.

10, మార్చి 2011, గురువారం

'భద్రత'ను విస్మరించారు..!



టెలికమ్యూనికేషన్‌ రంగంలో ప్రతికూల అంశాలున్న విదేశీ కంపెనీలకు సైతం 2జిస్పెక్ట్రమ్‌ను కేటాయించి దేశభద్రత అన్న అంశాన్ని విస్మరించారని సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీయెత్తున విదేశీ పెట్టుబడులను రాబట్టుకోవటం కోసం దేశ భద్రతతో రాజీ పడ్డారని న్యాయమూర్తులు జిఎస్‌సింఘ్వి, ఎజి గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. టెలికం రంగంలో 2జి కేటాయింపులు జరిపిన రెండు కేసుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కంపెనీల విషయంలో హౌం మంత్రిత్వశాఖ వ్యక్తంచేసిన అభ్యంతరాలు అత్యంత తీవ్రమైనవని న్యాయమూర్తులు గుర్తు చేశారు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి