19, సెప్టెంబర్ 2011, సోమవారం

దూకుడు VS ఊసరవెల్లి

 నేటి యువ హీరోల్లో మహేష్‌బాబు, ఎన్టీఆర్‌కు యువతలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ విషయంలో ఎన్టీఆర్‌ కాస్త ముందున్నారు. చివరిసారి మహేష్‌ నటించిన 'ఖలేజా', ఎన్టీఆర్‌ 'బృందావనం' ఒకే సమయానికి విడుదలై, పోటీ పడ్డాయి. ఇప్పుడు తాజాగా మరోమారు తెరపై పోటీపడుతున్నారు. వీరద్దరూనటించిన 'దూకుడు', 'ఊసరవెల్లి' ఒక వారం తేడాలో వస్తున్నాయి. దూకుడు ఈనెల 23న రిలీజ్‌ అవుతోంది. దసరాకి ఊసరవెల్లి రానుంది.........

వచ్చాడు... పోయాడు !

హీరోయిన్‌...ఒక విలన్‌. కథానాయికను విలన్‌ ఎత్తుకెళతాడు. దాచేస్తాడు. హీరో అన్వేషణ సాగిస్తాడు. విలన్‌ గుట్టు కనుగొంటాడు. ఓ పట్టుపట్టి విలన్‌ను పడగొడతాడు. కానీ 'వచ్చాడు గెలిచాడు' దర్శకుడు అంతా రివర్స్‌గేర్‌లో నడిచాడు. ముందు క్లైమాక్స్‌ అనుకొని, ఆ తర్వాత కథ అల్లుకున్నట్టుంది ! కేవలం పతాక సన్నివేశంలో వచ్చే మలుపు (ట్విస్ట్‌) ఆధారంగా ప్రేక్షకుల్ని రెండు గంటలు కూర్చొబెట్టాలని దర్శకుడు కన్నన్‌ భావించాడు......

వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ధ్వంసం

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాలుగు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోపోద్రిక్తులై ఆదివారం నిరసనలు, ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. జూపాడుబంగ్లా, నందికొట్కూరు, బ్రహ్మణకొట్కూరు, గార్గేయపురంలో ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన మూడు వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేశారు ...........