.

26, నవంబర్ 2010, శుక్రవారం

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రజలకు కూడా ఆకలి బాధ తప్పడం లేదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏదో ఒక సాకుతో యుద్ధాలకు దిగుతున్న అమెరికాలో అన్నార్తుల సంఖ్య పెరుగుతోందనేది నగ సత్యం. యుద్ధాల కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికా తన ప్రజల ఆకలిని తీర్చడంలో విఫలం కావడం సిగ్గుచేటు. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలోని పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది ఆకలి బాధను చవిచూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి