.

18, నవంబర్ 2012, ఆదివారం

సినిమా అంటే స్ట్రగుల్‌

డాక్టరు కావాలనుకుని యాక్టరయ్యే వాళ్ల గురించి తెలుసు. కానీ ఆయన డాక్టరై కావాలనే యాక్టరయ్యారు. పలు చిత్రాల్లో పలు పాత్రల్ని పోషించి జనాన్ని మెప్పించారు. పోలీస్‌ అధికారి పాత్రకు చిరునామాగా నిలిచారు. ఆయన మరెవరో కాదు రవిప్రకాష్‌. స్వశక్తితో సినీ ఇండిస్టీలోకి ప్రవేశించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న ఆయనతో ప్రజాశక్తి మాట్లాడింది. ఆ విశేషాలు, ఆయన చెప్పే సినిమా కబుర్లు మీకోసం....

అమెరికా అసలు బతుకు

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో కొనసాగుతున్న సార్వత్రిక సంక్షోభంలో భాగంగా 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దీనిని 2000 సంవత్సరంలోనే అంచనా వేసిన అరుదైన వ్యాసాల సమాహారం డి.పాపారావు రచించిన 'సమాధిలోకి సామ్రాజ్యవాదం'. సర్వసంపదలకు నిలయంగా తృతీయ, ద్వితీయ ప్రపంచ దేశాలు కలలు గనే అమెరికా అసలు బతుకును చిన్నచిన్న ఎనభై రెండు వ్యాసాలలో తెలుగు పాఠకుల కళ్ళకు కట్టినట్టు..........

17, నవంబర్ 2012, శనివారం

అమెరికాలో పెరిగిన నిరుద్యోగులు

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య శాండీ తుపాను తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయిందని అమెరికా కార్మిక శాఖ గురువారం తెలిపింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గత వారం బాగా పెరిగిందని తెలిపింది. నవంబరు 10తో ముగిసిన వారానికి నిరుద్యోగ భృతి అందుకుంటున్న వారి సంఖ్య 4,39,000కి చేరింది. కాగా అంతకుముందు వారం ఈ సంఖ్య కేవలం 78,000గానే వుంది. గత 18 మాసాల్లోనే ఇది అత్యంత ఎక్కువని పేర్కొంది. వారం వారం ప్రాతిపదికన చూస్తే కాస్త ఒడిదుడుకులున్నప్పటికీ గత నాలుగు వారాల సగటుతో చూస్తే ఇప్పుడు ఒక్కసారిగా .......

11, నవంబర్ 2012, ఆదివారం

ఈ పిల్లాడికి పెళ్లవుతుందా?

కొడుకు పుట్టాల కొరివి పెట్టాలనే ఛాందస భావాలు చివరకు ఆ కుమారులకు పెళ్లి కావటం పెద్ద సమస్యగా మార్చాయి. ఇంతకు ముందు ఈ పిల్లకు పెళ్లవుతుందా అని చింత పడిన తలిదండ్రులు ఇప్పుడు ఈ పిల్లాడికి పిల్లనెక్కడి నుంచి తేవాలని తలలు పట్టుకుంటున్నారు. ఉన్న ఆసియాలోని అనేక దేశాలలో ఇప్పుడు పెళ్లి కుమార్తెలకు కొరత ఏర్పడింది. దాంతో పెళ్లి కుమార్తెలను అపహరించటం, దొంగతనంగా తీసుకురావటంతో పాటు, దిగుమతి భారీగా పెరిగింది. అది ఒక అంతర్జాతీయ వాణిజ్యంగా మారిపోయిందని దక్షిణ కొరియాలోని శాంసంగ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ .......

4, నవంబర్ 2012, ఆదివారం

నూరేళ్ల సమర స్ఫూర్తి


సమర్‌ ముఖర్జీ! మార్క్సిస్టు పార్టీ కురువృద్ధ నేత. మరి రెండు రోజుల్లో నూరవ వసంతంలోకి అడుగెట్టబోతున్నారు. నిండు నూరేళ్ల జీవితంలో ఎన్ని పోరాటాలు! ఎన్నెన్ని సాహసకృత్యాలు! ఎన్నెన్ని విజయాలు! ఎన్నేసి నిర్బంధాలు-నిషేధాలు! ఎన్నేసి త్యాగాలు! అన్నీ పీడిత తాడిత ప్రజానీకం కోసమే. తనకంటూ ఏమీ ఆశించలేదు. ఆఖరి వరకు బ్రహ్మచారిగానే వుండిపోయారు. ఒక్కసారి ఆయన జీవితపుటలను వెనక్కి తిరగేస్తే బహుముఖాలు దర్శనమిస్తాయి. ఆయనలోని ఓ ఆందోళనకారుడు, సమరశీలుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, శాంతి కాముకుడు, ప్రజాహితైషి మనకు గోచరిస్తాడు........

3, నవంబర్ 2012, శనివారం

2, నవంబర్ 2012, శుక్రవారం

తేరుకుంటున్న అమెరికా

టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం


 టీడీపీ సీనియర్ నేత పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం ఆయిల్ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నాయకులు ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు......