2, జనవరి 2011, ఆదివారం

హీరోలు సహకరించాలి

'గత ఏడాది ఇండిస్టీ ఉత్సాహంగా లేదు. నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు రావాలి. నిర్మాణ వ్యయంలో పడుతున్న ఇబ్బందులను ఆర్టిస్టులు గ్రహించి వారికి సహకరిస్తే పరిశ్రమ బాగుంటుంది. దీనికి అనుగుణంగా హీరోల సహకారం చాలా ముఖ్యమైంది' అని ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అభిప్రాయపడ్డారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణలో........

నరబలి కోసం పాప కిడ్నాప్‌

నూతనంగా నిర్మించిన పరిశ్రమకు నరబలి ఇచ్చేందుకుగాను ఓ మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌చేసేందుకు దుండగుడు విఫలయత్నం చేసి పోలీసులకు పట్టుబడిన ఉదంతం శనివారం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం గ్రామంలో పవన్‌ ఫ్లైవుడ్స్‌ పేరిట పరిశ్రమను నిర్మించారు. దీనికి నరబలి ఇవ్వడానికి చిన్న పిల్ల ఒకరు కావాలని కాపలాదారు నిరంజన్‌కుమార్‌ సింగ్‌ను సంస్థ.........

టాప్‌ 10 బ్రౌజర్లు

బ్రౌజరు గురించి క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పమంటే! ఇంటర్నెట్‌లో ఉన్న కోట్లాది వెబ్‌ పేజీలను మన కంప్యూటర్‌ ద్వారా చూడగలిగే సౌకర్యం కల్పించే సాఫ్ట్‌వేరే బ్రౌజర్‌. బ్రౌజర్‌ అంటే వెబ్‌పేజి కాదు! శోధన యంత్రం (సెర్చ్‌ ఇంజన్‌) కాదు! శోధన యంత్రం కూడా ఒక వెబ్‌ పేజీనే. వెబ్‌ బ్రౌజర్‌ అంటే ఒకప్పుడు కేవలం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మాత్రమే. ఓపెన్‌సోర్స్‌ ఉద్యమం మొదలైన తర్వాత ఉచిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్థి చెందడంతో ఇటీవల కాలంలో అనేక సాఫ్ట్‌వ్తేర్లు వాడుకలోకి వచ్చాయి. అనేక సంస్థలు బ్రౌజర్‌ సాఫ్ట్‌వేర్లను ఉచితంగానే అందిస్తున్నాయి. ముందు వరుసలో వున్న 10 బ్రౌజర్లేవంటే... ఫైర్‌ఫాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌... వంటివి. ఇవన్నీ తెలుగులో కూడా లభ్యమవుతున్నాయి వాటి వివరాలు.

గోల్కొండ కోట

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలలో గోల్కొండ కోట ఒకటి. కుతుబ్‌ షాహి రాజుల పరిపాలనకు సాక్షీభూతంగా నిలిచిన ఈ కట్టడాన్ని చూడడం ఓ అద్భుతానుభవం. నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది...ఓV్‌ా! వర్ణించడం కష్టం. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి. మరి ఆ వివరాలేంటో చూద్దామా!

చదువు శాశ్వతం - సంపద తాత్కాలికం

కొత్త వత్సర ప్రారంభదినాన మరో ఐదుగురు రైతులు బలి

క్యాలెండరు మారినా సమస్యలు అలాగే ఉన్నాయనేందుకు ఉదాహరణే కొత్త సంవత్సరం ప్రారంభ దినాన మరో ఐదుగురు రైతులు బలవన్మరణం చెందారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం బాలాపురం గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తి(40) అప్పుల బాధతాళలేక ఉరేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణమూర్తి తన ఐదెకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలు చేశాడు. అందులో వేరుశనగ సాగు చేశాడు.

కాలుష్య నియంత్రణకు అంతర్జాల విధానం

కాలుష్య నియంత్రణకు ప్రవేశపెట్టిన అంతర్జాల (ఇంటర్‌నెట్‌) విధానం 'మహా విశాఖ'లోనూ త్వరలో అమలులోకి రానుంది. ఇప్పటికే విశాఖలోని పలు కాలుష్య కారక పరిశ్రమల వల్ల ప్రజలు ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలపై పరిశ్రమలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ విధానం మెరుగైన ఫలితాలివ్వనుందని ఆ శాఖాధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల ఏడాది పొడవునా ఆయా సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని గుర్తించి, కాలుష్య నియంత్రణను పట్టించుకోని సంస్థలను హెచ్చరించే వీలుంది. అప్పటికీ నియంత్రించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పారు.

ఎప్పుడో విడిపోయాం.. 6న చట్టబద్ధతే

'తెలంగాణా ప్రాంతంలో మనుషులూ, మనసులు ఎప్పుడో విడిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధతే తరువాయి. 6న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో చట్టబద్ధత వస్తుందని మేము ఆశిస్తున్నాం' అని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధనరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఏకాభిప్రాయం పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. శనివారం టిడిఎల్‌పి కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

అరుణార్ణవమైన లాల్‌గఢ్‌

బెంగాల్‌లోని జంగల్‌మహల్‌ ప్రాంతంలో గత రెండేళ్లుగా తృణమూల్‌-మావోయిస్టు కూటమి సాగిస్తున్న నరమేధాన్ని శుక్రవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది ఆదివాసీలు ముక్త కంఠంతో ఖండించారు. సిపిఎం పిలుపు మేరకు జరిగిన ఈ ర్యాలీ గత రెండేళ్ల కాలంలోనే అతి పెద్దది కావటం విశేషం. లాల్‌గఢ్‌తో పాటు మావోయిస్టు-తృణమూల్‌ అరాచకాన్ని ప్రతిఘటిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ర్యాలీలో గణనీయంగా పాల్గొన్నారు.

లోపాలను అధిగమిస్తాం

పాలనలో లోపాలు, బలహీనతలను అధిగమిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన తన సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. గత ఏడాదిలో ఎదురైన పరిణామాలు, సంఘటనలు గుర్తు చేసుకుంటూ, ఇది కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయమని అన్నారు. కొత్త ఏడాదిలో పాలనా ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు రెట్టింపు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు.

వీలైతే మరో సౌత్‌సినిమా

 సౌత్‌ సినిమా అంటే చాలా ఇష్టం. నా మొదటి చిత్రం ఇక్కడ్నుంచే వచ్చింది. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ అయ్యాక, దక్షిణాది చిత్రాల్లో చేసే సమయం దొరకలేదు. కానీ 'రోబో' ఇచ్చిన విజయంతో ఆ అసంతృప్తి పోయింది.అన్నీ కుదిరితే మరోటి చేస్తా' అని అంటోంది ఐశ్వర్యరారు. హిందీలో వచ్చిన యాక్షన్‌రిప్లే, గుజారిష్‌ ఐశ్వర్యకు తీవ్ర ..............

నిజరూపాలు చూపనున్న 2011

అంతా ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల ఇష్ట ప్రకారమే చేస్తున్నామన్నట్టు చూపించుకునే అతి లౌక్యం, అమిత చాకచక్యం ఇందులో వున్నాయి. అధికార పక్షంగా తన విధానం ఏమిటో సూటిగా చెప్పకుండా ఇతరులను ముందు ఇరికించి దాగుడుమూతలు పునరావృతం చేస్తున్నది. రాజ్యాంగ పరంగానైనా రాజకీయంగానైనా రాష్ట్ర సమస్యలను ఆ రాష్ట్రానికి చెందిన పక్షాలకే వదిలేయడం అన్న సూత్రం పైకి చాలా ప్రజాస్వామికంగా కనిపించినా వాస్తవంలో కేంద్రం తన బాధ్యతను దాటవేస్తున్నది. రెండవది సూటిగా ...........

14న అహనా పెళ్ళంట

అల్లరి నరేష్‌ హీరోగా సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న సినిమా 'అహనా పెళ్లంట'. అనిల్‌కుమార్‌ సుంకర సారధ్యంలో వీరభద్రం చౌదరిని దర్శకునిగా పరిచయమవు తున్నాడు. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని గురించి నిర్మాత తెలియజేస్తూ...'14న విడుదల చేస్తున్నాం. వినోదమే