.

30, ఏప్రిల్ 2011, శనివారం

విలీనం ప్రసక్తే లేదు : కెసిఆర్‌

కాంగ్రెస్‌ పార్టీకి విలీనమనే పిచ్చి పట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీయే కాదు ఏ పార్టీలోనూ టిఆర్‌ఎస్‌ విలీనమయ్యే ప్రసక్తే లేదు. దుర్మార్గులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. ఇప్పడికైనా కాంగ్రెస్‌ నేతలు దిక్కు మాలిన ప్రచారం మానుకోవాలి. లేకుంటే కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో విలీనం చేసే పరిస్థితి........

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై కాల్పులు : పరిస్థితి విషమం

ఫలించిన ఎండోసల్ఫాన్‌ వ్యతిరేక పోరాటం

ప్రపంచ ఎండోసల్ఫాన్‌ తయారీ, వినియోగంలో మన దేశమే అగ్రస్థానంలో వుంది. ప్రపంచ వినియోగంలో 20 శాతానికి పైగా మన దేశంలోనే వుంది. దీనిని ప్రధానంగా ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌, కోరమాండల్‌ ఫర్టిలైజర్స్‌, హిందూస్థాన్‌ ఇన్సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ (భారత ప్రభుత్వ సంస్థ)లు తయారు చేస్తున్నాయి. వార్షికంగా 8,500 టన్నులు ఉత్పత్తి కాగా సగం పైగా దేశంలోనే వాడుతున్నారు. ఈ లాబీయే ఎండోసల్ఫాన్‌ వినియోగాన్ని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. అందుకే ఇన్నాళ్లూ తాత్సారం చేసింది.......................

ఏడు ఖండాలు - ఎనిమిది నెలలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దంపతులు వారు. పదహారణాల తెలుగువాళ్లు. దిగంతాల్లో భారత పతాకాన్నే కాదు, తెలుగు కీర్తిని ప్రతిష్టించిన వారు ప్రకృతి ప్రేమికులు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం గలవారు. అందుకే కలిసికట్టుగా ఏడు ఖండాలలోనూ మారథాన్‌ చేయాలనుకున్నారు. ఆ సుదూర పరుగు కూడా నగరాల మధ్య కాదు... అడుగుపెట్టడానికి సాహసించని దట్టమైన అరణ్యాలు, సూర్య కిరణాలు నిట్టనిలువుగా తాకే భూమధ్యరేఖ ప్రాంతం, నాలుక పిడచకట్టుకుపోయే ఎడారులు, మోకాళ్లవరకూ కూరుకుపోయే మంచు ప్రాంతాలు... జీవజాలమే కనిపించని ధృవ ప్రాంతాల్లో! అదీ కేవలం ఎనిమిది నెలల్లో! కారణం ఒక్కటే! భారతదేశ ఔనత్యం పపంచానికి చాటిచెప్పాలి. అందుకే ఈ మహాక్రతువుకు పూనుకున్నారు. వారే గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ యండి చిగురుపాటి కృష్ణప్రసాద్‌, క్రిస్మా వైనరీన్‌ యండి శ్రీమతి చిగురుపాటి ఉమ. మరి ఆ మారథాన్‌ విశేషాలేంటో ఉమ ద్వారానే తెలుసుకుందామా?!.................................................

బాబా యజుర్మందిరంలో రత్నాకర్‌ మకాం? : సత్యజిత్‌ పరిస్థితి ఏమిటో..?

సత్యసాయి బాబా నివాసమైన యజుర్వేదమందిరంలో రత్నాకర్‌ మకాం వేయనున్నారన్న ప్రచారం పుట్టపర్తిలో జోరుగా సాగుతోంది. రెండంతస్తులున్న ఈ భవంతిలో ఇప్పటి వరకు సత్యసాయి ఒక్కరే ఉంటూ వచ్చారు. ఈ భవంతిలోకి ట్రస్టు సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఉండేది కాదు. రెండంతస్తులున్న ఈ భవంతి పైఅంతస్తులో బాబా ఉండేవారు. ఆయన సహాయకులుగానున్న నలుగురి శిష్యులకు.......

అట్టహాసంగా విలియం వివాహం


బ్రిటన్‌ యువరాజు విలియం, కాటే మిడిల్‌టన్‌ల వివాహం బ్రిటన్‌లో ఘనంగా జరిగింది. శుక్రవారం జరిగిన ఈ వివాహం బ్రిటన్‌ రాచరిక చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. చరిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకన్న వెస్ట్‌మినిస్టర్‌ చర్చిలో ఈ ఇరువురు దంపతులు అయ్యారు. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భారీ తెరల ద్వారా ఆహ్వానితులతో పాటుగా........

హద్దుల్లో ఉంటేనే...

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ముందుగానే వెబ్‌సైట్లో ఫలితాలు!

బాబాపై కోడిరామకృష్ణ సినిమా

నగరం నిద్రపోతున్న వేళ...గీతాలు

తొలగని అనుమానాలు : అన్నింటికీ 'బాబా ఆజ్ఞ' ప్రకారమేనని సమాధానాలు

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు, సందేహాలను ఆ ట్రస్టు సభ్యులు నివృత్తి చేయలేకపోయారు. గురువారం ఉదయం 11 గంటల నుండి దాదాపు రెండు గంటలపాటు సాగిన విలేకరుల సమావేశంలో జెవి.శెట్టి మినహా తక్కిన సభ్యులందరూ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ప్రధానంగా ట్రస్టు సభ్యుడైన శ్రీనివాసన్‌ సమాధానాలిచ్చారు. భక్తుల్లోనున్న అనేక సందేహాలు దీని ద్వారా నివృత్తి ...........

జగన్‌ నిజస్వరూపం బయటపడింది

28, ఏప్రిల్ 2011, గురువారం

మీడియా సృష్టే

పదేళ్ల బాలుడినీ వదల్లేదు

జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల్లో స్థైర్యం నింపేందుకు, పోలీసు కాల్పుల భాధితులను పరామర్శించేందుకు మహారాష్ట్ర సిపిఐ(ఎం) బృందం రత్నగిరి జిల్లాలోని కొంకణ్‌ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు స్థలాన్ని గత 24వ తేదీన సందర్శించింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ ధావళె నేతృత్వంలోని .........

' బాబా పేరు మీద ఎ లాంటి ఆస్తులు లేవు : సత్యసాయి ట్రస్టు సభ్యులు'

దుర్మార్గానికి చిరునామా అమెరికా

'బే ఆఫ్‌ పిగ్స్‌ పోరాటంపై నా రిప్లెక్షన్‌ను కొనసాగిస్తానని వాగ్దానం చేసినందున పెద్ద ఎత్తున సమాచారాన్ని, పుస్తకాలను నేను చదివాను' అని క్యూబా విప్లవనేత ఫైడల్‌ కాస్ట్రో చెప్పారు. ప్రతివారం పెద్ద ఎత్తున సమాచారం వచ్చి పడుతోంది. అది జపాన్‌ భూకంపం నుంచి పెరూలో మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమోరీ కుమార్తె కీకోపై ఒలాంటా హెమాలా విజయం వరకూ ఉంది. పెరూ వెండి, రాగి, సింక్‌, తగరం, తదితర ఖనిజాలను ఎగుమతి చేసే ముఖ్యమైన దేశంగా ఉంది....................

'ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయి'

సత్యసాయి ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ట్రస్టు సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. ఈరోజు పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్టు సభ్యులు మీడియాతో సమావేశమయ్యారు. బాబా నిర్యాణంపై ట్రస్టు సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ ట్రస్టు కార్యకలాపాలను మీడియాకు వివరించారు. బాబా ఆరోగ్యం క్షీణిస్తున్న.................

రక్షణ ఒప్పందం వెనుక అమెరికా అసలు వ్యూహం

భారత, అమెరికా మధ్య రక్షణ ఒప్పందాలకు సంబంధించి వాణిజ్యపరమైన కోణాల గురించి అనేక విషయాలను వ్యూహాత్మక, రక్షణ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. భారత రక్షణ మార్కెట్‌ను అమెరికా సరఫరాదారుల కోసం తెరిచి ఉంచడంపై అనేక వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భారత మార్కెట్‌లో వేలాది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపారం చేసుకునే అవకాశాలు అమెరికా కంపెనీలకు ఉన్నాయి. రానున్న కొద్ది మాసాల్లో భారత్‌ 14 బిలియన్‌ డాలర్ల మేరకు రక్షణ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేబుల్స్‌ వెల్లడించాయి. అమెరికా వాణిజ్యపరంగా.................................

బాబా మరణం ముందే తెలుసా? * 20రోజుల క్రితమే శవపేటికకు ఆర్డర్‌ * 5వ తేదేనే పుట్టపర్తికి * బయటపెట్టిన కన్నడ మీడియా


 

సత్యసాయి కోలుకుంటున్నారని, తిరిగి భక్తులకు దర్శనమిస్తారని పదేపదే ప్రకటించిన ట్రస్టు సభ్యులు ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడారు. సాయి కోలుకుంటున్నారంటూ ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయన అంతిమ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. తాజాగా వెలుగులోకొచ్చిన వివరాల ప్రకారం... సత్యసాయి మరణంపై ట్రస్టు సభ్యులకు, ఆస్పత్రి.........

అక్కినేని మూడుతరాల ముచ్చట్లు!

 
స్త్రీ వేషాలతో నటన ప్రారంభించి మహానటుడయ్యారు అక్కినేని. 85 ఏళ్ళ వయస్సులోనూ నటిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగార్జున 52 ఏళ్ళ వయస్సులోనూ యువతతో పోటీ పడుతున్నారు. ఆయన వారసునిగా అతని కుమారుడు నాగచైతన్య ముందుకు వచ్చారు. ఇలా మూడు తరాలు ఒక్కసారి కలిసి తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటివరకు ఉన్న పరిస్థితులు వివరించారు. ఆ వివరాలు..

దేవుడు, సైన్సు మధ్య తారతమ్యం ఏమిటి?

27, ఏప్రిల్ 2011, బుధవారం

యూరప్‌లో 'వీర' పాటలు

కల్మాడీ పై చెప్పు

దిగ్గజాల మధ్య ధీరుడు !

తమిళ సినీరంగంలోనికి రామ్‌చరణ్‌తేజ్‌ను ఆహ్వానిస్తున్నామని పద్మశ్రీ కమల్‌హాసన్‌ అన్నారు. గీతాఆర్ట్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌, కాజల్‌, శ్రీహరి ప్రధాన తారగణంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర' తమిళంలో 'మావీరన్‌' పేరుతో అనువాదమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నయ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయిన కమల్‌హాసన్‌ తొలి సిడిని విడుదల చేసి, దర్శకుడు మణిరత్నంకు అందించారు.........................

టీమిండియా కోచ్‌గా డంకన్‌ ప్లెచర్‌

సత్య సాయిబాబా మహా సమాధి కార్యక్రమం పూర్తి

డబుల్‌ ఏజెంట్‌

పాకిస్తాన్‌లో 2002లో రెండు క్రైస్తవ చర్చీలు, ఒక విలాసవంతమైన హోటల్‌పై బాంబు దాడి కేసుల్లో నిందితుడైన ఒక అల్‌ఖైదా కార్యకర్త అదే సమయంలో బ్రిటీష్‌ ఇంటెలిజెన్స్‌ కోసం కూడా పని చేసినట్లు అమెరికా సైన్యం గ్వాంటెనామో జైలుకు తరలించిన ఖైదీలకు సంబంధించిన రహస్య పత్రాలు వెల్లడించాయి. అల్‌ఖైదా కోసం సదుపాయాలు కల్పించేవానిగా, కొరియర్‌, కిడ్నాపర్‌, హంతకునిగా అభివర్ణించిన అల్జీరియా పౌరుడు అదిల్‌ హదీ అల్‌ జజైరీ బిన్‌ హమ్‌లిలీని 2003లో పాకిస్తాన్‌లో నిర్బంధించారు. అనంతరం గ్వాంటెనామో జైలుకు పంపారు. కాగా ఆయన అదే......

నేడు సత్యసాయి సమాధి

'సాక్షి'పై 9 కేసులు

కడప జిల్లా ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన నలుగురు రాష్ట్ర మంత్రులకు భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సాక్షి ఛానల్‌,పత్రికలో పెయిడ్‌ ఆర్టికల్స్‌ ఇచ్చినట్లు రుజువు కావడంతో 9 కేసులు నమోదు చేశామని, మరో 21 ఆర్టికల్స్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...........

రాజమౌళి, మరోసారి నితిన్‌తో "సై" అనబోతున్నాడు...

26, ఏప్రిల్ 2011, మంగళవారం

సత్యసాయి ఆస్పత్రిలో వైద్యానికి నిరాకరణ

సత్య సాయికి ప్రముఖులు అంతిమనివాళులు అర్పిస్తున్నఫోటో గ్యాలరీ

గుండెలో రంధ్రాలుంటే అబార్షన్‌ చేయించుకోవాలా?

వ్యవసాయ సబ్బిడీలపై వేటు ఆహార భద్రతకు చేటు

ఉచిత విద్యుత్‌కు మంగళం పాడాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ ఆహ్లువాలియా చేసిన సూచన, రాష్ట్రాలకిచ్చే ఎఐబిపి నిధులను ఎత్తివేయాలని కేంద్రం చేస్తున్న ఆలోచన వ్యవసాయ రంగంలో రానున్న ప్రమాదాలకు సంకేతాలుగా భావించవచ్చు. ఇటీవల ప్రధాని అధ్యక్షతన జరిగిన ప్రణాళికా సంఘం సమావేశం వ్యవసాయ రంగంలో సంస్కరణల జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం విడుదల జేసిన ప్రకటన చూస్తే ఇది...............

మైనింగ్‌ మాఫియాపై పృధ్వీ ఐఎఎస్‌

పునీత్‌ రాజ్‌కుమార్‌, పార్వతి జంటగా జాకబ్‌ వర్గీస్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా కన్నడ నాట సంచలనం సృష్టించింది. ఇది 2010 సంవత్సరంలో విడుదలైంది. తాజాగా రాజేష్‌ ఫిల్మ్‌ పతాకంపై అడపాల శేఖర్‌బాబు, ఎ.ఎస్‌.వెంకటేష్‌ తెలుగులో 'పృధ్వీ ఐఎఎస్‌'గా అనువదిస్తున్నారు. ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఆడియో సీడీని హీరో తనీష్‌ విడుదలచేసి నటుడు కాశీవిశ్వనాథ్‌కు, సురేష్‌కొండేటికి అందజేశారు. నిర్మాత శేఖర్‌బాబు మాట్లాడుతూ...'అనంతపురంలోని మైనింగ్‌............................

అమాయకులపై చిత్రహింసలు

ఇక్కడ ఇంకా 172 మంది ఖైదీలున్నారు. వారిలో కొంతమందిని ఎప్పుడు విడుదల చేస్తారో సైనిక సిబ్బందికే తెలియదు............................

సచిన్‌ వ్యాఖ్యలపై నిరాశకు గురయ్యా

పుట్టపర్తిలో అన్నం కరువు

సాయిబాబా అంతిమ దర్శనానికి భక్తజనం పోటెత్తింది. సోమవారం మధ్యాహ్నానికి లక్ష మంది భక్తులు సాయిబాబా భౌతిక కాయాన్ని దర్శించుకున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి ప్రజాశక్తికి తెలిపారు.మంగళవారం ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ విఫలమైంది. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు పుట్టపర్తిలో కనీస అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది...........

25, ఏప్రిల్ 2011, సోమవారం

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రేపు పుట్టపర్తి రాక

సత్యసాయి బాబాకు సచిన్‌ టెండ్కూలర్‌ దంపతులు ఘనవివాళి

పేరు నిలబెట్టుకోవాలి : రిచా

చేతిలో నాలుగు సినిమాలున్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి...ఇదీ నేటితరం నాయికల ఫార్ములా. ఓ సినమా హిట్టయితే...ఆ అండతో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. అయితే దీనికి తాను మాత్రం భిన్నమని రిచా గంగోపాధ్యాయ అంటోంది. 'మిరపకారు' తర్వాత మరో సినిమా ఎప్పుడు ! అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. 'మూడు సినిమాలతో అంతో ఇంత పేరు............

నాలుగు రోజులు సంతాప దినాలు

రెడీ అయ్యాక మాట్లాడండి

సల్లూ భయ్యాకి అసలే కోపమెక్కువ. ఈమధ్య తగ్గించుకొన్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అది ఇప్పట్లో తగ్గేది కాదని, సల్మాన్‌ వాలకం చూస్తే తెలుస్తోంది. ఈ మధ్య మీడియా తెగ కోపం వచ్చేసింది. అవాకులు, చెవాకులు రాయొద్దని గట్టిగా హెచ్చరికలాంటిది కూడా ఇచ్చాడు. విషయమేమంటే...సల్మాన్‌, ఆసిన్‌ జంటగా 'రెడీ' సినిమా రూపొందుతోంది. అయితే ఈ చిత్రం అనుకున్నంత బాగా రావటం లేదని, కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ షూట్‌................

28 రోజులు మృత్యువుతో పోరాటం చేసిన్న బాబా చివరకు నిన్న ఉదయం 7:40 నిమిషాలకు మృతి చెందాడు బాబాను చివరిసారిగా చూడడానికి భక్తులు తరలివస్తున్నారు

సత్యసాయిబాబా కోలుకుని తిరిగి తమ ముందుకొస్తారని ఆశించిన భక్తులు ఆయన మృతితో తీవ్ర కలత చెందారు. 'తపోవనం' పుస్తకంలో ప్రకటించిన మాదిరిగా, 40 రోజుల తర్వాత బాబా కోలుకుని తమ ముందుకు వస్తారని భక్తులు ఆశించారు. ఆ నమ్మకంతోనే ఆయన అనారోగ్యానికి గురైనప్పటి నుంచీ పెద్దఎత్తున భక్తులు పూజలు, భజనలు చేశారు. అయినా బాబా ఆరోగ్యం మెరుగుపడలేదు............

సాయిబాబా ఇకలేరు

 


పుట్టపర్తి సత్య సాయిబాబా ఆదివారం ఉదయం 7.40కు తుది శ్వాస విడిచినట్లు సత్యసాయి సూపర్‌ స్పెషాలటీ ఆసుపత్రి డైరెక్టర్‌ సఫాయా ఆదివారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గుండె, శ్వాస వ్యవస్థ దెబ్బతినటంతో ఆయన మరణించినట్లు తెలిపారు. ఈ వార్తతో ఆయన భక్తజనం శోక సంద్రంలో మునిగిపోయింది. పుట్టపర్తిని విషాదం అలుముకొంది. సత్యసాయి చెప్పినట్లు 96 ఏళ్లు జీవిస్తారన్న విశ్వాసంతో.......

ఇష్టపడి కష్టపడ్డ...తమన్నా

అమెరికా అనుభవాలు

డెభై ఏళ్లకు కాని నాకు అమెరికా చూసే అవకాశం రాలేదు. ''అదేమన్నా గొప్పా?'' అని అడగరనే కొండంత ధైర్యంతో ముందుకు సాగుతున్నా. చైనావాళ్ల తర్వాత అమెరికాలో ఎక్కువగా వుండే ప్రాచ్యులు మనదేశానికి చెందినవాళ్లే. వాళ్లలో విద్యార్థులుంటారు, ఉద్యోగస్తులుంటారు. భార్యల హోదాలోనో, భర్తల హోదాలోనో వెళ్లిన వాళ్లుంటారు. వాళ్లు కన్న పిల్లలుంటారు. ఆ పిల్లలను పెంచేందుకు వచ్చిన బామ్మలూ........

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మిస్టర్‌ రాస్కెల్‌ ఎలా అయ్యాడు !

మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 24 వరకు బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి భిన్న కథనాలు వినిపించాయి. శ్వాస పీల్చు కోవడంలో ఇబ్బంది. మూత్రం సరిగా రాకపోవడంతో కాలేయం పనిచేయడం లేదని.... భిన్న కథనాలు వినిపింరచాయి. మార్చి 28న బాబాను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఆయనకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు. 24 రోజు ఉదయం 7.40 నిమిషాలకు గుండె సరిగా పనిచేయక తుదిశ్వాస విడిచారు.

సచిన్‌ ఆడేనా?

సత్యసాయిబాబా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆదివారం తన 38వ పుట్టిన రోజును జరుపుకోరాదని సచిన్‌ టెండూల్కర్‌ నిర్ణయించుకున్నాడు. సాయిబాబా అంటే సచిన్‌కు అపరిమితమైన భక్తి, ప్రపత్తు లున్నాయి. సచిన్‌ ఆదివారం నాడు డక్కన్‌ ఛార్జర్స్‌తో ఆడతాడా అనే విషయం కూడా అనుమానంలో పడింది. సచిన్‌ నుండి కానీ, ముంబయి ఇండియన్స్‌ జట్టు నుండి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ అతడు ఈ మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అనే.........

వైఎస్‌ చాలా మందిని ఎదగనివ్వలేదు : పాలడుగు

దారుణ అకృత్యం * రంగారెడ్డి జిల్లాలో కల్లు తాగించి.. అత్యాచారం * కాళ్లు నరికి కడియాల అపహరణ

ఒక మహిళపై కొందరు మృగాళ్లు దారుణ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెతో కల్లు తాగించి... సమీపంలోని అడవికి తీసుకెళ్లి... అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమె కాళ్లు తెగనరికి... వెండి కడియాలు, మెడలోని బంగారం దోచుకుపోయారు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మదన్‌పల్లి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూక్‌నగర్‌.....

23, ఏప్రిల్ 2011, శనివారం

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల దర్శకుడు బి.గోపాల్‌ త్వరలో బాలకృష్ణ.....

యువత ఆ భాష వాడాల్సిందే!

పొడుగు లాగూ, టీ షర్టు వేసుకొని, ఏ.సి. గదిలో మంచం మీద కూర్చొని, ల్యాప్‌టాప్‌కు ఫోటాన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యు.ఎస్‌.బి. పోర్ట్‌ తగిలించి, ఫేస్‌బుక్‌ చూస్తున్నారాయన. ఆ ల్యాప్‌టాప్‌కి పక్కనే టెరాబైట్‌ మెమొరీ ఉన్న ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డ్రైవ్‌, కంప్యూటర్‌కు అనుసంధానించిన ఓ ఐ-ప్యాడ్‌ (అందులో కొన్ని వందల పాటల ఆడియో, వీడియోలున్నాయి) కనిపిస్తాయి. ఫేస్‌బుక్‌ చూస్తున్న ఆ వ్యక్తి తన సొంత బ్లాగ్‌లో నిన్న రాత్రి పెట్టిన టపాకు వ్యాఖ్యలు.........

వందరోజుల...మిరపకాయ్

బహ్రెయిన్‌ మారణహోమం

బహ్రెయిన్‌లో మరణిస్తున్న, గాయపడిన ప్రజాతంత్ర అనుకూల నిరసనకారులకు వైద్యం చేసిన డాక్టర్లను భయపెట్టారని, నిర్బంధించారని 'ది ఇండిపెండెంట్‌'కు లభించిన ఇ-మెయిల్స్‌ ద్వారా వెల్లడైంది. బహ్రెయిన్‌ పోలీసులు గత నెలలో సర్జన్లు, ఫిజీషియన్లు, పిల్లల వైద్యులు, స్త్రీ వైద్య నిపుణులు సహా కనీసం 32 మంది వైద్యులను అరెస్టు చేసి నిర్బంధించారు. ఇదంతా ఘర్షణలో గాయపడిన వారికి వైద్య రక్షణ అందించడాన్ని గ్యారంటీ ఇస్తున్న జెనీవా.........................

జిగేల్‌ ఇన్నింగ్స్‌

ఐపిఎల్‌-4లో వరుస పరాజయాలతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు తన విజయ దాహం తీర్చుకుంది. బెంగళూరు జట్టు తరఫున మొదటి మ్యాచ్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ సెంచరీతో జట్టుకు విజయానందించి తనెంత విలువైన ఆటగాడో తెలియజేశాడు. కొల్‌కతా నైట్స్‌ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొల్‌కతా నిర్దేశించిన 172........

నమ్మకద్రోహం

అమ్మాయిలు మహా సున్నిత మనస్కులు. ఒకరికి మనసిచ్చారంటే ఇక జీవితమంతా వారితోనే అనుకుంటారు. వారికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. మరో ఆలోచనలేకుండా మనసు, తనువు సమర్పించుకుంటారు. ఇంతగా నమ్ముతారు కనుకనే అనుకోని పరిణామాలు ఎదురైతే తట్టుకోలేరు. అయినా అతన్నే పట్టుకుని వేలాడతారు తప్ప మోసం చేయబోయిన వాడి అంతు తేల్చాలనుకోరు. అందుకే అమ్మాయిలకు.............

'కరుణ' కూతురు, భార్య నిందితులే

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

నమ్మలేకున్నా !

కోటి రూపాయలు చెదలపాలు : ప్రభుత్వ బ్యాంకులో విచిత్రం

ఐపిఎల్‌ వివాదం సుఖాంతం

భారత్‌, శ్రీలంక క్రికెట్‌ బోర్డుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడే ప్రమాదం శ్రీలంక ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడంతో తప్పిపోయింది. తమ క్రీడాకారులు ఇంతకుముందు సూచించిన విధంగా మే 5న కాకుండా 18 వరకు ఆడే అవకాశం శ్రీలంక కల్పించింది. శ్రీలంక క్రీడా శాఖా మంత్రి మహిందానంద అలుత్‌గమాగే జోక్యంతో రెండు దేశాల..................

యూత్‌ మెచ్చే ఫ్యామిలీ స్టోరీ - దిల్‌రాజు

 
ట్రెండ్‌కు వ్యతిరేకంగా నడక సాగించి విజయాలు నమోదు చేసుకుంటున్న నిర్మాత దిల్‌రాజు. డిస్ట్రిబ్యూషన్‌ రంగం నుంచి రావటం వల్ల ప్రేక్షకుడి నాడీ బాగా తెలుసుకున్నారు. హీరో ఇమేజ్‌కు కాకుండా, స్టోరీ ఇమేజ్‌కు ప్రాధాన్యతనివ్వటం ఈయన ప్రత్యేకత. అలా తీసిన బృందావనం, గగనం మంచి ఆదరణ చూరగొన్నాయి. ఇలాగే రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ను 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అంత్య దశలో బాబా అనుమానాల ఆశ్రమం

నెల రోజులుగా అనారోగ్యంతో బాధడుతున్న సత్య సాయిబాబా పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన శరీరావయవాలన్నీ పనిచేయడం మానేశాయనీ, చికిత్సకు కూడా స్పందించడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గురించీ, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, దాన్ని నిర్వహిస్తున్న ట్రస్టు గురించీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్యం గురించీ, ఆయన అనారోగ్యంపాలైన తరువాత.............................

ఆ నలుగురు అనర్హులు

వైఎస్‌ జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్‌ పార్టీ చురకంటించింది. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాముందు ఆడిన పిసిసి, కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం(సిఎల్పీ) గురువారం ఒకేసారి దాడి ప్రారంభించాయి. ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌కు సిఎల్పీ ఫిర్యాదు చేసింది. దీంతో.................

త్రివిధ దళాల్లో చోటు కల్పించే...ఎన్‌డిఎ

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, నావల్‌ అకాడమీల్లో జూన్‌ 2012 నుంచి ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డిఎ) ప్రకటన వెలువడింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు పైలట్‌, బిటెక్‌, బిఎస్సీ, బిఎ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా లెఫ్టినెంట్‌, సబ్‌ లెఫ్టినెంట్‌, ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగవచ్చు. ట్రేడ్‌ శిక్షణలో నెలకు రూ.21,000 స్టైపెండ్‌ లభిస్తుంది. రూ.35,000కుపైగా వేతనంతో కెరీర్‌ ఆరంభమవుతుంది. ఇంటర్‌ విద్యార్థుల పాలిట అద్భుత అవకాశంగా ఎన్‌డిఎను చూపుతారు. ఆ పరీక్ష వివరాలు ఇలా ఉన్నాయి...............

భవిష్యత్తు జీవ ఇంధనానిదే

రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో విస్తారమైన జీవ ఇంధన వినియోగం ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) తెలిపింది. దాన్ని సుస్థిరంగా ఉత్పత్తి చేసినప్పుడు ఇంధన భద్రత కూడా పెరుగుతుందని పేర్కొంది. రవాణా రంగం చెప్పుకోదగినంతగా పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఇంధనాలకు గిరాకీ పెరుగుతున్నందున కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, ద్రవ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇవి కీలక..........................

పూర్తిగా విషమం

పెట్టుబడులకై ఆహ్వానం

21, ఏప్రిల్ 2011, గురువారం

ఈ డబ్బెవరిది?

డబ్బులు లెక్కపెట్టుకోను : విక్రమ్‌

క్షేత్ర సహాయకులపై లాఠీ

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న క్షేత్ర సహాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆందోళనతో క్షేత్ర సహాయకులు బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్‌ కలెక్టరేట్ల వద్ద క్షేత్ర సహాయకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని గొడ్లను బాదినట్లు బాదారు. ఈ ఘటనలో కొందరు స్పృహ కోల్పోయారు. మరి కొందరికి గాయాలయ్యాయి. కలెక్టరేట్ల...............

ఇంటర్‌ ఫలితాలు విడుదల( జనరల్) (వోకేషనల్‌ ‌)

రెండు భారత్‌లు ఉండరాదు !

దేశంలో ఆకలి చావులు సంభవిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. 'మీకు రెండు..........

ఆనందంగా ఉంది: బాలకృష్ణ

 


హార్వర్డ్‌ యూనివర్సిటీ, హౌస్టన్‌ యూనివర్సిటీ, కెల్లాంగ్‌ యూనివర్సిటీల్లో చంద్రబాబునాయుడు కోడలు బ్రహ్మణికి ఎంబిఎలో సీటు వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సి.ఇ.ఓ. స్టీవ్‌ బాల్మర్‌, గూగుల్‌ కంపెనీ సృష్టికర్త సెర్వేబ్రిగ్‌, హెచ్‌పి కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్‌ పాకార్డ్‌, ప్రముఖ కంపెనీ నైక్‌ సి.ఇ.ఓ. ఫిలిప్స్‌ నైట్‌, సన్‌ మైక్రో సిస్టమ్‌ ఛైర్మన్‌ స్కాట్‌ మెక్‌మనీ.......

మిచెల్లీ ఒబామాకు తృటిలో తప్పిన ప్రమాదం

అమెరికా ప్రధమ మహిళ మిచెల్లీ ఒబామా ప్రయాణిస్తున్న విమానం మంగళవారం నాడు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నది. మిచెల్లీ ప్రయాణిస్తున్న విమానం ఇక్కడికి సమీపంలోని ఆండ్రూ వైమానిక స్థావరంలో దిగబోతున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై మరో కార్గో విమానం ఉండటాన్ని గమనించిన అధికారలు లాండింగ్‌ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మిచెల్లి విమానం పైలట్‌ను ఆదేశించారు. అప్పటికే విమానం........

20, ఏప్రిల్ 2011, బుధవారం

అనాగరికం... సిగ్గుచేటు

ఖాప్‌ పంచాయతీ లపై(కుల పంచాయతీలు) సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అవి చట్టవిరుద్ధమని పేర్కొన్న కోర్టు, ఖాప్‌లు విధిస్తున్న గౌరవ హత్యల (కుల దురహంకార) శిక్షలను సిగ్గుచేటు, అనాగరికమైనవిగా అభివర్ణించింది. హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో కంగారూ కోర్టులుగా వ్యవహరిస్తున్న ఈ ఖాప్.........

అంధుల కోసం మొబైల్‌

జైతాపూర్‌ అణు విద్యుత్కేంద్రం తక్షణం ఆపాలి

మహారాష్ట్రలోని జైతాపూర్‌లో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ ప్రాజెక్టును తక్షణం నిలిపి వేయాలని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ప్రాజెక్టుపై నిరసన తెలుపుతున్న వారిపై జరిపిన పోలీసు కాల్పులను ఖండించింది. ఆ కాల్పుల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నారు. అలాగే తమ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైతాపూర్‌ అణు విద్యుత్‌ ప్రాజెక్టును.............

జంకులేని పోరాటవాదులుగా ఉండాలి

నూతన తరం విప్లవ నాయకులైన యువత ఆదర్శప్రాయమైన నేతలుగా, సోషలిజం కోసం పోరాడే సచ్ఛీలురైన, అధ్యయనశీలురైన, ఏమాత్రం జంకులేని పోరాటవాదులుగా ఉండాల్సిన బాధ్యత ఉందని క్యూబా విప్లవ నేత, మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో అన్నారు. వినియోగదారీ సమాజపు దుర్మార్గమైన దశను, ప్రజల్లో స్వార్థాన్ని ప్రోత్సహించే, పెంపొందించే పెట్టుబడిదారీ ఉత్పత్తిని అధిగమించడం నిస్సందేహంగా క్లిష్టమైన సవాలేనని అన్నారు. సరిచేయాల్సిన, మార్చాల్సిన అవసరమున్న వాటన్నింటినీ ఏమాత్రం జంకులేకుండా కొత్తతరం యువత సరిచేసి, మార్చాలని పిలుపునిచ్చారు. అసాధ్యమైన దాన్............

"ask"ఉంటే చాలు ..!

ఐదంకెల జీతం... ఆధునిక హంగులు... గుర్తింపు... హోదా... ఇవన్నీ యువతను ప్రయివేటు, కార్పొరేట్‌ కొలువులవైపు ఆకర్షిస్తున్నాయి. కొన్ని కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా చదువు పూర్తిగాకముందే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా యువత అటువైపు మొగ్గుచూపేలా చేస్తోంది. అదీగాక ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు కచ్చితమైన విద్యార్హతలే ప్రతిభగా, మార్కులే ప్రామాణికంగా భావించట్లేదు. వ్యక్తిలోని ఆసక్తి, సృజనాత్మకత, తపన లాంటి అంశాలను గమనిస్తున్నాయి...........

భారత జట్టుకు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ వెళ్లిన పోయిన తరువాత భారత జట్టుకు కోచ్‌గా పలువురి పేర్లు వినపడుతున్నాయి. ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ ( జస్టిస్‌ లాంగర్‌ ) , ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు షేన్‌వార్నే, తాజాగా మరో క్రీడాకారుడి పేరు కూడా వినిపిస్తుంది ( ఫ్లవర్‌ ) ఈ ముగ్గురి భారత జట్టు కోచ్‌ ఎవరు అన్న సందేహాము ...........

 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ పదవీకాలం ముగించుకుని స్వదేశం తిరిగివెళ్లిన తరువాత ఆయన వారసునిగా ఎవరు ఎంపికవుతారనే విషయంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ దిశగా పలువురి పేర్లు వినపడుతున్నాయి. తొలుత ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ పేరు షికార్లు కొట్టింది. ఆ తరువాత స్పిన్‌ మాంత్రికుడు,................

19, ఏప్రిల్ 2011, మంగళవారం

నిర్మాతలు నష్టపోతున్నారు - కెఎస్‌ రామారావు


చలనచిత్ర పరిశ్రమలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సమ్మె వల్ల పెద్ద నిర్మాతలే ఎక్కువగా నష్టపోతున్నారని ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్‌.టి.ఆర్‌., బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాలుగు రోజులపాటు షూటింగ్‌ జరిగింది. సమ్మె గురించి ఆయన ప్రస్తావిస్తూ...ప్రస్తుతం షూటింగ్‌లు ఆగినా, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆకాశంలో ఒక తార... ( కామెడీ హీరో అల్లరి నరేష్‌ కామెడీ అనే కాకుండా తన ప్రతి సినిమాలో ఒక పాత హిట్‌ సినిమా సాంగ్‌ ఉండేలా అల్లరి నరేష్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

 కామెడీ హీరోగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న మినిమం గ్యారెంటీ హీరో నరేష్‌. తన సినిమాల్లో పలు రిమిక్స్‌ పాటల్తో పాపులర్‌ అవుతున్నాడు. కేవలం కామెడీ అనే కాకుండా తన ప్రతి సినిమాలో ఒక పాత హిట్‌ సినిమా సాంగ్‌ ఉండేలా అల్లరి నరేష్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. 'సీమశాస్త్రి' సినిమాలో 'కొండవీటి రాజా'లోని 'మంచమేసి దుప్పటేసి' పాటని రిమిక్స్‌ చేసి హిట్‌ కొట్టాడు............

సోషలిజానికి అనుగుణంగానే మార్పులు

ఆర్థిక మార్పులు దేశంలోని సోషలిజానికి అనుగుణంగానే ఉంటాయని క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో తెలిపారు. ఆయన ఇక్కడ క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఆరవ మహాసభను ప్రారంభించారు. పలు మార్పుల ప్రతిపాదనలను రావుల్‌ ఈ సందర్భంగా ముందుకు తెచ్చారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఆస్తుల కేంద్రీకరణను అనుమతించేందుకు వచ్చిన పలు సంస్కరణల సూచనలను ఆయన తిరస్కరించారు. అయితే క్యూబా సోషలిస్టు వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు ఆయన గట్టిగా మద్దతిచ్చారు. క్యూబా పలు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన.....................

మంచి సినిమాలు రెండు చాలు : దగ్గుబాటి రానా

 


అటు ప్రొడక్షన్‌లో, ఇటు యాక్షన్‌లో అనుభవాన్ని నింపుకొని రంగంలోకి దూకిన నూతన తార రానా. స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడి మనవడిగా ఇండిస్టీలో కావాల్సినంత సపోర్ట్‌ ఉంది. అలా అని ఉన్నపళంగా తెరపైకి దూకేయలేదు. తెరవెనక జరుగే విషయాల్ని తెలుసుకోవాల్సినంత తెలుసుకొని 'లీడర్‌'గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి చిత్రం తర్వాత బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ కూడా రానాతో తీయడానికి........

నగరం నిదప్రోతున్న వేళ ఏం జరుగుతోంది

'ఫుకుషిమా' అదుపునకు రోబోలు

18, ఏప్రిల్ 2011, సోమవారం

ఫిట్స్‌ వైవాహిక జీవితానికి ఆటంకం కాదు

ఫిక్సింగ్‌కి అవకాశం

   


న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు ఫిక్సింగ్‌ అయ్యే అవకాశం ఉందని ఐసిసి అవినీతి వ్యతిరేక భద్రతా విభాగం (ఎసిఎస్‌యు) కివీస్‌ క్రికెట్‌ బోర్డుకు సమాచారం అందించిందని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి జస్టిన్‌ వాగన్‌ పేర్కొన్నాడు. ఇలాంటి సంఘటనలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో చోటుచేసుకుంటాయని, ఫిక్సర్లకు అనుకూలంగా..............

అరె...ఓ..సాంబా...కిత్నే ఆద్మీ తే : డైలాగ్‌ వెండితెరపై సచిన్‌ నోట

జీవన 'యానాం'


ఒక పక్క సముద్రం, మరోపక్క గోదావరి ప్రవాహం... మధ్య విస్తారమైన కొబ్బరి చెట్లూ, పచ్చదనం... ఆ పచ్చదనపు పందిట్లో చూడచక్కని బొమ్మరిల్లులా ఉంటుంది యానాం. ఉండటానికి తూర్పు గోదావరి సందిట్లో చంటిపాపలా కనిపిస్తుంది. కానీ, వాస్తవానికి అది ప్రత్యేక 'పోషణ', 'పాలన' ఉన్న పట్టణం. గోదావరి బంధుత్వం, సాంప్రదాయతత్వం పుష్కలంగా కలగలిసిన ఊరే కానీ, చారిత్రాత్మకంగా దాని తీరు వేరు! ఒకప్పటి వలస పాలన నుంచి నేటి కేంద్ర పాలిత పాలన దాకా ... యానాందొక విలక్షణ ప్రస్థానం! దాని అడుగుజాడల అవలోకనమే ఈ అక్షర యానం!........................

గుట్టు రట్టు చేయాలి

విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేసి ప్రయివేటు సంస్థలకు లాభం కలిగించే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాల లోగుట్టును, రహస్యాలను బట్టబయలు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్‌ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టేందుకు దీర్ఘకాలిక ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే విద్యుత్‌ విధానాన్ని రూపొందించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.విద్యుత్‌ పంపిణీ కేంద్రాలైన

క్యూబా కమ్యూనిస్టుపార్టీ 6వ మహాసభలు ఘనంగా ప్రారంభం


క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పిసిసి) 6వ జాతీయ మహాసభలు శనివారం ఇక్కడ అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో సమక్షంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలో రావుల్‌ కాస్ట్రోతో పాటు అన్ని ప్రావిన్సుల నుండి 997 మంది ఎన్నికైన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇక్కడి అంతర్జాతీయ సమావేశ మందిరంలో జరుగుతున్న ఈ మహాసభల్లో పార్టీ ఆర్థిక, సామాజిక విధాన మార్గదర్శకాల ముసాయిదా, విప్లవంపైన సమగ్రంగా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు..............

తీన్‌మార్‌...ఏక్‌బార్‌

 మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సామాజిక, భౌతిక మార్పులే కాకుండా మానవ మస్తిష్కంలో, మనసు లోతుల్లోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జీవితాల్లో వేగం పెరిగిపోయింది. దాంతో ప్రేమానుబంధాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. ఈ పాయింట్‌ ఆధారంగా ప్రేమ...నిన్న, నేడు...అనే కథనంతో తెరకెక్కిన హిందీ చిత్రం 'లవ్‌ ఆజ్‌ కల్‌'. చక్కటి స్క్రీన్‌ప్లే.......