.

29, నవంబర్ 2010, సోమవారం

2010 కుంభకోణాలమయం

ఈ దశాబ్దపు చివరి సంవత్సరమైన 2010 కుంభకోణాల మయంగా మారింది. ఈ ఏడాది ఐదు భారీ కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. అందులోనూ నాలుగు స్కాంలు చివరి నాలుగు నెలల్లోనే వెలుగు చూశాయి. అవినీతిని నివారిస్తామని, పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని పాలకులు చెప్తున్న మాటలు వట్టి నీటి మూటలే. నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత ఈ కుంభకోణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా క్రోనీ కేపిటలిజమే దీనికి కారణం. మనదేశంలో అవినీతి తీరును ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ జాబితాలో భారత్‌ స్థానమే స్పష్టం చేసింది. అవినీతిలో భారత్‌ 87వ స్థానంలో నిలవటమే పరిపాలనలో పారదర్శకత ఏ పాటిదో తేటతెల్లం చేస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి