30, నవంబర్ 2010, మంగళవారం

సంక్రాంతికి పరమవీరచక్ర

బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోన్న సినిమా 'పరమవీర చక్ర'. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రానుంది. ఆయనకు ఇది 150వ చిత్రం. షూటింగ్‌ చివరిదశలో ఉంది. బాలయ్య సరసన అమీషాపటేల్‌, షీలా, నేహా ధూపియా నటిస్తున్నారు. సి.కళ్యాణ్‌ నిర్మాత. రామోజీఫిల్మ్‌ సిటీలో చిత్రానికి సంబంధించిన కీలక.......

అర్హతలే ఆధారం...


డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నంత మాత్రాన జీవితంలో స్థిరపడిపోయామని కాదు. ఉద్యోగం కావాలి. జీవితంలో సంతోషంగా బతకగలమన్న భరోసా కావాలి'' అంటున్నాడు సాఫ్ట్‌వేర్‌ స్టోర్స్‌ విభాగంలో పనిచేస్తున్న శ్యాము. అతను బి.కామ్‌.పూర్తి చేశాడు. పై చదువులు చదివే స్థోమత లేక మానేశాడు. అయితే తనకాళ్ల మీద తాను నిలబడడానికి ఒక ఆధారం కావాలి కదా! అందుకే సిటీకొచ్చి ఈ పనిలో కుదిరానంటున్నాడు. అస్సలు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ప్రస్తుతం చాలామంది పేద, మధ్య తరగతి, గ్రామీణ యువత నిరుద్యోగ.....

ఆలోచనను ఆచరణలో పెడితే..!

చదువులోనైనా, కొలువులోనైనా, ఏ ఇతర రంగంలోనైనా లక్ష్యం సాధించాలన్న తపన వుంటే సరిపోదు. విషయ పరిజ్ఞానం అలవర్చుకోవాలి. విభిన్న కోణాల్లో ఆలోచించగలగాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు. ఆ విజయం మరిన్ని విజయాలకు ప్రేరణగా నిలుస్తుంది. లక్ష్యాన్ని చేరేమార్గంలో సమస్యలూ, ఇబ్బందులే కాదు. పొరపాట్లు కూడా సహజమే. పొరపాటు జరిగిందని వెనుకడుగు వేస్తే ఆ వ్యక్తి లక్ష్యం చేరుకోలేడు........

ఒంటరిగానే వెళ్తున్నా....

వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ సోమవారం రాజీనామా చేశారు. జగన్‌తోపాటు ఆయన తల్లి విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్‌ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ వెంటనే ఆమోదించారు. విజయమ్మ తన రాజీనామాను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు పంపారు. ఆమె రాజీనామాపై శాసనసభ సంప్రదాయాల ప్రకారం వ్యవహరిస్తామని డిప్యూటీ స్పీకర్‌ తెలిపారు.తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.......

25 ఏళ్ల సార్వతిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అనుభవాలు ఆలోచనలు

ప్రధాన లక్ష్యాలు
*మూడు ప్రధాన లక్ష్యాలతో మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.1990 నాటికి దేశంలోని ఏడాదిలోపు పిల్లల్లో 85 శాతం మందికి ఒక మోతాదు బిసిజి టీకా, మూడు మోతాదుల ఓరల్‌ పోలియో, మూడు మోతాదులు డిపిటి, ఒక మోతాదు తట్టు సూది అందించడం. 100 శాతం గర్భవతులు టెటనస్‌ టాక్సాయిడ్‌తో రక్షించడం......

పేలిన జ' గన్‌ '

కాంగ్రెస్‌లో 'గన్‌' పేలింది. వైఎస్‌ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆమోదించారు. తనయుడి బాటలోనే వైఎస్‌ సతీమణి విజయలక్ష్మమ్మ నడిచారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి.....

వైఫల్యాన్ని నిబ్బరంగా ఎదుర్కోవాలి : రామానాయుడు

 

అత్యధిక భాషల్లో సినిమాలు తీసి చలనచిత్ర చరిత్రలోనే సుస్థిరస్థానాన్ని ఏర్పర్చుకున్న రామానాయుడు ఇటీవలే దాదాసాహెబ్‌ ఫాల్కేఅవార్డు పొందారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, స్టూడియో అధినేతగా, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. సంపాదించిన ప్రతి పైసా ఇక్కడే ఖర్చు చేశారు. అంతేగాక తన ఇద్దరు కొడుకులను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని స్థాయిల వారితో సినిమా తీయడం రామానాయుడి ప్రత్యేకత. ఆ కోవలేనే తాజాగా నిర్మిస్తున్న 'ఆలస్యం అమృతం' డిసెంబర్‌ 3న విడుదలకు........

మరిన్ని చిత్రాలు చేస్తా...- జయసుధ

'హీరోయిన్‌ ఎవరనేది నాకనవసరం. మంచి యాక్షన్‌కు స్కోపున్న సబ్జెక్టయితే నాకు చెప్పండి' అనే నటీమణి జయసుధ. అందుకే సహజనటిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. అవకాశమున్నప్పుడల్లా అందమైన పాత్రల్లో అగుపిస్తున్నారు. మరిన్ని చిత్రాలు ముందు ముందు చేస్తానని జయసుధ అంటున్నారు. తన కెరీర్‌పై......

ఆఫ్ఘన్‌పై భేటీ భారత్‌ను ఆహ్వానించని అమెరికా : రహస్య పత్రాల వెల్లడి

ఈ ఏడాది ఆరంభంలో టర్కీ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన భేటీకి అమెరికా భారత్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టింది. పాకిస్తాన్‌ను బుజ్జగించేందుకే అమెరికా ఈ చర్యకు పాల్పడినట్లు వికీలీక్స్‌ సంస్థ ఆదివారం విడుదల చేసిన రహస్య పత్రాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై జరిగే ఏ అంతర్జాతీయ సమావేశంలోనైనా భారత్‌కు స్థానం కల్పించకూడదన్న పాకిస్తాన్‌ ఉద్దేశాలను ప్రతిబింబించే విధంగా ఆఫ్ఘన్‌ భేటీకి భారత్‌ను ఆహ్వానించకూడదని నిర్ణయించినట్లు టర్కీ దౌత్యవేత్త ఒకరు అమెరికా అధికారులకు చెప్పినట్లు వికీలీక్స్‌ తెలిపింది. అమెరికా విదేశాంగశాఖలో రాజకీయ వ్యవహారాల ఉపమంత్రి విలియం బర్న్స్‌కు టర్కీ ద్వైపాక్షిక ..........

29, నవంబర్ 2010, సోమవారం

వైఫల్యాన్ని నిబ్బరంగా ఎదుర్కోవాలి

నడుస్తున్న చరిత్ర గురించి వార్తలు ఇచ్చి విశ్లేషించవలసిన పాత్రికేయులు, సంపాదకులు తమ స్థాయిని మరచి కార్పొరేట్‌ యుద్ధంలో వార్తాహరులుగానూ, లేఖకులుగానూ మారిపోయారు. ఈ మొత్తం కథలో భారతీయ జనతా పార్టీకి దగ్గరవాడైన రంజన్‌ భట్టాచార్య కూడా ప్రముఖ పాత్రనే వహించాడు. భారతదేశం మరో బనానా రిపబ్లిక్‌గా మారుతున్నదంటూ........

బాబోయ్ వైరస్‌ డేటా జాగ్రత్త!

 కంప్యూటర్లను ఉపయోగించి, అనేక పనులను సక్రమంగా నిర్వహించాలంటే, వాటికి ఎటువంటి అంతరాయం కలుగకూడదు. కాని కంప్యూటర్‌ వైరస్‌లు, కంప్యూటర్లను సక్రమంగా పనిచేయకుండా నిలిపివేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్లు ఏదో ఒక విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. 1970 నుంచే ఈ వైరస్‌ల బెడద మొదలైంది. సిఐహెచ్‌, మెలిసా, ఐలవ్‌యూ... వంటి అనేక వైరస్‌లు ఇటీవల కాలంలో కోట్ల రూపాయల నష్టాన్ని కల్గించాయి. ముఖ్యంగా ఇవి హార్డ్‌వేర్‌ కాంపొనెంట్స్‌ను.................

2010... స్కాముల నామ సంవత్సరం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌
కుంభకోణం : అక్రమ ఆర్థిక ఒప్పందాలు, జట్లలో బినామీ పేరుతో యాజమాన్యం.  కేంద్రబిందువు : ఐపిఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీ...............

1న కొత్త మంత్రివర్గం

రాష్ట్ర నూతన మంత్రివర్గం బుధవారం (డిసెంబర్‌ 1న) కొలువు తీరనుంది. కేబినెట్‌ కూర్పుపై రెండ్రోజులుగా హస్తినలో కసరత్తు పూర్తి చేసిన అనంతరం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిం చారు. మంత్రివర్గ జాబితా రూపకల్పనలో ఆదివారమంతా ఆయన బిజీగా గడిపారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం ఇక్కడి ఎపి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. '

సలహాలు ఇక చాలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇక ఇంటిదారి పట్టనున్నారు. ఇప్పటివరకు కేబినెట్‌ హోదాలో వారు బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 11 మంది సలహాదారులున్నారు. వీరిలో కెవిపి రామచంద్రరావు, పీటర్‌హసన్‌, సిసిరెడ్డి, సోమయాజులు, స్టాన్లీ, అగర్వాల్‌, సిఎస్‌రావు ముఖ్యులు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సలహాదారులను నియమించుకున్నారు.

2010 కుంభకోణాలమయం

ఈ దశాబ్దపు చివరి సంవత్సరమైన 2010 కుంభకోణాల మయంగా మారింది. ఈ ఏడాది ఐదు భారీ కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. అందులోనూ నాలుగు స్కాంలు చివరి నాలుగు నెలల్లోనే వెలుగు చూశాయి. అవినీతిని నివారిస్తామని, పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని పాలకులు చెప్తున్న మాటలు వట్టి నీటి మూటలే. నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత ఈ కుంభకోణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా క్రోనీ కేపిటలిజమే దీనికి కారణం. మనదేశంలో అవినీతి తీరును ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ జాబితాలో భారత్‌ స్థానమే స్పష్టం చేసింది. అవినీతిలో భారత్‌ 87వ స్థానంలో నిలవటమే పరిపాలనలో పారదర్శకత ఏ పాటిదో తేటతెల్లం చేస్తోంది.

అమెరికా గుట్టురట్టు

అమెరికా గుట్టు రట్టయింది. వివిధ దేశాల్లోని తన దౌత్యాధికారులకు అమెరికా పంపిన ఆదేశాలకు సంబంధించిన 2,50,000కు పైగా కీలక రహస్య పత్రాలు ఆదివారం వికిలీక్స్‌ విడుదల చేసింది. గార్డియన్‌ తదితర అంతార్జాతీయ మీడియా ద్వారా ఆ సంస్థ ఈ పత్రాలను బయటపెట్టింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా దౌత్య సంక్షోభంలో కూరుకుపోయేటట్లుగా ఈ పత్రాలున్నాయని నిపుణులు అంటున్నారు.

సత్కరించనున్న తెలుగు సినీ పరిశ్రమ

మూవీ మొఘల్‌ రామానాయుడ్ని తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించనుంది. దాదా ఫాల్కే పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలు చేసినవారికి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తుంది. సత్కరించే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీ మోహన్‌ తెలిపారు. హోటల్‌ నోవాటెల్‌లో డిసెంబర్‌ 6న కార్యక్రమాన్ని జరపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నట్టు సమాచారం.

గౌహతిలో 'విరాట్‌' స్వరూపం


విరాట్‌ కొహ్లి సెంచరీ చేయడం, యువరాజ్‌ సింగ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ ప్రదర్శించడంతో న్యూజిలాండ్‌తో ఆదివారం నాడిక్కడ జరిగిన మొదటి వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగులతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఇన్‌ఛార్జ్‌ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా భారత్‌ నిర్ణీత 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ను 236 పరుగులకు .............

ఉచిత స్కూలు యూనిఫాం కోసం జనతా పథకమే శరణ్యం


సర్కారు బడిలో చదువుతున్న పిల్లలకు ఉచితంగా యూనిఫాం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా 65శాతం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 35శాతం భరించాలి. పేదల పథకాలన్నీ ఈ మధ్య ఇలా సంయుక్త వాటా పద్ధతిలోనే వస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కరు నిధులు మంజూరు చేయకపోయినా పథకమే ఆగిపోయే పరిస్థితి వస్తోంది. గ్రామీణ ఉపాధి..............

ఉపాధిపై ప్రదాని కప్పదాటు

- ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే ప్రకారం 2007 నాటికి దేశంలో నిరుద్యోగం 2.8 శాతం మాత్రమే. కానీ కార్మిక బ్యూరో నివేదిక ప్రకారం అది 9.4 శాతానికి చేరింది. అంటే దేశంలో సుమారు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.
- 2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి..............

28, నవంబర్ 2010, ఆదివారం

కాంట్రాక్టు లెక్చరర్లా ? కట్టు బానిసలా ?

 బడ్జెట్‌ సాంక్షన్‌ పోస్టుల్లో పనిచేస్తున్నా... తమను సర్కారు కట్టు బానిసలుగా చూస్తోందంటూ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో చాలీ చాలని వేతనాలతో, అభద్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కల్పించే ...............

నైపుణ్యమేకాదు సమయపాలనా కావాలి

  ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే... ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే వృత్తి నైపుణ్యంతో పాటు సమయపాలన, క్రమశిక్షణ అవసరం. ఇవి ఉంటేనే సక్సెస్‌ సాధించ గలుగుతారు. కాబట్టి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఎలాంటి పని ఒత్తిడి ఉన్నా సమయం ప్రకారం పని పూర్తి చేయకపోతే దానిని యాజమాన్యం, పై అధికారులు అసమర్థతగా భావించే అవకాశాలే ఎక్కువ కాబట్టి మీరున్న పరిస్థితినిబట్టి, పనినిబట్టి అనుకున్న సమయంలోగా పనిపూర్తయ్యే ప్రణాళిక రూపొందించుకోవాలి.

వీడని సస్పెన్స్

రాష్ట్ర మంత్రివర్గం కూర్పు పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆదివారానికి ఈ కసరత్తు పూర్తవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి చెప్పారు. అదే విధంగా మంత్రివర్గంలో కేవలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య మంత్రిగా ఎంపికైన తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి తొలిసారి ఢిల్లీ వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం సూచనలు తీసుకునే క్రమంలో రోజంతా బిజీబిజీగా.......

రణంలో కొత్త 'కిరణం'

ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే ముఖ్యమంత్రి నిమ్స్‌కు వెళ్లినట్టే ఇందిరా పార్కు ధర్నా చౌకులో కిక్కిరిసిన వివిధ తరగతుల సమస్యల గురించి సత్వర చర్యలు తీసుకోవడం ద్వారానే జనం విశ్వాసం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికారులు అమాత్యులను అదుపు చేసుకోవడమే కాదు, అధిష్టానాన్ని మెప్పించడం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యమైంది అన్ని తరగతుల బాధలను పట్టించుకోవడం. కొత్త ముఖ్యమంత్రి తొలి ఘట్టంలోనే అందుకు..........

ఒబామా ఇప్పుడు అత్యంత ప్రమాదకారి : ఫైడల్‌ కాస్ట్రో

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్యంత ప్రమాదకారిగా ఉన్నట్లు క్యూబా విప్లవ నేత, కమ్యూనిస్టు దిగ్గజం ఫైడల్‌ కాస్ట్రో తెలిపారు. ఒబామా చురుకైన వ్యక్తేగానీ ఇప్పుడాయన కూడా పోటీ పడబోతున్నందున ప్రస్తుతం అత్యంత ప్రమాదకారిగా ఉన్నారని లాటిన్‌ అమెరికా మేధావులతో జరిగిన సమావేశంలో కాస్ట్రో పేర్కొన్నట్లు గ్రాన్మా పత్రికలో శుక్రవారం ప్రచురితమైన..........

27, నవంబర్ 2010, శనివారం

భళా భారత్‌

 

ఆసియాక్రీడల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ప్రదర్శనతో 14 స్వర్ణ, రజిత, 53 కంచు పతకాలతో మొత్తంగా 64 పతకాలు గెలుచుకుంది. పతకాల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. 72 క్రీడాంశాల్లో 47 దేశాలకు చెందిన సుమారు 10వేల మందిపైగా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఆతిథ్య చైనా ఆది నుంచి కనబరుస్తున్న తిరుగులేని ఆధిక్యతను తుది వరకు కొనసాగించింది. 199 స్వర్ణ, 119 రజిత, 98 కాంస్య పతకాలతో మొత్తం 416 పతకాలను సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఆసియాలో తిరుగులేని క్రీడాశక్తికి ప్రతీక........

'జగ'డమే

ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్‌ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా.....

ఆ..రేంజ్‌...అందుకోలేదు

 


థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల్లో చాలామంది యువతీయువకులే ఉంటారు. కాబట్టి ప్రేమకథతో వారిని చాలా సులభంగా ఆకట్టుకోవచ్చనేది తెలుగు దర్శకనిర్మాతల అభిప్రాయం. ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాల మాదిరిగా, దర్శకనిర్మాతలకు యూత్‌ అంశం చాలా ముఖ్యమైంది. దాంతో ప్రేమ కథలను తెరకెక్కించడంలో మన దర్శకుడు అనేక ప్రయోగాలకు దిగుతున్నాడు. అయితే ఆ ప్రయోగాలు సహజసిద్ధంగా, స్వచ్ఛంగా తెరపై తేలియాడాలి. కానీ హీరోను దృష్టిలో పెట్టుకొని కథనం నడిపిస్తే...

ఢిల్లీలో పైరవీల జోరు

  \మంత్రి పదవులు కాపాడుకునేందుకు కొందరు... జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలని ఇంకొందరు... ఇప్పుడు ప్రయత్నం చేస్తే, ఎప్పటికైనా ఫలితం వస్తుందని మరికొందరు... ఇలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో తిష్ట వేశారు. సోమవారం మంత్రివర్గ ఏర్పాటు ఖాయమంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో, ఆశావహులు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోయారు. ఢిల్లీ చేరిన తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో............

26, నవంబర్ 2010, శుక్రవారం

నాలుగు స్వర్ణాలతో ధగధగ ( *మహిళల, పురుషుల కబడ్డీలో టైటిల్స్‌... *బాక్సర్‌ విజేందర్‌ విజయం... *4×400 రిలేలో మహిళలు బంగారం... *ఆసియాడ్‌లో భారత్‌ రికార్డు

 


పదహారవ ఆసియన్‌ గేమ్స్‌ మరో రోజులో ముగియ నుండగా భారత్‌ శుక్రవారం నాడు మరో సారి పతకాల పంట పండించింది. ఈ పోటీలు శనివారం నాడు ముగియనుండగా శుక్రవారం నాడు నాలుగు స్వర్ణ, ఒక రజిత, మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకుంది. పతకాల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి,..........

చలికాలంలో మృదుత్వం

చలికాలం వచ్చిందంటే కేవలం వెచ్చదనం చేకూర్చే ఉలెన్‌ దుస్తులు సమకూర్చుకుంటే సరిపోదు. ఆ జాగ్రత్తలతో పాటూ మన చర్మాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరమూ వుంది. ఎందుకంటే చలికాలమనగానే ముందుగా ప్రభావానికి లోనయ్యేది, ఇబ్బందుల పాలయ్యేది.........

ఇక మీ మొబైల్‌ నంబర్‌ మార్చక్కర్లేదు !

మీ మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ ఇక మార్చక్కర్లేదు. ప్రస్తుత సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవలు సరిగా లేవనే అభిప్రాయం కలిగి నాణ్యమైన సేవలందించే ఇతర సర్వీస్‌ ప్రొవైడర్‌కు మారి, సిమ్‌ మార్చినా మీ పాత నంబర్‌ మార్చక్కర్లేదు. మునుపటి నంబర్‌తోనే కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును కల్పించే మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటీ (ఎంఎన్‌పి) ఊరించి... ఊరించి ఎట్టకేలకు గురువారం వాస్తవ రూపం దాల్చింది. ఇటీవలే 3జి సేవలు అందుబాటులోకి వచ్చిన........

యేళ్లు నిండుతున్నా ఏమున్నది గర్వకారణం?........

కాంగ్రెస్‌ క పాలకపార్టీగా ప్రజా సమస్యలు పరిష్కరించే స్థితి పోయింది. అవినీతికి నిలయంగా తయారైంది. పైకి ఎన్ని చెప్పుకున్నా పచ్చి ప్రజా వ్యతిరేక స్వభావాన్ని సంతరించుకుంది. ఉదారవాద ఆర్థిక విధానాల నెత్తికెక్కించుకున్న కాంగ్రెస్‌ జనసామాన్య సమస్యలను పరిష్కరించడం అసాధ్యం. అదుకే క్రమంగా ప్రతిపక్షాల మీద ప్రత్యేకించి ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకొస్తున్న,.........

హద్దులు తప్పనిసరి!

 

నటసార్వభౌముడి...ప్రస్థానం....

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 60 ఏళ్ళ నటప్రస్థానంపై సీనియర్‌ పాత్రికేయుడు వినాయకరావు 'యుగానికి ఒక్కడు' అనే పుస్తకాన్ని రచించారు. దాని ఆవిష్కరణ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సి.నారాయణరెడ్డి, డి.రామానాయుడు, సీనియర్‌ నటి కృష్ణవేణి, కృష్ణంరాజు, ఆర్‌. నారాయణమూర్తి, ఎన్‌.ఆర్‌.అనురాధాదేవి, చలపతిరావు.......

కిరణ్‌ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్లో మధ్యాహ్నం 12.14 గంటలకు కిరణ్‌కుమార్‌రెడ్డితో గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రెండుసార్లు తడబడ్డారు. అంతఃకరణశుద్ధితో బదులు అంతకర్త అని పలికారు. శాసనం... శాసనం...అని తడబడుతూ రెండు సార్లు చదివారు.

టన్నుకు రూ.2500 చెల్లించాలని కలెక్టరేట్‌ ముట్టడి

గానుగ ప్రారంభమై రెండు వారాలు గడిచినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ చెరుకు రైతులు సంగారెడ్డిలో గురువారంనాడు కలెక్టరేట్‌ను ముట్టడిం చారు. అంతకుముందు పట్టణంలోని బాలాజీ గార్డెన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ చెరుకు గడలు అలంకరించిన ట్రాక్టర్లలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు

రాజానెందుకు ప్రశ్నించలేదు?

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజాను ఎందుకు ప్రశ్నించలేదని సుప్రీం కోర్టు సిబిఐని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం తమను విస్మయానికి గురి చేసిందని న్యాయమూర్తులు జిఎస్‌ సింఘ్వి, ఎకె గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులను వేలం వేయటానికి బదులుగా తన ఇష్టం వచ్చినట్లు కేటాయించటం ద్వారా రాజా ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్ల మేర గండి కొట్టారని కాగ్‌, సివిసి తమ నివేదికల్లో వెల్లడించినప్పటికీ సిబిఐ వారిని ప్రశ్నించకుండా మౌనం వహించటం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రజలకు కూడా ఆకలి బాధ తప్పడం లేదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏదో ఒక సాకుతో యుద్ధాలకు దిగుతున్న అమెరికాలో అన్నార్తుల సంఖ్య పెరుగుతోందనేది నగ సత్యం. యుద్ధాల కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికా తన ప్రజల ఆకలిని తీర్చడంలో విఫలం కావడం సిగ్గుచేటు. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలోని పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది ఆకలి బాధను చవిచూస్తున్నారు.

పాటల్లో తెలుగమ్మాయి'పైరగాలి వచ్చి నన్ను పాటపాడమంది.. రైలు కూత చేరి నన్ను రాగం తియ్యమంది...' అనే పాటను 'తెలుగమ్మాయి' కోసం అనంత్‌ శ్రీరామ్‌ రాశారు. దీని చిత్రీకరణ జరుగుతోంది. వైష్ణవి మూవీస్‌ బ్యానర్‌లో వానపల్లి బాబూరావు నిర్మిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... 'ఈనెల 17 నుంచి 20వరకు ఫిలింసిటీలో రైల్వేస్టేషన్‌లో ప్రదీప్‌ ఆంథోనీ నేతృత్వంలో పాట చిత్రీకరించాం. కథప్రకారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతూ ఉండగా ఈ పాట సాగుతుంది. తొలి షెడ్యూల్‌ అనుకున్నట్టుగా పూర్తయింది' అని చెప్పారు.

భారత్‌-జపాన్‌ల సంయుక్తాధ్యర్వంలో ఢిల్లీ-ముంబయిల మధ్య

జపాన్‌ దేశంతో భారత్‌కు వున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన యిరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు అణు ఒప్పందాలపై చర్చలు ప్రారంభం కావడంతో యిరుదేశాల్లో ఉత్సాహం యినుమడించింది. తాజాగా ప్రతిపాదిత ఢిల్లీ-ముంబరు పారిశ్రామిక కారిడార్‌ (డిమిక్‌)లో 24 హరిత నగరాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలవడంతో భారత్‌-జపాన్‌ల ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్లయింది. డిమిక్‌ ప్రాంతంలో 24 హరిత నగరాలను నెలకొల్పడానికి భారత్‌-జపాన్‌లు సిద్ధమవుతున్నాయని జపాన్‌లో భారత మాజీ రాయబారి అఫ్తబ్‌ సేథ్‌ తెలిపారు.

వికాస్‌ 'గోల్డెన్‌' పంచ్‌


 ఆసియా క్రీడల్లో 13వ రోజున భారత్‌ స్వర్ణ పతకాల పంట పండించింది. బాక్సింగ్‌లో వికాస్‌ కృష్ణన్‌, పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో జోసెఫ్‌ అబ్రహాం, మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో అశ్విని అక్కున్‌జి బంగారు పతకాలు సాధించారు. ఫలితంగా 10 బంగారు, 14 రజతం, 29 కాంస్య పతకాలతో మొత్తం 53 పతకాలు సాధించి భారత్‌ ఏడో స్థానానికి చేరింది.

ఆలుపెరుగని పయనం

నవంబరు 9నుండి 12వరకూ కాన్పూరులో జరిగిన తొమ్మిదవ ఐద్వా జాతీయ మహాసభల్లో అందరి దృష్టినీ ఒక మహిళ ఆకర్షించారు. ఆ మహాసభల్లో అన్ని ఏర్పాట్లనూ ఒంటిచేత్తో చక్కబెట్టిన ఘనత ఆమెది. ఇటు ప్రతినిధులను ఓ కంట కనిపెడుతూ... అటు వంటలు సరిగ్గా వున్నాయో లేవోనని తనిఖీచేస్తూ... స్టేజ్‌పై కార్యక్రమాలను చక్కబెడుతూ... అటు మీడియా ప్రతినిధులు వచ్చారో లేదోనని ఆరాతీస్తూ... క్షణం తీరికలేకుండా అటూ ఇటూ తిరిగేస్తూ అన్నీ తానై చక్కబెడుతున్న సుభాషిణీ ఆలీ ఆ మహాసభల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. వయసును మరిచి ఆమెలో పరవళ్లు తొక్కుతున్న ఉత్సాహానికి ఆహుతులుసైతం అచ్చెరువొందారు. తామూ ఇనుమడించిన ఉత్సాహంతో మహాసభలను జయప్రదం చేశారు.

వీరా రాడియా ఉదంతం ప్రశ్నార్థ కమవుతున్న ప్రసారమాధ్యమం నైతికతబీహార్‌ తీర్పు

బీహార్‌అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జెడి(యు) - బిజెపి కూటమి అయిదింట నాలుగొంతుల మెజార్టీతో విజయం సాధించింది. ఈ కూటమికి ఇంతటి విజయాన్ని చేకూర్చిపెట్టిన ఘనత కచ్చితంగా నితీష్‌కే దక్కుతుంది. ఆందోళనకరమైన విషయమేమిటంటే జెడి(యు)కి జూనియర్‌ భాగస్వామిగా వున్న మతతత్వ బిజెపి నితీష్‌ను నిచ్చెనగా చేసుకుని తన బలాన్ని 55 నుండి 91కి పెంచుకోవడం. నితీష్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల జెడియు కన్నా బిజెపినే ఎక్కువ లాభపడిందన్నది స్పష్టం.

25, నవంబర్ 2010, గురువారం

కిరణ్‌కు కిరీటం


రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య అసెంబ్లీ కమిటీ హాలులో అదే రోజు సాయంత్రం అత్యవసర కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి ఢిల్లీ నుండి పార్టీ సీనియర్‌ నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, గులాంనబి ఆజాద్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రిని

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ముఖ్యమంత్రి పదవికి కొణిజేటి రోశయ్య రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు సమర్పించారు. రోశయ్య రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. నూతన ముఖ్యమంత్రిని నియమించే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రోశయ్యను గవర్నర్‌ కోరారు. రోశయ్యతో పాటు 33 మంది మంత్రులు రాజీనామా చేశారని రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ జీవో నం.663ను విడుదల చేశారు.

నితీష్‌కే బీహారీల పట్టం


 బీహార్‌ ప్రజలు మళ్లీ నితీష్‌కుమార్‌కే పట్టం కట్టారు. బుధవారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జెడియు, బిజెపితో కూడిన ఎన్డీయే కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారు. మొత్తం 243 సీట్లున్న అసెంబ్లీలో ఆ కూటమికి 206 స్థానాలు లభించాయి. 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే పాలక కూటమి గణనీయమైన రీతిలో సీట్లను పెంచుకుని నాలుగింట మూడొంతులకు పైగా మెజార్టీ సాధించింది. ఈ విజయంతో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, తమ .............

భారత వ్యవసాయంపై పెరగనున్న అమెరికా పట్టు


భారత అమెరికాల మధ్య జరుగుతున్న వ్యవసాయ సంప్రతింపులు ఆహార భద్రత, పౌష్టికాహారం, ఉపాధి సంరక్షణ లాంటి అంశాలపై జరగడం లేదు. ఆ సంప్రతింపులు అమెరికా ప్రభుత్వం కొద్ది మాసాల క్రితం ప్రకటించిన 'నూతన జాతీయ ఎగుమతి చొరవ' చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ పత్రం లోని వివరాలను అమెరికా వ్యవసాయ మంత్రి టామ్‌ విల్సాక్‌ వెల్లడించారు కూడ. 'అమెరికా ఆర్థికవ్యవస్థలో ఒక ప్రధాన రంగం వ్యవసాయరంగం. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఏడాది 3050 కోట్ల డాలర్ల మిగులును సంపాందించవలసి ఉంది............

24, నవంబర్ 2010, బుధవారం

పేదరికాన్ని పెంచుతున్న వైద్య ఖర్చులుఅనారోగ్యం, భారీగా ఉన్న వైద్య బిల్లుల మూలంగా ఏటా పది కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వార్షిక నివేదిక తెలిపింది. ఆ సంస్థ సార్వత్రిక వైద్య రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ విషయం పేర్కొంది. 'సార్వత్రిక వైద్య రక్షణ అనేది మెచ్చుకోదగిన లక్ష్యం. అదే సమయంలో అది సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయం' అని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ ఛాన్‌ ఇక్కడ ఆ నివేదికను ప్రవేశపెడుతూ .........

ప్రారంభమైన వీరరవితేజ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వీర' చిత్రం ప్రారంభమైంది. సాన్వి ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై గణేష్‌ ఇందుకూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఆర్ట్‌గ్యాలరీలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించారు. ఈ సందర్భంగా నిర్మాత గణేష్‌ మాట్లాడుతూ, రవితేజ గత చిత్రాల్లోచేయని పాత్ర ఇది. సెంటిమెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ ఉన్న ఈ కథను చాలా .........

సూపర్ చైనా

ఆధునిక విజ్ఞాన సృష్టిని, నేటి ప్రపంచీకరణను ముందుకు తీసుకువెళ్లడంలో కంప్యూటర్లు ఎనలేని పాత్ర వహిస్తున్నాయి. యుద్ధతంత్రాలు, అంతరిక్ష పరిశోధనల్లో కూడా ఇవి అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి. ఇపుడు మానవుడు విశ్వ రహస్యాన్ని తెలుసుకునేందుకు 'బిగ్‌బ్యాంగ్‌'తో సిద్ధపడుతున్నాడు. ఈ తరుణంలో చైనా అత్యంత శక్తివంతమైన 'సూపర్‌ కంప్యూటర్‌' ఆవిష్కరణతో మరో ముందుడుగు వేసింది. ప్రపంచంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతున్నట్లు ఈ కంప్యూటర్‌ ...........

రోశయ్య రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌

ముఖ్యమంత్రి పదవికి రోశయ్య చేసిన రాజీనామాను గవర్నర్‌ నరహింహన్‌ ఆమోదించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రోశయ్య మంత్రివర్గ సహచరులతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.

'మంచి పాములోడు' ఒబామా

ప్రపంచంలో ఇప్పటివరకు జీవించి ఉన్న వ్యక్తుల్లో 'ఉత్తమ పాములు పట్టే వాడు' అవార్డుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్ని విధాల అర్హుడని క్యూబా విప్లవ నేత ఫైడల్‌ కాస్ట్రో (84)వ్యంగ్యాస్త్రం సంధించారు. ఉగ్రవాద నిర్మూలన పేరిట పాశ్చాత్య దేశాలు ఉమ్మడిగా ఏర్పరచిన నాటో సంకీర్ణ సేనలను 'మిలటరీ మాఫియా'గా ఆయన అభివర్ణించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సాగుతోంది ఉగ్రవాద నిర్మూలన కాదని, ఆ ముసుగులో సాగుతున్న నరమేధమని........

షారుక్‌కు తెగ నచ్చింది...

హృతిక్‌ తాజా సినిమా గుజారిష్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. అటు విమర్శకుల నుండి, ఇటు బాలీవుడ్‌ ప్రముఖుల నుండీ ప్రశంసల జల్లు కురుస్తోంది. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ తన కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఈ సినిమాను చూశారు. హృతిక్‌ అభినయానికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వెలుబుచ్చారంట ! వెంటనే హృతిక్‌ కలుసుకునేందుకు వెళ్లి, ఇంటికి కూడా తీసుకొచ్చాడంట ! అయితే షారూక్....

సోమదేవ్‌కు మరో స్వర్ణం

భారత టెన్నిస్‌ క్రీడాకారుడు సోమదేవ్‌ దేవ్‌వర్మన్‌ ఆసియాడ్‌లో చరిత్ర సృష్టించాడు. ఆసియాడ్‌లో భారత్‌కు టెన్నిస్‌ సింగిల్స్‌లో తొలి స్వర్ణ పతకం సంపాదించిపెట్టాడు. సోమవారం నాడు సనమ్‌ సింగ్‌తో కలసి స్వర్ణ పతకం గెలుచుకున్న సోమదేవ్‌ మంగళవారం నాడు సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. మంగళవారం నాడు జరిగిన ఫైనల్లో 6-1, 6-2 తేడాతో ప్రపంచ నెంబర్‌ 44, ఈ క్రీడోత్సవాల్లో టాప్‌ సీడ్‌ డెన్నిస్‌ ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను ఓడించి పసిడి పతకం గెలుచుకున్నాడు. పదహారవ.......

23, నవంబర్ 2010, మంగళవారం

పదేళ్ళ తర్వాత కుమారుని కలిసిన సూకీ

మయన్మార్‌ ప్రజాతంత్ర ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌ సూకీ చిన్న కుమారుడు కిమ్‌ అరిస్‌ పదేళ్ళ కాలంలో తొలిసారిగా తన తల్లిని మంగళవారం కలుసుకున్నారు. రంగూన్‌ విమానాశ్రయంలో సూకీ తన కుమారునికి స్వాగతం పలికారు. తన తల్లి ఈనెల 13న విడుదల కావడానికి ముందే థాయ్ లాండ్‌కు వచ్చిన అరిస్‌ మయన్మార్‌కు వచ్చేందుకు వీసా కోసం వేచి ఉన్నారు. 65 ఏళ్ళ సూకీ రంగూన్‌ విమానాశ్రయంలో నవ్వుతూ.........

ఒబామా పర్యటనతో ఒరిగిందేమిటి?


''50,000 ఉద్యోగాలను సృష్టించే 1000 కోట్ల డాలర్ల విలువైన 20 ఒప్పందాలు''. ఒబామా పర్యటన ప్రారంభమైన తొలిరోజునే ఈ శీర్షిక ప్రసారమాధ్యమంలో పదేపదే దర్శనమిచ్చింది. భారతదేశపు డబ్బుతో అమెరికాలో సృష్టించే ఉద్యోగాలివి. కాని, మనం మాత్రం మహోత్సాహంతో పొంగిపోయాము. ఈ 50వేల ఉద్యోగాలన్నీ కూడా 2007 డిసెంబరు నుంచి అమెరికా పోగొట్టుకున్న.........

ప్రణయంలో ప్రళయం..!


నవీన యుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తున్నది. పని ఒత్తిడి మనసును ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడం లేదు. ప్రతీ క్షణం ఉద్యోగ, వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషితమైన వాతావరణం, సమయపాలన లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతో.....