.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

అన్ని మ్యాచ్‌లకూ టాటా!

 క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. భారత జట్టుకు 22 సంవత్సరాలపాటు సేవలందించి, అనేక అద్భుత విజయాలకు ప్రేరణగా నిలిచిన సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మట్‌లకు గుడ్‌బై చెపుతున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మట్‌ల నుండి వైదొలగుతున్నట్లు తెలియజేశాడు. కొల్‌కతా ప్రిన్స్‌గా, దాదాగా సుప్రసిద్ధుడైన గంగూలీ 1996లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసి వెలుగులోకి వచ్చాడు. 38 ఏళ్ల గంగూలీ భారత్‌కు 113 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 7,212 పరుగులు చేసాడు. 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధసెంచరీలున్నాయి. 49 టెస్టులు, 147 వన్డేల్లో భారత జట్టుకు సారధ్యం వహించాడు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి