.

30, జూన్ 2011, గురువారం

తెలంగాణా ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు

విత్తన సమస్యలు ... ప్రమాద ఘంటికలు..

'విత్తనం' క్రోడీకరించిన సంక్షిప్త సాంకేతికం. హైబ్రీడ్‌ విత్తనాలను రైతులకందించటం, నియంత్రించడం కంపెనీలకు చాలా తేలిక, లాభదాయకం. వ్యవసాయోత్పత్తిలో అన్ని సాంకేతికాల వినియోగ సామర్థ్యాన్ని ఇదే గరిష్ట స్థాయిలో నిర్ధారిస్తుంది. ఇలాంటి కీలక ఉత్పాదకంపై ఎవరికి ఆధిపత్యం ఉంటే వారే వ్యవసాయరంగాన్ని, రైతుల బాగోగుల్ని శాసిస్తారు. ఇంత ప్రాధాన్యత గల రంగం నుండి ప్రభుత్వం తన, తన సంస్థల పాత్రను నామమాత్రం చేస్తుంది. కొత్త విత్తన విధానం..........................................................

'సృజనాత్మకతను ప్రోత్సహించాలి'

ప్రముఖ దర్శకనిర్మాత విబి రాజేంద్రప్రసాద్‌ మనువరాలు పూజాప్రసాద్‌ ఆలపించిన 'పూజా స్వరాలు' ఆడియో విడుదల ఫిలింనగర్‌లో దైవసన్నిదానంలో జరిగింది. కేంద్రమంత్రి పురందరేశ్వరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈమధ్యకాలంలో పిల్లలు ఏ కాస్త సమయం దొరికినా టీవీలకో, కంప్యూటర్లకో అతుక్కుపోతున్న తరుణంలో తాను సంగీతం..............................

దమనకాండ


గ్రీసు పోలీసులు బుధవారం ఏథెన్స్‌లో నిరసనకారులపై దమనకాండ జరిపారు. ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేసే పొదుపు చర్యల ప్యాకేజీపై ఎంపీలు చర్చ జరుపుతుండగా పార్లమెంటు వెలుపల ఉన్న బారికేడ్లను దాటుకొని వచ్చేందుకు నిరసనకారులు ప్రయత్నించగా వారిని అడ్డుకొనేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. అనేక వేల మంది నిరసనకారులు బ్యానర్లు ఊపుతూ, డ్రమ్ములు మోగిస్తూ పార్లమెంటు వెలుపల ఉన్న సింటాగ్మా స్క్వేర్‌లో గుమిగూడారు.................................

చిరంజీవివి పగటి కలలు : చంద్రబాబు

జనంపై 'జోక్‌'పాల్‌!

29, జూన్ 2011, బుధవారం

ఆడా...? మగా...? నిర్ణయించే దెవరు

రేపు హైస్పీడ్‌ రైలు ప్రారంభం

చైనా ఇంజనీర్లకు బ్రహ్మాండమైన మౌలిక వసతుల ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం 39 మాసాలు మాత్రమే పట్టింది. 3,300 కోట్ల డాలర్ల వ్యయంతో దేశ రాజధాని బీజింగ్‌ నుంచి ఆర్థిక కేంద్రం షాంఘైకి (1,318 కి.మీ దూరం) హైస్పీడ్‌ రైలు మార్గాన్ని వారు అంత తక్కువ కాలంలో నిర్మించారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే ఆ రైలు గురువారం ఉదయం బీజింగ్‌లోని.......................

వనకన్య - వండర్‌వీరుడు

ఆర్తి అగర్వాల్‌ ఓ సోషియో ఫాంటసీ కథనంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రం పేరు 'వనకన్య-వండర్‌వీరుడు'. ఇందులో వనకన్యగా ఆర్తి నటిస్తోంది. శ్రీరాఘవేంద్ర ఫిలింస్‌ పతాకంపై జాలాది శివశంకర్‌ చౌదరి నిర్మిస్తున్నారు. శివనాగు దర్శకత్వం వహించారు. ఒక్కపాట మినహా షూటింగ్‌ పూర్తయింది. సోషియో ఫాంటసీ కథనానికి అనుగుణమైన గ్రాఫిక్స్‌ థ్రిల్‌ కలిగిస్తాయని దర్శకుడు తెలియజేశారు.....

ముఖ్యమంత్రినవుతా : చిరంజీవి

ఒత్తిడిలో భారత మహిళ

హాట్‌ స్పాట్‌ అంటే...

28, జూన్ 2011, మంగళవారం

అతివలకు అన్యాయం చేసిన అమెరికా కోర్టు తీర్పు

మోకాళ్ల నొప్పులన్నింటికి సర్జరీయేనా?

ఒకప్పుడు ఏ 60 ఏళ్లలో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు40 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ఈ తరహా నొప్పుల్లో 80 శాతం దాకా ఆర్థరైటిస్‌ సమస్యలే. ఒకప్పుడు దాదాపు వృత్తులన్నింటిలోనూ శారరీక శ్రమ ఒక భాగంగా ఉండేది. అందుకే పాత తరం వారిలో 40ఏళ్లకి మోకాళ్ల నొప్పులు రావడం అన్నది చాలా అరుదు. కీలు మార్పిడి చికిత్స నడకలో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోంది. కీళ్లనొప్పుల దశలు, కీళ్లమార్పిడి శస్త్రచికిత్స, అపోహల గురించి తెలుసుకుందాం.................

'దిల్‌ కబడ్డీ' ప్రారంభం

ఉదరుకిరణ్‌ కొత్త చిత్రం 'దిల్‌ కబడ్డీ' సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నెట్టికంటి ఆంజనేయస్వామి పతాకంపై వి.శివకుమార్‌ నిర్మిస్తున్నారు. శ్రీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. జాస్మిన్‌ కథానాయిక. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నందమూరి మోహనకృష్ణ క్లాప్‌ ఇచ్చారు. మురళీమోహన్‌ గౌరవ దర్శకత్వం వహించారు........................................

టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా?

చరిత్రే సర్వస్వం చైనా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి ప్రభుత్వ అభివృద్ధిపై జింగ్‌గాంగ్‌షాన్‌ కేడర్‌ అకాడమీ ఆఫ్‌ చైనా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ సియావోసాన్‌ ఒక వ్యాసం రచించారు. 'పీపుల్స్‌ డైలీ' ఆన్‌లైన్‌లో తర్జుమా చేసి ఉంచిన ఈ వ్యాసం సంక్షిప్తంగా...'చరిత్రే మనకు సర్వస్వం' అని ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ ఒకసారి అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 90 ఏళ్ళ చరిత్ర ఆదేశ విప్లవ చరిత్రకు, తలవంచని దేశ నిర్మాణ చరిత్రకు, సంస్కరణల అజేయ చరిత్రకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఇది వాస్తవికతకు అన్వయించగలిగిన శక్తివంతమైన శక్తికి, చైనా..............

పచ్చి మిరపకాయ్ కథ

నమిత తెలుగు ప్రేక్షకులకు పచ్చి మిరపకారు తినిపించబోతోంది. దాని వేడి, ఘాటు ఎలా ఉంటుందో తెరమీదకానీ చూడలేం. ఆ లోపు ఆ చిత్ర సంగతులేంటో తెలుసుకుందాం...తమిళంలో నమిత నటించిన ఓ చిత్రాన్ని 'పచ్చి మిరపకాయ్' పేరుతో తెలుగులో ఒన్‌విజన్‌ మీడియా బ్యానర్‌పై జి.సోమేశ్వరరెడ్డి, వి.ఆర్‌.ఆర్‌. సంయుక్తంగా అనువదిస్తున్నారు.....

నటుడిగా గుర్తిస్తున్నారు...

'నాకు ఈ కథ గురించి మొదట చెప్పింది నటుడు ఆర్య. తను నా పుట్టిన రోజు పార్టీకి వచ్చినప్పుడు...'బాలా సార్‌ దగ్గర ఓ మంచి కథ ఉంది. మనిద్దరం కలిసి చేద్దామా !' అని అడిగాడు. బాలా సినిమాలో చేసే అవకాశం వస్తుందంటే వదులుకుంటానా ! అందుకే కథ గురించి ఏ మాత్రమూ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాను' అని అంటున్న వీడు నటుడు విశాల్‌. తాజా చిత్రం 'వాడు-వీడు'తో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు........

27, జూన్ 2011, సోమవారం

జస్ట్‌ ట్వంటీఫోరే..!

ఫెదరర్‌ని కలిసి మాస్టర్‌

సున్నం బట్టిల్లో వెట్టి బతుకులు ...


యజమానుల మధ్య లాభాల పోటీ... సున్నపు బట్టీ కార్మికుల పొట్టగొడుతోంది. బట్టీలనే నమ్ముకొన్న బడుగుజీవుల వెట్టి చాకిరీకి కారణమవుతోంది. పట్టించుకోని ప్రభుత్వ వైనం... యాజమాన్యపు నిర్లక్ష్యం వెరసి...కష్ట జీవుల బతుకుల్ని రోడ్డుపాలు జేస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే... ఉన్నపని కూడా ఊడబీకి ఉపాధికి దూరం చేస్తోంది. కాలే కడుపుల మంటలతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మికులపై ఖాకీ లాఠీ కరాళ నృత్యం చేస్తోంది. కార్మికుల బాగోగుల గురించి ప్రగల్బాలు పలికే కార్మికశాఖ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం కళ్లు కనబడనట్లు నటిస్తోంది. సమస్యలపై స్పందించాల్సిన సర్కారు... తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇదీ...............................

చరిత్రపై చలనచిత్రం

ఆముగ్గురు...

సమాచార సాంకేతిక రంగం నేడు ఎంతగానో ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ఇందుకు రెండు ముఖ్యమైన పరిశోధనలే కారణం. ప్రారంభదశలో మెకానికల్‌ పరికరాలతో గణాంక యంత్రాలు తయారుచేయబడగా, తరువాత కాలంలో వ్యాక్యూమ్‌ ట్యూబులు, ట్రాన్సిస్టర్లను ఉపయోగించ సాగారు. గతంలో కంప్యూటర్లు పెద్దపెద్ద గదులను ఆక్రమించేవి. కిలోవాట్లకొద్ది విద్యుత్‌ని ఖర్చు చేసేవి. ఆ స్థాయి నుంచి డెస్క్‌టాప్‌లు, పామ్‌టాప్‌ల రూపానికి మారడానికి వీలు కల్పించింది 'ఇంటిగ్రేటెడ్‌ చిప్‌'.....................

'ఆమె'ను వద్దనుకుంటే యుద్ధాలే

బాబా 'ఆంతరంగిక' సందేశం

26, జూన్ 2011, ఆదివారం

దక్షిణాది కథలకు ఉత్తరాన క్రేజు

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న హిందీ చిత్రాలు ఏవైనా చూశారా? 'గజినీ', 'వాంటెడ్‌', 'రెడీ' - ఇలా ఏ చిత్రం చూసినా ఈ కథ మనకు తెలిసిందే, మనం తెరపై చూసిందేనే అని ఆశ్చర్యం కలుగుతోందా? ఆ ఆశ్చర్యానికి కారణం ఒక్కటే! ఇవాళ అనేక తెలుగు, తమిళ చిత్రాలు హిందీలోకి రీమేకవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో మన దక్షిణాది చిత్ర కథలు అనేకం హిందీ తెరపైనా విజయ ఢంకా మోగిస్తూ, వసూళ్ళ.........

అమెరికా మీడియా పక్షపాతం

మానవ హక్కులను గురించి నంగనాచి కబుర్లు చెప్పే అమెరికాలో మీడియా ఎంత పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందో క్యూబా-5 (అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు క్యూబా ఉగ్రవాద నిరోధక కార్యకర్తలను క్యూబా-5గా పిలుస్తారు) కేసును సెన్సార్‌ చేసిన విషయం వెల్లడిస్తోంది. ఈ విషయాన్ని వారికి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇంటర్నేషనల్‌ కమిటీ ఫర్‌ ది ఫ్రీడం ఆఫ్‌ ది క్యూబన్‌-5 ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ఐదుగురిలో ఒకరైన గెరార్డో హెర్నాండెజ్‌..................................

నెత్తు'రోడ్డు'తోంది!

అవి వాహనాలు కావు! మృత్యు శకటాలు! వాటి మూలంగా కన్నవారికి బిడ్డలు మిగలడంలేదు. బిడ్డలకు తల్లిదండ్రులు దక్కడంలేదు. కొత్త పెళ్లి కూతురుకు పెళ్లికొడుకు దూరమౌతున్నాడు. చివరికి ఆ పెళ్లికి అక్షింతలు వేయడానికి, మంగళ వాయిద్యాలు వాయించడానికి వచ్చిన బంధువులూ, బ్యాండుమేళంవారూ దూరమౌతున్నారు. రోడ్లమీద మృత్యుశకటాల మరణమృదంగంతో నిత్యం ఎక్కడోచోట రక్త తర్పణం జరుగుతూనే వుంది. అనియంత్రిత వేగం............................

బట్టబయలైన ప్రధాని బండారం

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయనందున అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జి) ఇటీవల తీసుకున్న నిర్ణయం వల్ల అధునాతనమైన అణు సాంకేతిక పరిజ్ఞానం మనకు అందబోదని సిపిఐ(ఎం) తెలిపింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యురేనియాన్ని శుద్ధిచేసే, రీప్రాసెసింగ్‌ చేసే పరికరాలు..........

ఒబామాకు ఎదురుదెబ్బ

25, జూన్ 2011, శనివారం

తనయుని కోసం ప్లాట్‌ కొన్న సచిన్‌

ఎన్నాళ్లీ విశ్వాసఘాతుకం

వైజాగ్‌లో...ఇట్స్‌ మై లవ్‌స్టోరీ

10 లక్షల మందితో తెహ్రీర్‌ స్క్వేర్‌కు మళ్లీ వస్తాం

ఈజిప్టులోని పాలక సైనిక జనరల్స్‌ ప్రజాస్వామ్యానికి మారేందుకుద్దేశించిన తమ ప్రస్తుత రోడ్‌మ్యాప్‌ను ఉపసంహరించుకోకపోతే తాము జులై 8న మళ్ళీ తెహ్రీర్‌ స్క్వేర్‌కు పది లక్షల మందిని తెచ్చి ప్రజాతంత్ర నిరసనలు ప్రారంభిస్తామని ఆ దేశ కార్యకర్తలు హెచ్చరించారు. అధికారం కోసం ఈజిప్టులోని ఇస్లామిస్టు, లౌకిక రాజకీయ శక్తుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం కావడంతో సెప్టెంబర్‌లో నిర్వహించతలపెట్టిన ఎన్నికలను ఆపేయాలని డిమాండుచేస్తూ 40 మితవాద, వామపక్ష ఉద్యమాలు ఏకమయ్యాయి. ప్రస్తుతమున్న ముబారక్‌ అనంతర మార్పు.....................

పాక్‌లో లాడెన్‌ విస్తృత నెట్‌వర్క్‌ : ఆధారాలందించిన సెల్‌ఫోన్‌

'లగడపాటి డర్టీ ఫెలో... ధన, కులాహంకారం'

24, జూన్ 2011, శుక్రవారం

చిరంజీవికి కేంద్ర నౌకాయానం?

త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి పదవి ఇచ్చి సరిపెట్టనున్నట్లు తెలిసింది. చిరంజీవి మాత్రం ప్రజలకు చేరువగా ఉండే మంత్రి పదవి ఏదైనా ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. రైల్వే, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుబట్టినా అధిష్టానం తిరస్కరించినట్లు.........

హిట్లర్‌కు పశ్చిమ దేశాల ప్రోద్బలం : కుట్రను వెల్లడించిన రహస్య పత్రాలు

టెన్షన్‌... టెన్షన్‌!

రజనీకి చిరు పరామర్శ

23, జూన్ 2011, గురువారం

పాము పగబట్టదా..?!

మనసు మాట

మానవ శరీరంలో రెండు వ్యవస్థలుంటాయి. మొదటిది శరీరం, రెండవది మనసు. మానసిక వ్యవస్థకు కేంద్రం మనిషి మెదడు. విచిత్రమేమిటంటే తొంభై ఎనిమిది శాతం పరిమాణమున్న శరీరాన్ని శాసించేది కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న మెదడు. మానవ శరీరం, మెదడుల నడుమ సమన్వయం, సహకారం ఉంటాయి కాబట్టి మానవ శక్తి సద్వినియోగపడుతోంది. మెదడు కన్పిస్తుంది. మనసు కన్పించదు. మరి దానిని గుర్తించడమెలా? మనసు అనేది ఒక భావ పరంపర. ఆలోచనలు, సంకల్పం వంటివి మనసు.....................................

అభివృద్ధి చేయకపోతే తిరిగివ్వండి

మహిళాభివృద్ధి .. ఆటంకాలు..

శారీరక పరిమితులు, సాంఘిక కట్టుబాట్లు, ఆర్థిక అసమానతలను అధిగమించి భారత మహిళలు నేటికి ఎంతో అభివృద్ధిని సాధించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా తల్లిదండ్రుల కర్మకాండలను చేయడం దగ్గర నుంచి అంతరిక్షంలో ఎగిరేంత వరకూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. వీరి భాగస్వామ్యం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ స్థానిక పాలన భాగస్వామ్యం నుండి అత్యంత ఉన్నతస్థాయి.. దేశాధ్యక్ష పదవికి ఎదిగారు. ఈ ఎదుగుదలకు మూలాధారం ప్రజాతంత్రశక్తులు స్వాతంత్య్ర పోరాటం ద్వారా సాధించిన విజయం,.........................

సినిమా తీయడమే తెలుసు

ఆదర్శ విద్యా గ్రామాలకు ఆదరణ


నిజామాబాద్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి మా పర్యటన అనుభవాలను చెప్పి ప్రజలు మేలైన విద్య ప్రభుత్వ రంగంలో వస్తుందని భావిస్తున్నారని, వారు కోరుకునే ఇంగ్లీషు విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ప్రయివేటు పాఠశాలలకు వెళ్ళరని చెప్పాము. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివిస్తామని ధైర్యంగా ముందుకు వచ్చిన గ్రామ ప్రజలకు సంపూర్ణ సహకారం...........................

2012 'మహాప్రళయం' ఆధారాలు దొరికాయంట నిజమేనా?

ప్రణబ్‌ కార్యాలయంలో గూఢచర్యం

తన ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో గూఢచర్యం జరిగిందని, ఈ ఘటనలపై రహస్య దర్యాప్తుకు తాను ఆదేశించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ఇప్పటికే లోక్‌పాల్‌ బిల్లుపై వివాదంలో చిక్కుకున్న మన్మోహన్‌ సర్కారుకు సీనియర్‌ మంత్రి ప్రణబ్‌ కార్యాలయాల్లో గూఢచర్యం వివాదం తాజాగా చుట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అతికించేందుకు.......

22, జూన్ 2011, బుధవారం

రామ్‌దేవ్‌, అన్నాహజారే, చిరంజీవి, వైయస్‌.జగన్‌ పాత్రలతో : వర్మ...కుర్చీ

నాలుగున్నరేళ్లుగా మౌనమెందుకు ?

కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి కెజి బేసిన్‌లో రిలయన్స్‌ అక్రమాలను కప్పిపుచ్చేలా వ్యవహరిస్తున్నారని సిపిఎం ఎంపీ, చమురు వ్యవహారాల స్థాయీ సంఘం సభ్యుడు తపన్‌సేన్‌ విమర్శించారు. కెజి బేసిన్‌ డి-6 బ్లాకులో రిలయన్స్‌ కృత్రిమంగా ఉత్పత్తి వ్యయాన్ని పెంచిందని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిందని కాగ్‌ తన ప్రాథమిక నివేదికలో...........

పోస్కోపై యుపిఎ ద్వంద్వ వైఖరి

పోస్కో ప్రాజెక్టుకు అటవీపరమైన అనుమతి మంజూరు చెయ్యడమే వివాదాస్పదం. అందులో ఎన్నో లోపాలు, అవకతవకలున్నాయి. భూ సేకరణ వేగవంతంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యం నిర్వహించింది. అప్రజాస్వామికంగా వ్యవహరించి అభ్యంతరాలను విస్మరించి వ్యవహరించింది. విస్తృత వ్యూహంలో అంతర్భాగంగానే పోస్కో ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. ఖనిజాల ఆధారిత పరిశ్రమల్లో పెద్ద ప్రాజెక్టులకు పర్యావరణపరమైన నిబంధనలను సడలించే వ్యూహం ఇందులో దాగి ఉంది....................

సిక్స్‌ప్యాక్‌ మానసిక దృఢత్వంతో ఉన్నా : బిగ్‌ బి


ఇప్పుడంతా సిక్స్‌ప్యాక్‌ ఫీవర్‌ నడుస్తోంది. జనాల్లో కన్నా, సినిమా కథానాయకులకు చాలా ప్రాధాన్యనతగల అంశం ఈ సిక్స్‌ప్యాక్‌ శరీరధారుఢ్యం. దీనిపై బిగ్‌బి అమితాబ్‌ తనదైన శైలిలో స్పందించాడు. అదేంటంటే...'శారీరక దృఢత్వం ఉండాలన్న ఫీలింగ్‌ సరైందే. అందరికీ అవసరం. అయితే సిక్స్‌ప్యాక్‌ ఫిజిక్‌ కోసం అందరూ తాపత్రయపడటం మంచిది కాదు. కొంతమంది.............................

ప్రశాంతి నిలయంలో అశాంతి

సత్యసాయి బాబా మంచి నీటి పథకం, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, యూనివర్సిటీ, కాలేజీలను స్థాపించి, ప్రజల నుండి సేకరించిన డబ్బును తిరిగి ప్రజలకే ఖర్చు చేసి సమాజ సేవ చేశారని చెబుతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వారు చాలా మంది వున్నా, బాబా సేవ నిస్సందేహంగా శ్లాఘనీయమే. కానీ ప్రజల నుండి విరాళాలుగా ఎంత తీసుకున్నారు, తిరిగి ప్రజలకెంత ఇచ్చారనేదే లక్షా ముప్ఫైవేల కోట్ల ప్రశ్న....

'గురు'విందలు : చెప్పేది ఆధ్మాత్మికం...చేసేది వ్యాపారం * కోట్లాది రూపాయల వాణిజ్య సామ్రాజ్యం

ఇటీవలి కాలంలో మతం మంచి వ్యాపార వస్తువుగా మారింది. ఆధ్యాత్మిక గురువులు ఆధునిక వ్యాపారులుగా మారిపోయారు. ఈమధ్య అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోగా గురు బాబా రామ్‌దేవ్‌ 'హేట్‌ లిస్ట్‌' (ద్వేషించే వారి జాబితా)ను పరిశీలిస్తే అందులో అవినీతి రాజకీయ నేతలు (వారిని ఉరి తీయాలంటాడు), స్వలింగ సంపర్కులు (అదొక వ్యాధి, దానిని నయం..............

21, జూన్ 2011, మంగళవారం

అందాలను అరువు తెచ్చుకుని వెండితెర మీద వెలిగిపోతున్న తారాతోరణం

 


వెండి తెర మీద వెలిగిపోతున్న సినీ తారలను చూచి 'అబ్బ... ఎంత అందంగా వున్నారు?!' అనుకుంటాం. అలా అంత అందంగా కనబడడానికి వారు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. అవసరమైతే... మమోప్లాస్టీ, రినోప్లాస్టీ ... వంటివి చేయించుకుంటారు. ముక్కు లోపాలను సరిదిద్దడానికి రినోప్లాస్టీ చేస్తారు. అంటే ముక్కు బాగా పొడవుగా వుండడం........

సత్యసాయి బాబా ట్రస్టు సూత్రధారులెవరు?

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టుకు సంబంధించిన రూ.35,53,000 నగదును తరలించడం వెనుక సూత్రధారులెవరన్నది చర్చనీయాంశమైంది. దీని వెనుక మరో కీలక వ్యక్తి ఉన్నారని పోలీసులు చెబుతున్నప్పటికీ అతడి పేరును బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదు. డబ్బు పట్టుబడినప్పటి నుంచి పై స్థాయి నుంచి పోలీసులపై ఒత్తిళ్లు పెరగడంతో సూత్రధారి పేరును బయటపెట్టేందుకు వెనుకాడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. డబ్బు తరలిస్తూ పట్టుబడిన సోహన్‌శెట్టి, ట్రస్టు......................

సత్యసాయి పుట్టిన రోజున విడుదల చేస్తాం


పుట్టపర్తి సత్యసాయి బాబా జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ 'బాబా సాయిబాబా' చిత్రాన్ని రూపొందించ డానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, పుట్టపర్తిలోని సత్యసాయి ట్రస్ట్‌ సభ్యుల్ని కలిసి, కొన్ని విషయాల్ని తెలుసుకోవాలని దర్శకుడు కోడిరామకృష్ణ భావించారు. అందుకోసం ట్రస్ట్‌ సభ్యులతో చర్చిండానికి దర్శకుడు కోడిరామకృష్ణ, నిర్మాత.............................


జైల్లోనూ రాచ మర్యాదలే!

ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి జైలుకు వచ్చినా వారు తమ రాచఠీవిని, రాచ మర్యాదలను ఎక్కడా మర్చిపోలేదు. ఒకప్పుడు చిన్న పిల్లల జైలుగా వున్న తీహార్‌ జైలు ఇప్పుడు విఐపి స్థాయికెదిగింది. కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణా మండలి మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీ, 2జి కేసులో నిందితురాలైన డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కణిమోజి ఇప్పుడు ఈ జైలుకు విశిష్ట అతిధులు (విఐపిలు). బయట వున్నపుడు తమకు సహజంగా లభించే రాచమర్యాదలనే వీరు ఇక్కడ కూడా అందుకుంటున్నారు. వివిధ జైళ్లలో వున్న విఐపిలకు ప్రత్యేక మర్యాదలు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుండి తమకు ఆదేశాలు వచ్చినందునే.........................

నిజమే

తాము ఒక ఇంటిని ధ్వంసం చేసినట్లు నాటో అంగీకరించింది. ఆ ఇంటిపై నాటో జరిపిన దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు లిబియా అధికారులు చెప్పారు. లిబియాలో తన మిషన్‌పై ఆ కూటమిలో అంతర్గతంగా కొత్త అనుమానాలకు ఈ సంఘటన బీజం వేసింది. నాటో బాంబు దాడుల్లో అనేక మంది పౌరులు మరణిస్తున్నారనడానికి ఇది స్పష్టమైన తార్కాణంగా ఉంది. ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం, వనరులు తీసుకుంటున్నట్లు ఇప్పటికే నాటో మిత్ర.......................

టీవీ చూస్తే వినోదం కాదు వ్యాధులొస్తాయి..?

మనం టీవీ ఎందుకు చూస్తాం. వినోదం కోసం. వార్తా విశేషాల కోసం. పిల్లలైతే కార్టూన్‌ షోలు, పిల్లల కార్యక్రమాలకు అంకితమవుతారు. ఇక మహిళలైతే గాలి లేకుండా బతగ్గలరు కానీ సీరియల్స్‌ లేకుండా ఉండలేరు. ఇది ప్రస్తుతమున్న పరిస్థితి. అందరికీ ఒక షాకింగ్‌ న్యూస్‌.. రోజూ రెండు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూస్తే టైప్‌-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు వచ్చే ప్రమాదం అధికమని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.......................

నేడు పగటి పొద్దు ఎక్కువ

గ్రహాల భ్రమణ, పరిభ్రమణ క్రమంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా మంగళవారం పగటి పొద్దు ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో పగటి సమయం ఎక్కవగా ఉన్న రోజుగా మంగళవారం నిలుస్తుంది. వేసవి అనంతరం సంభవించే ఈ పరిణామాన్ని 'సమ్మర్‌ సొలిస్టిస్‌'గా ఖగోళ శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు. ఇందులో సొలిస్టిర్‌ అనే పదం సోల్‌ (సూర్యుడు) సిస్టిర్‌...........................

కోట్ల డాలర్ల గల్లంతు

2003 దురాక్రమణ అనంతరం ఇరాక్‌ అభివృద్ధి నిధి (డిఎఫ్‌ఐ) నుంచి తీసుకున్న ఇరాక్‌ చమురు డబ్బు గల్లంతైనట్లు ఆ దేశ పార్లమెంటు వెల్లడించింది. ఆ డబ్బును సద్దాం హుస్సేన్‌ను కూల్చివేసిన అనంతరం పునర్నిర్మాణానికి ఉపయోగించేందుకు అమెరికా నుంచి తెచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో కనుగొనేందుకు ఐరాస సాయం కోరింది. 2004లో ఇరాక్‌ అభివృద్ధి నిధి నుంచి తీసుకున్న చమురు డబ్బును కనుగొనేందుకు సహాయం చేయాలని .......

మాస్టారి పాఠాలు ...

20, జూన్ 2011, సోమవారం

లగడపాటీ... రెచ్చగొట్టకు

విజయవాడ ఎంపి లగడపాటి రాజ్‌గోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మతాలకతీతంగా ప్రజలంతా రాష్ట్ర రాజధానిలో కలిసి మెలిసి ఉంటే లగడపాటి రాజ్‌గోపాల్‌ లాంటివారు తెలంగాణ ఏర్పడితే మతకలహాలు చెలరేగుతాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లగడపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, దయచేసి తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. లగడపాటి తెలంగాణను అవమానపరుస్తూ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి హనుమంతరావు మండిపడ్డారు........

తెలగులో అనువాద చిత్రాలకు అరవై ఏళ్లు .......

సాహిత్య రంగంలోనైనా, సినిమా రంగంలోనైనా అనువాదం ఓ అపురూపమైన ప్రయత్నం. ఒక ప్రాంతానికీ, ఒక భాషకూ చెందిన విషయాలనూ, విశేషాలనూ, ఆలోచనా ధోరణినీ మరొక ప్రాంతానికీ, భాషకూ అందించి, మానసిక పరిధిని విస్తరింపజేయడంలో అనువాదం పోషించే పాత్ర నిరుపమానం. అందుకే, ఎవరు ఏమనుకున్నా అనువాదం ఓ ప్రత్యేక కళ, దానిది ఓ ప్రత్యేక స్థానం. తెలుగు సినిమాకు సంబంధించి.......

సేఫ్‌ బెట్‌...దూకుడు

అమెరికాలో పెరుగుతున్న రసాయన ఆత్మహత్యలు

రసాయన ఆత్మ హత్యలు ఇటీవల కాలంలో అమెరికాలో బాగా పెరిగిపోతు న్నాయి. జపాన్‌లో అయితే ఇవి చాలా సాధారణమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మూసిఉన్న ప్రాంతాల్లో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ అనే విష వాయువును పీల్చడం ద్వారా సుమారు రెండు వేల మంది మృత్యువాత పడినట్లు పోలీసులు అంగీకరిస్తున్నారు. రసాయన మిశ్రమాలు, వాటిని ఉపయోగించే విధానాలపై వివిధ వెబ్‌సైట్‌లు అందించే సమాచారానికి ప్రభావితమై వీరంతా..........................

ప్రజలను కాల్చుకు తింటోంది

దేశ ప్రజలపై నానాటికి పెరుగుతున్న రుణ, పన్నుల భారాలకు కారణమైన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ రాజధాని ఏథెన్స్‌ నగరంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. దేశం అప్పుల ఊబిలో కూరుకు పోకుండా నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యయకర్తన, పన్నుల పెంపుదల వంటి చర్యలను నిరసిస్తూ జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపు 5 వేల మంది పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేశారు. పార్లమెంట్‌ వరకూ జరిగిన ఈ ప్రదర్శనకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేత అలెక్స్‌ పపారిగా నేతృత్వం వహించారు. ప్రభుత్వం రుణదాతలతో కుమ్మక్కయి ప్రజలను 'కాల్చుకు తింటోంద'ని ఆయన విమర్శించారు. అయితే...........................................

నిర్మాతగా తెరవెనక కొత్త పాత్ర ...

సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా మరో కొత్త పాత్ర పోషించబోతోంది. తెరమీద కాదు. నిర్మాతగా తెరవెనుక. కొత్త కథలను సినిమాలుగా మలచాలని కలలు కంటోంది. కథానాయికలు నిర్మాతలుగా మారటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు దియామీర్జా, లారాదత్తా, అమీషా పటేల్‌... నిర్మాణరంగంలో కాలుమోపినవారే. ఐపిఎల్‌తో వ్యాపార రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్న..........

గ్లామర్‌కు, యాక్షన్‌కు సమపాధ్రాన్యతనిస్తా...

త్వరలో రాష్ట్రపతి ఆస్తుల వెల్లడి

తన ఆస్తుల వివరాలను త్వరలోనే వెల్లడించాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ నిర్ణయించు కున్నారు. ఆస్తుల వివరాలను తెలియజేయాలని ఎలాంటి చట్టమూ లేకపోయినా భారత రాష్ట్రపతి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రతిభా పాటిలేనని కేంద్ర సమాచార కమిషన్‌ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 'భారత రాష్ట్రపతి తన ఆస్తుల.........

19, జూన్ 2011, ఆదివారం

సచినే ప్రేరణ : ద్రావిడ్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో 15 సంవత్సరాల అనుభవం అతడిది. భారత జట్టుకు పెట్టని గోడ అతడు. అయినా ఇప్పటికీ సచిన్‌ నుంచి ప్రేరణ పొందుతున్నానని వినమ్రంగా చెబుతున్నాడు భారత క్రికెట్‌ గ్రేట్‌వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌. గత రెండు మూడు సంవత్సరాల నుంచి సచిన్‌ కెరీర్‌లోనే ఉత్తమ బ్యాటింగ్‌ చేస్తున్నాడన్నాడు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్‌ మ్యాచ్‌ కోసం శుక్రవారం నుంచే ద్రావిడ్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. 1997లో కరేబియన్‌ పర్యటనలో టెస్టులకు సచినే నాయకత్వం వహించాడన్నాడు. ఈ సిరీస్‌లో సచిన్‌, ద్రావిడ్‌ రెండు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. బ్రిడ్జ్‌టౌన్‌లో........

నాన్నా నీతో ఓ గంట..!



'అమ్మా! నాన్నా!' అన్న కమ్మని పిలుపులు పోయి నేడు 'మమ్మీ.. డాడీ..!' అంటూ.. నాన్నకో రోజు... అమ్మకో రోజు కేటాయిస్తూ.. 'ఫాదర్స్‌ డే.. మదర్స్‌ డే..' అంటూ 'ప్రేమ'తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ సంస్కృతి మన ముంగిట్లోకొచ్చేసింది. మీరు మాత్రం ఇలాంటివాటిని...............................................

పాస్‌వర్డ్‌ పదనిసలు

రాజరికం రాజ్యాంగబద్ధం

ఉత్తరాఫ్రికా ఖండంలోని మొరాకోను రాజ్యాంగబద్ధమైన రాజరిక దేశంగా ఆ దేశ రాజు మహ్మద్‌-4 ప్రకటించారు. దేశంలో రాజ్యాంగ సంస్కరణల అమలులో భాగంగా దేశాన్ని రాజ్యాంగబద్ధమైన రాజరిక దేశంగా ప్రకటిస్తున్నట్లు ఆయన శుక్రవారం రాత్రి మీడియాలో చేసిన ప్రసంగంలో వివరించారు. దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలకు అనుకూలంగా ఉద్యమిస్తున్న కార్యకర్తలు రాజు మహ్మద్‌ ప్రకటనపై మౌనంగా ఉండిపోయారు. కొత్త రాజ్యాంగం ప్రకారం రాజు సర్వసైన్యాధిపతి అవుతాడు. అంతేకాక ఆయనే దేశంలో సర్వోన్నత..................................

20 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే... జంధ్యాలగారి చిత్రాలు చేసేవాణ్ని


 


'తమిళనాడులో పుట్టిపెరిగి, అసిస్టెంట్‌ దర్శకునిగా మణిరత్నం దగ్గర పనిచేసి, ఏడేళ్ళు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగులో మంచి విజయాలు నమోదయ్యాయి. దాంతో అంతా నన్ను తెలుగు వాడిగా అక్కున చేర్చుకున్నారు. సినీరంగానికి వచ్చి పదేళ్ళయింది. ఎన్నో విషయాలను నేర్చుకున్నా'నని నటుడు సిద్దార్థ్‌ అంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం '180' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలు విషయాలు ఇలా చెప్పుకొచ్చారు....

ఇంటర్నెట్‌ నిలిపివేతకు యత్నాలు

18, జూన్ 2011, శనివారం

అభిమానుల ప్రేమాభిమానాల వల్లే బతికాను : రజనీకాంత్

కాంగ్రెస్‌కు షాక్‌

మరపురాని మహావ్యక్తి 'మానాన్న'

మా చిన్నతనంలో నా క్లాస్‌మేట్స్‌ 'ఈవేళ మా నాన్న నన్ను కొట్టారు - అన్నయ్యను తన్నారు - అమ్మను తిట్టారు' అంటూ ఉంటే చాలా చిత్రంగా ఉండేది. 'బాబోరు మా నాన్నకు తెలిస్తే చంపేస్తారు' అని భయపడిపోతూ అబద్ధాలెలా చెప్పాలో ప్లాన్‌ చేసుకుంటూ ఉండేవారు. నాన్న ఇచ్చిన స్వేచ్ఛ (యదేచ్ఛ కాదు - క్రమబద్ధమైన స్వేచ్ఛ సుమా) వలన మాకెప్పుడూ అబద్ధాలాడాల్సిన అవసరం వచ్చేది కాదు. అమ్మ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేయటం వలన ఎక్కువ టైమ్‌ ఇంటిపట్టున ఉండేదికాదు. మా నాన్నగారే మాకు ..........

షారూఖ్‌తోనా ! సల్మాన్‌తోనా !

అందరం సిన్సీయర్‌గా కష్టపడ్డాం : అల్లు అర్జున్‌

'కష్టపడి పనిచేయండి. సిన్సియర్‌గా ఉండండి..ఇదే యువతకు నేనిచ్చే సందేశం' అని కథానాయకుడు అల్లు అర్జున్‌ అంటున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై 'బద్రీనాథ్‌'గా ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చారు. అల్లు అరవింద్‌ నిర్మించారు. అయితే ఈ సినిమా సక్సెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన.........

ఇప్పుడు మరో కుంభకోణం ...!

కెజి బేసిన్‌లోని సహజవాయువు ధరల నిర్ణయంలో డాలర్లలో ఉన్న అంతర్జాతీయ ముడిచమురు ధరలతో ముడిపెట్టడాన్ని తక్షణం తొలగించాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. వాస్తవ ఉత్పాదక వ్యయం ఆధారిత కాస్ట్‌ ప్లస్‌ ఫార్ములాతో సవరించాలని కోరింది. 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, ఆదర్శ్‌ హౌసింగ్‌ వంటి వరుస కుంభకోణాల్లో ఇప్పటికే పీకల్లోతు కూరుకున్న కేంద్రంలోని యుపిఎ-2 ప్రభుత్వం రిలయన్స్‌ ఇండిస్టీస్‌తో కుమ్మక్కయి మరో కుంభకోణానికి తెరతీసిన వైనాన్ని తాజాగా కాగ్‌ నివేదిక.........

17, జూన్ 2011, శుక్రవారం

భానుకిరణ్‌ను పట్టుకోలేకపోవడం దురదృష్టకరం

మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌ను పట్టుకోలేకపోవడం దురదృష్టకరమని డిజిపి అరవిందరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తూ గురువారం ఆయన కడపలో ఆగారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 20మంది పోలీసులకు స్థానిక డిపిఓలో ఆయన రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. భానును అరెస్టు చేయలేకపోవడంపై విలేకరులడిగిన ...........

కంటతడిపెట్టిన బొత్స

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కంటతడిపెట్టారు. బుధవారం ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ' మీ జీవితంలో బాధ, సంతోషం కలిగించిన సంఘటనలేమైనా ఉన్నాయా' అని అడిగిన సమయంలో ఆయన కంటతడిపెట్టుకున్నారు. 'నేను వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణానికి పాల్పడినట్లు టీవీల్లో వార్తలు వస్తున్న సమయంలో వాటిని నా తల్లి చూసింది. వెంటనే ఫోన్‌ చేసింది...........

సమాజ విరోధి ఎవరు?

శ్రీకాంత్‌ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరోధి'. మేక మీడియా పతాకంపై అనిల్‌ మేక నిర్మించారు. ఈ చిత్రం ఆడియోను వెంకటేష్‌ విడుదలచేశారు. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ, శ్రీకాంత్‌, అనిల్‌ ఈసినిమా తీయడానికి ముందుకు వచ్చారు.మంచి కథలు ఉన్నా అవి తీయడానికి నిర్మాతలు దొరకరు. ఇది సోషియో పొలిటికల్‌ సినిమా. నేటి..................

అమెరికా ఆక్రమిత ఆఫ్ఘనిస్తాన్‌ : స్త్రీలకు అత్యంత ప్రమాదకారి


మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో మొదటిదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉండగా రెండవ స్థానంలో కాంగో ఉన్నట్లు థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ నిపుణుల పోల్‌ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో హింస, అతి స్వల్పంగా ఉన్న ఆరోగ్య రక్షణ, తీవ్ర పేదరికం మహిళలను ప్రభావితం చేస్తుండగా కాంగోలో మహిళలపై అత్యాచారాలు భయానకమైన స్థాయిలో ఉన్నట్లు థామ్సన్‌ రాయిటర్స్‌లోని........................

తమిళనాట తెలుగు డబ్బింగుల జోరు!

ఇటీవల మీరు తమిళనాడు రాజధాని చెన్నై వెళ్ళారా? వెళితే అక్కడ మన తెలుగు హీరోల చిత్రాలు అనేకం తమిళ పేర్లతో గోడల మీద పోస్టర్ల రూపంలో కనబడే ఉంటాయి. అనుష్క 'అరుంధతి' నుంచి రామ్‌ చరణ్‌ తేజ్‌ 'మావీరన్‌' ('మగధీర') దాకా ఇప్పుడు గణనీయమైన సంఖ్యలో తెలుగు చిత్రాల తమిళ అనువాదాలు అక్కడ విడుదలవుతున్నాయి. ఎప్పుడూ తమిళంతో సహా వివిధ భాషల నుంచి తెలుగులోకి డబ్బింగ్‌ జరగడమే ఎక్కువగా.........

...వామ్మో! ఇది హెల్‌ఫోన్‌!!


సెల్‌ఫోన్‌... నేటి కమ్యూనికేషన్‌ వ్యవస్థలో ఇదో కీలకమైన పరికరం. సెల్‌ఫోన్ల రాకతో ప్రపంచమే మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలనున్నా ఒకరి నుంచి ఒకరు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇదో వారధిగా మారింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ సెల్‌ఫోన్లు మారుస్తూ... 3జి, బ్లూ టూత్‌ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తూ గాల్లో తేలుతున్నారు. 'వీలైతే నాలుగు మాటలు... కుదిరితే ఓ టెక్ట్స్‌ మెసేజ్‌' అంటున్నారు. ముఖ్యంగా యువతరంలో ఇదో క్రేజ్‌.........

సమాజ విరోధి ఎవరు?

16, జూన్ 2011, గురువారం

చే డైరీ ఆవిష్కరణ

అంతరిక్షంలోకి వెళితే పొడవు పెరుగుతామా?

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అదుర్స్‌..!

ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ రోజు రోజుకూ సరికొత్త హంగులతో మున్ముందుకు దూసుకుపోతున్నాయి. ఐఓఎస్‌ ప్రస్తుత సాంకేతిక విజ్ఞానం పీసీని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు మొబైల్‌, టాబ్లెట్‌ల హవా నడుస్తోంది. వాటిలో మొబైల్‌ నిర్వహణావ్యవస్థ (ఆపరేటింగ్‌ సిస్టమ్‌) లను శాసిస్తున్నవి ఆపిల్‌ సంస్థ వారి ఐఓఎస్‌, నోకియా వారి సింబియన్‌ ఓఎస్‌, గూగుల్‌ నుండి వచ్చిన ఆండ్రాయిడ్‌ ఓఎస్‌. వీటిని దగ్గరగా పరిశీలిస్తే వ్యత్యాసం చాలా ఉంది. మొదటి రెండూ ప్రొప్రయిటరీ నిర్వహణా వ్యవస్థ అయితే, ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ వెబ్‌ విహారంలో దిగ్గజంలా కొనసాగుతున్న గూగుల్‌ గూటి..................

మధ్య ప్రాచ్యంలో మితిమీరిన పశ్చిమ దేశాల జోక్యం


లిబియాలో ప్రజల హక్కుల కోసం యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్న పశ్చిమ దేశాలు బహ్రెయిన్‌, ఒమన్‌ దేశాల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని పరిశీలిస్తే వాటి మాటల వెనుక దాగి ఉన్న బూటకమేమిటో అర్థమవుతుంది. లిబియాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న పశ్చిమ దేశాలు సిరియాపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. ఈజిప్ట్‌, ట్యునీసియాల్లో అవి ఆలస్యంగా ప్రతిస్పందించాయి. తమకు వ్యతిరేకం కాని ప్రభుత్వాలను కాపాడేందుకు అవి పరోక్షంగా ప్రయత్నించాయి. సైన్యం, ప్రభుత్వ యంత్రాంగంతో గల సంబంధాలను ఉపయోగించుకున్నాయి. నేతలను మార్చడం వల్ల ఆ దేశాల్లో నిరసన ప్రదర్శనలు ఉపశమించాయి. అయితే ఇప్పటికీ పరిమిత స్థాయిలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి................................

అది ఫైనల్‌ కాదు

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వంతో తాము చేసుకున్న స్వయం ప్రతిపత్తిమండలి ఒప్పందంపై డార్జిలింగ్‌ కొండల్లోని ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం) బుధవారం అసలు విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వంతో జరిగింది తుది ఒప్పందం కాదని, తమకు ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత హోదా మాత్రమే కావాలని పునరుద్ఘాటించింది. మంగళవారం ఇక్కడ జింఖానా క్లబ్‌లో.........

ఆ మార్కెట్‌ పెంచుకోవాలి

గంగోత్రి నుంచి బద్రీనాథ్‌ వరకు ఒక్కో వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ వస్తున్న నటుడు అల్లు అర్జున్‌. దేశముదురుతో సిక్స్‌ప్యాక్‌కు క్రేజీ తీసుకు వచ్చిన అర్జున్‌ ఈసారి బద్రీనాథ్‌లో కేశాలంకరణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అది కృత్రిమమైనదైనా అమర్చడానికి చాలా సమయం పడుతుందంటున్న అల్లు అర్జున్‌ ఈ సినిమా గురించి పలు సంగతులు చెప్పారు.........

15, జూన్ 2011, బుధవారం

చిదంబరం రాజీనామా చేయాలి

అక్రమ మార్గాన పార్లమెంటుకు ఎన్నికైన కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగేందుకు చిదంబరం నైతిక అర్హతను కోల్పోయారని ఆమె విమర్శించారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఢిల్లీ విచ్చేసిన ఆమె ముందుగా ప్రధాని మన్మోహన్‌ను కలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ........

ప్రాధాన్యత సంతరించుకుంటున్న 'పబ్లిక్‌ హెల్త్‌' రంగం

అదో ప్రాథమిక, కనీస అవసరం... అందుకే ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులోనూ పబ్లిక్‌హెల్త్‌, క్లినికల్‌హెల్త్‌ అని రెండు విభాగాలున్నాయి. వీటిలో కొత్త పరిశోధనలు, కొత్త మార్పులు చోటు చేసుకోవడంవల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందుకే యువతరం సంబంధిత కోర్సులవైపు మొగ్గు చూపుతోంది. ఇష్టమైన కెరీర్లోకి ప్రవేశించి, ప్రతిభ కనబరుస్తోంది. ఎందరో ఆసక్తి చూపుతున్న ఈ రంగంలో ఎయే కోర్సులున్నాయి? ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? తదితర విషయాలు తెలుసుకుందాం...................

ఆయుధాలు సేకరించుకుందాం ప్రాణాలు కాపాడుకుందాం

పూర్తిగా మారిపోతున్న ఒక అనిశ్చితితో కూడిన భవితను ప్రస్తుతం ఇరాకీయులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించడానికి ఆయుధ సమరం ఒక్కటే పరిష్కారమనే అభిప్రాయంతో ఆయుధాలు గట్రా సమకూర్చుకుంటున్నారు. ఇంటి దగ్గర ఎకె-47 తుపాకీ ఉన్నప్పటికీ సాదౌనల్‌ సాహిల్‌లో భద్రతా భావన కరవైంది. బాగ్దాద్‌లో తాజాగా ప్రజ్వరిల్లుతున్న హింసకు ఈ ఫర్నిచరు వ్యాపారి చింతాక్రాంతుడవుతున్నాడు. అలానే ఇరాక్‌ గడ్డ మీద నుంచి అమెరికా సాయుధ బలగాల.........................................................

బొత్స దూకుడు

కాంగ్రెస్‌ పార్టీలో బొత్స ఇప్పుడు సూపర్‌బాస్‌గా మారిపోయారు. పిసిసి అధ్యక్షునిగా నియమితులయ్యాక మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మించి నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వెళ్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాదిరి ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పట్టు పెంచుకునే ప్రయత్నంలో బొత్స ఉన్నట్లు...........

అంతకంటే ప్రశంస ఏముంది : రవితేజ

 
రోజూ పని ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్‌కావాలంటే రకరకాల వ్యాపకాలున్నాయి. అందులో సినిమా కూడా కీలకం. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్‌ చిత్రాలు చూసి రిలీప్‌ అయ్యామని చాలామంది చెప్పారు. అదొక తరహా... ట్రెండ్‌నుబట్టి రిలీఫ్‌లు మారినట్లే... రవితేజ చిత్రాలుచూసి రిలీఫ్‌ చెందేవారు ఎందరో ఉన్నారు. ఈ మాట అన్నప్పుడల్లా తెలీని ఉత్సాహం వస్తుందని..........

14, జూన్ 2011, మంగళవారం

రూల్స్‌నే మార్చేశారు

జైపాల్‌ మార్గం పట్టండి

రాష్ట్ర మంత్రులు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మార్గాన్నే అనుసరించాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో ఢిల్లీ నుండి సమాచారం రానున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పదవీ స్వీకార సభలో 'మనం జాతీయవాదులం' అంటూ,..........

ప్రజారాజ్యం పార్టీ రద్దు

అమెరికా దుర్మార్గం

అవినీతిపై పోరాటం ఇలాగేనా ?

గత వారంలో చోటుచేసుకున్న సంఘటనలను వివరించేందుకు మాటలు సరిపోవు, ప్రహసనం, అసాధ్యం, పలుచన చేయడం ఇత్యాది పదాలు సంఘటనల అసలు పరిస్థితిని వివరించేందుకు సరిపోవు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దీక్ష చేస్తున్న రామ్‌దేవ్‌, ఆయన మద్దతుదారులపై అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడి చెయ్యడం యోగా గురువుతో కుదుర్చుకున్న మోసపూరిత రాజీలకు క్లయిమాక్స్‌ మాత్రమే. అనేకమంది అమాయకులు.....................................

ఆహ్లాదం ... ఆగ్రా ప్రయాణం

ఈ మధ్య కుటుంబ సభ్యులతో ఢిల్లీ, ఆగ్రా, మధురలో పర్యటించాం. ఎండలు మండిపోతున్నప్పటికీ పిల్లల చదువులు, సెలవుల సమస్యల కారణంగా ఎండల్లోనే పర్యటన సాగించాం. కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ ఆ చారిత్రక కట్టడాలు చూశాక, వాటి చరిత్ర తెలుసుకున్నాక ఆహ్లాదకరంగా అనిపించింది. పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఢిల్లీలో ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, తీన్‌మూర్తి భవన్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌, అక్షరధామ్‌, హుమాయున్‌ టూంబ్‌...మొదలైనవన్నీ చూశాక ఆగ్రాకు వెళ్లాం. ఢిల్లీ వెళ్లిన ఎవరైనా తప్పనిసరిగా చూడాలనుకునే చారిత్రక పర్యాటక ప్రదేశం ఆగ్రా. మరి ఈ వారం ఆగ్రా విశేషాలేంటో చూద్దామా................................

భవితపై నిరాశ

ఐరోపా దేశాలన్నింటిలోనూ యువత తీవ్ర నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. తమ వయస్సులో తల్లిదండ్రులు సాధించిన అభివృద్ధిని కూడా తాము సాధించలేమేమోనన్న దిగులు వారిలో తీవ్ర నిరాశను నింపుతోంది. తాము విద్యనభ్యశించి అవసరమైన శిక్షణ పొందినా తగిన ఉద్యోగాలు లభించకపోవటం, తగిన అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి రావటం నవతరాన్ని కుంగదీస్తోంది. ప్రపంచ దేశాలు ఆర్థిక, ఇతర సంక్షోభాలలో కొట్టుమిట్టాడుతున్న.......................

మూడో షెడ్యూల్లో ఎన్టీఆర్‌ మూవీ

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న చిత్రం రెండో షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై నిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్నారు. చిత్రం ప్రోగ్రెస్‌ గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ...'ఇంతవరకూ 13 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. ఎన్టీఆర్‌, శృతి హాసన్‌లపై రొమాంటిక్‌ సీన్స్‌, ఎన్టీఆర్‌, రాహుల్‌ దేవ్‌ కాంబినేషన్‌లో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌, ఎన్టీఆర్‌, కోట.......................................................................