరాటాలను పట్టించుకోని ప్రభుత్వం బడా కంపెనీయైన ఐటిసికి మాత్రం అటవీ భూములను కట్ట బెట్టాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లా బూర్గం పాడు మండలం సారపాకలోని ఐటిసి పిఎస్‌పిడి (ఇంపీరియల్‌ టుబాకో కంపెనీ పేపర్‌బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ డివిజన్‌) కాగితపు పరిశ్రమకు 1100 ఎకరాల అటవీ భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆదివాసీ సంఘాలు విఎస్‌ఎస్‌లు, చివరకు సారపాక గ్రామ పంచాయతీ ఆందోళననూ ప్రభుత్వం పక్కనబెట్టడంతో పినపాక మాజీ సర్పంచ్‌ బొల్లి కృష్ణమూర్తి హైకోర్టులో కేసు వేశారు. అక్టోబర్‌ 9న కోర్టు స్టే ఉత్తర్వులివ్వ డంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది.
ప్రజాశక్తి-భద్రాచలం
సారపాక గ్రామంగల శ్రీరాంపురం అటవీ ప్రాంతం అశ్వాపురం అటవీ రేంజ్‌ పరిధిలోనిది. ఇక్కడ వృక్షజాతి, జంతుజాలమే లేదని జిల్లా అధికారులు నివేదికనిచ్చిట్లు సమాచారం. కాని సౌత్‌జోన్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఇచ్చిన నివేదిక అందుకు విరుద్ధంగా ఉంది. అసలు ఈ ప్రాంతం జీవవైధ్యానికి చిరునామా అనీ అనేక ముఖ్యమైన జంతు, వృక్షజాతుల సమ్మేళనమని నివేదికలో పేర్కొన్నారు. నల్లచుక్క జింకలు, అడవి గొర్రెలు read more

10, నవంబర్ 2013, ఆదివారం

అవకతవకలు లేకుండా చూడండి


ఎన్నికల సంఘం భేటీలో అఖిలపక్షం
   -ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
    ఓటర్ల జాబితాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని అఖిలపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఎన్నికల సంఘం సిఇఓ భన్వర్‌లాల్‌తో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టిడిపి), కమలాకర్‌రావు, ఉమామహేశ్వరరావు (కాంగ్రెస్‌), డాక్టర్‌ లక్ష్మణ్‌ (బిజెపి), శ్రావణ్‌ (టిఆర్‌ఎస్‌) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల సవరణలపై చర్చ జరిగింది. అనంతరం ఆయా పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి చేసిన సూచనల్ని విలేకరులకు వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా అపార్టుమెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దళిత, గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల ....read more

విభజన ఓ కుట్ర

 
-  సీమాంధ్ర నేతల మేధోమథన సదస్సులో చంద్రబాబు 
     ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో 
      రాష్ట్ర విభజన ఓ రాజకీయ కుట్ర అని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు విమర్శించారు. విభజనకు హేతుబద్ధత లేదని వ్యాఖ్యానించారు. ఇరు ప్రాంతాల జెఎసి నేతలతో చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. తమ కష్టాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తెలుగు ప్రజల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. సీమాం ధ్రులకు న్యాయం చేయకుండా విభజనపై ఎలా ముందుకెళతారని ప్రశ్నించారు. శనివారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో రెండో రోజు జరిగిన సీమాంధ్ర టిడిపి నేతల మేథోమధన సదస్సు ముగింపు ఉప న్యాసం చేశారు. సీట్లు, ఓట్ల కోసమే సోనియాగాంధీ...read more

విభజనకు అంగీకరించలేదు

 -విడిపోతే తెలంగాణాకే ఎక్కువ నష్టం
   -ప్రధానితో భేటీ అనంతరం సిఎం కిరణ్‌
      ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
   రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్న తన అభిప్రాయంలో ఎటువంటి మార్పూ లేదని, విభజనకు తాను అంగీకరించినట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని సిఎం కిరణ్‌ శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌భవన్‌లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి, పనబాకలక్ష్మి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్‌ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సిఎం విభజనకు అంగీకరించారన్న దిగ్విజరు వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా....read more

రచ్చబండలో ప్రజాసమస్యలపై నిలదీయండి


 -సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పిలుపు
    -చేతివృత్తిదారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్‌
       ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
    ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీలను అమలు జరిపించుకోవడానికి రచ్చబండలో అధికారులను నిలదీయాలని సిపిఎం ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి బివి రాఘవులు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల పదకొండు నుండి ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ అధికారులతో సమావేశాలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల వద్దకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం పెట్టారని, దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని రాఘవులు తెలియజేశారు. read more

రాష్ట్రానికి వేయికోట్ల తక్షణ సాయం

 
- సిఎంతో సమావేశానంతరం ప్రధాని ప్రకటన
   -6,510 వేల కోట్లు కోరిన ప్రతినిధి బృందం
   ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
  పైలిన్‌ తుపాను, ఇటీవలి వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేయి కోట్ల రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించింది. సిఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందంతో సమావేశానంతరం ప్రధాని మన్మోహన్‌ శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ నేతృత్వంలోని రాష్ట్ర నేతల ప్రతినిధి బృందం శనివారమిక్కడ మన్మోహన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, పనబాక లక్ష్మితో పాటు రాష్ట్ర మంత్రులు శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావుతో read more

9, నవంబర్ 2013, శనివారం

పిఎఫ్‌సి క్యూ2 ఆదాయం రూ.5,337 కోట్లు

 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌ (పిఎఫ్‌సి) గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.5,336.96 కోట్లకు చేరింది. 2012-13 ఇదే క్యూ2లో రూ.4,191.16 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసుకుంది. క్రితం త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభాలు 23 శాతం పెరిగి రూ.1,273.79 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,036.49 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ2లో సంస్థ మొత్తం వ్యయం రూ.3,547.27 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ.2,759 కోట్ల వ్యయం నమోదయ్యింది.

సుప్రీంకు సిబిఐ

-  గౌహతి హైకోర్టు ఆదేశాల అధ్యయనం
   న్యూఢిల్లీ :  సిబిఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయసలహా కోరనున్నట్లు సిబిఐ పేర్కొంది. అనంతరం దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని తెలిపింది. 1963లో సిబిఐని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేసిన తీర్మానాన్ని గౌహతి హైకోర్టు గురువారం కొట్టివేసింది. 'ఈహైకోర్టు ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుని, అనంతరం అత్యున్నత న్యాయస్థానంలో దీనిని సవాలు చేస్తాము' అని సిబిఐ అధికార ప్రతినిధికంచన్‌ ప్రసాద్‌ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలావుండగా, గౌహతి హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని, అనంతరం తమ అభిప్రాయాన్ని పర్సనల్‌, ట్రైనింగ్‌ విభాగానికి తెలియజేస్తామని సిబిఐ చీఫ్‌రంజిత్‌సిన్హా చెప్పారు. 'ప్రస్తుత పరిస్థితిపై తక్షణ చర్యను మేము కచ్చితంగా కోరతాము' అన్నారు.read more 

ఎన్నాళ్లు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తారు

-  వెంటనే పర్మినెంట్‌ చేయాలి 
-  కనీస వేతనం రూ.12,500 చెల్లించాలి 
-  విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాలో రాఘవులు డిమాండ్‌
   ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
    కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులుగా ఎన్నాళ్లు పనిచేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత పనిలో కాంట్రాక్టు, క్యాజువల్‌ ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యుఇఇయు) (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎపిసిపిడిసిఎల్‌ సిఎండి కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన రాఘవులు ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ప్రమాదాలకు వెరవకుండా విద్యుత్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. 5,6,10 ఏళ్లపాటు కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులుగా పనిచేసినా రెగ్యులరైజ్‌ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత పనిలో ఏళ్లతరబడి కాంట్రాక్టు కార్మికులతో పనిచేయించడం అమానుషమని విమర్శించారు. read more

వారంలో 531 పాయింట్లు ఫట్‌


-  కొనసాగుతున్న సెన్సెక్స్‌ పతనం
   ముంబయి : వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టిసిఎస్‌, మారుతి సుజుకి షేర్లు అమ్మకాలకు గురి కావడంతో శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 157 పాయింట్లు దిగజారింది. దీంతో ఈ వారంలో మొత్తంగా సెన్సెక్స్‌ 531 పాయింట్ల (2.65 శాతం) పతనాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో రూపాయి మారకం ఆరు వారాల కనిష్టానికి చేరడం మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. ముఖ్యంగా అమెరికాలో ఉపాధిపై నెలకొన్న ఆందోళనలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 156.62 పాయింట్లు (0.75%) పతనమై 20,600.90 పాయింట్లకు దిగజారింది. ఇంట్రా ట్రేడ్‌లో అత్యల్పంగా 20,600 పాయింట్ల వద్ద నమోదయ్యింది. read more