12, మే 2011, గురువారం

తెలుగు సినిమాలో ఇండిస్టీలో కమేడియన్‌గా పేరు నమోదు చేసుకున్న బ్రహ్మానందం ఈనెల 14న హైటెక్స్‌ పెద్దల సమక్షంలో మాటీవీ ఘనంగా సన్మానించనుంది

11, మే 2011, బుధవారం

Veera-Movie-Latest-Wallpapers

Veera-Movie-Latest-Wallpapers

 

ఆదివాసీల ఆగ్రహం


ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులను గిరిజనులు తరిమికొట్టారు. చైనా క్లే తవ్వకాలకు మద్దతు తెలిపితే సహించేది లేదంటూ శాసనసభ్యుని కారును ధ్వంసం చేయడంతోపాటు, ఎంపిపిపై పేడనీళ్లు చల్లి, చొక్కా చింపి పరుగులు పెట్టించారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం ఖండ్రూమ్‌ పంచాయతీ సరాయి రెవెన్యూ పరిధి జాంకరవలసలో చైనా క్లే తవ్వకాలకు పర్యావరణశాఖ అనుమతి కోసం ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై..........................................

పదేళ్ళ క్రితమే రహస్య ఒప్పందం

ఒసామా బిన్‌ లాడెన్‌ను పాకిస్తాన్‌ భూభాగంలో హతమార్చేందుకు అమెరికా, పాకిస్తాన్‌ మధ్య దాదాపు పదేళ్ల క్రితమే రహస్య ఒప్పందం కుదిరినట్లు గార్డియన్‌ పత్రిక వెల్లడించింది. 2001 చివర్లో లాడెన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లోని టోరా బోరా పర్వతాల నుంచి అమెరికా దళాలకు చిక్కకుండా పారిపోయిన అనంతరం అప్పటి సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషరఫ్‌, అధ్యక్షుడు జార్జిబుష్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు ఉభయ దేశాలకు చెందిన ప్రస్తుత, పదవీ విరమణ చేసిన అధికారులు చెప్పారు. అందులోని నిబంధనలననుసరించి లాడెన్‌, ఆయన డిప్యూటీ నేత అల్‌ జవహరి, అల్‌ఖైదా నెంబర్‌.........................................

గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అమితాబ్‌

హెచ్‌పివి వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అవకతవకలు

హ్యూమన్‌ పాపిల్లో వైరస్‌ (హెచ్‌పివి) నిరోధక వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించే క్రమంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ అందుకు సాక్ష్యాధారాలున్నట్లు తన నివేదికలో వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించిన యువతులపై వారి సమ్మతి లేకుండానే పరీక్షలు జరిపినట్లు సాక్ష్యాధారాలున్నాయని.....

10, మే 2011, మంగళవారం

మరణమే తగిన శిక్ష

వింతగా ఉంది

'హైస్పీడ్‌' చైనా

హైస్పీడ్‌ ట్రైన్‌ చైనా రూపొందించిన హైస్పీడ్‌ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. చైనా రాజధాని బీజింగ్‌, సాంస్కృతిక రాజధాని షాంఘై మధ్య వచ్చే నెలలో (జూన్‌ 2011) ప్రారంభంకానుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే బీజింగ్‌ నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘైకి ఐదు గంటల్లో చేరుకోవచ్చు. ఇప్పుడు 18 గంటల సమయం పడుతోంది. మధ్య చైనాకు గుండెకాయలాంటి ఉహాన్‌ నుంచి 968 కిలోమీటర్ల దూరంలోని, చైనా దక్షిణతీరంలో...............................

భుజం నొప్పి కారణంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపిఎల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు

ఫోటో గ్యాలరీ


ప్రైవేటీకరణ విదేశీకరణ ముప్పు

విద్యారంగానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్రయివేటీకరణ, విదేశీకరణ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించాలని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) 12వ రాష్ట్ర మహాసభలను కర్నూలులోని అమరజీవి అప్పారి వెంకటస్వామి నగర్‌లో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ఏచూరి ప్రారంభించారు. యుటిఎఫ్‌ బాధ్యత పెరిగిందని, ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా జాతీయ.........................

కార్మిక హక్కుల్ని కాలరాచే యత్నాలు

కార్మిక మార్కెట్‌లో తమ ఇష్టానుసారం మార్పులు చేసుకునే అవకాశం ఉండాలనేది నయా ఉదారవాదం గురించి ప్రచారం చేసేవారు నిరంతరం చేసే డిమాండ్లలో ప్రధానమైనది. కార్మికులను తమ ఇష్టానుసారం నియమించు కునేందుకు, తొలగించు కునేందుకు యజమానులకు సంపూర్ణ హక్కులు ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనేది వారి........................

మధ్యధరా సముద్రంలో చావుకేక

సహాయం కోసం వారు చేసిన అభ్యర్థన అరణ్య రోదనే అయింది. మధ్యధరా సముద్రం నుంచి వారు వేసిన కేకలు ఐరోపా, నాటో, సైనిక దళాలు విస్మరించినట్లు కన్పిస్తోంది. దీంతో ఆకలిదప్పులతో అనేక డజన్ల మంది సముద్రంలోనే మృతి చెందారు. 72 మంది శరణార్థులతో బయలుదేరిన ఓ పడవ నడి సముద్రంలో చిక్కుకుపోయి చివరకు అందులోని 11 మంది మినహా మిగిలినవారంతా ఆకలిదప్పులతో మరణించిన హృదయ విదారక విషాద గాథను గార్డియన్‌ పత్రిక తెలియచేసింది..............................

తెలుగులో దబాంగ్‌

'తీన్‌మార్‌' నిర్మించిన గణేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' అనే సినిమాను నిర్మిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనుంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'నామీద అభిమానంతో వెంటనే మా బ్యానర్‌లో రెండో సినిమాకి డేట్స్‌ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌గారికి జీవితాంతం కృతజ్ఞణ్ని. వెంట వెంటనే రెండు సినిమాలు తీసే అవకాశం దక్కినందుకు నిర్మాతగా నాకెంతో సంతోషంగా వుంది........

9, మే 2011, సోమవారం

అనుకరిస్తూపోతే ఉపయోగం లేదు : విద్యాబాలన్‌

అబద్ధాలు, మిస్టరీలు..

ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన వారు ఆ పనిని సొంతంగా చేయలేదు. అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వారు అనుసరించారు. ఇలాంటి ప్రత్యేక 'విధు'ల నిర్వహణకు ప్రభుత్వం వారిని అత్యంత కఠినమైన పద్ధతుల ద్వారా ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణనిచ్చింది. యుద్ధ రంగంలో వున్న సైనికుడితో సైతం అమెరికా అధ్యక్షుడు నేరుగా మాట్లాడగలడన్న విషయం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌లోని అబొత్తాబాద్‌లో లాడెన్‌ను హతమార్చిన తరువాత వైట్‌హౌస్‌.................................

బెంగళూరు హ్యాట్రిక్‌ విజయం

చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోచీ టస్కర్స్‌ కేరళపై ఘన విజయం సాధించింది. మొదట బెంగళూరు బౌలర్లు కోచీని 125 పరుగులకే కట్టడి చేశారు. 126 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగిన బెంగళూరు గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌, దిల్షన్‌ అర్ధ సెంచరీ చేయడంతో 6.5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది.............

'100 % లవ్‌' సినిమాకు పాస్‌ మార్కులు పడ్డాయి !

భావోద్వేగభరిత డ్రామా, అర్థంలేని త్యాగం, అవధుల్లేని హింస...వంటి కథాంశాల నుంచి నేటి తెలుగు సినిమా దూరంగా వెళుతోందనిపిస్తోంది. విషాదాంతాలను నేటి ప్రేక్షకుడు కోరుకోవటం లేదు. సందర్భోచిత హాస్యానికి, డ్రామాకి ఆదరణ పెరుగుతోంది. వినోదానికి మొదటి ప్రియారిటీ ! తదుపరి...విషయానికి ! ఇస్తున్నాడు. అలా మొదలైంది, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఇలాంటి ఈక్వేషన్‌తో వచ్చి విజయాన్ని అందుకున్నవే.........

8, మే 2011, ఆదివారం

తెలుగు నేర్చుకునే పనిలో : త్రిష

వేసవి విజ్ఞాన వినోదాలు చిన్నారి 'సైట్లు

ఇంట్లో కంప్యూటర్‌ వుంటే చాలు. చిన్నారుల దృష్టంతా కంప్యూటర్‌ గేమ్స్‌ మీదే. ఆకలిదప్పికలుండవు. గంటల తరబడి దాని ముందే. 'ఫర్వాలేదులే. దెబ్బలు తగిలించుకుంటారన్న బెంగలేదు. హాయిగా ఆడుకుంటారు' అనుకోవచ్చు పెద్దలు. 'కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటి సాంకేతిక విషయాల పట్ల పిల్లలు సైతం అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందికదా' అన........

మృగాడి ఘాతుకం

వీరలో ఆ రీమిక్స్‌ సాంగ్‌ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది

కడప కింగులు సూపర్‌ యాక్షన్‌, ఫ్యాక్షన్‌ సినిమా

ఇక్కడ చేయలేనివి అక్కడ చేయగలుగుతా : రామ్‌చరణ్‌

మెగాతారకు కుమారుడిగా ఘన వారసత్వం... మూడే మూడు చిత్రాలతోనే మాస్‌ హీరోగా శిఖర సదృశమైన పేరు ప్రఖ్యాతులు... చేసే ప్రతి సినిమా పైన, వేసే ప్రతి అడుగు పైన సమాచార ప్రసార సాధనాల్లో పైసా ఖర్చు లేని విపరీత ప్రచారం... బహుశా ఇవి చాలా కొద్దిమందికే దక్కే అనుభవాలు, అదృష్టాలు. ఆ అరుదైన అదృష్టం - హీరో చిరంజీవి ఏకైక కుమారుడైన.......

ఆ తొమ్మిది నెలలు ... కల్పిత గాథలు..

7, మే 2011, శనివారం

అమ్మ చెప్పిన ఎనిమిది అబద్ధాలు..

ఆరేళ్లుగా అదే భవనంలో

అసలు ఉగ్రవాది అమెరికానే!అమెరికా సైన్యం, దాని ఛీర్‌లీడర్స్‌ ఎట్టకేలకు సంబరపడటానికి ఒక అవకాశం లభించింది. బిన్‌ లాడెన్‌ను హతమార్చడం అమెరికాకు ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తోంది. వధింపబడిన ప్రాంతం నుండి సముద్రంలో విసిరివేసే వరకు కథనాలు ప్రచురించే అవకాశం మీడియాకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పాల్పడిన ఆక్రమణలకు, చేసిన యుద్ధాలను సమర్ధించుకుంటూ పలికిన అసత్యాల గురించి ఒబామా ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో పుష్కలంగా లభించే చమురు గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు..................

లాడెన్‌ హత్య ఫైడల్‌ కాస్ట్రో రిఫెక్షన్స్‌

హత్య చేసి లాడెన్‌ మృతదేహాన్ని సముద్రపు లోతుల్లో ముంచేయడం వంటి చర్య భయాన్ని, అభద్రతను వ్యక్తం చేస్తోంది. లాడెన్‌ను మరింత భయానకమైన వ్యక్తిగా చేస్తోంది. తొలుత ఉన్మాదంతో ఆనందోత్సవాలు చేసుకున్నప్పటికీ తరువాత ఆయన్ను చంపేందుకు ఉపయోగించిన పద్ధతుల పట్ల అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఫైడల్‌ కాస్ట్రో పేర్కొన్నారు.....................

సందేశాన్నిచ్చే...తెలుగమ్మాయి

సలోని కథానాయికగా రాజా వన్నెంరెడ్డి తీస్తున్న సినిమా 'తెలుగమ్మాయి'. వైష్ణవి మూవీస్‌ బ్యానర్‌పై చేగొండి హరిరామజోగయ్య, కరాటం రాంబాబుల సారథ్యంలో వానపల్లి బాబూరావు నిర్మిస్తున్నారు. పలువురు డాన్సర్లపై ఫిలింసిటీలో ఐటెం సాంగ్‌ చిత్రిస్తున్నారు. ఈసందర్భంగా శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వానపల్లి బాబూరావు....................

10 ఫోర్లు... 9 సిక్స్‌లు

క్రిస్‌ గేల్‌ మరోసారి రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. తనదైన ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించిన ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్‌మన్‌ చిన్నస్వామి స్టేడియంలో శివాలెత్తాడు. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గేల్‌, 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 107 రన్స్‌ చేశాడు. నలుదిశలా భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఫలితంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ చేతిలో టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 రన్స్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ కూడా కొంత సేపు క్రీజులో నిలబడడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు..........................

కడప ఉపఎన్నికల పోలింగు ముందు పురివిప్పిన పాతకక్షలు : ఇద్దరు కాంగ్రెస్‌ నేతల హత్య

కడప లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలు మరో 48 గంటల్లో జరగాల్సి ఉండగా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెలో పాత కక్షలు పురివిప్పాయి. కాంగ్రెస్‌ గ్రామస్థాయి నాయకులు రాజువారి లక్ష్మీనారాయణ(32), రాజువారి సుబ్బరాయుడు(55) దారుణ హత్యకు గురయ్యారు. దీంతో జిల్లా ఉలిక్కిపడింది. పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెకు.....

లాడెన్‌ మృతి వెనుక వాస్తవాలేంటి?

మూఢనమ్మకాల సాక్షిగా..

6, మే 2011, శుక్రవారం

కడపలో ముంచేశారు : * మంత్రులపై సిఎం అసంతృప్తి! * నేడు అధిష్టానం దృష్టికి?

కడప ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రుల వైఖరిపై ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి నప్పటికీ రాష్ట్ర మంత్రులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించారన్న అభిప్రాయానికి సిఎం వచ్చినట్లు సమాచారం. ఉప ఎన్నికల కోసం కడపలో .......

కూతుళ్లను చంపిన కుల దురహంకారం : సజీవ దహనం చేసిన తల్లి, మేనమామలు

హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆటవిక చర్యలు... తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగాయి. ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలకు ప్రస్తుతం మన రాష్ట్రం కూడా వేదికగా నిలిచింది. తక్కువ కులం వ్యక్తిని.....

శిరిడిసాయిగా నాగార్జున

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేసిన నాగార్జున, మరోసారి రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'శిరిడిసాయి'గా తెరమీదకు రానున్నారు. పరుచూరి బ్రదర్స్‌ రచన చేశారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 'నాగబాల' సీరియల్‌ తీసిన భక్త సురేష్‌కుమార్‌ కథాసంకలనం చేశారు. మహేశ్వరరెడ్డి నిర్మిస్తున్నారు...................

అందరికీ అభివృద్ధి ఫలాలు

'మేము చైనా ప్రజలందరికీ సంతోషదాయకమైన, చక్కటి జీవితం అందించాలని కోరుకుంటున్నాం. మా అభివృద్ధి ఫలాలు కొద్ది మందికి గాక అందరికీ అందేలా చూడాలని భావిస్తున్నాం. ప్రజల ప్రయోజనాలను స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు చక్కగా నెరవేర్చేలా మేము గ్యారంటీ ఇస్తాం' అని కెనడాలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్సారు చెప్పారు. చైనా భవిష్యత్‌ అభివృద్ధి లక్ష్యాన్ని తమ 12వ పంచవర్ష ప్రణాళిక ప్రజలకు తెలియజేస్తుందని అన్నారు. చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన కెనడా-చైనా ఫ్రెండ్‌షిప్‌ సొపైటీ ఆఫ్‌ ఒట్టావా (సిసిఎఫ్‌ఎస్‌-ఒట్టావా) 35వ.....................

సజీవంగానే పట్టుకొని కాల్చి చంపారు : ప్రత్యక్షసాక్షి వివరణ

అమెరికా ప్రత్యేక దళానికి చెందిన కమాండోలు నిరాయుధుడిగా ఉన్న తన తండ్రిని సజీవంగా పెడరెక్కలు విరిచిపట్టుకొని కాల్చి చంపినట్లు తండ్రి మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన లాడెన్‌ 12 ఏళ్ల కుమార్తె చెప్పింది. లాడెన్‌ మృతికి సంబంధించి వైట్‌హౌస్‌ ఎప్పటికప్పుడు కథనాలను మారుస్తుండటంతో వాస్తవ పరిస్థితులేమిటన్నది...

'సత్యసాయి' వారుసుడు లేనట్టే..!

సత్యసాయి వారుసుడు లేనట్టే... శాశ్వత అధ్యక్షుడిగా సత్యసాయిబాబానే కొనసాగించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌, శ్రీనివాసన్‌, ఎస్‌వి.గిరికి సంయుక్తంగా చెక్‌పవర్‌ కల్పించారు. ఇక నుంచి ఈ ముగ్గురు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో తీర్మానించారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని......

ఇక మోస్ట్‌ వాంటెడ్‌ నెం.2 దావూద్‌ లాడెన్‌ మరణంతో ప్రమోషన్‌

1993 నాటి ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడైన భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం ఇప్పుడు ప్రపంచ మోస్ట్‌వాంటెడ్‌ నెం.2గా ఎదిగాడు. ఇప్పుడీ మోస్ట్‌వాంటెడ్‌ నేరస్తుడు లాడెన్‌ తరహాలోనే పాకిస్తాన్‌లోనే వుండి వుండవచ్చని గార్డియన్‌ పత్రిక తన తాజాసంచికలో ప్రచురించిన వార్తా కథనంలో పేర్కొంది. ప్రపంచపు మోస్ట్‌వాంటెడ్‌ వ్యక్తుల......

5, మే 2011, గురువారం

వైజాగ్‌లో వెంకటేష్‌ చిత్రం

మా దేశంలో లేడంటే లేడు : లాడెన్‌ ఆచూకీపై పలు మార్లు పాక్‌ ప్రకటన

2009లో అధ్యక్షుడు జర్దారీ పలు సందర్భాలలో లాడెన్‌ మరణించి వుండవచ్చని వ్యాఖ్యానించినట్లు అమెరికన్‌ దౌత్య పత్రాలు వివరిస్తున్నాయి. లాడెన్‌ తమ దేశంలో లేనే లేడని ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ 2008లో పాక్‌ను సందర్శించిన అమెరికన్ల సెనేటర్ల బృందానికి వివరించినట్లు ఇస్లామాబాద్‌ నుండి అమెరికా దౌత్య కార్యాలయం..........

ప్రముఖుల పాలిట మృత్యు విహాంగాలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఖండు దోర్జీ దుర్మరణం ఆకాశయాన చరిత్రలో మరో విషాద అధ్యాయం రచించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి దుర్మరణాన్ని ఇంకా మర్చిపోకముందే పదవిలో ఉన్న మరో ముఖ్యమంత్రి అదే విధంగా మృతి చెందడం అత్యంత విచారకరం. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు హెలికాప్టర్‌, విమాన ప్రమాదాల్లో.............

గోదాములు ఖాళీ చేయించే పేర బియ్యం ఎగుమతికి స్వేచ్ఛ

రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఉప్పుడు బియ్యం, ముడి బియ్యాన్ని ఎటువంటి షరతులూ లేకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోడానికి మిల్లర్లు, వ్యాపారులకు ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ ఆదేశాలు రెండు నెలల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. రబీ ధాన్యం సేకరణపై బుధవారం సమీక్షించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బియ్యం ఎగుమతులకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. బియ్యం ఎగుమతికి పర్మిట్లు ఇవ్వాలని మిల్లర్లు తెచ్చిన ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బియ్యం నిల్వలు విధిగా....................

లాడెన్‌తో మరణించిన ఇద్దరూ పాకిస్తానీయులే!

ఆదివారం రాత్రి అబొట్టాబాద్‌లో జరిగిన దాడిలో లాడెన్‌తో పాటు మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌, తారిక్‌ ఖాన్‌లుగా గుర్తించారు. వీరిరువురూ పాకిస్తానీయులేనని పాక్‌ మీడియా వెల్లడించింది. అతి తక్కువ స్థాయి వ్యాపారులైన వీరిరువురూ సోదరులు కానీ, బంధువులు కానీ అయి వుంటారని లాడెన్..........

బిటి పత్తి .. ఆకాంక్షలు .. అనుభవాలు..

రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తూ వ్యవసాయోత్పత్తుల అవసరాల్ని 21వ శతాబ్దంలో కూడా తీర్చడానికి రెండవ (లేదా) నిరంతర హరిత విప్లవం కావాలని పాలకులు చెపుతున్నారు. హరిత విప్లవ కాలం (1965-85) లో వ్యవసాయోత్పత్తిలో సాధించిన విజయాలు, పరిమిత స్థాయిలోనైనా, వ్యవసాయమే జీవనాధారంగా కలవారి నిజాదాయాల్ని పెంచింది. ఆ తర్వాత అమలుచేసిన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల దుష్ప్రభావాల నేపథ్యంలో 'మరో హరితవిప్లవం' అవసరమని పాలకులు చెపుతున్నారు. కానీ, కొత్తగా తీసుకురావాలంటున్న హరిత విప్లవంలో రైతుల, వినిమయదారుల స్థానమేంటో స్పష్టం చేయడంలేదు. మరో హరిత విప్లవం యొక్క స్వరూప, స్వభావాల్ని కూడా వివరించడం లేదు. రైతుల బాగోగులు,...........................

స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వమే మార్క్స్‌

సామాజిక, ఆర్థిక అసమానతలకు మూలమైన ఉత్పత్తి విధానం నేడు ఫైనాన్స్‌ పెట్టుబడిపై ఆధారపడి నడుస్తోంది. పెట్టుబడి గ్రంథంలో మార్క్స్‌ సరుకు స్వభావాన్ని వర్ణించాడు. అది ఎలా విశ్వవ్యాపితమవుతుందో కూడా వివరించాడు. సరుకు సృష్టించే ప్రళయంలో నుంచే విప్లవం పుట్టుకొస్తుందని మార్క్స్‌ చెప్పాడు. నేడు అనేక దేశాల్లో అదే జరుగుతోంది. అమెరికా మేధావుల ఊహలకు అందకుండానే మధ్య ప్రాచ్యంలో మతానికతీతంగా ప్రజల తిరుగుబాట్లు చూస్తున్నాం....................

సిగరెట్‌ మానేయాలనుకుంటున్నారా..! ఈ - సిగరెట్‌ తాగండి!

ప్రధానిని చంపుతాం

అమెరికా నయవంచన

4, మే 2011, బుధవారం

సంయుక్త ఆపరేషన్‌ కాదు - లాడెన్‌ హత్యపై జర్దారీ (ఇరకాటంలో పాకిస్తాన్‌)

ఇలాంటి స్పందన నా కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు : ప్రభాస్‌

ఫస్ట్‌ కమ్యూనికేటర్‌ ఎవరో తెలుసా?

మీరు కోరుకున్న అవకాశాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇష్టమైన ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. అలా అనుకున్నంత మాత్రాన సరిపోదు కదా! వెంటనే రెజ్యూమ్‌ సమర్పిస్తారు. అంటే మీ గురించి తెలియజేసే మొట్టమొదటి కమ్యూనికేటర్‌ ఇదేనన్నమాట. అందుకే ప్రస్తుతం దీనికింత ప్రాధాన్యత లభిస్తోంది. తొలి కమ్యూనికేషన్‌లోనే ఆకట్టుకునే నైపుణ్యం ప్రదర్శిస్తే... ఆకర్షించే ఆకృతిని మేళవిస్తే అవకాశం దక్కే మార్గం సుగమమైనట్లే అంటున్నారు నిపుణులు. మరి అదెలాగో తెల్సుకుందామా!........................

కుటుంబకథా చిత్రాలు రావాలి : దాసరి

తెలుగు సినీ చరిత్రలో తమదైన ముద్ర వేసిన అతికొద్దిమంది వ్యక్తుల్లో దాసరినారాయణరావు ఒకరు. వెండితెరపై ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ ఎలానో, తెరవెనుక దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు అలా. దర్శకరత్నగా పరిశ్రమ ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటుంది. వృత్తిగతంగా ఎంతోమందికి తెరపై చోటు కల్పించిన దాసరి, వ్యక్తిగతంగానూ అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా తన పుట్టినరోజున ఏదో ఒక మంచి పనిచేయటం, వాటిని చక్కగా ఆచరణలో పెట్టటం ఆయన తరహా. ఈ ఏడాది 'నీడ దాసరి ఛారిటబుల్‌' అనే సంస్థను ప్రారంభిస్తున్నారు. మరి ఈ ఛారిటీ విశేషాలు, సినీ సంగతులు ఆయన మాటల్లో విందాం..........................

హెలికాప్టర్‌ ప్రమాదంలో అరుణాచల్‌ సీఎం మృతి

అవార్డులొస్తాయని తీయలేదు

మంత్రి పదవి ఇస్తానన్నా ఎందుకెళ్ళావ్‌ ?

అభిమానులకు శుభవార్త ఐపిల్‌-4లో గంగూలీ

3, మే 2011, మంగళవారం

ఒసామా జీవిత విశేషాలు ...

బిన్‌ లాడెన్‌ హతం

 
అమెరికాకు వెన్నులో వణుకు పుట్టించిన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ మరణించాడు. ఆఫ్ఘన్‌, పాక్‌ సరిహద్దుల్లో తమ దళాలు లాడెన్‌ను చంపినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఒబామా ఈ ప్రకటన చేశారు. అటు పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం లాడెన్‌ కుమారుడితో.....

ఆస్తమా నియంత్రణ మీ చేతుల్లోనే

ఆస్తమా వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో పది మంది బాధపడుతున్నారు. అతి వేగంగా పెరుగుతున్న జనాభా , అంతకంతకు అధికమవుతున్న వాతావరణ కాలుష్యం, పారిశ్రామికీకరణ ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్యను మరింత పెరగడానికి దోహదం చేస్తుంది. ఆస్తమాతో బాధపడే వారు ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. వైద్యరంగం అభివృద్ధి చెంది, కొత్త మందులు, చికిత్స విధానాలు వచ్చినా రోగుల్లో ఆస్తమా పట్ల అవగాహన పెరగడమే ముఖ్యం. మే 3న ప్రపంచ ఆస్తమా దినం. ఈ ఏడాది నినాదం 'మీ ఆస్తమాను మీరే నియంత్రించుకోగలరు' (యు కెన్‌ కంట్రోల్‌ యువర్‌ ఆస్తమా). ఈ ఆస్తమా గురించి ఊపిరితిత్తుల వ్యాధినిపుణులు డాక్టర్‌ సుధీంద్రతో ప్రత్యేక ఇంటర్వ్యూ.............................

పాపి కొండల్లో ప్రయాణం

ప్రతి ఏటా ఏదొక కొత్త ప్రదేశంలో వార్షిక సమావేశం జరుపుకునే 'ప్రజాశక్తి' విజయవాడ ఎడిషన్‌ మిత్రులు - ఈసారి రాజమండ్రిని వేదిక చేసుకున్నారు. తొలిరోజు సమావేశం పూర్తి చేసుకొని, రెండోరోజు పాపికొండల యాత్రకు బయల్దేరారు. ఆతిథ్యమిస్తున్న రాజమండ్రి ఎడిషన్‌ నుంచి మేం కూడా కొంతమందిమి వారితో కలిసి వెళ్లాం... ఆహ్లాదంగా సాగిన ఆ ప్రయాణ విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం...............

హక్కుల ముసుగులో అమానుషాలు

స్పృహలోకొచ్చిన అక్బరుద్దీన్‌

కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చినట్లు తాజా బులెటిన్‌లో ఆసుపత్రి వర్గాలు ఆసుపత్యి. ఈ విషయం తెలియడంతో మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని తమ నేత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ రోడ్డుపైనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో కేర్‌ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు......

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే...

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే... తర్వాత మరేదైనా మంచి టైటిల్‌ అనుకుంటే తప్పకుండా మారుస్తామని నిర్మాత తిరుమల శెట్టి నీలిమ అన్నారు. సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కామీడియా వర్క్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై నిర్మించనున్న చిత్ర విశేషాలను ఆమె వెల్లడించారు.........

2, మే 2011, సోమవారం

మేడే నాడు ఏం జరిగింది?

ప్రపంచ కార్మికుల పోరాట స్ఫూర్తికి సంకేతమైన మే దినోత్సవానికి కారణమైన చికాగో ఘటనల ప్రత్యక్ష సాక్షి కథనం ఇది. అమెరికాలోనే గాక ప్రపంచ వ్యాపితంగా పోరాటాల మాతృమూర్తిగా మన్నన పొందిన మదర్‌ జోన్స్‌ జ్ఞాపకాల పునర్ముద్రణ. జోన్స్‌ అసలు పేరు మేరి హారిస్‌ (1837-1930) ఐర్లాండులో పుట్టిన జోన్స్‌ కుటుంబం ఆమె శైశవ దశలోనే కెనడా వలస వెళ్లింది. దర్జీగా పని చేసే మేరీ ఇంట్లో 1871లో అగ్ని ప్రమాదం జరిగి భర్త, నలుగురు పిల్లలు మరణించారు. తర్వాతి కాలంలో ఆమె పూర్తిగా కార్మికోద్యమానికి అంకితమైనారు..........

ముందు దర్శకుడ్ని మెప్పించాలి

కార్తిక్‌ కుమార్‌ సినీ ప్రేక్షకులకు కొత్తేమో కానీ, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా హైదరాబాద్‌కు పాతే. ఈవం అనే అతని గ్రూప్‌ ప్రదర్శించిన అనేక ప్రోగ్రామ్స్‌ ఇక్కడి ప్రేక్షకులు చూశారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ పరిచయం హైదరాబాద్‌తో కొనసాగుతోంది. కార్తిక్‌ కుమార్‌ కొత్తగా వెండితెరపైకి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.........

పాట రాయడం కన్నా... రాసింది ఓకే అనిపించుకోవడమే కష్టం..!

ఇవాళ పాట రాయడంలో కష్టం ఏమీ లేదు. కానీ, రాసిన పాటకు పచ్చజెండా ఊపించుకోవడమే అసలు కష్టంగా మారింది. కొంత కాలం నిర్మాతలు, మరికొంత కాలం దర్శకులు, ఇంకొంత కాలం సంగీత దర్శకులు, ఇప్పుడేమో సోకాల్డ్‌ పెద్ద హీరోలు పాటను శాసిస్తున్నారు. ఏ పాట ఎలా కావాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఇవాళ పాట అలా చేతులు మారుతోంది. చివరకు పాట ఏ రూపంలో, ఎలా సినిమాలో బయటకు వస్తుందనేది తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా అవుతుందన్నంత కష్టంగా తయారైంది. కానీ, పూరీ జగన్నాథ్‌, రవిబాబు లాంటి కొందరు దర్శకులు మాత్రం ఇవాళ్టికీ తమ చిత్రాల్లోని పాటలకు తామే నిర్దేశకులు. వాళ్ళ ప్రోద్బలం, ప్రోత్సాహం వల్లే నేను ధైర్యంగా అనుకున్నది రాయగలుగుతున్నా......................

సైనిక అణచివేతపై సిరియన్ల నిరసన

సిరియాలో ప్రజాస్వామ్య ఉద్యమకారులపై సైన్యం కొనసాగిస్తున్న అణచివేతను డేరా నగర పౌరులు తీవ్రంగా నిరసించారు. డేరా నగరంలో శనివారం సైన్యం కొనసాగించిన ఊచకోతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలనకు వ్యతిరేకంగా దాదాపు ఆరు వారాల నుండి కొనసాగుతున్న ఆందోళనను అణచివేసేందుకు వారం క్రితం డేరా నగరంలోకి ప్రవేశించిన సైన్యాలు నిరసన ప్రదర్శనలను అణచివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రజలకు విద్యుత్‌, కమ్యూనికేషన్‌ సౌకర్యాలను నిలిపివేసి తీవ్ర ఇబ్బందులు

'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' ‌...ఓకే !

తెలుగు సినిమా బాక్సాఫీస్‌ కిటకిటలాడాలంటే అటు యూత్‌ను, ఇటు ఫ్యామిలీని ఆకట్టుకోవాలి. మాస్‌ ఎలిమెంట్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ను నమ్ముకుంటే...యూత్‌ నుండి ఒకే ఒక టికెట్‌ రాలుతుంది. దీంతో నిర్మాత గట్టెక్కలేడు. గట్టెక్కాలంటే ఫ్యామిలీ ద్వారా నాలుగు టికెట్స్‌ తెగాల్సిందే ! ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు బాగా...........

ఉద్యోగం దొరికిందా!

1, మే 2011, ఆదివారం

అలా మొదలైంది వందరోజుల వేడుక

రంజిత్‌ మూవీస్‌పతాకంపై నందినీ రెడ్డిని దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది' వందరోజుల వేడుక శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కె.రాఘవేంద్రరావు, కైకాల సత్యనారాయణ, సుమన్‌, మురళీమోహన్‌, జగదీష్‌ప్రసాద్‌, కె.రాఘవ మొదలైన సినీ పెద్దలు కార్యక్రమానికి హాజరై రంజిత్‌కుమార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..........

ప్రపంచం మీ అరచేతిలోనే!

దశాబ్దం కిందట సొంతంగా మొబైల్‌ ఫోన్‌ వుండటమే ఓ విలాసం. ఇప్పుడు పరిస్థితి చెప్పక్కర్లేదు. జీవితంలో మొబైల్‌ ప్రాథమిక అవసరమై పోయింది. సాంకేతిక రంగంలో ఇదో విప్లవం. చేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్‌లోనే మొబైల్‌ ఇంటర్నెట్‌ రూపంలో మరో విప్లవం చోటుచేసుకుంది. ప్రపంచం ఇక మీ అరచేతిలోనే. మొబైల్‌లోనే బ్రౌజింగ్‌, ఇమెయిల్స్‌, ఛాటింగ్‌, ఇ-బ్యాంకింగ్‌ వంటి అనేక ఫీచర్లు వుండడంతోపాటు దేశంలో 3జి సేవలు అందుబాటులోకి రావడంతో మొబైల్‌ ఇంటర్నెట్‌కు తెరలేచింది. అత్యంత వేగవంతమైన ఈ 3జి సేవల వలన మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య మరింతగా ఊపందుకుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ మార్కెట్‌ పురోగతిపై ప్రపంచవ్యాప్తంగా ''బిజ్‌సిటి'' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగంలో మొదటి పది దేశాల్లో మనదేశంతోపాటు చైనా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.......................

భారీ మేడే ప్రదర్శనలు

క్యూబా కమ్యూనిస్టు పార్టీ మహాసభ జరిగిన నాటి నుంచీ తొలిసారిగా అందులో అంగీకరించిన ఒప్పందాలకు ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపేందుకు వచ్చిన మొదటి అవకాశం మేడే ప్రదర్శనలు. తమ మద్దతు తెలిపేందుకు ఆదివారం ప్లాజా డీ లా రివల్యూషన్‌, దేశంలోని ఇతర సాంప్రదాయిక కేంద్రాల్లో లక్షలాది మంది పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆ ఒప్పందాలను నెరవేర్చడంలో తమ చిత్తశుద్ధిని, విప్లవం, కమ్యూనిస్టు పార్టీ చుట్టూ బలమైన ఐక్యతను చాటేందుకు ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్మిక దినోత్సవాన్ని భారీగా............

సత్యసాయిబాబా ట్రస్టు అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌కే అవకాశం ?

సత్యసాయి బాబా వారుసుడెవరన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 1972లో ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సత్యసాయిబాబానే అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ఏప్రిల్‌ 24న సత్యసాయి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్నది మీమాంశ మొదలైంది. అనేక తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థానం కోసం ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్‌, రత్నాకర్‌ పోటీపడుతున్నారు............

చంద్రబాబుపై దాడి : రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసురుతూ జగన్‌ అనుచరుల వీరంగం

 పులివెందుల శాసనసభా స్థానంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వారుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ అనుచరులు శనివారం దాడి చేశారు. శుక్రవారం పిఆర్‌పి నేత చిరంజీవి వాహనశ్రేణిపై కూడా ి చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారంలో........

అరుణాచల్‌ సిఎం హెలికాప్టర్‌ గల్లంతు

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ శనివారం ఉదయం నుంచీ గల్లంతైంది. భూటాన్‌లో దిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినప్పటికీ దాని జాడ తెలియలేదు. దోర్జీ హెలికాప్టర్‌ భూటాన్‌లో దిగినట్లు ఎలాంటి సమాచారం లేదని ఆ దేశంలోని భారత రాయబారి సాయంత్రం తెలిపారు. భూటాన్‌లో ముఖ్యమంత్రి..........

1992 నుండి లంక ఫిక్సింగ్‌ : శ్రీలంక మాజీ కెప్టెన్

30, ఏప్రిల్ 2011, శనివారం

విలీనం ప్రసక్తే లేదు : కెసిఆర్‌

కాంగ్రెస్‌ పార్టీకి విలీనమనే పిచ్చి పట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీయే కాదు ఏ పార్టీలోనూ టిఆర్‌ఎస్‌ విలీనమయ్యే ప్రసక్తే లేదు. దుర్మార్గులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. ఇప్పడికైనా కాంగ్రెస్‌ నేతలు దిక్కు మాలిన ప్రచారం మానుకోవాలి. లేకుంటే కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో విలీనం చేసే పరిస్థితి........

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై కాల్పులు : పరిస్థితి విషమం

ఫలించిన ఎండోసల్ఫాన్‌ వ్యతిరేక పోరాటం

ప్రపంచ ఎండోసల్ఫాన్‌ తయారీ, వినియోగంలో మన దేశమే అగ్రస్థానంలో వుంది. ప్రపంచ వినియోగంలో 20 శాతానికి పైగా మన దేశంలోనే వుంది. దీనిని ప్రధానంగా ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌, కోరమాండల్‌ ఫర్టిలైజర్స్‌, హిందూస్థాన్‌ ఇన్సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ (భారత ప్రభుత్వ సంస్థ)లు తయారు చేస్తున్నాయి. వార్షికంగా 8,500 టన్నులు ఉత్పత్తి కాగా సగం పైగా దేశంలోనే వాడుతున్నారు. ఈ లాబీయే ఎండోసల్ఫాన్‌ వినియోగాన్ని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. అందుకే ఇన్నాళ్లూ తాత్సారం చేసింది.......................

ఏడు ఖండాలు - ఎనిమిది నెలలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దంపతులు వారు. పదహారణాల తెలుగువాళ్లు. దిగంతాల్లో భారత పతాకాన్నే కాదు, తెలుగు కీర్తిని ప్రతిష్టించిన వారు ప్రకృతి ప్రేమికులు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం గలవారు. అందుకే కలిసికట్టుగా ఏడు ఖండాలలోనూ మారథాన్‌ చేయాలనుకున్నారు. ఆ సుదూర పరుగు కూడా నగరాల మధ్య కాదు... అడుగుపెట్టడానికి సాహసించని దట్టమైన అరణ్యాలు, సూర్య కిరణాలు నిట్టనిలువుగా తాకే భూమధ్యరేఖ ప్రాంతం, నాలుక పిడచకట్టుకుపోయే ఎడారులు, మోకాళ్లవరకూ కూరుకుపోయే మంచు ప్రాంతాలు... జీవజాలమే కనిపించని ధృవ ప్రాంతాల్లో! అదీ కేవలం ఎనిమిది నెలల్లో! కారణం ఒక్కటే! భారతదేశ ఔనత్యం పపంచానికి చాటిచెప్పాలి. అందుకే ఈ మహాక్రతువుకు పూనుకున్నారు. వారే గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ యండి చిగురుపాటి కృష్ణప్రసాద్‌, క్రిస్మా వైనరీన్‌ యండి శ్రీమతి చిగురుపాటి ఉమ. మరి ఆ మారథాన్‌ విశేషాలేంటో ఉమ ద్వారానే తెలుసుకుందామా?!.................................................

బాబా యజుర్మందిరంలో రత్నాకర్‌ మకాం? : సత్యజిత్‌ పరిస్థితి ఏమిటో..?

సత్యసాయి బాబా నివాసమైన యజుర్వేదమందిరంలో రత్నాకర్‌ మకాం వేయనున్నారన్న ప్రచారం పుట్టపర్తిలో జోరుగా సాగుతోంది. రెండంతస్తులున్న ఈ భవంతిలో ఇప్పటి వరకు సత్యసాయి ఒక్కరే ఉంటూ వచ్చారు. ఈ భవంతిలోకి ట్రస్టు సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఉండేది కాదు. రెండంతస్తులున్న ఈ భవంతి పైఅంతస్తులో బాబా ఉండేవారు. ఆయన సహాయకులుగానున్న నలుగురి శిష్యులకు.......

అట్టహాసంగా విలియం వివాహం


బ్రిటన్‌ యువరాజు విలియం, కాటే మిడిల్‌టన్‌ల వివాహం బ్రిటన్‌లో ఘనంగా జరిగింది. శుక్రవారం జరిగిన ఈ వివాహం బ్రిటన్‌ రాచరిక చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. చరిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకన్న వెస్ట్‌మినిస్టర్‌ చర్చిలో ఈ ఇరువురు దంపతులు అయ్యారు. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భారీ తెరల ద్వారా ఆహ్వానితులతో పాటుగా........

హద్దుల్లో ఉంటేనే...

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ముందుగానే వెబ్‌సైట్లో ఫలితాలు!

బాబాపై కోడిరామకృష్ణ సినిమా

నగరం నిద్రపోతున్న వేళ...గీతాలు

తొలగని అనుమానాలు : అన్నింటికీ 'బాబా ఆజ్ఞ' ప్రకారమేనని సమాధానాలు

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు, సందేహాలను ఆ ట్రస్టు సభ్యులు నివృత్తి చేయలేకపోయారు. గురువారం ఉదయం 11 గంటల నుండి దాదాపు రెండు గంటలపాటు సాగిన విలేకరుల సమావేశంలో జెవి.శెట్టి మినహా తక్కిన సభ్యులందరూ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ప్రధానంగా ట్రస్టు సభ్యుడైన శ్రీనివాసన్‌ సమాధానాలిచ్చారు. భక్తుల్లోనున్న అనేక సందేహాలు దీని ద్వారా నివృత్తి ...........

జగన్‌ నిజస్వరూపం బయటపడింది

28, ఏప్రిల్ 2011, గురువారం

మీడియా సృష్టే

పదేళ్ల బాలుడినీ వదల్లేదు

జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల్లో స్థైర్యం నింపేందుకు, పోలీసు కాల్పుల భాధితులను పరామర్శించేందుకు మహారాష్ట్ర సిపిఐ(ఎం) బృందం రత్నగిరి జిల్లాలోని కొంకణ్‌ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు స్థలాన్ని గత 24వ తేదీన సందర్శించింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ ధావళె నేతృత్వంలోని .........

' బాబా పేరు మీద ఎ లాంటి ఆస్తులు లేవు : సత్యసాయి ట్రస్టు సభ్యులు'

దుర్మార్గానికి చిరునామా అమెరికా

'బే ఆఫ్‌ పిగ్స్‌ పోరాటంపై నా రిప్లెక్షన్‌ను కొనసాగిస్తానని వాగ్దానం చేసినందున పెద్ద ఎత్తున సమాచారాన్ని, పుస్తకాలను నేను చదివాను' అని క్యూబా విప్లవనేత ఫైడల్‌ కాస్ట్రో చెప్పారు. ప్రతివారం పెద్ద ఎత్తున సమాచారం వచ్చి పడుతోంది. అది జపాన్‌ భూకంపం నుంచి పెరూలో మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమోరీ కుమార్తె కీకోపై ఒలాంటా హెమాలా విజయం వరకూ ఉంది. పెరూ వెండి, రాగి, సింక్‌, తగరం, తదితర ఖనిజాలను ఎగుమతి చేసే ముఖ్యమైన దేశంగా ఉంది....................

'ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయి'

సత్యసాయి ట్రస్టుపై దుష్ప్రచారం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ట్రస్టు సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. ఈరోజు పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్టు సభ్యులు మీడియాతో సమావేశమయ్యారు. బాబా నిర్యాణంపై ట్రస్టు సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ ట్రస్టు కార్యకలాపాలను మీడియాకు వివరించారు. బాబా ఆరోగ్యం క్షీణిస్తున్న.................

రక్షణ ఒప్పందం వెనుక అమెరికా అసలు వ్యూహం

భారత, అమెరికా మధ్య రక్షణ ఒప్పందాలకు సంబంధించి వాణిజ్యపరమైన కోణాల గురించి అనేక విషయాలను వ్యూహాత్మక, రక్షణ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. భారత రక్షణ మార్కెట్‌ను అమెరికా సరఫరాదారుల కోసం తెరిచి ఉంచడంపై అనేక వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భారత మార్కెట్‌లో వేలాది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపారం చేసుకునే అవకాశాలు అమెరికా కంపెనీలకు ఉన్నాయి. రానున్న కొద్ది మాసాల్లో భారత్‌ 14 బిలియన్‌ డాలర్ల మేరకు రక్షణ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేబుల్స్‌ వెల్లడించాయి. అమెరికా వాణిజ్యపరంగా.................................

బాబా మరణం ముందే తెలుసా? * 20రోజుల క్రితమే శవపేటికకు ఆర్డర్‌ * 5వ తేదేనే పుట్టపర్తికి * బయటపెట్టిన కన్నడ మీడియా


 

సత్యసాయి కోలుకుంటున్నారని, తిరిగి భక్తులకు దర్శనమిస్తారని పదేపదే ప్రకటించిన ట్రస్టు సభ్యులు ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడారు. సాయి కోలుకుంటున్నారంటూ ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయన అంతిమ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. తాజాగా వెలుగులోకొచ్చిన వివరాల ప్రకారం... సత్యసాయి మరణంపై ట్రస్టు సభ్యులకు, ఆస్పత్రి.........

అక్కినేని మూడుతరాల ముచ్చట్లు!

 
స్త్రీ వేషాలతో నటన ప్రారంభించి మహానటుడయ్యారు అక్కినేని. 85 ఏళ్ళ వయస్సులోనూ నటిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగార్జున 52 ఏళ్ళ వయస్సులోనూ యువతతో పోటీ పడుతున్నారు. ఆయన వారసునిగా అతని కుమారుడు నాగచైతన్య ముందుకు వచ్చారు. ఇలా మూడు తరాలు ఒక్కసారి కలిసి తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటివరకు ఉన్న పరిస్థితులు వివరించారు. ఆ వివరాలు..