1, మే 2011, ఆదివారం

అలా మొదలైంది వందరోజుల వేడుక

రంజిత్‌ మూవీస్‌పతాకంపై నందినీ రెడ్డిని దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది' వందరోజుల వేడుక శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కె.రాఘవేంద్రరావు, కైకాల సత్యనారాయణ, సుమన్‌, మురళీమోహన్‌, జగదీష్‌ప్రసాద్‌, కె.రాఘవ మొదలైన సినీ పెద్దలు కార్యక్రమానికి హాజరై రంజిత్‌కుమార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..........

ప్రపంచం మీ అరచేతిలోనే!

దశాబ్దం కిందట సొంతంగా మొబైల్‌ ఫోన్‌ వుండటమే ఓ విలాసం. ఇప్పుడు పరిస్థితి చెప్పక్కర్లేదు. జీవితంలో మొబైల్‌ ప్రాథమిక అవసరమై పోయింది. సాంకేతిక రంగంలో ఇదో విప్లవం. చేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్‌లోనే మొబైల్‌ ఇంటర్నెట్‌ రూపంలో మరో విప్లవం చోటుచేసుకుంది. ప్రపంచం ఇక మీ అరచేతిలోనే. మొబైల్‌లోనే బ్రౌజింగ్‌, ఇమెయిల్స్‌, ఛాటింగ్‌, ఇ-బ్యాంకింగ్‌ వంటి అనేక ఫీచర్లు వుండడంతోపాటు దేశంలో 3జి సేవలు అందుబాటులోకి రావడంతో మొబైల్‌ ఇంటర్నెట్‌కు తెరలేచింది. అత్యంత వేగవంతమైన ఈ 3జి సేవల వలన మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య మరింతగా ఊపందుకుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ మార్కెట్‌ పురోగతిపై ప్రపంచవ్యాప్తంగా ''బిజ్‌సిటి'' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగంలో మొదటి పది దేశాల్లో మనదేశంతోపాటు చైనా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.......................

భారీ మేడే ప్రదర్శనలు

క్యూబా కమ్యూనిస్టు పార్టీ మహాసభ జరిగిన నాటి నుంచీ తొలిసారిగా అందులో అంగీకరించిన ఒప్పందాలకు ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపేందుకు వచ్చిన మొదటి అవకాశం మేడే ప్రదర్శనలు. తమ మద్దతు తెలిపేందుకు ఆదివారం ప్లాజా డీ లా రివల్యూషన్‌, దేశంలోని ఇతర సాంప్రదాయిక కేంద్రాల్లో లక్షలాది మంది పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆ ఒప్పందాలను నెరవేర్చడంలో తమ చిత్తశుద్ధిని, విప్లవం, కమ్యూనిస్టు పార్టీ చుట్టూ బలమైన ఐక్యతను చాటేందుకు ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్మిక దినోత్సవాన్ని భారీగా............

సత్యసాయిబాబా ట్రస్టు అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌కే అవకాశం ?

సత్యసాయి బాబా వారుసుడెవరన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 1972లో ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సత్యసాయిబాబానే అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ఏప్రిల్‌ 24న సత్యసాయి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్నది మీమాంశ మొదలైంది. అనేక తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థానం కోసం ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్‌, రత్నాకర్‌ పోటీపడుతున్నారు............

చంద్రబాబుపై దాడి : రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసురుతూ జగన్‌ అనుచరుల వీరంగం

 పులివెందుల శాసనసభా స్థానంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వారుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ అనుచరులు శనివారం దాడి చేశారు. శుక్రవారం పిఆర్‌పి నేత చిరంజీవి వాహనశ్రేణిపై కూడా ి చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారంలో........

అరుణాచల్‌ సిఎం హెలికాప్టర్‌ గల్లంతు

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ శనివారం ఉదయం నుంచీ గల్లంతైంది. భూటాన్‌లో దిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినప్పటికీ దాని జాడ తెలియలేదు. దోర్జీ హెలికాప్టర్‌ భూటాన్‌లో దిగినట్లు ఎలాంటి సమాచారం లేదని ఆ దేశంలోని భారత రాయబారి సాయంత్రం తెలిపారు. భూటాన్‌లో ముఖ్యమంత్రి..........

1992 నుండి లంక ఫిక్సింగ్‌ : శ్రీలంక మాజీ కెప్టెన్