.

31, జనవరి 2011, సోమవారం

నేటితరం ఆలోచనలు...లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్

 తెరమీదకొచ్చిన మరో ప్రేమకథ 'ఎల్‌బిడబ్ల్యు.' ప్రవీణ్‌ సత్తారు. దర్శకుడు. సిద్దార్త్‌, అభజిత్‌, అసిఫ్‌రాజ్‌, చిన్నయి, నిశాంతి, ప్రదానపాత్రలు. నవీన్‌సత్తారు. డెబ్రాస్టోన్‌ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ...'జీవితం గురించి నేటి తరం ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నమే ఈ సినిమా. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తుంది. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాం. ఇటివలే విడుదలై పాటలు క్లిక్‌ అయ్యాయి. ఫిబ్రవరిలో విడుదల చేయనున్నాం'మని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ...'కథ ప్రకారం చిత్రం నడక వేగంగా ఉంటుంది. ..........

అవును అవి 'రచ్చ'బండ సభలే

ప్రభుత్వం పని చేస్తోందని చాటి చెప్పేందుకు చేపట్టిన 'రచ్చ'బండ సభలు జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. పరిమిత సంక్షేమ పథకాలు ప్రారంభించిన రచ్చబండ, చివరికి గ్రామాల్లో సమస్యల గుదిబండగా అధికారులకు తయారైంది. నిరసనలు, నిలదీతలు, తోపులాటలు, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలుచోట్ల రసాభాసగా ముగుస్తోంది. ముఖ్యమంత్రి రాజాంలో ప్రారంభించిన సభలో మహిళలు వేసే ప్రశ్నలకు అధికారులతోపాటు ముఖ్యమంత్రి తెల్లముఖం వేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్ది పింఛను వచ్చేట్లు చేస్తానని ముఖ్యమంత్రి........

దళితులు ప్రవేశించారని గుడికి తాళం

దళితలపై నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఇరుముడుల ప్రక్రియలో భాగంగా దళిత అయ్యప్ప భక్తులు ఆంజినేయస్వామి దేవాలయంలోకి ప్రవేశించారని పెత్తందారులు ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. దళితులపై ఆగ్రహం చెందిన గ్రామ పెద్దలు శబరి మలై నుంచి వచ్చిన దళిత యువకులను పిలిచి పంచాయితీ పెట్టి వారికి జరిమానా విధించాలనుకున్నారు. ఇదంతా అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే బి.కె.పార్థసారధి సొంత మండలం రొద్దంలో జరిగింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన మరువ పల్లిలో ఇందిరమ్మ ఇళ్లు దళితుల ఇళ్ల పక్కన కేటాయించారని అగ్ర వర్ణాలకు వారు ఆగ్రహం చెందారు. పైగా ఇళ్ల నిర్మాణాలను ఆపేశారు. ఈ సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. మండలంలో దళితులను దుకాణాల్లోకి రానివ్వరు.........

మిన్నంటిన నిరసనలు

అధ్యక్షుడు హోష్నీ ముబారక్‌ ముర్దాబాద్‌ అంటూ ఆందోళన కారులు గత మంగళవారం ప్రారంభించిన నిరసన ప్రదర్శనలు ఈజిప్టును ఇంకా కుదిపేస్తూనే ఉన్నాయి. నిరసనకారుల అదుపు చేయాలని విధించిన నిషేధాజ్ఞలను ధిక్కరించి మరీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళన కారులను అదుపు చేయడం లక్ష్యంగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న సైన్యానికి ఆందోళన కారులు జడవక పోగా సాదర స్వాగతం పలకడం విశేషంగా చెప్పాలి. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట మోహరించిన సాయుధ బలగాలు, ఆందోళన కారుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొనలేదు.

అర్థంకాని మోడర్న్‌ ఆర్ట్‌ దోబీఘాట్‌

ఎనర్జటిక్‌, వెరైటీ, వర్సిటైల్‌...ఇవివి

30, జనవరి 2011, ఆదివారం

ఖాకీల కర్కశత్వం

అమెరికా మార్కు అమానుషం * రాష్ట్ర విద్యార్థులకు రేడియో ట్రాకర్లు * కదలికలపై నిఘా *పాస్‌పోర్టుల స్వాధీనం

నల్లబడిన గణతంత్రం- గాంధీ జపం తూతూ మంత్రం

ఎవరికి వారే సాటి .....

 2011 వన్డే ప్రపంచ కప్‌ విజేత ఎవరనేది మిలియను డాలర్ల ప్రశ్నగా ఉంది. కప్‌ మాదంటే మాదని ఏ జట్టుకాజట్టే ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రపంచ నెంబర్‌ వన్‌గా ఉన్న భారత్‌, నెంబర్‌ టూగా ఉన్న దక్షిణాఫ్రికాలకు ఎంత అవకాశం ఉందో అంత అవకాశం మాకూ ఉందని హ్యాట్రిక్‌ ఛాంపియన్లు ఆస్ట్రేలియా ధీమా కనబరుస్తోంది. ర్యాంక్‌ల రేస్‌లో తాము వెనకబడ్డా ప్రపంచకప్‌ కోసం రేస్‌లో వెనకబడ లేదని ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు ప్రకటిస్తున్నాయి. 1983లో భారత్‌ ఒకే ఒక్కసారి కప్‌ గెలుచుకుంది. అంతకుముందు రెండు సార్లు విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ కోసం ఉవ్విళ్లూరుతున్న వెస్టిండీస్‌ ఆశలను హర్యానా హరికేన్‌ కపిల్‌దేవ్‌ నిఖంజ్‌ సారధ్యంలోని

శవ'సేవ'లు

  యాభై ఎనిమిదేళ్ల ర్యాండి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆ మరుసటి రోజు అతని భార్య డయానే, 'సింపుల్‌ ఫ్యూనరల్స్‌' అనే సంస్థ కార్యాలయానికి వెళ్లింది. ఆ సంస్థ అంత్యక్రియలను నిర్వహిస్తుంది. సాంప్రదాయకంగా ఆ క్రియలు చేస్తే సుమారు మూడున్నర వేల డాలర్ల ఖర్చు అవుతుంది. కానీ ఈ సంస్థ అతి సాదా సీదాగా కేవలం పదకొండు వందల డాలర్లతో పని ముగిస్తుంది. మరుసటి రోజున, ఒంటి చేత్తో డయానే తన భర్త అంతిమ సంస్కారాలను తన బడ్జెట్‌లో ముగించింది. అంతిమ క్రియల విషయంలో బేరాలు ఆడలేని ఇబ్బందికర పరిస్థితులలో

తెలుగు కింగ్‌‌ డమ్‌. నెట్‌

 ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఆర్కుట్‌ వెబ్‌సైట్లు సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు పర్యాయపదాలుగా మారిపోయాయి. ఈ వెబ్‌సైట్లకు అంతటి ఆదరణ ఉంది మరి. ఇప్పుడు కొత్తగా తెలుగు వారికోసం తెలుగులో ఇలాంటి వెబ్‌సైటే అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న తెలుగువాడు జ్యోతికిరణ్‌ 'తెలుగుకింగ్‌డమ్‌' (www.telugukingdom.net) పేరుతో ఒక వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దేశవిదేశాల్లో ఉండే తెలుగువారి గురించి ఈ సైట్‌లో తెలుసుకోవచ్చు.

కామ 'సర్పం'చి

ఒక గ్రామం బాగు పడాలంటే ఆ గ్రామస్తులతో పాటు ఆ గ్రామ ప్రజా ప్రతినిధి (సర్పంచి) ఉత్తముడై ఉండాలి. అప్పుడే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామ సర్పంచి ఉత్తముడో కాదో తెలియదు కానీ.. కామ సర్పం'చి'లా మారి అభం.. శుభం తెలియని ఓమైనర్‌పై కాటేశాడు. ఈ సంఘటనతో బాధితురాలు, వారి బంధువులు కెవిపిస్‌ ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్‌లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎఎస్పీ హరిశ్చంద్రకు ఫిిర్యాదు చేశారు. ఈ విషయమై ఎఎస్పీ దోమ ఎస్‌ఐకి ఫోన్‌ చేసి విషయం అడిగి తెలుసుకున్నారు.

ఫెమినిస్టు మహిళ

29, జనవరి 2011, శనివారం

వణుకుతున్న అరబ్బు నియంతలు

రోజుకు కోటిన్నర !

తిరిగొచ్చిన ఎల్‌బరాదీ

 

ఐరాస అణు సంస్థ మాజీ అధిపతి, ఈజిప్టు అసమ్మతిదారు మహ మ్మద్‌ ఎల్‌బరాదీ గురువారం రాత్రి వియన్నా నుంచి స్వదేశానికి తిరిగొ చ్చారు. తమ దేశంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొనబోతున్నట్లు ఆయన చెప్పారు. తనను కోరితే ఈజిప్టులోని మార్పుకు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎల్‌బరాదీ తెలిపారు. 'ముబారక్‌ 30 ఏళ్ళ పాటు దేశాన్ని పాలించారు. ఆయన పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది' అని అన్నారు.......

ఫుల్‌లెంత్‌ మాస్‌ రోల్‌...వీర

ఆయుధ బజారులో అమెరికా జోరు

వచ్చే అయిదేళ్లలో సాయుధ బలగాల ఆధునీకరణకోసం భారత ప్రభుత్వం 5,000 కోట్ల డాలర్లు వెచ్చించాలని నిర్ణయించింది. వీటిలో వెయ్యి కోట్ల డాలర్లను 126 బహుళార్థక యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం కేటాయించింది. అమెరికన్‌ కంపెనీ ఈ ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాన్ని గనుక సంపాదిస్తే అమెరికా భారత్‌కు అతి పెద్ద రక్షణ పొత్తుదారుగా మారనుంది. భారత్‌ ఇప్పటికే అమెరికా.........

రాజీనామాలు చేసి చరిత్ర సృష్టిస్తారా?

28, జనవరి 2011, శుక్రవారం

కార్తీక 'కో'

డెస్క్‌టాప్‌పైనే వరల్డ్‌ బుక్‌షాప్‌ యూరీడ్‌.కామ్‌


పుస్తక ప్రియులకు సుభవార్త, మీ ఇంటి నుంచే 60 లక్షలకు పైగా టైటిల్స్‌ను గరిష్ట డిస్కౌంట్‌ హామీతో ఉచిత డెలివరీ ద్వారా అందించనున్నట్లుగా యూరీడ్‌.కామ్‌ తెలిపింది. మీరు చేయవలసిందల్లా యూరీడ్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో మీకు కావలసిన పుస్తకాన్ని ఎంచుకొని డబ్బులు చెల్లించితే చాలు సత్వర డెలివరీ చేయనున్నట్లుగాను, దాగి ఉండే ఖర్చులు లేకపోవడం.......

ఫిబ్రవరి మొదటివారంలో అమెరికా అల్లుడు

పోలీసుల అదుపులో భాను అనుచరుడు, గన్‌మెన్‌

నిరసనల మధ్య రచ్చబండ

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ గురువారం పాల్గొన్న మహబూబ్‌నగర్‌, కర్నూలు జల్లాల రచ్చబండ కార్యక్రమం నిరసనల మధ్య జరిగింది. మహబూ బ్‌నగర్‌లో ప్రత్యేక తెలంగాణ వాదులు ఆందోళన చేయగా, కర్నూలు జిల్లాలో ఒప్పందం ప్రకారం ఉపాధి కల్పించాలని శ్రీశైలం ముంపు బాధితులూ, తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్పాలని బుడగ జంగాలు నిరసన తెలిపారు..........

ప్రమాదంలో ముబారక్‌ సర్కార్‌

దాదాపు 30 సంవత్సరాలుగా దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడు ముబారక్‌ ప్రభుత్వానికి కాలం చెల్లే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన నిరంకుశ పాలనకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకొస్తున్నారు. నిషేధాజ్ఞలు కూడా ఉల్లంఘించి ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలతో పోలీసులు విరుచుకుపడుతున్నారు.............

అవార్డులకన్నా అభిమానులే మిన్న !

27, జనవరి 2011, గురువారం

'మిరపకాయ్' పోస్టర్లు దగ్ధం

నిర్విరామంగా బాలయ్య " శ్రీరామరాజ్యం"

రచ్చబండలో దళితులపై రౌడీయిజం

2011కున్న విశిష్టత ఏమిటి? రసాయనిక శాస్త్రానికీ 2011కూ లింకు ఏమిటి..?

ఐదేళ్లుగా బానిస బతుకు : ఓ బాలిక దీనగాథ

ఏడు వేల రూపాయల కోసం ఒక వ్యాపారి కుటుంబం 17 ఏళ్ల బాలికను ఐదేళ్లుగా కట్టు బానిసగా ఉంచిన హృదయ విదారక గాథ వెలుగులోకి వచ్చింది. ఆ బాలికను చైల్డ్‌ లైన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు గత గురువారం రక్షించారు. ప్రస్తుతం ఆమె నాగపూర్‌ కటోల్‌ రోడ్డులోని ప్రభుత్వ కరుణ మహిళా సంరక్షణాలయంలో పునరావాసం పొందుతున్నారు. కొరడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే..............

సిద్ధమైన గగనం

26, జనవరి 2011, బుధవారం

రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు

మూడు సినిమాలకు ఒప్పందం!

స్నేహగీతం చిత్ర దర్శకుడు శ్రీధర్‌రెడ్డితో వరుసగా మూడు చిత్రాలు నిర్మించేందుకు ప్రవాసాంధ్రుడైన డా|| మున్న వెంకట కృష్ణారెడ్డి ఒప్పందం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన వెంకట కృష్ణారెడ్డి గత 20 సం||లుగా దక్షిణాఫ్రికా మరియు బోట్స్‌వానా దేశాల్లో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు........

పరిటాల హత్య కేసులో జగన్‌, కిరణ్‌ పాత్రపై సిఎంను ప్రాసిక్యూట్‌ చేయాలి

సెన్సార్‌ బోర్డుపై ఓయు విద్యార్థి జెఎసి దాడి

సెన్సార్‌ బోర్డు కార్యాలయంపై ఓయు విద్యార్థి జెఎసి మంగళవారం దాడి చేసింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసింది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైబోలో తెలంగాణ' చిత్రంలో అభ్యంతరకర, రెచ్చగొట్టే సీన్లు ఉన్నాయంటూ సెన్సార్‌ బోర్డు సభ్యులు చిత్ర విడుదలకు అనుమతించలేదు. ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర నాయకుల ఒత్తిడి వల్లే.........

తెలుగు 'పద్మాలు'లు

2010 సంవత్సరానికిగాను తెలుగు 'పద్మా'లు గణనీయంగా వికసించాయి. తెలుగు ప్రముఖులకు, తెలుగు గడ్డపై నివసిస్తున్న తెలుగేతరులకు కలిపి 'పద్మ' కేటగిరీల్లో 14 పురస్కారాలు వచ్చాయి. సినీరంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఇదివరకే అందుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సైన్స్‌, ఇంజనీరింగ్‌ రంగంలో పల్లె రామారావు పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పారిశ్రామికవేత్త డాక్టర్‌ కె.అంజిరెడ్డి, డాక్టర్‌ జివి కృష్టారెడ్డికి పద్మభూషణ్‌ పురస్కారాలు లభించాయి..........

వినోదానికే అగ్రతాంబూలం : రవితేజ


'ఒక్క ఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్స్‌' అంటూ తెలుగు సినీ ప్రవేశం చేసిన నటుడు రవితేజ. ప్రతీ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొని హీరోగా ఇతరులకు ఛాన్సులిచ్చే స్థాయిలో నిలబడ్డారు. ఇష్టపడి, కష్టపడి సాధించటాన్ని రవితేజలో చూడొచ్చు. తనదైన అల్లరితో వినోదాన్ని కురిపిస్తున్న రవితేజ నుంచి తాజాగా వచ్చిన చిత్రం 'మిరపకాయ్'. బుకింగ్‌ కౌంటర్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుకుంటోంది. జనవరి 26 ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా పలు విషయాలు మీడియాతో ఇలా ముచ్చటించారు...

25, జనవరి 2011, మంగళవారం

రాజ్‌ గీతాలు

ఆ పెట్టుబడులెలా వచ్చాయ్ : జగన్‌కు హైకోర్టు నోటీసులు

నేతలపై కోడిగుడ్లు

హు పర్యటన : ఒళ్లు దగ్గర పెట్టుకున్న ఒబామా

26న ఎర్రగులాబీలు

మనదేశం మూవీస్‌ బ్యానర్‌లో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎర్రగులాబీలు'. షూటింగ్‌ పూర్తయి డి.టి.ఎస్‌. పనులు జరుపుకుంటోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోందనీ, ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత వల్లభనేని అశోక్‌ తెలియజేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...'ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. 26న విడుదల చేయాలనుకున్నాం.

సంక్రాంతి చిత్రాల్లో... కొత్తదనం కొరవడింది !

 కొత్త సంవత్సరం బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన పలు చిత్రాలు అభిమానుల్ని నిరాశపర్చాయి. పరమవీరచక్ర, మిరపకాయ్, అనగనగా ఓ ధీరుడు, గోల్కొండ హైస్కూల్‌...మొదలైన చిత్రాలు సంక్రాంతి బరిలో దిగాయి. కథకు ఓ చోట ప్రాముఖ్యత లభిస్తే, కథనానికి మరోచోట ప్రాముఖ్యత దక్కింది. ఈ రెండూ సరిగ్గా ఉన్న చోట నటీనటుల కాంబినేషన్‌ సరిగ్గా కుదర్లేదు. స్టోరీ, యాక్టర్స్‌ బలంగా కుదిరినా నేటి ట్రెండ్‌కు తగ్గట్టు 'పరమవీరచక్ర'ను ప్రెజెంట్‌ చేయలేకపోయారు. ఇలా ఏదో ఒక లోపంతో ఆయా చిత్రాలు ప్రేక్షకులను రంజింపచేయలేకపోయాయి.

పాపులారిటీ కోసం తీయలేదు

రచ్చ... రచ్చ... : ప్రశ్నించిన వ్యక్తిని కొట్టిన ఎంపి లగడపాటి

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమాలు చాలాచోట్ల రచ్చరచ్చగా మారాయి.కృష్ణాజిల్లా తిరువూరు మండలం చిట్యాలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఒకరిని కొట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలి సొంత వ్యాపారాల కోసమే మీరు సమైక్యాంధ్ర అంటున్నారనీ .....

24, జనవరి 2011, సోమవారం

పది నిమిషాల్లో హెచ్‌ఐవి నిర్ధారణ

నాకు తగిన కథే ఎంచుకుంటా - నిత్యమీనన్‌

 'వాస్తవంగా నేను మలయాళీ. మా తల్లిదండ్రులు బెంగుళూరులో స్థిరపడ్డారు. నేను అక్కడే పుట్టాను. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేశాను. చిన్నతనం నుండీ నాకు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. అయితే మనం ఒకటి తలిస్తే, దైవం ఒకటి తలుస్తాడు కదా అందువల్ల కాలేకపోయాను' వివరిస్తోంది నూతన తార నిత్యమీనన్‌. తన తాజా చిత్రం 'అలా మొదలైంది' అనుభవాల్ని ఇలా వివరిస్తోంది..............

సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం

దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక వన్డే సిరిస్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని భారత్‌ పోగొట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను 3-2 తో దక్షిణాఫ్రికా గెలుచుకుంది. సఫారీలు 1-2 తో వెనకబడ్డా వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హసీమ్‌ ఆమ్లా సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్‌ స్మిత్‌ ఏడు పరుగులు చేసి అవుటైన జట్టును ముందుండి నడిపించాడు. ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఓపెనర్‌ కెప్టెన్‌ స్మిత్‌ వికెట్‌ను జహీర్‌ ఖాన్‌ పడగొట్టాడు.

తెలుగులో 'యామ్లా పాగ్లా దీవానా' !

 ఒక భాషలో హిట్టయిన సినిమాలను వెంటనే వేరే భాషలో రీమేక్‌ చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది. తెలుగులో విజయం సాధించిన కిక్‌, రెడీ చిత్రాలను హిందీలో రీమేక్‌ చేస్తుండగా, లవ్‌ ఆజ్‌ కల్‌, దబాంగ్‌ చిత్రాలను తెలుగులో పునర్‌నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల విజయం సాధించిన హిందీ చిత్రం 'యామ్లా పాగ్లా దీవానా'ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒకప్పటి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ధర్మేంద్ర, అతని తనయులు సన్నిడియోల్‌, బాబీడియోల్‌ నటించారు. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో మంచి వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు ..............

ఐదు రోజుల్లో ఐదుగురితో...దొంగలముఠా

 వర్మ తాజా స్టేట్‌మెంట్‌ 'దొంగలముఠా' విడుదలకు ముందే ఇండిస్టీలో చర్చకు తెరలేపింది. కారణం ఈ సినిమాని ఐదు రోజుల్లో తీస్తాననటమే. అంతేగాక సినిమా కోసం పనిచేసే వారికి ముందస్తు అడ్వాన్స్‌లు ఏమీ ఇవ్వనని కూడా ప్రకటించాడు. ఇంతకీ ఆయన సినిమా లాంటిదేదైనా తీస్తాడా ! సినిమానే తీస్తాడా ! కథేంటి ! మొదలైన సందేహాలకు వర్మఇలా సమాధానమిస్తున్నాడు..............

యాక్షన్‌, డ్రామా...లేకుండా తీశాం

అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌రావు తీసిన 'దోభీఘాట్‌' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అంతేగాక థియేటర్‌ వద్దా బాగానే వసూళ్లు నమోదు చేసుకుంది. పేయింటర్‌ అరుణ్‌ (అమీర్‌ఖాన్‌), ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ మోనికా దోగ్రా, ఓ ముస్లిం యువతి (క్రితీ మల్హోత్రా), బట్టలు ఉతికే దోభీ మున్నా (ప్రతీక్‌ బబ్బర్‌)...అనే నలుగురి వ్యక్తుల వ్యక్తుల కథే ఈ సినిమా. ముంబారు నగర ప్రస్తావన అత్యంత కీలకమైంది. దర్శకురాలు కిరణ్‌ మాటల్లో...'ఈ మహానగరంలో బతకడానికి ...........

గుట్కా కంపెనీలపై ఐటి దాడులు

దేశ వ్యాప్తంగా పాన్‌-మసాలా, గుట్కా తయారీదారుల వ్యాపార సంస్థలు, నివాస గృహాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల తయారీదారులకు సంబంధించి పద్నాలుగు రాష్ట్రాల్లో వున్న 69 ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో వెయ్యి మందికిపైగా అధికారులు, భధ్రతా సిబ్బంది పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. ఈ దాడుల్లో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఖాతాల్లో చూపని సొమ్మును డిపార్టుమెంటు స్వాధీనం చేసుకుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సిబిడిటి) తెలిపింది................

23, జనవరి 2011, ఆదివారం

'ఎక్స్‌ట్రా' పేరుతో ఎందుకీ వివక్ష?

''ఇ.డి ఉద్యోగులను డిపార్టుమెంటు సర్వేంట్లుగా గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2) ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి'' 1977 ఏప్రిల్‌ 22న తపాలాశాఖలోని ఇడి ఉద్యోగుల (గ్రామీణ డాక్‌ సేవక్‌లు) గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పిది. పాలకులు దానిని ఏనాడూ అమలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికీ అదేపరిస్థితి కొనసాగుతోంది. పైగా అదనపు పనులు అప్పగిస్తూ అభద్రతకు గురిచేస్తోంది. కనీస వేతనాలు అమలు చేయకుండా అలవెన్సులు ఇస్తోంది. అవి కూడా సమయానికి అందక, ...............

అతి సుందర నగరం కోపెన్‌ హాగెన్‌

వందలాది ద్వీప సముదాయం మధ్య వెలసిన సుందర నగరమిది. పాలు, పన్నీరు, వెన్న, సముద్ర ఉత్పత్తులకు పేరుగాంచిన నగరమిది. ప్రముఖ ఓడరేవు పట్టణంగా గుర్తింపు పొందింది. అటు ఆధునిక ... ఇటు చారిత్రక సాంప్రదాయాల మేలు కలయికకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం కొంగొత్త ప్రాంతాలను తప్పక వీక్షించే పర్యాటకుల పాలిట వర ప్రసాదం. అదే కోపెన్‌హాగెన్‌. మరి ఉల్లాసాన్ని... ఉత్సాహాన్ని... ఆహ్లాదాన్ని అందించే ఆ నగర విశేషాలేంటో చూద్దామా...........

దక్షిణాదిలో సినిమాల శ్రీకార గాధ

అవునన్నా, కాదన్నా సినిమా ఇవాళ జన జీవితంలో ఓ ప్రధానమైన భాగం. ప్రజల కట్టూ బొట్టూ, ఆటా పాటా, మాటా - ఇలా అన్నిటినీ అనూహ్యంగా ప్రభావితం చేస్తున్న శక్తిమంతమైన మాధ్యమం. అలాంటి సినిమాలకు మన దేశంలో నూరేళ్ళకు పైగా చరిత్ర ఉంది. దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)కు మునుపే కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఫాల్కే 'రాజా హరిశ్చంద్ర'ను తొలి భారతీయ చలనచిత్రంగా చరిత్రకారులు తీర్మానించారు. మరి, కేవలం మన దక్షిణాది వరకు...........

ఉచిత విజ్ఞాన సర్వస్వం వికీపీడియాకు పదేళ్లు


ఇంటర్నెట్‌తో పరిచయం ఉన్నవారికి వికీపీడియా పేరు సుపరిచితమే. ఏ అంశానికి సంబంధించిన సమాచారమైనా క్షణంలో మన కళ్ల ముందుంచే ఏకైక సాధనం వికీపీడియా. ఇది పరిచయమై పదేళ్లవుతోంది. చిన్నప్పుడు అందరం వామన గుంటలు, కోతి కొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకొని వుంటాం... లేదా మన గ్రామానికో, పట్టణానికో వున్న ఏదో ఒక చరిత్ర మనకు తెలిసే వుంటుంది. ఇలాంటివి ఏవైనా కావచ్చు... ఇవన్నీ మన తరానికే పరిమితమా? మన తర్వాతి తరాలకు వీటిని.......

తెరవెనుక హీరో...ఇవివి

 

ప్రముఖ దర్శకుడు ఇవివి.సత్యనారాయణ హఠాన్మరణం సినీ అభిమానుల్ని విషాదంలో ముంచింది. దర్శకుడిగా తనదైన ప్రశంసనీయ పాత్రనే కాకుండా, మంచి మనిషిగా ఇంటా బయటా నిలబడ్డారు. సినిమా పట్ల ఆసక్తి ఉన్న ఎంతోమందిని ప్రోత్సహించేవారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, ఏ పనైనా చాలా ఇష్టంతో కష్టపడి తీర్చిదిద్దేవారు. చాలా చిన్న వయసులోనే.......

ఔరా సాహసబాలలు ...

22, జనవరి 2011, శనివారం

ఆ గోళ్లు పొడవు మీటరు

రచ్చబండపై కొత్త రగడ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమంలో మంత్రులకు ప్రాధాన్యత తగ్గనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో మంత్రుల ఫొటోలకు స్థానం లభించలేదు. స్థానిక శాసనసభ్యుల ఫోటోలను మాత్రమే ముద్రించాలని నిర్ణయించడంతో మంత్రుల బొమ్మలూ వారి నియోజకవర్గాలకే.......

వికలాంగులపై అత్యాచారాలు


చట్టానికి కళ్లులేవు. చెవులే ఉన్నాయి. రుజువులు చూపిస్తేనే అది శిక్షిస్తుంది. లేకుంటే సాక్షాల్లేవంటూ దోషులను వదిలేస్తుంది. ప్రభుత్వాలనే తల్లకిందులు చేయగల ఘనులున్న మన వ్యవస్థలో సాక్ష్యాలను తల్లకిందులు చేయగల 'సాక్షాసురులకు' (సాక్ష్యాలను తారుమారు చేయగల రాక్షసులు) కొదువలేదు. అందువల్లే అత్యాచారాలకు గురైన మహిళలూ, వైవాహిక జీవితంలో.......

'మిరపకాయ్' సంక్రాంతి సంబరాన్ని నింపింది

మైక్రోఫైనాన్స్‌కు ఊపిరిపోసిందెవరు?

దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల వైఫల్యం మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పెరుగుదలకు దారితీసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ. ఇక్కడ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమాలు నిలచి పోవటంతో మైక్రోఫైనాన్స్‌ సంస్థలపై జనం ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ సంస్థలకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. దానిలోని విశేషమేమంటే, ఈ సంస్థలు వసూలు చేసే వడ్డీపై పరిమితి గురించిన ప్రస్తావనే లేదు..........

'గ్వాంటెనామో' మూసివేత యోచన విరమణ

క్యూబాలోని గ్వాంటెనామో తీరంలోని జైలును మూసివేయాలనే యత్నాలను ఒబామా ప్రభుత్వం మానుకొంది. నిందితులుగా ఉన్న ఉగ్రవాదులను అమెరికా కోర్టుల్లో విచారించాలనే అధ్యక్షుని పథకాన్ని కాంగ్రెస్‌ అడ్డుకోవడంతో కొత్తగా విచారణలు ప్రారంభించనున్నారు. కొత్త సైనిక ట్రిబ్యునళ్ళను ప్రారంభించడాన్ని నిలిపివేస్తూ రెండేళ్ళ క్రితం ఒబామా పదవీ స్వీకారం సందర్భంగా విధించిన ఉత్తర్వును రక్షణ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌ త్వరలో ఎత్తివేయనున్నారని భావిస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వివరించింది. 30 మందికి పైగా ఖైదీలకు వ్యతిరేకంగా నూతన అభియోగాలు మోపేందుకు కొద్ది వారాల్లోనే విచారణ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు...........

ఈవివి ఇక లేరు


   తెలుగు చలన చిత్ర రంగంలో హాస్య బ్రహ్మగా కీర్తినొందిన జంధ్యాల వద్ద ఈవివి శిష్యునిగా పనిచేశారు. ఈవివి పూర్తిపేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. జంధ్యాల వారసునిగా అనేక హాస్య, కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరెన్నో చిత్రాలను స్వీయదర్శకత్వంలో 51 చిత్రాలు నిర్మించి తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈవివి నాన్న వెంకటరావు, తల్లి వెంకటరత్నమ్మ. ఈవివికి చిన్ననాటి నుంచి సినిమాలంటే అమితమైన ఆసక్తి. నిడదవోలులో ఇంటర్మీడియట్‌కు చేరేవరకు..............

మహేష్‌బాబు, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో "ది బిజినెస్‌ మేన్‌''

ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార యమకంత్రి

21, జనవరి 2011, శుక్రవారం

తొలి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ ఎవరు ?

సూరికి ఎన్టీవి యాంకర్‌కు లింకేంటి ?

అభినయానికే ప్రాధాన్యత - రిచా గంగోపాధ్యాయ

'షూటింగ్‌ అయిపోయిందని చెప్పడానికి సినిమావాళ్లు వాడే మాట ప్యాకప్‌ ! ఎవరైనా రాత్రీపగలూ షూటింగ్‌ చేశాక, ప్యాకప్‌ ఎప్పుడు చెబుతారా ! అని ఎదురుచూస్తుంటారు. జిగేల్‌మనే ఆ ఫ్లడ్‌లైట్ల వెలుగులో కాస్త ఊరట పొందాలని ఆరాటపడుతుంటారు. కానీ నాకు మాత్రం ప్యాకప్‌ అనే మాట వినగానే బాధేసేది. అప్పుడే అయిపోయిందా ! అనిపించేది' అంటూ మిరపకారు షూటింగ్‌ గురించి నటి రిచా.........

నటుడిగా మంచి మార్కులు సాధించాలి

  నా నటన చూసి అందరూ ప్రశంసించాలి. గొప్ప స్టార్‌ అయిపోవాలన్న పెద్ద పెద్ద కలలేమీ లేవు. ముందు నటుడిగా మంచి మార్కులు సంపాదించాలి. అందంగా కనిపించడం అనేది ఇక్కడ ప్రాధాన్యత లేని అంశం. అందునా మీరొక మోడల్‌ అయివుంటే అభినయానికే ప్రాముఖ్యత నిస్తారు. పర్సినాలిటీ కొంతవరకే తీసుకెళుతుంది. ఆర్టిస్ట్‌ అనేవాడే తెరపై కనబడతాడు' అని వివరిస్తున్నాడు 'దోభీఘాట్‌' హీరో ప్రతీక్‌ బబ్బర్‌. ప్రొడక్షన్‌ ఫీల్డ్‌లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండిస్టీలో కెరీర్‌ ఆరంభించాడు. 'జానే తు...యా జానే నా' అనే సినిమా ...........

'నల్లధనం' వివరాలు చెప్పలేం

 విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారత ఖాతాదారుల వివరాలను వెల్లడించలేమని ప్రధాని మన్మోహన్‌ అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల జాబితాను సమర్పించే విషయంలో ప్రభుత్వ విముఖతపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రధాని నల్లధనం ప్రస్తావన తెచ్చారు..................

ఓ ఊరి కథ

 సంక్రాంతి సందర్భంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సొంత ఊరికివెళితే అక్కడ ఇంతకు ముందు కనిపించే ఆప్యాయత, అభిమానంతో పలకరింపులు, కబుర్లు ఇప్పుడు మచ్చుకు కూడా కానరాలేదు. ఇప్పుడు బస్సుదిగగానే ప్రత్యక్షమయ్యేది తప్పతాగి రోడ్డు మీద తూలుతూ కన్పించే వారే ఎక్కువ. బాగా దగ్గర బంధువులయితే ఎదురుపడడానికి కూడా సిగ్గుపడి దూరంగా దూరంగా చూడనట్లు వ్యవహరిస్తారు...........