.

31, మార్చి 2011, గురువారం

'నరసింహ' సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణలు ఎర్రనిచీర ధరిస్తే ఎద్దు వారి వెంటపడుతుంది....! పశువులు ఎర్ర రంగుని గుర్తిస్తాయా? తేనె వల్ల వెంట్రుకలు తెల్లగా మారతాయా?

వైఎస్‌, బాబు జాతకాలు బయటపడ్తాయి

భూ కేటాయింపులపై వేయబోతున్న సభాసంఘం ద్వారా తప్పులున్నట్లు తేలితే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు జాతకాలు బయటికొస్తాయని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో డిఎస్‌ మాట్లాడారు. భూ కేటాయింపులపై ప్రభుత్వం సభాసంఘం వేయడాన్ని తప్పుపట్టడం సరైంది కాదని చెప్పారు. సభాసంఘం వేయకుంటే ఏదో గూడుపుఠాణీ ఉందంటారని, వేస్తే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే ఎలా అని జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకోవాలంటే చాలా రకాలున్నాయని, ఆ ఉద్దేశం తమకు లేదని తెలిపారు. భూ కేటాయింపులు చంద్రబాబు, వైఎస్‌ హయాంలోనే జరిగాయని, సిపిఐ(ఎం), బిజెపి లాంటి పార్టీలు పాలించలేదని, తప్పు తేలితే ఆ ఇద్దరి వ్యవహారమే బయటికొస్తుందని........

సస్యరక్షణ మందులు.. అవశేషాలు.. ప్రభావాలు..

వ్యవసాయోత్పత్తిలో సస్యరక్షణ మందుల వాడకం అనివార్యం చేయబడింది. వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించగల ప్రత్యామ్నాయాలు రైతులకు చేరడం లేదు. వీటి ఆచరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వాడకాన్ని కనీసస్థాయికి తగ్గించగల సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతుల ఆచరణకు నోచుకోవడం లేదు. మందుల తయారీ కంపెనీల పరోక్ష, ప్రత్యక్ష ప్రభావం, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం సమగ్ర సస్యరక్షణకు నోచుకోక విచక్షణా రహిత మందుల వినియోగానికి దోహదపడుతుంది. ఇది ఉత్పత్తుల్లో అవశేషాలను హాని కలిగించే కనిష్ట స్థాయిని మించుతోంది. మందుల వాడకం, ఆ తర్వాత అధికంగా ఉన్న అవశేషాలు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని తగ్గించడానికే ప్రవేశపెట్టామని చెపుతున్న బిటి పంటలు (బిటి విషాహార పంటలు) కూడా పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని ప్రచారం చేసినట్లుగా తగ్గించలేదు. ఈ నేపథ్యంలో, సస్యరక్షణ మందుల వాడకంలో ఉన్న ఇబ్బందుల్ని, ప్రభావాల్ని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సుస్థిర వ్యవసాయోత్పత్తి కేంద్రం సహకారంతో రేఖామాత్రంగా విశ్లేషిస్తూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది................................

కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం

మయన్మార్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం జుంటా పాలన అధికారికంగా బుధవారం రద్దయింది. మయన్మార్‌ మారుమూల రాజధాని నేయిప్‌టావ్‌లో అధ్యక్షుడు థీన్‌ సీన్‌ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం చేత పార్లమెంటు పదవీ స్వీకార ప్రమాణం చేయించినట్లు ప్రభుత్వ టీవీ, రేడియో తెలిపాయి. థీన్‌ సీన్‌ గత సైనిక ప్రభుత్వంలో ప్రధానిగానూ, అందులో ఒక ఉన్నతస్థాయి సభ్యునిగానూ ఉండేవారు. ప్రజాస్వామ్యానికి మార్పు చెందే క్రమంలో భాగంగా ఈ పరిణామాలు జరిగాయి. అయితే ఇదంతా బూటకమంటూ అంతటా విమర్శలు వచ్చాయి.

ప్రజాతంత్ర హక్కులకు ప్రమాదం

ఈనాటి ప్రపంచ ద్రవ్య పెట్టుబడుల శకంలో సామ్రాజ్యవాదం, మానవ నాగరికత సాగించే ప్రజాతంత్ర పురోగమనంపై బహుముఖ దాడి చేస్తున్నది. ప్రస్తుత కాలంలో ఇది సంక్షేమ రాజ్యం పట్ల విశృంఖల దాడి మినహా మరొకటి కాదు. ఐరోపాలో మనం దీనిని చూడవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికన్‌ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం లండన్‌ వాసులు నిరసనలు తెలిపారు. ఇదేవిధంగా పలు దేశాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేమంటే, ఇప్పుడు సాగుతున్న పోరాటాలన్నీ ఆత్మరక్షణ స్వభావం కలిగినవే. అంటే, ఇంతకుముందు పోరాడి సాధించుకున్న ప్రయోజనాలను కాపాడుకోవటమే ధ్యేయంగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి...............

ఒకే ఒక్కడుగు

కామెడీ విలనిజానికి కేరాఫ్‌ అడ్రస్‌

1
దేశం చాలా క్లిష్టపరిస్తితుల్లో ఉంది...అంటూ డైలాగ్‌కు తనదైన మ్యానరిజాన్ని, కామెడీ విలనిజాన్ని జోడించిన అరుదైన నటుడు నూతన్‌ప్రసాద్‌. రావుగోపాల్‌రావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ...వంటి ఉద్ధండుల మధ్య ప్రత్యేకత నిలుపుకున్న యాక్టర్‌ ఆయన. బుధవారం ఆయన మృతి చెందారన్న వార్త సినీ అభిమానులందర్నీ బాధపెట్టింది. నాటకరంగం నుంచి వెండితెరకు వచ్చిన అతికొద్దిమంది ఆణిముత్యాల్లో నూతన్‌ ప్రసాద్‌.....

సెన్సార్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా నర్తకి లీలా శామ్సన్‌

సుప్రసిద్ధ భరత నాట్య కళాకారిణి, రచయిత్రి లీలా శామ్సన్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితు లయ్యారు. లీల ప్రస్తుతం సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఉన్న విషయం విదితమే. ఇప్పటి వరకూ రెండుసార్లు సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా ఉన్న సినీనటి షర్మిలాటాగూర్‌ స్థానంలో....

30, మార్చి 2011, బుధవారం

వస్తూత్పత్తి రంగంలో చైనా ఆధిక్యత

ఎగుమతుల్లో చైనా సాధించిన అద్భుత పురోగతి బయటి దేశాలకు భయాన్ని కల్గిస్తున్నది. 2008లో సంక్షోభం ఉనికిలోకి రాక ముందు వస్తువుల, సేవల ఎగుమతులు జిడిపీలో ఐదింట రెండొంతులని అంచనా. దేశీయ డిమాండుపై చైనా ఎక్కువగా ఆధారపడుతుండటంతో దీనిలో తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ చైనా ఒక మహత్తర శక్తిగా ఎక్కడ ఆవిర్భవిస్తుందోనన్న భయం బయటి దేశాలకు లేకపోలేదు. అత్యధిక జనాభా, తక్కువ తలసరి ఆదాయం కారణంగా రానున్న దశాబ్దాలలో చైనా వృద్ధి రేటు ఎక్కువగా ఉండగలదని దాని పోటీదారులు భయపడుతున్నారు..............

హీరోలుగా నిలిచిన జపాన్‌ 'అణు' కార్మికులు

జపాన్‌లోని ఫుకుషిమ అణు రియాక్టరులో విషమస్థితి నెలకొని ఉన్నప్పటికీ విపత్తు నివారణకు కార్మికులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల దృష్టిలో వీరే హీరోలు. అన్న పానాదులు మరచి ఈ కార్మికలు శ్రమిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు భద్రత గది నుంచి వెళితే సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వస్తున్నారు. వెళ్లే ముందు అల్పాహారం కింద కాసిని బిస్కట్లు, కూరగాయల జ్యూసు తీసుకుం టున్నారు. మధ్యాహ్న భోజనం లేదు..............

యునైటెడ్‌ మూవీస్‌ బ్యానర్‌పై రానా, జెనీలియా

'సింహా' చిత్రాన్ని అందించిన 'యునైటెడ్‌ మూవీస్‌' మరో క్రేజీ కాంబినేషన్‌తో ముందుకు వస్తోంది. దగ్గుబాటి రానా, జెనీలియా జంటగా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌ 9న నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. 'లీడర్‌ ద్వారా ఆర్టిస్టుగా తానేంటో రానా నిరూపించుకున్నాడు. 'నేను నా రాక్షసి'తో కమర్షియల్‌ స్టామినా చూపించబోతున్నాడు.................

మాస్‌ సరిపోదన్నారు

లవర్‌బాయ్ గా సినీ ప్రవేశం చేసిన నటుడు నితిన్‌. దాదాపు 14 చిత్రాల్లో కథానాయకునిగా నటించారు. ఎనిమిది పలకల శరీర దారుఢ్యాన్ని సాధించిన అతికొద్ది మంది తెలుగు హీరోల్లో నితిన్‌ ఒకరు. తనవంతు ప్రయత్నంగా పలు భిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజా చిత్రం 'ఇష్క్‌' శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటోంది. నేడు ఆయన 27వ పుట్టినరోజు ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు ముచ్చటించారు.........

కెప్టెన్సీకి పాంటింగ్‌ రాజీనామా

134 సంవత్సరాల ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రికీ పాంటింగ్‌ టెస్టు, వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. బ్యాట్స్‌మెన్‌గా మాత్రం జట్టులో కొనసాగుతానన్నాడు.36 సంవత్సరాల ఈ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ 2002 నుంచి వన్డేలకు, 2004 నుంచి టెస్ట్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా పాంటింగ్‌ నేతృత్వంలోనే ఆసీస్‌ మూడో యాషెస్‌ సిరీస్‌ను కోల్పోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా 2011 వన్డే ప్రపంచ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోనే............

ప్రతిభతో రాణించగలరా?

గోవర్ధన్‌... సోహెల్‌ ఇద్దరూ ఉద్యోగాన్వేషణలో వున్నారు. కెరియర్లో మార్పుకోసం గోవర్ధన్‌ ప్రయత్నిస్తున్నాడు. ఉన్నత చదువులు పూర్తిచేసి కొలువుకోసం ఎదురు చూస్తున్నాడు సోహెల్‌. అయితే ఏ సంస్థ ప్రకటన చూసినా కొంత అనుభవం, నైపుణ్యం ఉన్న అభ్యర్థులనే కోరుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో అవకాశం సొంతం చేసుకోవడం ఎలా? అనుభవం లేకపోయినా ప్రతిభతో రాణించగలమని రిక్రూటర్లను ఎలా నమ్మించాలి? అన్న ప్రశ్నలతో వారిద్దరూ సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నిపుణులు సలహాలు, సూచనలు ఎంతో అవసరమవుతాయి. .......

29, మార్చి 2011, మంగళవారం

ముంచుకొచ్చిన ప్రమాదం బ్రిటన్‌లో ప్రభుత్వ రంగ కోతలు

బ్రిటన్‌లో ప్రభుత్వ రంగ కోతలు ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున గ్రాంటులు నిలిచిపోతాయి. కాంట్రాక్టులు రద్దవుతాయి. ఛారిటీలు, సేవల సంస్థలు మూతబడటం ప్రారంభమౌతుంది. అనేక నెలలుగా ఎదురుచూస్తున్న దారుణం ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం శీఘ్రంగా చేపట్టిన లోటు తగ్గింపు కార్యక్రమాల దుష్ఫలితాలు వాస్తవ రూపం దాల్చడం ప్రారంభమవుతోంది. వీటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఎలా ఉంటుందనే విషయాన్ని ది గార్డియన్‌ పత్రిక స్థూలంగా పరిశీలించింది...........

అందమైన అతిథి

జనవరి మొదలు జులై వరకు రంగురంగుల పక్షులు అక్కడ కనిపిస్తాయి. ప్రాంతీయ, భాషా బేధాలు మనుషులకే కానీ మాకు లేవంటూ వందల, వేల కిలోమీటర్ల నుండి వలస వస్తాయి. పిల్లలు ఎండాకాలం సెలవులకు ఊరెళ్లినట్లు ఈ పక్షులు కూడా సంవత్సరంలో ఆరు నెలలు ఇక్కడికి వచ్చి సేద తీరుతాయన్నమాట. ఇలా ఒకటి రెండు సంవత్సరాలు కాదు... కొన్ని దశాబ్దాలుగా ఈ పక్షులు వలస వస్తూనే ఉన్నాయి. నాలుగైదు వసంతాల కంటే ఎక్కువ జీవితకాలం లేని ఈ పక్షులకు పుట్టిల్లు అనంతపురం జిల్లాలోని వీరాపురమైతే మెట్టిల్లు రష్యాలోని సైబీరియా ప్రాంతం..............

ప్రశాంత్‌ చిత్రానికి కరుణానిధి కథ

ప్రశాంత్‌ ద్విపాత్రాభిన యంలో త్యాగరాజన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పొన్నార్‌ శంకర్‌'. కరుణానిధి కథ అందిం చారు. లక్ష్మీ శాంతి మూవీస్‌ పతాకంపై రూపొందుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం చెన్నరు ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. తొలి ఆడియోను ముఖ్య మంత్రి కరుణానిధి విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.........

ప్రజాస్వామ్యంపై పచ్చి దాడి

 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చరిత్రలో మరో చీకటిరోజు. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణపై దాడి జరిగింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై సభలోనే దాడి జరిగింది. ఒక అమాత్యుడే అందుకు తెగబడ్డారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారంటూ, విమర్శిస్తున్నారంటూ పట్టరాని కోపంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులపై..........

సముద్ర జలాల్లో విస్తరిస్తున్న రేడియేషన్‌

జపాన్‌ సముద్ర జలాల్లో అణుథార్మికత విస్తరిస్తోంది. టోక్యోకు ఈశాన్యంగా 220కి.మీ. దూరంలో ఉన్న ఫుకుషిమ దాయితీ అణు రియాక్టరు నుంచి వెలువడుతున్న అణుథార్మికతతో సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం క్రమేపి సమీప భూగర్బ ప్రాంతానికి విస్తరించే అవకాశం ఉందని అధికారులు సోమవారం హెచ్చరించారు. ఒక దాని వెంట ఒకటిగా.......

28, మార్చి 2011, సోమవారం

స్నేహ బాలీవుడ్‌ ఎంట్రీ

స్కానింగ్‌ ఓ అద్భుతం!

వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందడంతో గర్భిణీల పాలిట వరంగా అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఆవిర్భవించింది. గర్భిణీలను తప్పనిసరిగా స్కానింగ్‌ చేయించుకోమని వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. తొలి స్కానింగ్‌ గర్భం ధరించిన మూడు నెలల్లోపే చేయించుకోమంటున్నారు. అసలు ఈ స్కానింగ్‌ అంటే ఏంటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దానివల్ల ఉపయోగాలేంటి.......

జర్మనీలో 'అణు' వ్యతిరేకత

జపాన్‌లో అణు ధార్మికత ప్రమాదం ఇతర దేశాల్లో భయాందోళనలు రేపుతోంది. ఆయా దేశాల ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా అణు విద్యుత్కేంద్రాలపై జర్మనీలో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నిరసన పెల్లుబుకింది. అణు రియాక్టర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా సుమారు రెండు లక్షల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొలోన్‌, బెర్లిన్‌, మ్యూనిచ్‌, హాంబర్గ్‌ నగరాల్లోని ప్రజలంతా ప్రభుత్వ అణు విధానాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు...............

గంగపుత్రుల...జీవన చిత్రం

నేడు నూటికి తొంభై ఐదు సినిమాలు కమర్షియల్‌ పంథాలోనే వస్తున్నాయి. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ప్రధానంగా కోరుకునేది కొత్తదనం, వినోదం. ఈ రెండింటినీ కొలబద్దలేసి కృత్రిమంగా చూపిస్తున్న నేటి సినీ వాతావరణంలో సహజసిద్ధమైన 'సొంతవూరు' మట్టి వాసనను దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి మరోసారి చూపాడు. ఆయన తీసిన 'గంగపుత్రులు' ఓ ఊరి జీవన చిత్రం. రాపిడ్‌ ఇండిస్టియలైజేషన్‌, అభివృధ్ది పేరుతో వస్తున్న ఎకనామిక్‌ జోన్లు, స్థానిక ప్రజలపై పడుతున్న ప్రభావం గురించి ఒక్కసారి ఆలోచించమని దర్శకుడు చెప్పదల్చుకున్న పాయింట్‌. శ్రీకాకుళం జిల్లా, సోంపేట సంఘటనతో సినిమా మొదలవుతుంది. పంట పొలాలు కోల్పోయి, కాలుష్యం బారిన పడే అలాంటి అభాగ్యుల మానసిక క్షోభను దర్శకుడు తెలపాలనుకున్నాడు. బిగ్‌స్టార్స్‌, బిగ్‌ ప్రొడక్షన్‌...ఇవేవీ లేకుండా కథను నమ్ముకుని తీసిన సినిమా ఇది. ఇన్ని కోట్లతో తీశాం, ఇన్ని కోట్ల మార్కెట్‌ చేస్తుంది అనే కోణంలో కాకుండా, వాస్తవిక కథను, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయమని చూపటం మెచ్చదగింది. తీసిన నిర్మాతలు వై.రవీంద్రబాబు, కిషోర్‌ బసిరెడ్డిని ప్రశంసించకుండా ఉండలేం. మంచి చిత్రాల కోసం ఎదురు చూసేవారు తప్పక చూడాల్సిన సినిమా...........

భూకంపం వస్తే ఇంతే సంగతులు..! : * భారత్‌లో భవనాలు 90 శాతం ప్రమాదకరం * 60 శాతం భూమి వైపరీత్యానికి అనుకూలం

జపాన్‌లో మాదిరిగా భూకంపం, సునామీ ఒక్కసారిగా విజృంభిస్తే భారత్‌ తట్టుకోలేదు. భూకంప అనంతర పరిణామాలను జపాన్‌ సమర్థంగా ఎదుర్కొంటోందని, అంతటి శక్తి సామర్థ్యాలు భారత్‌కు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని భవనాల సామర్థ్యం ఏపాటిదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారత్‌లోని భవనాల్లో 90 శాతం ప్రమాదకరమైనవే........

కోటి రెట్లు పెరిగిన 'ధార్మికత'

27, మార్చి 2011, ఆదివారం

సూపర్‌ మూన్‌ వచ్చాడు... వెళ్లాడు

వారం పదిరోజుల పాటు ప్రపంచాన్ని ఆందోళలనకు గురిచేసిన మూన్‌ (ఆందోళనకు గురి చేసింది సూపర్‌ మూన్‌ కాదు, ఆ పేరుతో మనలో కొందరు) ఎప్పటిలా, మామూలుగానే ఉందయించింది, అస్తమించింది. భూగ్రహంపై ఎక్కడా మరో అగ్నిపర్వతం బద్దలు కాలేదు, సముద్రాల లోతు నుండి ప్రకంపనలు వెలువడలేదు. సునామీలు తెగబడలేదు. ఎక్కడా సైక్లోన్లూ, టార్నెడోలూ, హరికేన్లూ పుట్టలేదు. అంతా ప్రశాంతమే....

మనసుందా...? మార్గమూ ఉంది...! ( కోట్ల కొద్దీ బడ్జెట్‌తో రెండేళ్ళు కష్టపడి సినిమాలు తీస్తుంటే, రెండు వారాలు కూడా ఆడడం లేదన్నది సినీ రంగంలో ఎదురు దెబ్బలు తిన్న ఏ పెద్ద దర్శక, నిర్మాతను కదిలించినా అనే మాట)

 అసలు సినిమాను అన్నేసి రోజులు తీయాల్సిన అవసరం ఉందా? అన్నన్ని కోట్లు పెడితే కానీ సినిమా తీయలేమా? ఇలాంటి ప్రశ్నలకు జవాబుగానా అన్నట్లు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా అందించిన చిత్రం - 'దొంగల ముఠా'. శ్రేయా ప్రొడక్షన్స్‌ - రామ్‌గోపాల్‌ వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. అసలు సినిమా తీయాలంటే ఎంత డబ్బు, ఎన్ని రోజులు కావాలన్న అంశంపై చర్చను లేవనెత్తింది......

స్వేచ్ఛ... స్వేచ్ఛ...

సిరియా సైనిక దళాలు దేశవ్యాప్తంగా నిరసనకారులపై కాల్పులు జరిపాయి. రాజధానిలోని చారిత్రక పాత నగరంలో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గుంపులు ఘర్షణ పడ్డాయి. సంస్కరణలు డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. దక్షిణ ప్రాంతంలోని గ్రామీణ నగరంలో ఎనిమిది రోజుల క్రితం ప్రారంభమైన తిరుగుబాటు శుక్రవారం నాటికి అనేక నగరాలకు విస్తరించి వేలాదిగా నిరసనకారులు వీధుల్లోకొచ్చారు. నిరసనకారులు రక్తమోడుతున్న మృతదేహాల వద్ద కూర్చొని ఏడుస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసినట్లు తెలుస్తోంది...........

వెబ్‌ డబ్‌


ఒక్క క్లిక్‌ చేస్తే చాలు! మీకు కావాల్సింది మీ ముందుంటుంది!! అది కడుపుబ్బ నవ్వించే జోక్స్‌.. సినీతారల హాట్‌ టాపిక్స్‌.. నోరూరించే వంటకాలు... షాపింగ్‌ మాల్స్‌ వివరాలు... ఆధ్యాత్మిక పాటలు, ఆపాత మధుర గీతాలు, క్రీడాంశాలు, కార్పొరేట్‌ అంశాలు, యాత్రల వివరాలు, సాఫ్ట్‌వేర్‌ విశేషాలు...మీకు ఇష్టమైనవి ఏవైనా సరే వెబ్‌సైట్లో మీ ముందుంటుంది. ఆసక్తికే అగ్ర తాంబూలం. అందుకే ఈ మధ్య వెబ్‌ డిజైనింగ్‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. వినోదానికి వినోదం... ఉపాధికి ఉపాధి. వెబ్‌ డిజైనింగ్‌ కొందరికి వినోదాన్ని, మరికొందరికి ఉపాధిని అందిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసిన యువత ఇప్పుడు అందివచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది. ఆ ఆసక్తికర విశేషాలు ఈ వారం అట్టమీది కథలో..............

కనువిప్పు



అనంగ దేశాన్ని ఏలే ఆనందవర్థనుడికి వేట అంటే పిచ్చి. తరచూ వేట నిమిత్తం అడవికెళ్లి, చాలా జంతువులను వేటాడి వినోదించేవాడు. సరదా తీరాక ఏ సాయంకాలనికో తిరిగి రాజ్యానికి వస్తూండేవాడు. ఒకసారి ఆయన వేటకు వెళ్లి చాలాసేపు జంతువులను వేటాడాడు. కానీ, గుర్రాన్ని వేగంగా నడుపుతూ, ఉన్నట్లుండి పట్టుతప్పి గుర్రం మీద నుండి కింద పడిపోయాడు...............

పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఎంపీ కుమారుడి హడావిడి

రెహమాన్‌ ఆటోబయోగ్రఫీ

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ జీవిత చరిత్ర అక్షరరూపం దాల్చబోతోంది. ఆయన జీవిత విశేషాలు పుస్తకరూపంలో ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముంగిటకురానుంది. ప్రముఖ రచయిత్రి నస్రీన్‌ మున్ని కబీర్‌ రచించిన 'రెహమాన్‌ ఆటోబయోగ్రఫీ-ద స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌' ఢిల్లీలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాన్ని ఓమ్‌ బుక్‌ ఇంటర్నేషనల్‌.......

నాగచైతన్య, తమన్నాల '100 % లవ్‌' ఏప్రిల్‌ 29న

26, మార్చి 2011, శనివారం

రజనీకాంత్‌ సినిమాలో ఇలియానా

రజనీకాంత్‌ తాజా చిత్రం 'రాణా' ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. రోబో తర్వాత వస్తున్న మరో సంచలనంగా ఇండిస్టీలో వినికిడి. ఇందులో కూడా రజనీకాంత్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలకు సరిజోడుగా జాతీయస్థాయిలో పేరొందిన ప్రముఖ కథానాయికలను పరిశీలించారు. మొదట బాలీవుడ్‌ నటి రేఖని అనుకున్నారు. అయితే పారితోషికం.....

కప్‌ ఎంత దూరం?

ప్రపంచ కప్‌ కీలకమైన దశకు చేరుకుంది. భారత క్రికెట్‌ జట్టు ట్రోఫీకి చేరువైంది. భారత్‌ కప్‌ గెలుచుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మన క్రికెటర్లు 1983ను పునరావృతం చేసి అభిమానుల ఆశలను నెరవేరుస్తారా? 2003లో మాదిరిగా చివరి దశలో బోల్తా పడ్తారా? అభిమానులందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే !.....

ప్రకటనపై సంతృప్తి చెందకపోతే... సభా సంఘానికి ఓకే

భూముల పందేరం వ్యవహారం శాసనసభను శుక్రవారం కూడా కుదిపేసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. భూముల ధారాదత్తంపై జెఎల్సీ వేయాలని టిడిపి, సిపిఎం, సిపిఐతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి ప్రకటన, దానిపై చర్చ తర్వాత జెఎల్సీ గురించి ఆలోచిద్దామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం ఒక మెట్టు దిగింది. ప్రభుత్వ ప్రకటన, చర్చ తర్వాత సభ్యులకు అసంతప్తి కలిగితే, అక్రమాలపై నిర్దిష్టమైన ఆధారాలు చూపితే సభాసంఘాన్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. రెవెన్యూ, వక్ఫ్‌, దేవాదాయ, ఎపిఐఐసి తదితర ఎన్నో రకాల భూములపై సభ్యులు లేవనెత్తుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం ఎలా చెప్పాలో ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాలని మంత్రులు సూచించారు. అందుకు ఉపసభాపతి సాయంత్రం ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరిపారు.....................

లిబియాలో సామ్రాజ్యవాదుల జోక్యం

చమురు నిల్వలు పుష్కలంగా వున్న ప్రాంతంపై తన పెత్తనాన్ని నిలబెట్టుకోవటమే పరమావధిగా సామ్రాజ్యవాదులు ఇంతటి దుస్సాహసానికి తెగబడుతున్నారు. అదే విధంగా తన ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తుల పునరేకీకరణను అడ్డుకోవటం కూడా ఈ దాడి వెనక వున్న వ్యూహం. 2009 నాటి అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో 10,320 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా వున్న చమురు నిల్వల్లో 55.6 శాతం ఇక్కడే ఉన్నాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలంటూ బహ్రెయిన్‌ ప్రజానీకం ఖలీఫాకు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలచినప్పటికీ అమెరికా ప్రోద్బలంతో సౌదీ అరేబియా సైనిక దళాలు ఖలీఫాకు మద్దతుగా బహ్రెయిన్‌లో జోక్యం చేసుకున్నాయి. సామ్రాజ్యవాదుల ద్వంద్వ ప్రమాణాలను ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది.....................

నాటోకు 'నో ఫ్లై జోన్‌' బాధ్యత

లిబియాపై నో ఫ్లై జోన్‌ అమలు బాధ్యతను చేపట్టేందుకు నాటో అంగీకరించింది. వరుసగా ఆరో రోజు కూడా సంకీర్ణ దళాలు ట్రిపోలీని లక్ష్యంగా చేసుకొని గగనతల దాడులు జరుపుతున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం 28 దేశాల కూటమి నో ఫ్లై జోన్‌ అమలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్‌ ఆండర్స్‌ ఫోగ్‌ రాస్‌ముస్సెన్‌ గురువారం వెల్లడించారు. 'గడాఫీ ప్రభుత్వం నుంచి పౌరులను కాపాడే విస్తృత అంతర్జాతీయ చర్యల్లో భాగంగా మేము ఈ చర్య తీసుకుంటున్నాం' అని ఆయన చెప్పారు................

అణు రియాక్టర్‌కు పగుళ్లు?

జపాన్‌లో ఫుకుషిమా దారుచీ అణు రియాక్టర్‌కు పగుళ్లు సంభవించి ఉంటాయని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభానికి మూలమైన రియాక్టర్ల వద్ద మరమ్మతు పనులు చేపట్టిన కార్మికులు ముగ్గురు అక్కడి నీటిలో దిగినప్పుడు అణు ధార్మికతకు లోనవడం తమ ఆందోళనలకు ఆధారంగా అధికారులు పేర్కొన్నారు. ఇక్కడున్న ఆరు రియాక్టర్లలోని ఒక దానిలో సంభవించిన పగుళ్ళు గుర్తించడం అసాధ్యంగా.........

మరోసారి జోడి కట్టబోతున్న విక్టరీ వెంకటేష్, త్రిష

25, మార్చి 2011, శుక్రవారం

'శ్రీకృష్ణ' పక్షపాతం

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా శ్రీకృష్ణ కమిటీ పనిచేసిందని కాంగ్రెస్‌ తెలంగాణా ఎంపీలు విమర్శించారు. సీమాంధ్ర నేతల కుట్రల వల్లే కమిటీ పక్షపాతంతో కూడిన నివదికనిచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు చొరవతో బహిర్గతమైన నివేదక 8వ అధ్యాయమే ఇందుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీలు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌........

వధువుకు 17, వరుడికి 75

హైటెక్‌ రంగులు దిద్దుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న తరుణంలో పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు ఏవిధంగా ఉన్నాయనేదానికి మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో గురువారం జరిగిన సంఘటనలు నెలువెత్తు నిదర్శనం. మన్యంకొండలోని అలవేలు మంగమ్మ దేవాలయంలో వృద్ధునితో, బాలిక వివాహం జరిపించి జోగినిగా మార్చారు. మెదక్‌లో మగ సంతానం కోసం 52 ఏళ్ల ప్రభుత్వ అధికారి 16 సంవత్సరాల బాలికను.......

జిల్లాలో రెండు సార్లు పర్యటించిన మహాత్మాగాంధీ

బ్రిటీష్‌ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టేందుకు శాంతియుత పోరాటమే ఆయుధంగా ఉద్యమం సాగింది. స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీ చిత్తూరు జిల్లాలో రెండు సార్లు పర్యటించారు. మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ప్రజా ఉద్యమ విరాళాల కోసం సాగించిన యాత్రలో ఆయన రెండుసార్లు జిల్లాను సందర్శించారు. ఆయన పర్యటన అంటరానితనాన్ని చీల్చి చెండాడే ప్రసంగాలు, ఖద్దరు నిధి, హరిజనాభివృద్ధి నిధుల సేకరణకు పరిమితమైంది. తొలుత 1929 మే, 14వ తేదీన మహాత్మా గాంధీ చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు సాగిన ఆయన తొలి పర్యటనలో జిల్లాలోని శ్రీకాళహస్తి, పుత్తూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరులలో విరాళాల సేకరణ సాగింది........

ఛాప్టర్‌-8పై దుమారం

జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఫాసిస్ట్‌ నైజాన్ని చాటుకుందని, అది పూర్తిగా కుట్రపూరితంగా ఏర్పాటైందని, టిఆర్‌ఎస్‌ శాసన సభ్యులు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ఎనిమిదో అధ్యాయం పరిశీలిస్తే సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయిందని రుజువైందని ఆరోపించారు. న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చేవిధంగా నివేదిక తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కమిటీ సభ్యులకు శిక్షలు పడేవరకు వదిలిపెట్టేదిలేదన్నారు. శ్రీకృష్ణ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.........

'చిరు' అల్లుడి ముందస్తు బెయిల్‌కు నో

వరకట్నం కేసులో నిందితుడిగా ఉన్న పిఆర్‌పి అధ్యక్షుడు చిరంజీవి అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిలు తిరస్కరించింది. శిరీష్‌ భార్య శ్రీజ ఈనెల 14వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్‌ మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు తప్పదని భావించిన శిరీష్‌, అతని తల్లి ముందస్తు బెయిలు కోసం ఆరు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో..........

ఆసీస్‌ ఆట కట్టు


 

టీం ఇండియా... ఆసీస్‌ ఆట కట్టించింది. ప్రపంచ ఛాంపియన్‌ క్వార్టర్స్‌ స్థాయిలోనే ఇంటిబాట పట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించిన భారత్‌... కంగారూలను కంగారెత్తించింది. టీం ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌, రైనా రెచ్చిపోయి ఆడడంతో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించిన........

24, మార్చి 2011, గురువారం

శక్తి వాయిదా!

హాలీవుడ్‌ నటి ఎలిజబెత్‌ టేలర్‌ మృతి

అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తాం

భారత్‌ తన సొంత కాళ్లమీద నిలబడాలని తాము కోరుకుంటున్నామని, తమకు బిజెపి స్వదేశీ నినాదం తరహాలో విదేశీయులపై ఎటువంటి ద్వేషం లేదని కరత్‌ అమెరికా అధికారికి తేల్చిచెప్పినట్లు ఈ దౌత్యపత్రం వివరిస్తోంది. టెలికమ్యూనికేషన్ల రంగంలో ఎఫ్‌డిఐలను ఆహ్వానించాలన్న అంశంలో తమకు ఎటువంటి సహేతుకత కన్పించలేదని కరత్‌ చెప్పినట్లు ఈ పత్రం వెల్లడించింది.............

ఒబామా లాటిన్‌ అమెరికా పర్యటన తంపులకు యత్నం

లాటిన్‌ అమెరికా ప్రాంతంలోని అత్యంత విప్లవ ప్రభుత్వాలు (క్యూబా, వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్‌), అలాగే పురోగామి ప్రభుత్వాల (బ్రెజిల్‌, అర్జెంటీనా, ఉరుగ్వే) మధ్య తగాదాలు పెట్టేందుకు ఒబామా ప్రయత్నిస్తున్నారని క్యూబా విప్లవనేత ఫైడల్‌ కాస్ట్రో తెలిపారు. ఒబామా బ్రెజిల్‌ పర్యటనలో అమెరికా, ఆ దేశ ప్రయోజనాల మధ్య వైరుధ్యాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయని కాస్ట్రో అన్నారు. 2016 ఒలింపిక్‌ క్రీడల కోసం చికాగోతో రియో డీ జెనీరో పోటీపడిన విషయాన్ని మరువ జాలం. దక్షిణ అమెరికాలోని ఈ అగ్ర దేశం నుంచి ప్రయోజనం పొందాలని ఒబామా భావించారు................

కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ విజయాలు

యుడిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలో పడ్డాయి. నష్టాలను సాకుగా చూపి ఆ ప్రభుత్వం వీటిల్లో చాలా వాటిని మూసివేయటానికీ, చివరకు అమ్మివేయటానికీ ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుండా కార్మికులు సమైక్యంగా ప్రతిఘటించడంతో అమ్మకం నిలిచి పోయింది. ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వచ్చిన తరువాత కార్మికులు, నిపుణులు అందజేసిన సహాయ సహకారాలతో సమర్థ్ధవంతమైన చర్యలను చేపట్టింది. ఇప్పుడు వాటిల్లో దాదాపుగా అన్నీ లాభాలతోనే నడుస్తున్నాయి.............

పాంటింగ్‌ కెప్టెన్సీకి ఎసరు !

ఇప్పుడు అందరీ దృష్టి మార్చి 24న అహ్మదాబాద్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ పైనే ఉంది. ఉరుములేని పిడుగులా ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు తనను తొలగించి ప్రయత్నాల్లో ఉన్నట్లు పాటింగ్‌కు ఉహిచని వార్త అందింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులో కొందరు సభ్యులు పాటింగ్‌ కెప్టెన్సీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌ పర్యటన తరువాత రిటైర్‌మ్మెంట్‌ ప్రకటించాలని వారు.......

23, మార్చి 2011, బుధవారం

అత్యాచార యత్నంపై ప్రశ్నించినందుకు కుటుంబం గ్రామ బహిష్కరణ

ప్రశ్నించే పౌరుడిగా వస్తున్నా : శ్రీకాంత్‌

సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఎంతగానో కష్టపడ్డాను. ఒక్క సినిమా అయినా చేస్తానా ! అన్న సందేహం ఉండేది. అలాంటిది 100 చిత్రాలు పూర్తయ్యాయి. ఇది ఏనాడూ ఊహించలేదు' అని నటుడు శ్రీకాంత్‌ అంటున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఇండిస్టీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా పలు విషయాలు ఇలా చెప్పుకొచ్చారు...........

కొనసాగుతున్న దాడులు

సంకీర్ణ దళాలు వరుసగా మూడోరోజు రాత్రి సోమవారం కూడా లిబియాపై బాంబు దాడులు నిర్వహించాయి. గడాఫీ దళాలు మంగళవారం తిరుగుబాటుదార్ల అధీనంలోని రెండు పట్టణాలపై దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ట్రిపోలీపై సంకీర్ణ దళాలు మూడు రాత్రుల పాటు గగనతల దాడులు జరిపిన అనంతరం గడాఫీ అనుకూల దళాలు ఈ దాడులు జరిపాయి. ప్రభుత్వ వైమానిక రక్షణ స్థావరాలు, అధ్యక్షుడు గడాఫీ దళాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. దీంతో గత వారం ఓడిపోయే దశలో ఉన్న తిరుగుబాటుదారులు తిరిగి కొంత పురోగతిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు...........

స్నేహమేరా మిన్న

స్నేహం ఎడారిలో ఒయాసిస్సు. నీవెంటే నడిచే నీడ. నీ మనసులోని ఆనందాన్ని, అలజడులను తెలుపకనే తెలుసుకునే తోడు. సమస్యల సాగరంలో మునిగిపోయినపుడు చేయిపట్టి లాగే నేస్తం. నేనున్నానని ధైర్యాన్నిచ్చే వెలుగు. గెలుపులోని ఆనందాన్ని పంచుకునే సహచరి. ఓటమిలో వదలని హితుడు. ఎప్పుడూ అండగా నిలిచే ఆత్మీయుడు. అందుకే ప్రపంచంలోని అన్ని బంధాలలో స్నేహం తీయనిది అంటారు. కమ్మనిది అంటారు. సుఖంలో... బాధలో... ఆనందంలో... దు:ఖంలో... నవ్వినా... కన్నీరు కార్చినా... ఎప్పుడూ నీ వెంటే ఉండే స్నేహాన్ని మాటల్లో వర్ణించడం కష్టం...................

నాగంకు ఎసరు!

టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధనరెడ్డిపై సొంత పార్టీ నేతలే ముప్పేట దాడి చేస్తున్నారు. తొలుత పిఏసి ఛైర్మన్‌ పదవి నుండి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పిఏసి పదవి మార్చి 31న ముగుస్తోంది. ఆయన స్థానంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు ఇప్పించాలని కొంత మంది తెలంగాణ ప్రాంత నేతలే ప్రయత్నిస్తున్నట్లు.........

ప్రపంచకప్‌లో 'దావూద్‌' ఫిక్సింగ్‌ ?

అంతర్జాతీయ క్రీడా ప్రపంచాన్ని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఒక కుదుపు కుదుపుతున్న సందర్భంలో పదవ 2011 ప్రపంచ క్రికెట్‌ కప్‌ టోర్నీ ప్రారంభమైంది. ఈ కప్‌లోని ఒక మ్యాచ్‌ను అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుయాయులు ఫిక్స్‌ చేసిన గుట్టును ముంబయి క్రైంబ్రాంచ్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 21న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను దావూద్‌ అనుయాయులు ఫిక్స్‌ చేశారని..........

కథానాయిక కోసం వేట

22, మార్చి 2011, మంగళవారం

కృష్ణపట్నం పోర్టుకు ప్రపంచ రికార్డు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో నౌక నుండి 24గంటల్లో 71,587 మెట్రిక్‌ టన్నుల బొగ్గును అన్‌లోడింగు చేశారు. ఇది ప్రపంచ రికార్డు. ఈ సందర్భంగా పోర్టు సిఇఒ వై.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ లెమాసెల్‌ దేశానికి చెందిన ఎంవి పెదౌలాస్‌ ట్రేడర్‌ నౌక దక్షిణాఫ్రికాలోని రిచార్డ్స్‌ బేపోర్టు....

వర్మ రాజకీయ చిత్రం 'రెడ్డిగారు పోయారు'

ఇద్దరు నాయికలతో మనోజ్‌ కొత్త చిత్రం

మంచు మనోజ్‌ కధానాయకుడిగా శ్రేయ, ప్రణీత కథానాయికలుగా నటిస్తోన్న చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ఆరంభమైంది. సినిమా 5 సమర్పణలో శ్రీశైలేంద్ర సినిమాస్‌ పతాకంపై డి.ఎస్‌.రావు నిర్మిస్తున్నారు. గతంలో అసాధ్యుడు, జంక్షన్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌కృష్ణ అనిగా పేరు మార్చుకుని దర్శకత్వం వహిస్తున్నారు..............

చెన్నయ్ లో అఖిల భారత నాటక పోటీలు

అఖిల భారత మళయాళీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చెన్నరు కామరాజర్‌ ఆరంగంలో నేటి నుండి 27వ తేదీ వరకు అఖిల భారత నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ కార్యదర్శి కెపికె.శంకర్‌ నంబియార్‌ తెలిపారు. చెన్నరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...'కేరళ కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో మళయాళీలు నివసిస్తున్నారు..........

కొనసాగుతున్న 'ఆపరేషన్‌ ఒడిస్సీ' లిబియా పై క్షిపణి దాడులు

 
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 'ఆపరేషన్‌ ఒడిస్సీ' పేరిట లిబియాపై చేపట్టిన దురాక్రమణ రెండో రోజు సోమవారమూ కొనసాగింది. ఇందులో భాగంగా లిబియాలోని రక్షణ స్థావరాలపై సంకీర్ణ సేనలకు చెందిన యుద్ధ విమానాలు రెండో దఫా క్షిపణి దాడులు జరిపాయి. లిబియా గగన తలంపై పట్టు సాధించడం, బెంఘాజీ దిశగా పురోగమించే గడాఫీ సేనలను నిరోధించడం అనే ద్విముఖ ప్రయోజనం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి...............

నో స్మోకింగ్‌

పొగతాగడంతో ఆరోగ్యం క్షీణించి, మృత్యువుకు దగ్గరవుతాం. పొగాకు పొగలో ఆక్సిడెంట్స్‌, ఫ్రీ రాడికల్స్‌, కార్సినోజెన్స్‌ ఉంటాయి. వీటిలో కొన్ని శోధం కలిగించేవి. ఈ పదార్థాలు మానవ శరీరంమీద నేరుగా, శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. సిగరెట్‌ తాగడం వల్ల శరీరంలోని దెబ్బతినే ముఖ్య అవయవాల గురించి తెలుసుకుందాం...............

కెసిఆర్‌ ...నీ పార్టీ సంగతి చూస్కో

టిఆర్‌ఎస్‌ను సజావుగా నడుపుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ దృష్టిసారించాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జూలకంటి స్పందిస్తూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదని, భవిష్యత్తులోనూ అదే కొనసాగుతుందని చెప్పారు. సిపిఎం అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి బదులు కెసిఆర్‌ సొంతపార్టీ సంగతి చూసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ వేయడాన్ని జూలకంటి ప్రస్తావించారు.........

రచ్చబండ హామీలు గాలికి!

ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి మేలూ ఒనగూడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు నెలల క్రితం రచ్చబండలో ఇచ్చిన హామీలు నేటికీ అమలుకావడం లేదు. వారం రోజుల్లో మీ సమస్యలు పరిష్కారిస్తామని చెప్పిన ఉన్నతాధికారులు ఆ దిశగా ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు..........

21, మార్చి 2011, సోమవారం

కెసిఆర్‌...పద్ధతి మార్చుకో

కెసిఆర్‌ ఇంకా కుటుంబ పాలనే కొనసాగిస్తున్నారని, అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసహించుకుంటూ సమయమొచ్చినప్పుడు దెబ్బతీస్తున్నారని, ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ విమర్శించారు. విద్యార్థులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. ఆదివారం తూప్రాన్‌కు వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్‌ ఇంక కుటుంబపాలనే సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఇలాంటి సమయంలో విద్యార్థులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని కోరారు.కెసిఆర్‌ కుటుంబపాలనకు తోడు సీమాంధ్ర నాయకులకు ఓట్లను అమ్ముకున్నాడని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయగానే

జర్నలిస్టుగా చార్మి

జర్నలిస్టు పాత్రలో చార్మి నటిస్తున్న సినిమా 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు ఓ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. గురుదేవ క్రియేషన్స్‌ పతాకంపై నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకుడు. మేలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో చార్మి మాట్లాడుతూ... 'జర్నలిస్టుల నుంచి ఎంతో విలువైన సమాచారం ప్రజలకు చేరుతోంది. సమాజంలో వీరి పాత్రను తెలియజేసే విధంగా నా పాత్ర ఉంటుంది..............

యుద్ధం ఆపండి

ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో దురాక్రమణకు దిగి ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా యుఎస్‌ వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు. వైట్‌హౌస్‌ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌ గేట్ల వద్ద నుండి వెళ్లిపోవాలని జారీ చేసిన ఉత్తర్వులను నిరసనకారులను ఏ మాత్రం పట్టించుకోలేదు. 'మేము వెళ్లిపోము' అంటూ యుద్ధ వ్యతిరేక నినాదాలు చేశారు..............................

అమెరికాతో చెట్టపట్టాల్‌

 మన విదేశాంగ వ్యవహారాల్లో ప్రతి చిన్న అంశాన్నీ అమెరికా ఎంత నిశితంగా పరిశీలిస్తుందో హరదీప్‌పురీ నియామకంపై అది అనుసరించిన వైఖరి చూస్తే అర్థమవుతుంది. 2009 ఏప్రిల్‌లో ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తరపున శాశ్వత ప్రతినిధిగా హరదీప్‌పురీని నియమించినప్పటి నుంచి ఆయన గుణగణాలన్నిటినీ అమెరికా విదేశాంగ శాఖ సేకరించడం మొదలెట్టింది. అమెరికా సీనియర్‌ దౌత్యవేత్త ఒకరు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రి కుమార్‌తో మాట్లాడుతూ హరదీప్‌పురీపై ఫిర్యాదులేమైనా వున్నాయా అనేది తాము.............

దొంగలముఠా ప్రేక్షకులు...ఠా !

తలుపు చాటు నుండి 'భూ..!' అంటూ చిన్న పిల్లలు ఆడే ఆట మనకు తెలుసు. అలా భయపెట్టడం తనకెంతో యిష్టమని'నా ఇష్టం'లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ రాసుకున్నాడు. ఆ చిన్నప్పటి చేష్టలు ఇంకా కొనసాగుతున్నాయనటానికి 'దొంగలముఠా' ఓ చక్కని ఉదాహరణ. కిడ్నాప్‌ స్టోరీకి సస్పెన్స్‌ జోడించి, భయాన్ని పులిమి రూపుదిద్దుకున్న పక్కా సి-గ్రేడ్‌ సినిమా 'దొంగలముఠా'. రన్నింగ్‌ అండ్‌ ఛేజింగ్‌ అనేక సినిమాల్లో చూపించినా, వర్మ ఇంకా దాన్నే పట్టుకు వేలాడుతున్నాడు. 5-డి కెనాన్‌ హ్యాండీ కెమెరా అయినా, స్టిల్‌ కెమెరా అయినా, సెల్‌ కామ్‌ అయినా...తీసే దాంట్లో విషయం ఉండాలి. అదేదీ లేకుండా ఓ దాగుడుమూతల ఆటను చూపించాడు. ఎంచుకున్న కిడ్నాప్‌ స్టోరీ తెలుగు ప్రేక్షకుడికి ..........

విజయం మీదే!

కారుణ్యకు ఆ రోజు ఇంటర్వ్యూ. ఇంజనీరింగ్‌ చదివాడు. ఉత్సాహవంతుడు. అయినా ఇంటర్వ్యూ అనగానే ఒకటే టెన్షన్‌ పడిపోతున్నాడు. ఆ కంగారుతో మరింత ఆలస్యం చేస్తున్నాడు. గాభరాపడుతూ ఏమీ తినకుండా హడావిడిగా బయల్దేరాడు. మొత్తానికి ఇంకాసేపట్లో టైమైపోతుందనగానే ఇంటర్వ్యూ అటెండయ్యాడు. అదృష్టవశాత్తూ కారుణ్య వెళ్లిన పది నిముషాలకు అతనికి పిలుపొచ్చింది. సమాధానాలు సంతృప్తికరంగానే ఇచ్చాడు. కానీ అతను సెలెక్ట్‌ కాలేదు.  .........

20, మార్చి 2011, ఆదివారం

తెలుగు వారి సినీ కళకు తొలి మార్గదర్శి రఘుపతి వెంకయ్య

 కొత్తగా వచ్చిన ఏ విజ్ఞానాభివృద్ధి అయినా జనంలో ప్రాచుర్యం పొందాలంటే, దాన్ని ముందుగా విస్తృత వ్యాప్తిలోకి తీసుకువచ్చే ద్రష్టలు అవసరం. ఆ దిశలో అనేకులు పయనించడానికి దోవ చేసి, దారి చూపే మార్గదర్శకులు అత్యవసరం. ఇరవయ్యో శతాబ్దపు అత్యద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణల్లో ఒకటైన చలనచిత్ర కళకు సైతం అలా మనదేశంలో పాదులు తీసి, ప్రాచుర్యంలోకి తెచ్చిన పితామహులు, మార్గదర్శకులుగా దాదాసాహెబ్‌ ఫాల్కే, ఆర్‌.జి. టోర్నే లాంటి పెద్దల పేర్లను మనం స్మరించుకుంటూ ఉంటాం. కానీ, వాళ్ళందరి కన్నా ముందే, 1909 నాటికే చలనచిత్ర రంగంలో దిగిన తెలుగు వాడు - రఘుపతి వెంకయ్య. వాళ్ళ కన్నా ముందే మన గడ్డ మీద సినీ..........

మరణమే శరణమైతే ...

ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుంది. 'అబ్బ...ఎంత దౌర్భాగ్యం ఈ జీవితం. నరకయాతన పడుతున్నా కనీసం చావుకైనా కనికరం కలగలేదే...' అని. అలాంటి ఉదాహరణలు చరిత్రలో, వర్తమానంలో అడపాదడపా కనిపిస్తూనే వుంటాయి. తాజాగా వార్తల్లోకొచ్చిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్‌ ఉదంతం తెలిసినదే. తన ప్రమేయం అణుమాత్రం లేకపోయినా అంపశయ్యకే అంకితమైన అభాగ్యురాలు అరుణ. ఆమెను ఆ స్థితిలో చూచి తట్టుకోలేక... కారుణ్య మరణాన్ని ప్రసాదించమని ఆమె మిత్రురాలు, అడ్వకేట్‌ పింకీ విరానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరి మరణమే శరణమైతే ... చట్టం అంగీకరిస్తుందా? అందుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు నిలబడ్డారు. కరుణలేని మరణంపైఈ వారం అట్టమీది కథలో ................

అనేక రెట్లు అధికం

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ (ఎస్‌ఒఎఫ్‌) దాడుల్లో మరణించిన పౌరులపై ఐరాస గత వారం ప్రచురించిన నివేదికలో పేర్కొన్న సంఖ్య 80 కంటే వాస్తవ మరణాలు అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు ఐపిఎస్‌ వార్తా సంస్థ దర్యాప్తు వెల్లడించింది. తాలిబాన్లు చేసే హత్యలకు అన్వయించే విధంగా ఎస్‌ఒఎఫ్‌ దాడుల్లో పౌరులను నిర్వచించేందుకు అదే రకమైన మానవీయ చట్ట ప్రమాణాలను అన్వయించడంలో ఐరాస విఫలమైనట్లు ఆ నివేదిక తెలిపింది. మార్చి 9న విడుదలైన నివేదికను ఐరాస మానవహక్కుల యూనిట్‌ ఐరాస అసిస్టెన్స్‌ మిషన్‌ ఇన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (యుఎన్‌ఎఎంఎ), ఆఫ్ఘనిస్తాన్‌ ఇండిపెండెంట్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎఐహెచ్‌ఆర్‌సి) సంయుక్త ఆధ్వర్యంలో విడుదల చేశారు................