14, మార్చి 2011, సోమవారం

జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొస్తా

తెలుగుజాతినే కించపర్చుకున్నాం

ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడమంటే తమకు తాము తెలుగు జాతిని కించపర్చుకున్నట్లేనని పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. విగ్రహాల పున: ప్రతిష్టించాలని వారు డిమాండ్‌ చేశారు. తెలుగు తేజాల కూల్చివేతను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జన చైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఎబికె ప్రసాద్‌ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ధ్వంసం వల్ల సాధించిందేమిటో...........

బెంగాల్‌ ఎన్నికల్లో కొత్త రక్తం

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అధిక శాతం మంది కొత్త అభ్యర్ధులను బరిలోకి దింపుతూ బెంగాల్‌ వామపక్ష కూటమి తన జాబితాను ఆదివారం నాడు ప్రకటించింది. కాంగ్రెస్‌, టిఎంసిల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు వాయిదాలు పడుతుండగా వామపక్ష కూటమి తన అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించింది. జాబితాను మీడియాకు విడుదల చేసిన కూటమి ఛైర్మన్‌ బిమన్‌ బసు మాట్లాడుతూ మొత్తం 294కు గాను 292 స్థానాలకు ప్రకటించిన అభ్యర్ధుల్లో 149 మంది కొత్తవారిని ఎంపిక చేసినట్లు చెప్పారు...............

వీడని ముప్పు

శనివారం ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో ఏర్పడిన ముప్పు భయం తొలగిపోక ముందే రెండో రియాక్టర్‌ ఆదివారం పేలేందుకు సిద్ధంగా వుందన్న సమాచారం జపాన్‌ ప్రజానీకంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ అణువిద్యుత్‌ కేంద్రంలో రెండో నెంబర్‌ రియాక్టర్‌లో కూలింగ్‌ వ్యవస్థ వైఫల్యంతో దీనిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చుట్టూ ఉన్న ఉక్కు రక్షణ కవచం కరిగిపోవటం ప్రారంభించిందని అధికారులు చెప్పారు. దీనితో మరో అణు ప్రమాదం సంభవించవచ్చన్న భయాందోళన లు వ్యక్తమవుతున్నాయి..................

ఎనిమిది పదుల ఎనలేని వింత

మన దేశంలో వెండితెర మీద బొమ్మ మాట్లాడడం మొదలై ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్ళు కావస్తోంది. మాటలు లేని మూగ సినిమాల (మూకీల) యుగం నుంచి భారతీయ సినిమా మాట, పాట నేర్చిన (టాకీల) స్థాయికి ఎదిగిన కథ ఎన్నో గమ్మత్తయిన అనుభవాల సమాహారం. తొట్టతొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా' ఇప్పటికి సరిగ్గా ఎనిమిది దశాబ్దాల క్రితం 1931 మార్చి 14న విడుదలైంది. మూకీ చిత్రాల నుంచి మాట్లాడే సినిమాల వైపు జనం ఎలా విపరీతంగా ఆకర్షితులయ్యారనే సంగతులు ఇవాళ్టికీ మనకు ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. ఆ విశేషాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రండి!............

అణు విద్యుత్‌ వద్దు

జపాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు జర్మనీలో ఆ సాంకేతిక పరిజ్ఞానపు భవిష్యత్తుపై దీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదానికి కొత్తగా ఆజ్యం పోసింది. దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాల జీవిత కాలాన్ని పెంచాలనే ప్రణాళికలకు వ్యతిరేకంగా జర్మనీలో వేలాది మంది శనివారం ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శకులు నెకార్‌వెస్తీమ్‌ అణు ప్లాంటు నుంచి స్టట్‌గార్ట్‌ వరకూ 28 మైళ్ళ పొడవున (45 కిమీ) మానవహారం ఏర్పాటు చేసినట్లు ప్రదర్శన నిర్వాహకులు చెప్పారు. 'అణు విద్యుత్‌ - వద్దు' అని రాసి ఉన్న పసుపుపచ్చ జెండాలను కొందరు ఊపినట్లు వారు తెలిపారు. పోలీసులు వెంటనే ప్రదర్శకుల సంఖ్యను వెల్లడించలేదు...............

పేరులేని ఉపేంద్ర సినిమా... గాలిమేడలు+లవ్‌స్టోరీ

ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన పేరులేని సినిమా కన్నడనాట సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ అదే విధంగా కేవలం చేతి బొమ్మ మాత్రమే పోస్టర్‌పై ముద్రించి నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ విడుదల చేశారు. సమాజం పట్ల, దేశం పట్ల సామాన్య పౌరుడు తన బాధ్యతను మరిచాడని, ఓటు అమ్ముకొని తప్పు చేస్తున్నాడని, ఇది అనేక దారుణాలకు దారితీస్తుందని కథనంలో దర్శకుడు పేర్కొన్నాడు. కఠిన నిర్ణయాలు తీసుకొని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలన్నది అంతిమంగా చెప్పదల్చుకున్న పాయింట్‌. ఈ విషయాన్నిఓ లవ్‌స్టోరీతో పోల్చాడు. కథలో ఈ పోలిక గందరగోళానికి దారితీసింది............

కలా? నిజమా?

లా? నిజమా? - అని జపనీయులంతా విలవిలలాడిపోతున్నారు. ప్రకృతి కన్నెర్రకు కకావికలమైన వాస్తవ పరిస్థితుల నుండి తేరుకునేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. సునామీ తాకిడి నుంచి తేరుకునే లోపుగానే అణుథార్మిక ప్రమాదం జపనీయులను ఆందోళన అగాథంలోకి నెట్టివేసింది. అణుప్రమాదాలు, సునామీ తుఫానులు జపాన్‌కు కొత్త ఏమీ కానప్పటికీ రెండు రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం, దాని వెన్నంటిన సునామీ అలలు ఈశాన్య జపాన్‌లో వేలాది మంది జపనీయుల ప్రాణాలను తమలోకి లాగేసుకున్నాయి. ఇది నిజం కాకూడదు... కలైతే బాగుండని అనుకునే వారు కొందరైతే, అచ్చు సినిమాలోలా అనుభూతికి లోనైనానని 50 ఏళ్ల ఇచిరొ సకమోటో వాపోయాడు. ...........

13, మార్చి 2011, ఆదివారం

వైఎస్‌ జగన్‌కు నోటీసులు

కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద జిల్లా కలెక్టర్‌ శశిభూషణ్‌కుమార్‌, ఎస్‌పి తరుణ్‌జోషి బహిరంగసభను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. కడప జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానికసంస్థల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున కోడ్‌ అమల్లో ఉంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును అధికారి కంగా శుక్రవారం జగన్‌ జగ్గంపేటలో ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో ఆపార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. .............

అణు లీకేజీ

శుక్రవారం నాటి భూకంపం, సునామీ దెబ్బకు విలవిల లాడుతున్న జపాన్‌లో శనివారం 'అణు' లీకేజీ మరింత భయం కలిగిస్తోంది. టోక్యోకు ఉత్తరంగా 150 కి.మీ దూరంలో ఉన్న ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రంలోని ప్రధాన రియాక్టర్‌ పైకప్పు శనివారం ఎగిరి పడటంతో పాటు ప్రహరీ గోడలు దగ్ధమయ్యాయి. దీంతో పేలుడు సంభవించి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.............

ప్రజల వాణిని వినండి

ప్రజల వాణిని వినాల్సిందిగా ఐరాస సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. తాను ఈజిప్టు, ట్యునీషియాను సందర్శించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బాన్‌ ఈ విజ్ఞప్తి చేశారు. అరబ్బు ప్రపంచంలో ముఖ్యంగా లిబియాలో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక దళాల మధ్య గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే వారంలో ఆయన ఆ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. 'ప్రతి సంభాషణలోనూ, అవకాశం వచ్చిన ప్రతిసారీ తమ ప్రజల వాణిని వినాల్సిందిగా, మార్పు కోసం వారి ఆకాంక్షలకు తలొగ్గాల్సిందిగా, చర్చల ద్వారానూ, పూర్తి...................

ఒక చిన్న గాంధీ

ఒకరోజు నేను పాఠశాల నుండి వస్తుండగా గాంధీ వేషంతో చిన్న కుర్రాడు కనిపించాడు. నేను అతన్ని చూడగానే పాఠశాలలో వేషం వేస్తున్నాడని అనుకున్నాను. కానీ తీరా చూస్తే అతను ఒక భిక్షగాడు. వచ్చే పోయేవారిని అతను డబ్బులు అడుగుతున్నాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఎందుకు డబ్బులు కావాల్సి వచ్చింది? అప్పుడు నేను ఆ చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్లి, ''నీవు ఎందుకు డబ్బులు అడుగుతావు? వాటితో నీకేమి అవసరం వచ్చింది? ఎందుకిలా వేషం వేసుకొని డబ్బులు అడుగుతున్నావు?'' అని అడిగాను...............

ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టే... దొంగలముఠా

జైపాల్‌కు చేదు అనుభవం

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డికి సొంత నివాసంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యుపిఎ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నేతలు జైపాల్‌రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణాపై బహిరంగంగా ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. ఆయన మౌనవైఖరి పట్ల నిరసన తెలుపుతూ కుర్చీల్లో కూర్చోకుండా నేలపైనే బైఠాయించారు. వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నా..

అందరూ మెచ్చే...తెలుగమ్మాయి

12, మార్చి 2011, శనివారం

ఆకస్మిక హంతకి సునామీ

అక్కడ ఏనుగులే హీరోలు

19న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ గీతాలు

తెలుగు జాతికి అవమానం

మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై గురువారం జరిగిన ఘటనలు తెలుగుజాతికి అవమానకరమైనవని శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సభ్యులందరూ విగ్రహాల కూల్చివేతను, మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన మైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ అసమర్థతే కారణ మని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి..............

'మార్ఫింగ్‌'. మేనియా

చిట్టగాంగ్‌లో సంచలనం

ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. విండీస్‌ చేతిలో ఘోర ఓటమిపాలైన బంగాదేశ్‌ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇంకో ఓవర్‌ మిగిలి ఉండగానే చేరుకుంది. విజయానికి మరో 56 పరుగుల దూరంలో బంగ్లాదేశ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ఈ తరుణంలో ఇంగ్లండ్‌ విజయంసాధించి క్వార్టర్స్‌ ఫైనల్స్‌ చేరుకుంటుందని అందరూభావించారు. అయితే షఫియిల్‌ ఇస్లాం ధీరోచితంగా పోరాడి మహ్మదుల్లాతో కలిసి తొమ్మిది వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి తమ జట్టుకు అనుహ్య విజయం అందించారు...........

ఆ కమ్మదనం వెనక ...

మంచు దుప్పటి నిండుగా కప్పుకున్న సోయగం... పచ్చదనాన్ని పావడాగా, గోదావరి పైటచెంగుగా చుట్టుకున్న వయ్యారం... కల్మషం యెరుగని మనుషులు... వెరసి కోనసీమ. కోనసీమ ప్రకృతి అందాల సీమ. కోనసీమలో ఎటుచూసినా కొబ్బరిచెట్లు, పిల్ల కాలువలు, పచ్చటి పైర్లు... చూసే వీక్షకులు మైమరచిపోవాల్సిందే! కోనసీమ అనగానే కొబ్బరిచెట్లే కాదు. మరొకటి కూడా గుర్తురావాలి. అవి క్షణాల్లో నోట్లో కరిగిపోయినా ఎన్నటికీ మరువలేని తీపి గురుతులు. వాటి రూపం విచిత్రం. తయారీ విడ్డూరం. రుచి మాత్రం అద్భుతం. అవే కోనసీమ తియ్యందనానికి మారుపేరుగా నిలిచే 'పూతరేకులు'....................

ప్రకృతి విలయం : * జపాన్‌లో భూకంపం, సునామీ బీభత్సం * 13 అడుగుల ఎత్తుకు సముద్రపుటలలు * పలు దేశాలకు సునమీ హెచ్చరిక


 

ప్రపంచంలో 'సూర్యుడు మొదటిగా ఉదయించే దేశం' (ల్యాండ్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌) జపాన్‌పై ప్రకృతి కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుడింది. చరిత్రలోనే అత్యంత భీకరమైన భూకంపం.. ఆ పైన సునామీ చుట్టుముట్టడంతో ఉత్తర జపాను కకావికలమైంది. కడపటి వార్తలు అందే సమయానికి వందలాది మంది చనిపోయారు. వేలాది వాహనాలు అలల తాకిడికి.....

'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ' సినిమాలో నటించడం కోసం తెలుగమ్మాయి కోసం అన్వేషణ

'స్నేహగీతం' ఫేం 'మధుర' శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో మున్నా వెంకటకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'. ఈ సినిమాలోని నటీనటుల కోసం స్టార్‌హంట్‌ ఏర్పాటుచేశారు. ఈ వివరాలను శ్రీధర్‌రెడ్డి తెలియజేస్తూ...'మేం తలపెట్టిన స్టార్‌హంట్‌కి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దాదాపు ఇప్పటివరకు 3000లకు పైగా .........

11, మార్చి 2011, శుక్రవారం

నమ్మినవాడే మోసంచేస్తే?!

దాంపత్యం నమ్మకం ఆధారంగానే ఏర్పడే బంధం. కన్నవారిని వదిలి కట్టుకున్నవాడితో ఏడు సముద్రాలు ఆవలకైనా ఆడది పయనిస్తుందంటే కారణం నమ్మకమే. పెళ్లయిన మరుక్షణం నుంచి ఆ నమ్మకమే వారిని కలిపి ఉంచుతుంది. కలతలు వచ్చినా 'నా మనిషి' అన్న నమ్మకమే ఆ బంధాన్ని పట్టి ఉంచుతుంది. కన్నవారిని మరిచి అతని వెన్నంటి నడవడం వెనుక ఆ నమ్మకం దాగుంది. కష్టసుఖాలు, మంచీచెడ్డలు...........

పూర్తయిన శక్తి

మహిళల అక్రమ రవాణ కేసులో థాకరే మనుమడు

తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పిలుపు నిచ్చారు. గురువారం సాయంత్రం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు రాజీనామాలు చేస్తే వారే ప్రేమాభిమానాలతో మళ్లీ గెలిపిస్తారని, అందుకే ప్రజల ఆకాంక్షను..............

మహనీయుల విగ్రహాలు ధ్వంసం

తెలుగు జాతి ఔన్నత్యానికి బాటలు వేసి, సాహిత్యం, కళలు సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన మహనీయుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాదులో గురువారం నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌లో ఆందోళనకారులు 16 విగ్రహాలను ధ్వంసం చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలను అలరిస్తున్న ట్యాంక్‌ బండ్‌ తీరం కళ తప్పింది. ..............

తెలుగు వెలుగులపై దాడి

 


'మిలియన్‌ మార్చ్‌' పేరిట గురువారం నాడు ట్యాంకుబండ్‌పై విశ్వశాంతిని ప్రబోధించిన బుద్ధుని విగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండలో తెలుగు వెలుగులపై దాడి జరిగింది. జాతి చైతన్య మూర్తులు, సామాజిక వైతాళికులూ అయిన మహామహుల విగ్రహాలను నేలకూల్చారు. చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషువా.......

పండ్లు, కూరగాయల్లో పురుగుమందులు తస్మాత్‌ జాగ్రత్త

మేము తాజా పండ్లూ కూరగాయలు తింటున్నాం, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశం స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మార్కెట్‌కు తరలివస్తున్న కూరగాయలు, పండ్లలో నాడీ, కాలేయానికి హానిచేసే, కేన్సర్‌, గుండె జబ్బుల కారణభూత విషపూరిత రసాయనాలు కలిగివుంటున్నాయి. దేశ రాజధానిలో అమ్ముడవుతున్న తాజా........

మాస్‌ కథనంతో...పూర్ణామార్కెట్‌

10, మార్చి 2011, గురువారం

అమితాబ్‌తో పూరీ హిందీ చిత్రం బుడ్డా

అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 అండ్‌ ఎ.బి. కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న హిందీ చిత్రం 'బుడ్డా' (హోగా తేరా బాప్‌). ఈ చిత్రం షూటింగ్‌ ముంబాయి వెర్‌సోవాలోని ఖోజా బంగ్లాలో ప్రారంభమైంది. సోనూ సూద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశంతో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారారు బచ్చన్‌, సోనాల్‌ చౌహాన్....

పోలీసుల సహకారంతోనే... చట్టవిరుద్ధ కార్యకలాపాలు * శృంగార కేంద్రాలుగా పబ్‌లు : దాడి

'భద్రత'ను విస్మరించారు..!టెలికమ్యూనికేషన్‌ రంగంలో ప్రతికూల అంశాలున్న విదేశీ కంపెనీలకు సైతం 2జిస్పెక్ట్రమ్‌ను కేటాయించి దేశభద్రత అన్న అంశాన్ని విస్మరించారని సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీయెత్తున విదేశీ పెట్టుబడులను రాబట్టుకోవటం కోసం దేశ భద్రతతో రాజీ పడ్డారని న్యాయమూర్తులు జిఎస్‌సింఘ్వి, ఎజి గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. టెలికం రంగంలో 2జి కేటాయింపులు జరిపిన రెండు కేసుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కంపెనీల విషయంలో హౌం మంత్రిత్వశాఖ వ్యక్తంచేసిన అభ్యంతరాలు అత్యంత తీవ్రమైనవని న్యాయమూర్తులు గుర్తు చేశారు...........

ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలి

రైతులకు మద్దతు ధర కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శించాయి. వరి రైతుకు బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశాయి. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై జరిగిన చర్చలో తెలుగు దేశంతోపాటు విపక్షపార్టీల సభ్యులు మద్దతు ధర లభించని నేపధ్యంలో వరిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బియ్యం ఎగుమతులకు కేంద్రం నుండి అనుమతి తీసుకోవాలని కోరారు............

బీటీ ఆహారం స్సై సామాజిక కోణాలు

జన్యు మార్పిడి పంటల్లో బీటీ ఆహారం ఒక ప్రత్యేక రకానికి చెందిన ఆహారం. ఈ పంట మొక్కల్లో అంతర్గతంగా సీతాకోకచిలుక జాతి కీటకాలను చంపే బీటీి విషం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఈ ఆహారాన్ని తింటే, దీనితోబాటు బీటీ విషాన్ని కూడా తినాల్సి వస్తుంది. అందువల్ల, బీటీ విషం కలిగిన ఆహారాన్ని 'బీటీి విషాహారం'గా పిలవడం ఉచితం. కానీ, ఇలా పిలవడానికి వీనిని రూపొందించి, అమ్మే కంపెనీలు గానీ, వీరికి మద్దతు ఇస్తున్నవారు కానీ అంగీకరించరు. ఇలా పిలిస్తే, తినే ఆహారంలో విషం వుందని తెలుసుకుని చూస్తూ, చూస్తూ తినడానికి ఎవరూ ముందుకురారు. బీటీి వంగ రూపంలో బీటీ విషాహారాన్ని తినిపించడానికి ప్రయత్నాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి.................

పేదలకు సబ్సిడీ కోత-ధనికులకు రాయితీల పెంపు!

ఆమ్‌ఆద్మీ, సమీకృత పురోగతి అంటూ ఎంత ఆర్భాటం చేసినప్పటికీ ప్రస్తుత బడ్జెట్‌ ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచుతుంది. గత రెండేళ్ళ కాలంలో శతకోటీశ్వరుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. సంఖ్య రీత్యా చూస్తే 52మంది ఉండొచ్చు. కానీ, వీరందరి ఆస్తుల విలువ కలిపిచూస్తే మన జిడిపీలో నాల్గవవంతుకు సమానం. ఈ ఏడాది వీరి సంఖ్య 69కి పెరిగినట్లు సమాచారం (ఈ తెగ ఇంకా పెరగవచ్చు). అయినప్పటికీ మన జిడిపీలో ప్రజారోగ్యానికి 3 శాతాన్ని, విద్యకు 6 శాతాన్ని కేటాయించటానికి మనం చాలా దూరంలో ఉన్నాము..........

ఆఫ్ఘన్‌ యుద్ధం రికార్డు స్థాయిలో పౌరుల మృతి ఐరాస వెల్లడి

ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులే రికార్డు స్థాయిలో మృతి చెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం చింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు రెట్టింపయ్యాయని ఐరాస తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. గత ఏడాది కాలంలో మొత్తం 462 హత్యలు జరగ్గా ఇందులో సగానికి పైగా దక్షిణాన తాలిబన్లకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో జరిగినవే. ఈ ప్రాంతాల్లో తమ దళాలు పట్టు సాధిస్తున్నాయంటూ అమెరికా చేస్తున్న ప్రచారంలోని డొల్ల తనాన్ని ఈ నివేదిక ఎండగట్టింది. ఈ పదేళ్ల యుద్ధకాలంలో మొత్తం 2,777 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడగా 2010లో ఇది మొత్తమ్మీద 15 శాతం పెరిగిందని, గత నాలుగేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించింది.............

దిల్షాన్‌ డోపింగ్‌ ?

ప్రపంచ కప్‌లో శ్రీలంక తరఫున ఆడుతున్న ఆల్‌రౌండర్‌ తిలకరత్నే దిల్షాన్‌ డోపింగ్‌ టెస్ట్‌లో పట్టుబడినట్లు శ్రీలంక మీడియా తెలియజేసింది. రాండమ్‌ డోపింగ్‌ టెస్టులో భాగంగా తిలకరత్నేను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఎంపిక చేసి పరీక్ష నిర్వహించిదని, ఆ పరీక్షలో దిల్షాన్‌ నిషేధిత ఉత్పేరకాలు తీసుకున్నట్లు వెల్లడయ్యిందని మీడియా తెలియజేసింది...............

మా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు : తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీల ఆరోపణ

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. అణిచివేత ద్వారా ఉద్యమాన్ని అడ్డుకోవాలన్న వైఖరిని ప్రభుత్వం విడనాడాలని వారు హితవు పలికారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కూడా ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మిలియన్‌ మార్చ్‌కు మద్దతుగా సమావేశాలకు.........

రోశయ్యపై కేసు

9, మార్చి 2011, బుధవారం

జన్యువుల వల్లనే ప్రజ్ఞావంతులకు ఎక్కువ తెలివి ఉంటుందా?

ఆ 'తప్పు' ఎందుకు జరిగింది?

థామస్‌ నియామకంలో తప్పు తన వల్లే జరిగిందని ప్రధాని చల్లగా చెప్పారు. థామస్‌ నియామకాన్ని సమర్థించుకోవడానికి నానా పాట్లు పడిన ప్రధానికి చివరికి తప్పు ఒప్పుకోక తప్పింది కాదు. తప్పు ఒప్పుకోవడమే ఒక ఘనకార్యంగా చాటుకొని అసలు వాస్తవాలను కప్పి పుచ్చడానికి నిష్కళంకుడిగా కాంగ్రెస్‌ అధినేత్రి చేత కితాబు పొందిన మన్మోహన్‌సింగ్‌ ప్రయత్నించడం దేశ ప్రజలందరికీ ఆందోళన........

యుక్త వయసులో శారీరక, మానసిక మార్పులు సహజం

'మహిళా' బిల్లు తక్షణం ఆమోదించాలి

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమొంటు తక్షణం ఆమోదించాలని వివిధ మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇక్కడ పలు మహిళా సంఘాలు ఉత్సాహంగా నిర్వహించాయి. ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, వైడబ్ల్యుసిఎ, పిఎంఎస్‌, సిడబ్ల్యుడిఎస్‌, జెడబ్ల్యుపి, స్వాస్తిక్‌ మహిళా సమితి తదితర మహిళా సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్‌ పాల్గొన్నారు.............

తీరాన్ని మింగేస్తారా...?

కోస్తా తీర ప్రాంతంలో పోర్టులు, ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లు, పారిశ్రామిక కారిడార్‌ల పేరిట భూమిని విచ్చల విడిగా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడంపై శాసనసభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏలు కూడా తీర ప్రాంతం ప్రైవేటు పరం చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. 'తీరాన్ని మింగేస్తారా ...ఎవరిచ్చారు మీకా హక్కు' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా జరిగిన భూకేటాయింపుల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని వేయాలని డిమాండ్‌ చేశారు................

పరీక్షల్లో గట్టెక్కేదెలా..?

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్షలూ దగ్గర పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు చదువుతోపాటు ఆటాపాటలకు సై అన్న విద్యార్థులు ప్రస్తుతం కేవలం స్టడీ అవర్స్‌మీదే దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఎలా చదవాలో తమ పిల్లలకు సూచనలిస్తున్నారు. కొందరైతే కచ్చితంగా 90 శాతం తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్‌ అనగానే ఏదో యుద్ధానికి బయల్దేరుతున్నంత హడావిడితో అనవసర ఆందోళన చెందడంవల్ల ఫలితం ఉండదు. పైగా అది అపసవ్య ఆలోచనలకు దారి తీస్తుంది. కాబట్టి చదువుకునేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది. అనవసర ఒత్తిడికి విద్యార్థులు దూరంగా ఉండాలి.............

మాట తప్పిన ఒబామా

గ్వాంటెనామో బేలో బంధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద అనుమానితులపై సైనిక విచారణ ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పచ్చజెండా ఊపారు. తద్వారా 2009 నాటి అధ్యక్ష ఎన్నికల వాగ్దానం గ్వాంటెనామో మూసివేత. అయితే ఆయన ప్రస్తుతం ఆ వాగ్దానం నుంచి దూరం జరిగినట్లు కనబడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న పోరును పౌర చట్టాల పరిధిలోకి తెస్తానన్న నాటి ఒబామా హామీ నీటి బుడగ చందంగా మారింది. ఒబామా ఈ నిర్ణయంతో అధ్యక్షునిగా శ్వేతసౌధంలో కాలుపెట్టిన మొట్టమొదటి రోజు ప్రకటించిన 'సైనిక కమిషన్ల'పై నిషేధం ఎత్తివేసినట్లయింది................

అభిమానులకు వివాహ విందు

యువతులపై అత్యాచారం ఆరోపణలు పరారీలో హిందూ మతగురువు

8, మార్చి 2011, మంగళవారం

భారత్‌కు ఎన్ని తపాలా జోన్‌లున్నాయి

ఫిట్స్‌ బాధితులు పెళ్లి చేసుకోవచ్చా?

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

అనుమానం రాకుండా ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లక్షా పదివేల రూపాయలు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ జోన్‌ ఏసిపి సత్యనారాయణ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాల వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్‌టౌన్‌ జోజి నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన సహాయంతో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు, టాస్క్‌ ఫోర్సు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి నింధితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ..........

నూరేళ్ల మహిళాదినోత్సవం స్త్రీశక్తి ఎగరేసిన చైతన్య పతాక

ఫ్యూడల్‌ వ్యవస్థలో వున్న ఆస్తి సంబంధాలు స్త్రీని వంటగదికి బందీ చేయగా పారిశ్రామిక విప్లవం అనివార్యంగా స్త్రీలను సామాజిక ఉత్పత్తిలో భాగస్వాములను చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధి స్రీ, పురుషుల మధ్య శ్రమ విభజనలో అసమానతలు నిర్మూలించడానికి అసరమైన ప్రాతిపదికను కల్పిస్తుంది. అయితే, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం, అంతర్గతంగా ఉండే వైరుధ్యాలు అలా జరగకుండా నిరోధిస్తున్నాయి.నయా ఉదారవాద విధానాల పేరుతో నేడు ఇదే జరుగుతోంది...........

బరాదీ అపఖ్యాతికి కుట్ర వెల్లడించిన ఈజిప్టు భద్రత 'లీక్‌'

ఈజిప్టులో నెలకొన్న భద్రత స్థితిని తెలియజేసే పలు కీలక పత్రాలను ఆ దేశ ఆందోళనకారులు బహిరంగ పరిచారు. ప్రపంచంలోని అనేక దేశాలను ఒక కుదుపు కుదిపేసిన వికీలీక్స్‌ తరహాలోనే ఈ బహిర్గత చర్యకు 'దేశ భద్రత లీక్స్‌ అని పేరుపెట్టారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ మాజీ అధిపతి తదనంతర కాలంలో ముబారక్‌ వ్యతిరేక పోరాటంలో కీలక నేతగా అవతరించిన మహమ్మద్‌ ఎల్‌ బరాదీని అపఖ్యాతి పాల్జేయడానికి కుట్రపన్నినట్లు పేర్కొనడం జరిగింది............

శ్రీహరి హీరోగా...సర్కార్‌ గూండా

'విదేశాల నుంచి మనకు గంజాయి దిగుమతి అవుతుంటే...మనం మాత్రం వారికి గోధుమలు పంపిస్తున్నాం. ఇదెక్కడి న్యాయం. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడుతుంటే, వినోదం చూస్తూ కూర్చుందా ? దీనికి పరిష్కారం ఏమిటి ?' అన్నది తమ 'సర్కార్‌ గూండా' సినిమా స్టోరీ అని కథానాయకుడు శ్రీహరి చెబుతున్నారు. దేవాప్రొడక్షన్స్‌పై సుజాత దేవా నిర్మిస్తున్నారు. సోమవారం నానక్‌రామ్‌గూడా విలేజ్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. డైరెక్టర్‌ వంశీ దగ్గర పనిచేసిన సదా దర్శకునిగా పరిచయమవుతున్నారు..................

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం

తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉందని ఆ పార్టీ పునరుద్ఘాటించింది. టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధనరెడ్డి సోమవారం అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఫోరం చర్చించింది. నాగం వద్దకు ఫోరం బృందాన్ని పంపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ఫోరం సభ్యులు చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో సమావేశయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న అంశాన్ని నాగంతో చర్చించాలని నిర్ణయించింది. కలిసి కట్టుగానే తెలంగాణ కోసం ఆందోళన చేయాలని, అది ఫోరం ఆధ్వర్యంలోనే జరగాలని అభిప్రాయపడింది. 10న జరగనున్న మిలియన్‌ మార్చ్‌కు ఫోరం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు, నాయకులు మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది............

ఆమెను చంపొద్దు

దీర్ఘకాలంగా తీర్పు కోసం ఎదురు చూస్తున్న అరుణ రామచంద్ర షాబాగ్‌ కేసులో సుప్రీం కోర్టు సోమవారం మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముంబయిలోని కెఇఎం ఆసుపత్రిలో గత 37 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మంచానికి అంటుకు పోయి ఉన్న ఆ అస్పత్రి నర్సు అరుణ రామచంద్ర షాబాగ్‌(60) చనిపోవడానికి అనమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ మార్కాండేయ కట్జు, జ్ఞాన్‌ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. దారుణమైన లైంగిక దాడికి గురైన అరుణ రామచంద్ర  .............

7, మార్చి 2011, సోమవారం

తొలి మహిళా ప్రోగ్రామర్‌ అడా

ఆమె జీవితం సప్తవర్ణ సమ్మేళనం. ఓ నవల చదువుతున్న అనుభూతి. ప్రేమ, అందం, ఆనందం, ఐశ్వర్యం, విజ్ఞానం, విలాసం, వ్యసనం, అనారోగ్యం, విషాదం.... ఆమె జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తుంది. 36 ఏళ్ళకే నూరేళ్ళు నిండిన ఓ అసాధారణ ప్రతిభాశాలి. అందం, తెలివితేటలతోపాటు తొలి పరిచయంతోనే ఎదుటివారిని ఆకట్టుకోగల ఆకర్షణ శక్తి, ఎంత క్లిష్టమైన సమస్యనైనా క్షణాల్లో అర్ధం చేసుకొని, విశ్లేషించగల సూక్ష్మబుద్ధితోపాటు సంగీతం, ఆటలలో మంచి ప్రావీణ్యం ఆమె సొంతం. గణితశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి, పలు జటిలమైన సమస్యలను పరిష్కరించడానికి కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను రాసే స్థాయికి ఎదగడమే కాకుండా సంగీతం సమకూర్చడానికి ..............

ట్రిపోలీలో కాల్పుల హోరు

లిబియా రాజధాని ట్రిపోలీ నగరంలో ఆదివారం వేకువఝామునే మిషన్‌గన్ల కాల్పుల హోరు మొదలైంది. అధ్యక్షుడు గడాఫీకి నివాసానికి దగ్గర్లోనే ప్రభుత్వ బలగాలతో ఆందోళనకారులు భీకర పోరు సాగిస్తున్నారు. తుపాకుల కాల్పులు, వాహనాల మోతలతో నగరం దద్దరిల్లిపోయింది. ఉదయం 5.30 గంటల నుంచి అనేక గంటల పాటు పోరాటం కొనసాగింది...............

లో స్కోరులో థ్రిల్లింగ్‌

2011 వన్డే ప్రపంచ కప్‌లో 300 పరుగులకు పైన లక్ష్యాన్ని ఐర్లండ్‌ చేధించి సంచలనం సృష్టించింది. భారత్‌, బంగ్లా మధ్య జరిగిన ఆరంభమ్యాచ్‌లో బంగ్లా 283 పరుగుల దరిదాపులకు వచ్చింది. చిన్న జట్లే ఈ స్కోరు సాధించినప్పుడు 200 పరుగులలోపు లక్ష్యాన్ని చేధించడం పెద్ద జట్టకు నల్లేరుమీద నడకలాంటిదే. అలాంది పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిలపడింది. గ్రూప్‌-బిలో ఆదివారం చెన్నరులో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది............

అర్టీలు పెట్టుకున్న ఆర్నెల్లకా?

ఏ ఉద్యోగి అయినా తనకు రావలసిన ప్రావిడెంట్‌ ఫండ్‌ (భవిష్యనిధి) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ ప్రస్తుతం 10 శాతం మందికి అర్జీలు సమర్పించిన అర్నెల్లకుగానీ చేతికందట్లేదు. 80 శాతం మందికి మాత్రం రెణ్నెల్లలోపు అందుతోంది. అంటే పిఎఫ్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సందర్భంగా ప్రయాణ ఖర్చులే తడిసి మోపెడవుతున్నాయి. ఎందుకిలా? అంటే... ఖాతాలు పరిష్కరించేందుకు కావలసినంత సిబ్బంది లేదు. అదీగాక పెరిగిన ఖాతాదారుల సంఖ్యకు అనుగుణంగా పిఎఫ్‌ కార్యాలయాలను విస్తరించట్లేదు. ఫలితంగా ఉన్న కార్యాలయాల్లోనే, తక్కువ మంది సిబ్బందితో నెట్టుకురావడం ఆలస్యానికి కారణమవుతోంది................

తెలంగాణాపై ఇదే ఆఖరి పోరు

తెలంగాణ కోసం సాగుతున్న ఈ ఉద్యమమే ఆఖరి పోరాటమని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్‌ నాగం జనార్థన రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ ఆదివారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ అగ్రి డాక్టర్స్‌, రైతులు సంయుక్తంగా నిర్వహించిన 'రైతు మహా దీక్ష'లో నాగం మాట్లాడుతూ తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి రాకపోతే ప్రజలే తిరగబడతారని చెప్పారు. తెలంగాణ ప్రాంత నీళ్లు సీమాంధ్రులకు అవసరం కాబట్టే వారు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వల్ల

స్వాతంత్య్ర సమర యోధుడు బెంజిమన్‌ మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు, లోక్‌సభ పూర్వ సభ్యుడు సలగల బెంజిమన్‌ (90) గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బెంజిమన్‌ 1989లో బాపట్ల నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన స్వగ్రామం చీరాలకు భౌతికకాయాన్ని తరలించారు. సోమవారం  ..............

అభూత కల్పనల మంగళ

మంచయినా, చెడయినా దాని వెనుక ఓ కారణముంటుంది. ఆ కారణానికి రంగు, రుచి, వాసన కలగలిపి దర్శకనిర్మాతలు తెరపై ఓ వంటకం వండుతారు. దానికి ఓ రూపాన్నిస్తారు. రూపానికితగ్గట్టు కథనం నడుపుతారు. సినిమాపరంగా ఇదంతా ఊహాత్మకమైన కల్పన. కానీ దర్శకుడు ఒషో తులసీరాం తీసిన 'మంగళ' మాత్రం అభూత కల్పన. మంత్రతంత్రాలతో తెరపై అశాస్త్రీయ ప్రయోగాలు చేశాడు. మన సమాజంలో అనేక అనాచారాలు, రుగ్మతలు, వివక్ష ఉన్నాయి. అలాంటి వాటని బలపరిచేవి దెయ్యాలు, భూతాలు, క్షుద్రపూజ, అతీంద్రియశక్తులు. 'మంగళ' కూడా అలాంటిదే. లేనిదాన్ని ఉన్నట్టు చూపించటం, ఉన్నదాన్ని వక్రీకరించటం...........

6, మార్చి 2011, ఆదివారం

పొగడ్తలు ... విమర్శలు

శ్రీ సి.వి.సర్వేశ్వర శర్మ విద్యావేత్త, ప్రముఖ సైన్సు రచయిత. 1984లో 'కోనసీమ సైన్సు పరిషత్‌' ఆవిర్భావానికి సూత్రధారి, పాత్రధారి. సైన్సు ప్రచారానికి సాహిత్య ప్రక్రియల్నే ఆసరాగా చేసుకున్నారు. పాటలు, బుర్రకథలు, నాటికలు, సంగీత రూపకాలు, కథల ద్వారా సైన్సును ప్రజలకు అందిస్తున్నారు. 99 సైన్స్‌ ప్రాజెక్ట్స్‌, 101 సైన్స్‌ ప్రయోగాలు, 71 సైన్స్‌ ఎగ్జిబిట్స్‌ వంటి 93 సైన్సు పుస్తకాలు రాశారు. ఇవేగాక ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయితగా, ఇంటర్‌ ఫిజిక్స్‌

వర్ధమాన దేశాలకు క్యాన్సర్‌ ముప్పు

క్యాన్సర్‌ వ్యాధిని నివారించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లకపోతే 2030 నాటికి తృతీయ ప్రపంచ దేశాల్లో 70 శాతం క్యాన్సర్‌ పీడితులుంటారని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు డాక్టర్‌ వి.శాంత చెప్పారు. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ పేరిట బహుకరించే ప్రతిష్టాత్మక అవార్డును శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర హైకోర్టు జస్టిస్‌ ఎన్‌ వి.రమణ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నాయుడమ్మ 19వ స్మారకోపన్యాసం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటీ 10 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60 లక్షలు, మిగిలిన దేశాల్లో 40 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు...............

విదేశీ జోక్యం తగదు

లిబియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని అక్కడి చమురు నిక్షేపాలపై పెత్తనం చెలాయించాలనుకుంటే దానిని తాము వ్యతిరేకిస్తామని క్యూబా స్పష్టం చేసింది. ఈ మేరకు క్యూబా విదేశాంగ మంత్రి ఐరాస మానవ హక్కుల మండలి అధ్యక్షునికి లేఖ రాశారు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా అమాయకుల మరణాలు మానవతకే మాయని మచ్చగా నిలుస్తాయని, ప్రస్తుతం లిబియాలో జరుగుతున్న హింసాకాండపై క్యూబా ప్రపంచ దేశాలతో పాటు ఆందోళన చెందుతోందని ఆయన వివరించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ఎటువంటి విదేశీ జోక్యం లేకుండానే శాంతియుతమైన, సామరస్య పూర్వకమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ సమస్యలో విదేశీ సైనిక జోక్యాన్ని లిబియన్లు నిశ్చయంగా తిరస్కరిస్తారని, విదేశీ జోక్యం కారణంగా లిబియాలో జరుగుతున్న హింసాకాండకు తెరదించే పరిష్కార సాధనమరింత ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు..............

పరీక్షలు... పాఠాలు...!

పరీక్షల కాలం ప్రారంభమైంది. ఎప్పటిలాగే విద్యార్థులు మొదలుకొని విద్యాయంత్రాంగం వరకు ఒక వైపు అప్రమత్తత మరోవైపు అభద్రత. పరీక్షలు సమర్థవంతంగా రాయాలని విద్యార్థి, సమర్థవంతంగా నిర్వహించాలని విద్యా యంత్రాంగం హోరాహోరీ పోరాడుతుంటారు. అదే సమయంలో ఏం జరుగుతుందోననే భయం వెంటాడటంతో అభద్రత అనివార్యమవుతుంది. రోజురోజుకూ పరీక్షలకు పెరుగుతున్న శ్రుతి మించిన ప్రాధాన్యత విషయంలో కనిపించే అశాస్త్రీయ ధోరణులు - అసమతుల్యతలే ఒక విధంగా ఆందోళనకు కూడా కారణమవుతున్నాయి. ఎందుకంటే 30,40 సంవత్సరాల కిందట పరీక్షల కాలాన్ని నేటి పరీక్షల కాలంతో పోల్చి చూస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. పరీక్షలు...పాఠాలకు సంబంధించిన వివరాలు ఈవారం అట్టమీది కథలో..............

ఎవరికీ రాని అవకాశమొచ్చింది : చార్మి


 

'నటనకు స్కోపున్న రోల్‌ 'మంగళ'. ప్రేక్షుకులు నుంచి మంచి మార్కులు పడ్డాయి' అని తన తాజా చిత్రం 'మంగళ' పట్ల చార్మి ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మంగళ' ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. శనివారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో విలేకర్లతో చార్మి పలు సంగతులు తెలుపుతూ...'సాధుపుంగవులతో నటించేప్పుడు కాస్త భయమేసింది. ఒళ్ళంతా బురద పూసుకోవాల్సి వచ్చింది. దాంతో,..........

బాపురే రమణీయం ... మానవీయం...

అమెరికా అంగట్లో అవయవాలు

5, మార్చి 2011, శనివారం

పూర్తి వినోద భరితంగా మలిచాం

 


'నాకోసం ఇంటికి వచ్చే ఎవ్వరీనీ నిరుత్సాహపర్చను. అందుకే ఒక్కసారి కథ విని బాగోలేదు అని దర్శకుడు వీరభద్రానికి చెబుదామని అనుకున్నాను. నెలరోజులపాటు వీరభద్రం నా ఇంటికి వస్తూపోతు ఉండేవాడు. నేను బిజీగా ఉండేవాడిని. ఒకరకంగా చెప్పాలంటే... అతన్ను తప్పించాలనుకున్నాను. కానీ నేను నటించిన అనేక చిత్రాలకు కోడైరెక్టర్‌గా పనిచేశాడు. పెద్ద నసగాడు అనిపించేది. పోనీ సినిమా కథ విని వాయిదా వేద్దామనుకున్నా. ఓసారి కథ వింటానని రమ్మన్నా. కళ్లముందు సినిమా చూపించేశాడు. సూపర్‌గా ఉంది స్టోరీ........

మేమే మా కుటుంబంలో ఆఖరివాళ్లం

అనగనగా ఒక అడవిలో భారత దేశ జాతీయ పక్షులు అంటే నెమళ్లు ఉండేవి. కాని అవి మూడే ఉండేవి. వాటి పేర్లు రాము, సోము, చింటు. అడవిలోని అన్ని జంతువులు ఆ ముగ్గురిని ''మీ వంశంలో మీరే ఆఖరివారు'' అని ఎగతాళి చేసేవారు. రోజూ రాము సోముతో'' సోమూ! మనం నిజంగా మన వంశంలో ఆఖరి వాళ్లమా?'' అని అడిగేవాడు. అప్పుడు సోము ''రామూ! వేరే జంతువులు అనేది నిజమేనేమో........

సోనియా నోరు విప్పరా? చంద్రబాబు ఎక్కడున్నాడు?

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ఎవరు కారణమన్న అంశంపై శాసనసభలో శుక్రవారం టిడిపి, కాంగ్రెస్‌ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. సభ ప్రారంభం కాగానే టిడిపికి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. శుక్రవారం నాటి సభాకార్యక్రమాలకూ ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరుకాలేదు. సభా నిర్వహణకు సహకరించాలంటూ అధ్యక్ష స్థానంలో.......

అర్జున్‌సింగ్‌ మృతి

కాంగ్రెసు పార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ సింగ్‌ (81) శుక్రవారం సాయంత్రం ఇక్కడ మృతి చెందారు. కేంద్ర మంత్రి సహా ఆయన పలు పదవులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గుండెనొప్పి, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అర్జున్‌సింగ్‌ను కొద్ది రోజుల కిందట ఇక్కడి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో చేర్చారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్వాస అందక బాధపడిన అర్జున్‌కు 6.15 సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన అర్జున్‌ సింగ్‌ 80వ దశకంలో రాజీవ్‌ గాంధీ హయాంలో కాంగ్రెసు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన ఆయన...

క్యాన్సర్‌ వైద్యశాలకు హరీస్‌ జైరాజ్‌ రూ.6 లక్షల విరాళం

బహ్రెయిన్‌లో ఘర్షణలు

సున్నీ పాలిత రాజ్యం బహ్రెయిన్‌లో రెండు వారాల క్రితం నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా శుక్రవారం జాతుల హింస జరిగింది. సున్నీలు, మెజారిటీ షియా ముస్లిముల మధ్య ఒక పట్టణంలో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. రాజధాని మనామా వెలుపల బైఠాయించి ఉన్న నిరసనకారులు రాజకీయ సంస్కరణలు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో షియాలకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. షియాలు చాలా కాలంగా తమకు ద్వితీయ శ్రేణి హోదా కల్పిస్తున్నారని, వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది. బేషరతుగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బహ్రెయిన్‌ ప్రతిపక్ష గ్రూపులు సంసిద్ధత వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనో ఈ ఘర్షణలు జరిగాయి............

చతికిలపడ్డ బంగ్లా

కరేబియన్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడిపోయారు. ఏ మాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. చాలా కాలం తర్వాత బంగ్లాదేశ్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు వెళ్ళే మార్గాన్ని సంక్లిష్టం చేసుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌-బి లో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ మధ్య మీర్పూర్‌లోని షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు బంగ్లాదేశ్‌పై అలవోకగా గెలుపొందింది. తద్వారా ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు పాయింట్లతో గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా సరసన నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 18.5 ఓవర్లలో కేవలం 58 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది...........

సేవకు మారుపేరు శాంత

కేన్సర్‌తో బాధపడుతున్న ఎందరికో ఆమె అమృతమూర్తి. ఆమె హస్తవాసి ఎందరికో బతుకునిచ్చింది. జీవితం అంతమైపోతుందని అలసిపోయిన వ్యాధిగ్రస్తులను తల్లిలా ఆదరిస్తుంది. ఆమె దగ్గరికి కొన ఊపిరితో వచ్చి చిరునవ్వుతో తిరిగి వెళ్లినవారెందరో! ఆప్తురాలిగా వైద్యం చేస్తుంది. కేన్సర్‌ భూతాన్ని ఈ ప్రపంచంనుంచి తరిమి కొట్టడానికి తన శ్రాయశక్తులా శ్రమిస్తున్న అలుపెరుగని వైద్యురాలు డాక్టర్‌ వి. శాంత. లక్షలాది మందికి వ్యాధి నయంచేసిన అనుభవం, మరెన్నో పరిశోధనలు చేసిన స్థితప్రజ్ఞత, యాభైయేళ్లుగా వైద్యరంగంలో చేస్తున్న కృషి... అయినా ఆమెలో అదే నిరాడంబరత, నిగర్వం. అర్థ శతాబ్దిగా ఆమె వైద్య వృత్తిలో వున్నా అదే నిబద్ధత..............

పూర్తి బాధ్యత నాదే..!

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా పిజె థామస్‌ నియామకానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు. శుక్రవారం తనను కలిసిన జమ్మూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ సివిసి నియామకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానన్నారు. అయితే ఈ అంశంపై ఇంతకు మించి స్పందించేందుకు నిరాకరించిన ఆయన దీనిపై పార్లమెంటులో వివరణ ఇస్తానని చెప్పారు. ఈ అంశంపై పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ దీనిపై ఇంతవరకూ ఆలోచించలేదని, మీడియా ప్రస్తావిస్తున్న అంశాలు ప్రధానమైనవని తాను భావిస్తున్నట్లు, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ...........

మా గొంతు నొక్కేశారు

ప్రత్యేక తెలంగాణాపై కాంగ్రెస్‌ అధిష్టానం తమ గొంతు నొక్కేసిందని ఆ పార్టీ తెలంగాణా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో నిరసన తెలపవద్దని ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాత్రి ఎంపీలకు హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11 మంది పార్టీ లోక్‌సభ సభ్యులు శుక్రవారం పార్లమెంటు లోపల, బయటా మౌన నిరసన చేపట్టారు. మధుయాష్కీ, మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షెట్కర్‌ తదితర ఎంపీలు మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని తొలుత పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నల్ల రిబ్బన్లు ధరించే లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. ............

4, మార్చి 2011, శుక్రవారం

రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను తగలబెడుతున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం విమర్శించింది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా సోనియా గాంధీ కళ్లు తెరవకపోవడం విచారకరమని పేర్కొంది. సోనియా భారతీయురాలు అయివుంటే ఇక్కడి సమస్యలు తెలిసేవని, ఇటాలియన్‌ కాబట్టే మౌనంగా ఉందని విమర్శించింది. గురువారం చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్‌బ్యూరో.........

మాజీ ఎమ్మెల్యే, రెండు టివి ఛానళ్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు

న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, న్యాయమూర్తి చేయని వ్యాఖ్యలను ఆయనకు అంటగడుతూ మీడియాకు ఎక్కిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌కు, ఈ వార్తను పదే పదే ప్రసారం చేసిన రెండు టివి ఛానళ్లకు హైకోర్టు గురువారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణపై కించపర్చే వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహారెడ్డిపై చర్య తీసుకోవాలంటూ జయప్రకాష్‌ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదును సుమోటో కోర్టు ధిక్కరణ కేసుగా స్వీకరిస్తూ జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి జయప్రకాష్‌కు.........

మన మాటల్లో, సంగీత పరికరాల ధ్వనుల్లో తేడాలెందుకు?