.

29, డిసెంబర్ 2012, శనివారం

'దూకుడు'ను మించిన కామెడీ

'దూకుడు' సినిమా చూసిన వాళ్లెవరూ ఎమ్మెస్‌ నారాయణ పోషించిన పాత్రను మరిచిపోలేరు. సినిమాల్లో నటించాలనే మోజులో మహేష్‌బాబు చేతిలో పావుగా మారిపోయే ఈ పాత్రలో ఆయన అశేష ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. సింహా, మగధీర, యమదొంగ, రోబో..సినిమాల్లోని కథానాయకులను అనుకరిస్తూ ఆయన చేసిన కామెడీ ఎపిసోడ్‌ను టీవీల్లో చూస్తూ జనం ఇప్పటికీ ఎంజారు చేస్తున్నారు.

షేమ్‌..షేమ్‌..కర్నాటక

ఒకప్పుడు ప్రశాంత రాష్ట్రంగా పేరు పొందిన కర్నాటక ఇప్పుడు కాషాయదళ బిజెపి సర్కార్‌ పాలనలో కామాంధుల రాష్ట్రంగా అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. వరుసగా జరుగుతున్న అత్యాచారాలతో ఆగ్రహిస్తున్న ప్రజానీకం షేమ్‌..షేమ్‌ కర్నాటక (కర్నాటక సిగ్గు..సిగ్గు..) అంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత పది రోజుల్లో ఏకంగా పది అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడం బిజెపి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని రుజువు చేసింది........

28, డిసెంబర్ 2012, శుక్రవారం

అమెరికా ద్రవ్య 'సంకటం' - అసలు వాస్తవం

అమెరికాలో క్రింది స్థాయి 80 శాతం కుటుంబాల వార్షిక సగటు ఆదాయం 31,244 డాలర్లు. 2009 నుంచి వారి ఆదాయాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేస్తే అంటే నిజ ఆదాయాలు పెరగకపోగా 4.5 శాతం తగ్గాయి. అమెరికాలో నేడు 4 కోట్ల మందికి పూర్తి స్థాయి ఉద్యోగాలు లేవు. తాత్కాలిక ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారు. 4.7 కోట్ల మంది అధికారిక దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 1.5 కోట్ల బాలలతో సహా 4.5 కోట్ల మంది ఫుడ్‌ స్టాంప్స్‌పైనే బ్రతుకుతున్నారు. ఇలాంటి పేద, సాధారణ అమెరికన్లపై మరిన్ని భారాలు ........

24, డిసెంబర్ 2012, సోమవారం

అంతా.. 72 గంటల్లోనే...

సచిన్‌ వన్డే కెరీర్‌పై 72 గంటల్లో తుది నిర్ణయం తీసుకున్నాడు. గత మూడు రోజులుగా బిసిసిఐ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌తో సచిన్‌ రిటైర్మెంట్‌పై సుదీర్ఘంగా చర్చించాడు. చివరికి శుక్రవారం రాత్రి తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపాడు. నాగ్‌పూర్‌ టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత సచిన్‌ తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశాడు. మూడు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాలేదు. అంజలీ (సచిన్‌ భార్య) నెంబర్‌ ద్వారానే సచిన్‌ను సంప్రదించడానికి వీలు పడిందని మాస్టర్‌ సన్నిహితుడు తెలిపాడు. కుటుంబ సభ్యులు,.........

16, డిసెంబర్ 2012, ఆదివారం

స్మార్ట్‌ ఫోన్లతో చక్కటి ఫొటో ఎడిటింగ్‌


డిజిటల్‌ ఇంకా డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలతో సాధ్యమయ్యే ఫొటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్‌ ఇంకా అరుదైన కెమెరాల ఆప్షన్లతో లభ్యమవుతున్న స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫొటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్‌ సౌకర్యాన్నీ అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీకి మరిన్ని............................

అంతర్జాలంలో 'సెకండ్స్‌' జోరు

14, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలంగాణొస్తే ఆ పార్టీలకు భవిష్యత్తుండదు ...

పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తున్న టిడిపి, వైకాపాకు తెలంగాణ వస్తే రాజకీయ భవిష్యత్తే ఉండదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు బాల్క సుమన్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని ఆ రెండు పార్టీలు అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. తెలంగాణపై వైఖరి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం కాదంటూనే.. ఇక్కడ కాదు, అక్కడే చెప్తామంటూ........

13, డిసెంబర్ 2012, గురువారం

రోదసీలోకి విమానాన్ని పంపలేమా?


రోదసిలోకి రాకెట్‌నే పంపాలా? విమానాన్నో, హెలికాప్టర్‌నో పంపలేమా?
- ఎన్‌. శివ, శాంతి ఎయిడెడ్‌ పాఠశాల, శాంతి ఆశ్రమం, కాకినాడ
విమానాలు, హెలికాప్టర్లు వంటి ఆకాశయాన వాహనాలు గాలిలో మాత్రమే ప్రయాణించగలవు. తమ రెక్కల ద్వారా లేదా చక్రాలకున్న రెక్కల్లాంటి ప్రొపెల్లర్‌ బ్లేడ్ల ద్వారా గాలిని ఓవైపు.........................................

యముడు వస్తున్నాడు

భూలోకంలోని ఓ ప్రాంత సమస్యను తీర్చేందుకు వచ్చిన యముని నేపథ్యంలో 'యముడు వస్తున్నాడు' (బీ కేర్‌ఫుల్‌) అనే చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దేవరపల్లి రావంత్‌ దర్శకుడు. ఎ. రాజుసాగర్‌ నిర్మాత. రావంత్‌, వరనిధి జంటగా నటిస్తుండగా యమునిగా వినోద్‌కుమార్‌, చిత్రగుప్తునిగా సారిక రామచంద్రరావు నటిస్తున్నారు. 'ఇది యమలోకం వెళ్ళే యమకథకాదు. భూలోకం.....

12, డిసెంబర్ 2012, బుధవారం

'రైల్‌ రాడార్‌' అప్లికేషన్‌ గురించి తెలుసా?

బెంగాల్‌ అసెంబ్లీలో గూండా రాజ్యం!

మంగళవారం నాడు నిండు సభలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాగిరికి తెగబడడంతో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ప్రతిష్ట నిలువునా మంటగలిసింది. ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారాలు చూపాల్సిన శాసనసభా వేదికను అధికారపక్ష గూండాలు రణవేదికగా మార్చాయి. వామపక్ష కూటమికి చెందిన సభ్యులపై పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్లజ్జగా, విచక్షణారహితంగా............

11, డిసెంబర్ 2012, మంగళవారం

జీన్స్‌ ధరిస్తే జరిమానా వేస్తారా?

ఇప్పటికే కుల దురహంకార హత్యలకు వేదికలుగా మారిన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో తాజాగా కాలేజీల యాజమాన్యాలే విద్యార్థినుల పట్ల వింత పోకడలను అవలంబిస్తున్నాయి. హర్యానాలోని భివానిలో కాలేజీ విద్యార్థినులు ఒకవేళ జీన్స్‌, టీ షర్ట్‌లు ధరించి కాలేజీకి వస్తే వారు రూ.100 జరిమానా చెల్లించాలి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో మరో రకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందే బాలికలు వాటిని అందుకునే కార్యక్రమానికి వచ్చేటపుడు జీన్స్‌లు ధరించరాదు, నలుపు దుస్తులు వేసుకోరాదు, ఆఖరికి ఆభరణాలు కూడా ధరించరాదని జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు కొంతమంది ముస్లిం నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముస్లిం....

దర్శకుడు కావాలనుకున్నా....

నా తర్వాతే చిరంజీవి!

''సినిమాల్లో డాన్స్‌లనేవి ప్రారంభించింది నేనే. నా తర్వాత డాన్స్‌ల్లో ఆరితేరిన వారు చిరంజీవి. ఆయన డాన్స్‌లు చేస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన పక్కన ఎంతటి కథానాయిక ఉన్నా ప్రేక్షకులు చిరంజీవి డాన్స్‌నే చూస్తారు కానీ అమ్మాయినిచూడరు. అసలు ఆయన బాడీ స్ప్రింగ్‌లా ఉంటుందా! అనే ఆశ్చర్యం కలుగుతుంది. డాన్స్‌లతోనే నెంబర్‌వన్‌గా ఎదిగారు. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళి టూరిజం డెవలప్‌మెంట్‌ బాధ్యతలను తీసుకున్నారని'' అక్కినేని నాగేశ్వరరావు అన్నారు......

6, డిసెంబర్ 2012, గురువారం

5, డిసెంబర్ 2012, బుధవారం

ఆ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో తస్మాత్‌ జాగత్త్ర..!

12-12-12-12-12-12..

4, డిసెంబర్ 2012, మంగళవారం

ట్విట్టర్‌ను ఇలా కూడా వాడొచ్చు...

దాదాపుగా కంప్యూటర్‌ వున్న వారందరికీ సామాజిక నెట్‌వర్క్‌లో అకౌంటు వుంటోంది. అయితే అత్యంత ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక సైట్లలో ట్విట్టర్‌ ఒకటి. వినియోగదారుల సందేశాల (ట్వీట్స్‌)ను పంపడానికి, చదవడానికి ఇది తోడ్పడుతుంది. ట్వీట్లలో 140 అక్షరాలను మాత్రమే రాయగలం. ట్విట్టర్‌ వినియోగదారుల సంక్షిప్త పేజీలోని ట్వీట్స్‌ను తమ స్నేహితులు, చందాదారులకు చేర్చుతుంది. ఆరంభంలో సందేశాలు సులువుగా చదువుకునేందుకు వీలుగా 140 అక్షరాల పరిమితి పెట్టారు.

3, డిసెంబర్ 2012, సోమవారం

' ఈ ' గేమ్స్‌ వదలరే !

కొంతమంది పిల్లలైతే, ఒకేసారి రెండు మూడు పరికరాలు కూడా వాడుతూ 10 గంటలపాటు గడిపేస్తున్నారట. గత అయిదేళ్ళలో పిల్లలు ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ పరికరాలు విరివిగా వాడుతున్నారు. వీడియో గేమ్‌లు ఈ తరం చిన్నారులను ఎక్కువగా ఆకర్షిస్తున్న వినోద సాధనం. పిల్లలు తమకు తెలియకుండానే దీనికి బానిసలవుతున్నారు. వాటిని చూస్తూ.. ఆడుతూ.. ఆ గేమ్స్‌లో లీనమవుతూ.. ప్రపంచాన్ని మరచి పోతున్నారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా వీడియో గేమ్స్‌కు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతోపాటు టీవీ కార్యక్రమాలు, సినిమాలు, మ్యూ.........